హైదరాబాద్ నందు (బంజర హిల్స్, జూబిలీ హిల్స్, మాదాపూర్, కొండాపూర్ ) పరిసర ప్రాంతాల్లో పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ వెంటనే కావాలను. ఆర్మీ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేసి రిటైర్ అయినా వారికీ తగిన ప్రాధాన్యత ఇవ్వ బడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ + 91 8074965869

హీరో సిద్దార్ద్‌ని బెదిరించిన దర్శకుడెవరో తెలుసా?

హీరో సిద్దార్ద్‌ని బెదిరించిన దర్శకుడెవరో తెలుసా?

Category : Uncategorized

తెలుగులో ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు, కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం, చుక్కల్లో చంద్రుడు’ వంటి అనేక చిత్రాలలో నటించి డ్రీమ్‌బోయ్‌గా, యువత మనసులను కొల్లగొట్టిన ప్లేబోయ్‌ సిద్దార్ధ్‌. ఇక ఈమద్య ఆయన చాలా కాలం తర్వాత ‘గృహం’ అనే హర్రర్‌ చిత్రంతో వచ్చి కోలీవుడ్‌, టాలీవుడ్‌, బాలీవుడ్‌లలో కూడా డీసెంట్‌ హిట్‌ని సాథించాడు. ఇక ఈయన తమిళంలో పలు వెరైటీ చిత్రాలు, పాత్రలు చేస్తూ అక్కడ మాత్రం మంచి క్రేజ్‌నే సాధిస్తున్నాడు. ఇక ఏ విషయంపైన అయిన తనకి తోచింది డైరెక్ట్‌గా చెప్పడం ఈయన లక్షణం. ఇటీవల ప్రభాస్‌ అభిమాని అయిన ఓ నెటిజన్‌ ప్రభాస్‌ బర్త్‌డే అని చెప్పి వందరోజుల ముందే ప్రీ సెలబ్రేషన్స్‌ అని పోస్ట్‌ పెట్టినప్పుడు ఏమాత్రం జంకకుండా దానిపై సెటైర్‌ విసిరాడు సిద్దార్ధ్‌.

ఇక విషయానికి వస్తే ఆయనకు పలువురు హీరోయిన్లతో కూడా ఎఫైర్లు ఉన్నాయని అంటుంటారు. తాజాగా ఈయన మీటూ ఉద్యమాన్ని సమర్ధిస్తూ తనదైన శైలిలో ట్వీట్స్‌ పెడుతున్నాడు. విక్రమ్‌తో భారీ బడ్జెట్‌ చిత్రంగా రూపొందిన ‘మల్లన్న’ చిత్ర దర్శకుడు సుశీగణేషన్‌ ప్రస్తుతం మీటూ ఉద్యమంలో నిందితునిగా మారిపోయాడు. తమిళనటి, రచయిత్రి, దర్శకురాలు లీనామణిమైఖలే.. సుశీగణేషన్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది. ఓసారి కారులో డ్రాప్‌ చేస్తాననే నెపంతో సుశీగణేషన్‌ తనని కారులోకి ఎక్కించుకుని లైంగికంగా వేధించాడని, దాంతో తాను తన బ్యాగ్‌లో ఉన్న కత్తిని చూపి బెదిరించి బయటపడ్డానని తెలిపింది. దీనిపై శశిగణేషన్‌ స్పందించాడు. 

మీటూ ఉద్యమాన్ని చూసుకుని మణి తప్పుడు ఆరోపణలు చేస్తోందని, తాను గేయరచయిత్రిగా ఎదగలేకపోయాను కాబట్టి మీ వద్ద దర్శకత్వ శాఖలో చాన్స్‌ ఇవ్వాలని చెప్పి ఆమె తనని ఎంతో మానసికంగా వేధించిందని వెల్లడించాడు. ఇక ఇదే సమయంలో సిద్దార్ద్‌.. మణికి అండగా, మద్దతుగా నిలిచాడు. ‘నీగళం అందరికీ వినిపిస్తోంది. నీ ధైర్యం ఆదర్శవంతం’ అని ట్వీట్‌ చేశాడు. దీంతో ఆగ్రహానికి గురైన సుశీగణేషన్‌.. సిద్దార్ద్‌ తండ్రికి ఫోన్‌ చేసి బెదిరించాడట. ఈ వ్యవహారంలో తల దూర్చకుండా పక్కకి తప్పుకోకుంటే సిద్దార్ధ్‌ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించడంతో ఈ వివాదం మరింత ముదిరింది. 

దీంతో వెంటనే సిద్దార్ద్‌ కూడా స్పందించాడు. ఇకపై మణికి ఇంత కంటే ఎక్కువ మద్దతు ఇస్తాను. ఇలాంటి వాటికి బెదిరే సమస్యేలేదు…అని తెగేసి చెప్పాడు. ఇక సుశీగణేషన్‌, మణిమైఖేల్‌లు పరస్పరం కేసులు పెట్టుకోవడానికి సిద్దం అవుతున్నారు. మరి ఈ వివాదం ఏం మలుపు తిరుగుతుందో వేచిచూడాల్సివుంది…!