హైదరాబాద్ నందు (బంజర హిల్స్, జూబిలీ హిల్స్, మాదాపూర్, కొండాపూర్ ) పరిసర ప్రాంతాల్లో పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ వెంటనే కావాలను. ఆర్మీ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేసి రిటైర్ అయినా వారికీ తగిన ప్రాధాన్యత ఇవ్వ బడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ + 91 8074965869

సాధినేని యామిని సమాధానం చెప్పమ్మా..!

సాధినేని యామిని సమాధానం చెప్పమ్మా..!

Category : Uncategorized

తెలుగులో కాస్టింగ్‌కౌచ్‌పై మొదట్లో నానా రాద్దాంతం చేసిన వారిలో శ్రీరెడ్డి, పూనమ్‌కౌర్, మాధవీలతల గురించి ప్రత్యేకించాలి. వీరిలో ఒకరు పవన్‌ని కూడా వివాదంలోకి లాగితే మిగిలిన ఇద్దరు మాత్రం పవన్‌ విషయంలో ఏ ఆరోపణలు చేయలేదు. ఇక విషయానికి వస్తే తెలుగు నటీమణుల్లో మాధవీలత గురించి చాలా మందికి బాగా తెలుసు. బళ్లారికి చెందిన ఈమె రవిబాబు ‘నచ్చావులే’, ష్‌, స్నేహితుడా, ఉసురు, అరవింద్‌2, చూడాలని చెప్పాలని, తొలిపాట వంటి తెలుగు చిత్రాలతో పాటు తమిళంలో ‘అంబాలా’ చిత్రంలో కూడా యాక్ట్‌ చేసింది. ఈమెని పవన్‌కళ్యాణ్‌ వీరాభిమానిగా చెప్పుకుంటారు. ఇక రాజమహేంద్రవరంలోని ధవళేశ్వరం వద్ద జన సైనికులు లక్షల్లో వచ్చి భారీ కవాత్తు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సభలో ఆయన టిడిపిని టార్గెట్‌ చేసిన ఘాటు విమర్శలు హాట్‌టాపిక్‌గా మారాయి.

ఇక టిడిపి మహిళా నేత సాధినేని యామిని సోషల్‌ మీడియాలో పవన్‌ని టార్గెట్‌ చేస్తూ కాస్త పరుష పదజాలంలో ఓ లేఖ పెట్టింది. దీనిపై పవన్‌ వీరాభిమాని మాధవీలత ఘాటుగా సమాధానం ఇచ్చింది. మాధవీలత మాట్లాడుతూ, ఇన్నాళ్లు నాకెందుకులే అని మౌనంగా ఊరుకున్నాను. ఇప్పుడు నాకెక్కడో కాలింది. మల్లెపూల విషయం ఏంటో దగ్గర నుంచి సాధినేని యామిని చూశారమే…! చూసినప్పుడు అడగాలి కానీ ఇప్పుడెందుకు అడగడం? పవన్‌కి వారసత్వం గురించి ప్రశ్నించే హక్కులేదా? నిజమే… ఎందుకంటే ఆయన వారసత్వంతో పైకి రాలేదు. కవాత్తు ఎందుకు చేశాడు? ఏమి చేశాడు? ఎలా చేశాడు? అనే విషయాలు నీకు తెలియవు ,కనబడవు లేమ్మా? అంటూ కౌంటర్‌ వచ్చింది. మీరు చేయలేని పనిని పవన్‌ స్వయంగా చేయడానికి సిద్దం అవుతున్నాడు. 

ఆయన వ్యక్తిగత జీవితంపై పడి ఏడవడం తప్ప మీరు ఆయన్నేమి చేయలేరు. మీకంటూ పీకడానికి, చెప్పడానికి వేరే ఏమీ లేవు కదా..! మొన్నటి దాకా బిజెపి నుంచి డబ్బులు తీసుకున్నాడని అన్నారు. ఇప్పుడు ఎవరో ఖర్చుపెడితే సభలు, ఉద్యమాలు చేస్తున్నాడని అంటున్నారు. ఆ డబ్బులేమైనా మీ అయ్యలు, తాతలు పవన్‌కి ఇచ్చారా? ఇవ్వలేదు కదా…! మరి మీకు నొప్పి ఎందుకు? పైసలు ఖర్చు పెట్టకుండా ఇంత మంది జన సైనికులు రావడం మీకు ఈర్ష్యను కలిగిస్తూ, కడుపు మంటగా ఉంది.. అంటూ ఆమె చేసిన ఈ పోస్ట్‌ని మెగాభిమానులు అద్భుతం అని ఆమెని అభివర్ణిస్తున్నారు. మరి దీనికి యామిని ఎలాంటి సమాధానం చెబుతుందో వేచిచూడాల్సివుంది.