హైదరాబాద్ నందు (బంజర హిల్స్, జూబిలీ హిల్స్, మాదాపూర్, కొండాపూర్ ) పరిసర ప్రాంతాల్లో పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ వెంటనే కావాలను. ఆర్మీ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేసి రిటైర్ అయినా వారికీ తగిన ప్రాధాన్యత ఇవ్వ బడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ + 91 8074965869

సునీల్‌ మరలా హీరోగా…?

సునీల్‌ మరలా హీరోగా…?

Category : Uncategorized

తెలుగులో కామెడీకి స్టార్‌డమ్‌ తెచ్చిన వారిలో రాజేంద్రప్రసాద్‌, చంద్రమోహన్‌… తర్వాతి తరంలో సీనియర్‌ నరేష్‌, అల్లరినరేష్‌లను చెప్పుకోవచ్చు. ఇక సునీల్‌ అయితే బ్రహ్మానందంని మించి కమెడియన్‌గా, హీరో స్నేహితుడిగా నవ్వించే పాత్రల్లో ఎంతో క్రేజ్‌ ఉండగానే చీమకుట్టి హీరో అయ్యాడు. అందాల రాముడు, మర్యాదరామన్న, పూలరంగడు వంటి తన బాడీకి సూట్‌ అయ్యే కథలను ఎంచుకునిసక్సెస్‌ అయ్యాడు. కానీ మరలా ఆయనకు మరో చీమ కుట్టింది. మాస్‌ హీరోగా పేరు తెచ్చుకుని స్టార్‌గా మారాలని భావించాడు. నాటి నుంచి నాగచైతన్యతో కలిసి నటించిన తడాఖా తప్ప మరో చెప్పుకోదగిన చిత్రం లేదు. దాంతో మరలా ఆయన కమెడియన్‌ అవతారం ఎత్తాడు. 

సెకండ్‌ ఇన్నింగ్స్‌లో ఇప్పటికే అరడజను చిత్రాలలో కమెడియన్‌గా నటించినా మంచి పేరు రాలేదు. రాబోయే త్రివిక్రమ్‌-బన్నీల చిత్రం, రవితేజ చిత్రంపైనే ఆశలుపెట్టుకుని ఉన్నాడు. ఇంతలో ఆయనకు మరలా హీరోగా నటించే చాన్స్‌ వచ్చిందట. బాలీవుడ్‌లో ఇటీవల విడుదలై ఘనవిజయం సాధించిన అంధాధున్‌కి రీమేక్‌ రైట్స్‌ని తీసుకుని సునీల్‌ హీరోగా తెరకెక్కించాలని భావిస్తున్నారు. దీనికి సునీల్‌ కూడా ఓకే అన్నాడని సమాచారం. ఇందులో ఆయుష్మాన్‌ ఖురానా, రాధికా ఆప్టే, టబు ప్రధానపాత్రల్లో నటించారు. 

ఈ చిత్రం బాలీవుడ్‌లోనే కాదు.. చైనాలో కూడా ఓ ఊపు ఊపింది. థ్రిల్లర్‌ జోనర్‌లో తెరకెక్కిన ఈ చిత్రంలో ఆయుష్మాన్‌ ఖురానా ఓ అంధుని పాత్రను పోషించాడు. తెలుగులో సునీల్‌ కూడా అంధునిగానే నటించాల్సి వుంటుంది. మరి ఈ చిత్రం బాలీవుడ్‌లో చేసిన మ్యాజిక్‌ని తెలుగులో రిపీట్‌ చేయగలదా? దర్శకుడు ఎవరు? అనేవి వెయిట్‌ చేయాల్సివుంది…..!