హైదరాబాద్ నందు (బంజర హిల్స్, జూబిలీ హిల్స్, మాదాపూర్, కొండాపూర్ ) పరిసర ప్రాంతాల్లో పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ వెంటనే కావాలను. ఆర్మీ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేసి రిటైర్ అయినా వారికీ తగిన ప్రాధాన్యత ఇవ్వ బడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ + 91 8074965869

Monthly Archives: August 2018

రేణుకి సమాజ స్పృహ ఎక్కువే..!

Category : Uncategorized

ఈమధ్య పలు సామాజిక సమస్యల నేపధ్యంలో చిత్రాలు విడుదల అవుతున్నాయి. ఇక మనదేశంలో సామాజిక సమస్య అంటే అన్నదాతల కడుపుకోత, ఆత్మహత్యలే ముందుగా గుర్తుకు వస్తాయి. చిరంజీవి తన 150వ చిత్రంగా తమిళ ‘కత్తి’కి రీమేక్‌గా చేసిన ‘ఖైదీనెంబర్‌ 150’, ఇక వరుసగా అన్ని సామాజిక రుగ్మతలపై చిత్రాలు తీసే ఆర్‌.నారాయణమూర్తి ‘అన్నదాత సుఖీభవ’, తమిళ డబ్బింగ్‌ ‘చినబాబు’ ఇలా వరుసగా రైతుల సమస్యలపై ప్రభావవంతమైన సినీ మీడియా దృష్టి కేంద్రీకరిస్తుండటం ఆహ్వానించదగ్గ పరిణామం. ఇక మెగాస్టార్‌ చిరంజీవి తన 151వ చిత్రంగా ‘సై..రా…నరసింహారెడ్డి’ చేస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత ఆయన కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు. ఇది కూడా రైతు సమస్యలపై రూపొందే చిత్రమని, ఇందులో చిరు రైతుగా కనిపిస్తాడని సమాచారం. ఇక బాలకృష్ణ కూడా కృష్ణవంశీతో ‘రైతు’ చిత్రం తీయాలని భావించి, చివరి నిమిషంలో అది వాయిదా పడింది. 

ఇక విషయానికి వస్తే పవన్‌కళ్యాణ్‌ మాజీ భార్య, నటి రేణుదేశాయ్‌ ప్రస్తుతం పూణెలో ఉంటూ మరాఠి చిత్రాలకు నిర్మాతగా, దర్శకురాలిగా తన ప్రతిభను చాటుకుంటోంది. త్వరలో ఆమె తెలుగులోకి నటిగా రీఎంట్రీ ఇస్తుందని పుకార్లు వచ్చాయి. కానీ రేణు మాత్రం తాను నటిగా రీఎంట్రీ ఇవ్వడం లేదని, కేవలం దర్శకురాలిగా తెలుగులో చిత్రం చేయనున్నానని ప్రకటించింది. ఇప్పటికే కథ, కథనాలు పూర్తయ్యాయని ప్రస్తుతం సంభాషణలు రాస్తున్నట్లు తెలిపింది. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం కూడా రైతుల సమస్యలు, వారి ఆత్మహత్యల నేపధ్యంలోనే ఉండనుందని తెలుస్తోంది. ఇక ఎన్నో చిత్రాలలో సమస్యలను ప్రస్తావించడం వరకే మన దర్శకులు ఆసక్తి చూపుతున్నారు. కానీ సమస్యలు అందరికీ తెలుసు. వాటికి పరిష్కార మార్గాలు చూపితేనే ఆయా చిత్రాలకు సార్ధకత ఉంటుంది. రేణుదేశాయ్‌ దర్శకత్వం వహించే చిత్రంలో రైతుల సమస్యలే కాదు.. వాటి పరిష్కారాలను కూడ సూచిస్తానని రేణుదేశాయ్‌ చెబుతోంది. ముందుగా రైతుల జీవితాలను దగ్గరగా చూసి, సినిమాను సహజంగా చూపించాలని కోరుకుంటున్నానని, అందుకోసం రైతుల సమస్యలపై అధ్యయనం చేసి వచ్చే ఏడాది ఆరంభంలో ఈ చిత్రాన్ని ప్రారంభిస్తానని రేణు చెప్పింది. 

