హైదరాబాద్ నందు (బంజర హిల్స్, జూబిలీ హిల్స్, మాదాపూర్, కొండాపూర్ ) పరిసర ప్రాంతాల్లో పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ వెంటనే కావాలను. ఆర్మీ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేసి రిటైర్ అయినా వారికీ తగిన ప్రాధాన్యత ఇవ్వ బడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ + 91 8074965869

శంకర్ లో సుజాత లేని లోటు బాగా కనిపిస్తోంది

శంకర్ లో సుజాత లేని లోటు బాగా కనిపిస్తోంది

Category : Uncategorized

ఒక దర్శకుడిగా శంకర్ కి పరిచయం అవసరం లేదు. ఆయన తీసే సినిమాలు టెక్నాలజీపరంగా టాప్ లెవల్లో ఉండడమే కాదు.. తన సినిమాలతో ప్రేక్షకులని ఆలోజింపజేయడమే కాక వారికి సమాజంపై బాధ్యతను కూడా కలుగజేసే సత్తా ఆయన సొంతం. అయితే.. ఈమధ్యకాలంలో శంకర్ సినిమాల్లో భారీతనం ఉంటుంది కానీ ఎమోషనల్ కనెక్టివిటీ మాత్రం మిస్ అవుతోంది. మొన్న విడుదలైన 2.0 పరిస్థితి కూడా అదే. భారతీయ చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ గ్రాఫిక్స్ ఉన్నప్పటికీ.. ప్రేక్షకుల్ని కథనంలోకి ఇన్వాల్వ్ చేసే కథ లేకపోవడంతో 2.0ను అందరూ అక్కున చేర్చుకోలేకపోయారు. అయితే.. ఇందుకు కారణం దర్శకుడు శంకర్ కాదు, ఆయన ఎప్పటిలాగే తనదైన ఆలోచనా విధానంతో సినిమాను లార్జ్ కాన్వాస్ లోనే తెరకెక్కిస్తున్నాడు. అయితే.. జనాలు ఆయన సినిమాకి ఇంతకుముందులా కనెక్ట్ అవ్వకపోవడానికి కారణం  సుజాత రంగరాజన్. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆల్మోస్ట్ అన్నీ సినిమాలకు ఆయన రచయితగా పనిచేశారు. రోబో సినిమా తర్వాత సుజాత రంగరాజన్ మరణించారు. ఆ తర్వాత నుంచి శంకర్ లో అద్భుతమైన సృజనాత్మకతకు సరైన సారధి లేకపోవడంతో ఆయన సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. సుజాత రంగరాజన్ ను కోల్పోయిన తర్వాతే శంకర్ 3 ఇడియట్స్ రీమేక్ చేశాడు. దాన్నిబట్టి అర్ధం చేసుకోవచ్చు శంకర్ రచయిత సుజాతను ఎంతలా మిస్ అయ్యాడు అనేది. సో, శంకర్ కి సుజాత రంగరాజన్ తరహాలో మరో రచయిత త్వరలోనే దొరకాలని.. టెక్నికల్ గా మాత్రమే కాక కథాబలం ఉన్న సినిమాలు ఆయన నుంచి రావాలని కోరుకొందాం.