హైదరాబాద్ నందు (బంజర హిల్స్, జూబిలీ హిల్స్, మాదాపూర్, కొండాపూర్ ) పరిసర ప్రాంతాల్లో పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ వెంటనే కావాలను. ఆర్మీ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేసి రిటైర్ అయినా వారికీ తగిన ప్రాధాన్యత ఇవ్వ బడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ + 91 8074965869

సినిమాలకు గుడ్ బై.. మళ్లీ రాజకీయాల్లోకి నటి!

సినిమాలకు గుడ్ బై.. మళ్లీ రాజకీయాల్లోకి నటి!

Category : Uncategorized

అవును మీరు వింటున్నది నిజమే.. టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటి హేమ కీలక నిర్ణయం తీసేసుకున్నారు. ఇక సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పాలని.. పూర్తిస్థాయి రాజకీయాల్లోకి రావాలని ఫిక్స్ అయిపోయారు. ఇటీవల రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన హేమ రాజకీయాల్లోకి మళ్లీ వచ్చేస్తున్నట్లు ప్రకటించేశారు.

వాస్తవానికి హేమకు రాజకీయాలేం కొత్తకాదు.. ఫస్ట్ టైమ్ రాజకీయాల్లోకి ఉన్న వ్యక్తేం కాదు. రాష్ట్ర విభజన అనంతరం జరిగిన ఎన్నికల్లో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన ‘జై సమైక్యాంధ్ర’ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసిన హేమ ఘోర పరాజయం పాలయ్యారు. అంతేకాదు ఈ ఎన్నికల్లో ఈ చెప్పు గుర్తు పార్టీకి చెందిన వారు ఒక్కరంటే ఒక్కరూ గెలవలేకపోయారు. అయితే.. అప్పట్నుంచి రాజీకీయాల గుడ్ బై చెప్పి మళ్లీ సినిమాల్లోకి వచ్చిన హేమ మళ్లీ ఇప్పుడు రీ ఎంట్రీ ఇవ్వాలని ఫిక్స్ అయ్యినట్లు తెలిపారు.

‘హైదరాబాద్ సినీ పరిశ్రమను వీడి ఒక అడుగు ముందుకేసి బాహ్య ప్రపంచంలోకి వచ్చేస్తున్నాను. ఇక పూర్తిస్థాయి రాజకీయాలకే నా జీవితాన్ని అంకితం చేస్తున్నాను. అంతేకాదు ప్రజలందరికీ అందుబాటులో ఉండేందుకు గాను రాజమండ్రిలో కొత్త ఇల్లు కట్టుకుంటున్నాను. ఇక్కడ్నుంచే రాజకీయాలు చేస్తాను’ అని హేమ చెప్పుకొచ్చారు. అయితే ఈ నటి ఏ రాజకీయ పార్టీ నుంచి రీ ఎంట్రీ ఇస్తుందో వేచి చూడాల్సిందే మరి.