ఇక ఇటీవల మహారాష్ట్ర రైతులు పెద్ద పాదయాత్ర చేసి దేశం మొత్తం దృష్టిని ఆకర్షించారు. ఈ స్ఫూర్తితోనే ఆమె ఈ చిత్రం చేయాలని భావిస్తున్నట్లు ఉంది. దీనికోసం ఆమె సిబిఐ మాజీ డైరెక్టర్‌ జెడిలక్ష్మీనారాయణ నుంచి ఎందరో రైతు సమస్యల మీద అవగాహన ఉన్నవారిని కలవనుందిట. మరి ఇందులో హీరోగా ఎవరు నటిస్తారో వేచిచూడాల్సివుంది…! 


శ్రీదేవి కూతురికి.. జాక్‌పాట్‌!

Category : Uncategorized

అతిలోక సుందరి శ్రీదేవి గారాల పెద్ద కూతురు జాన్వికపూర్‌. ఈమె హీరోయిన్‌గా తెరంగేట్రం చేసిన మరాఠీ ‘సైరత్‌’కి రీమేక్‌ అయిన ‘ధడక్‌’ చిత్రం మంచి విజయాన్నే సాధించింది. ఈ చిత్రాన్ని బాలీవుడ్‌ లక్కీ ప్రొడ్యూసర్‌ కరణ్‌జోహార్‌ నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అటు అభినయం పరంగా, మరోవైపు గ్లామర్‌ పరంగా కూడా జాన్వి కపూర్‌ అందరినీ అలరించింది. ఇక ఈమధ్య ఆమె మాట్లాడుతూ, తన మొదటి చిత్రం రీమేక్‌ చేశానని, కానీ రెండో చిత్రం మాత్రం స్ట్రెయిట్‌ చిత్రం చేస్తానని చెప్పుకొచ్చింది. ఆమె అనుకున్నట్లే ఓ భారీ బడ్జెట్‌ చిత్రం ఆమెకి లభించింది. దీనిని అధికారికంగా ప్రకటించడమే కాకుండా టైటిల్‌ పోస్టర్‌ని కూడా విడుదల చేశారు. ఈ చిత్రాన్ని కూడా కరణ్‌జోహార్‌ ధర్మ ప్రొడక్షన్స్‌ బేనర్‌లోనే నిర్మిస్తుండటం విశేషం. 

‘బాహుబలి’ సమయం నుంచి అలాంటి భారీ చిత్రాన్ని బాలీవుడ్‌లో తీయాలని ఉబలాటపడుతోన్న కరణ్‌జోహార్‌ నిర్మించే ఈ చిత్రం బడ్జెట్‌ ఏకంగా 500కోట్లు. ఇందులో రణవీర్‌సింగ్‌ హీరోగా నటిస్తుండగా, ఆయన సరసన కరీనాకపూర్‌, అలియాభట్‌లు నటిస్తున్నారు. మరో హీరోగా విక్కీ కౌశల్‌ని తీసుకున్నారు. ఇతనికి జంటగా జాన్వికపూర్‌ని భారీ రెమ్యూనరేషన్‌ ఇచ్చి తీసుకున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రం పేరు ‘తక్త్‌’. అంటే ‘సింహాసనం’ అని అర్ధం. దీనిని బట్టి ఇది రాజులు, సింహాసనం కోసం చేసే యుద్దాలు గట్రా ‘బాహుబలి’ తరహాలోనే ఉంటుందని అనిపిస్తోంది. 

గతంలో కృష్ణ కూడా 70ఎంఎంలో ‘సింహాసనం’ చిత్రం స్వీయ నిర్మాణ, దర్శకత్వంలో తానే హీరోగా, జయప్రద, మందాకిని హీరోయిన్లుగా తీశాడు. ఇదే చిత్రాన్ని కృష్ణ బాలీవుడ్‌లో కూడా జితేంద్ర హీరోగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. మరి ‘తక్త్‌’ అంటే ‘సింహాసనం’ చిత్రం జాన్వీని నేషనల్‌ స్టార్‌ని చేస్తుందో లేదో వేచిచూడాల్సివుంది. కెరీర్‌ ప్రారంభంలోనే ఆమెకి ఇంత భారీ బడ్జెట్‌ చిత్రంలో అవకావం రావడం అదృష్టమనే చెప్పాలి. కాగా ఈ చిత్రం 2020లో విడుదల కానుందని యూనిట్‌ ప్రకటించింది. 


మళ్లీ దోచుకునేలానే వున్నాడు..!!

Category : Uncategorized

సుధీర్ బాబు ప్రొడ‌క్ష‌న్స్‌ ‘నన్నుదోచుకుందువ‌టే’ చిత్రంలోని ‘మౌనం మాటతోటి’… లిరికల్ వీడియోకు సూపర్బ్ రెస్పాన్స్. 

సమ్మోహనంతో తెలుగు ప్రేక్ష‌కుల్ని స‌మ్మోహ‌నం చేసిన సుధీర్ బాబు హీరోగా, సుధీర్ బాబు ప్రొడక్షన్స్ బ్యాన‌ర్ లో ఆర్‌.ఎస్.నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘నన్ను దోచుకుందువటే’.. ఈ చిత్రంలోని ‘మౌనం మాటతోటి’…. అనే పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు. విడుదల చేసిన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది. అజనీష్ లోకనాథ్ సంగీతమందించడంతో పాటు గాయకుడి గాను మెప్పించాడు. ప్రముఖ రచయిత శ్రీమణి సాహిత్యమందించారు. విజయ్ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫి చేశారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ టీజర్ తో సినిమాపై అంచనాలు క్రియేట్ చేసింది. ఇప్పుడు రిలీజ్ చేసిన ఈ పాటతో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా కాన్సెప్ట్ డిఫరెంట్ గా ఉండడం… హీరో, హీరోయిన్ పెర్ ఫార్మెన్స్ ఫ్రెష్ గా అనిపించడంతో అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఆఫీస్ మొత్తం భయ‌ప‌డే సాఫ్ట్ వేర్ కంపెనీ మేనేజ‌ర్ గా సుధీర్‌బాబు న‌టించ‌గా.. అల్ల‌రి చేసే గ‌డుస‌మ్మాయి సిరి పాత్ర‌లో హీరోయిన్ న‌భా న‌టేశ్ క‌నిపించింది. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా రెడీ అవుతున్న ఈ చిత్ర షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్య‌క్ర‌మాలు శరవేగంగా జరుగుతున్నాయి. అన్నికార్య‌క్ర‌మాలు పూర్తిచేసి వినాయ‌కచ‌వితి ప‌ర్వ‌దినాన సెప్టెంబ‌ర్ 13న విడుద‌ల చేయాటానికి స‌న్నాహాలు చేస్తున్నారు. సెప్టెంబర్ 12న స్పెషల్ ప్రీమియర్ షోస్ ప్లాన్ చేస్తున్నారు. 

ఈ సందర్భంగా దర్శకుడు ఆర్.ఎస్.నాయుడు మాట్లాడుతూ… సుధీర్ బాబు గారు హీరోగా సుధీర్ బాబు ప్రొడ‌క్ష‌న్స్ లో నిర్మిస్తున్న ‘నన్నుదోచుకుందువ‌టే’ చిత్రానికి సంబంధించిన టీజ‌ర్ ని జూలై 14న రిలీజ్ చేశాం. చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్పుడు ‘మౌనం మాటతోటి’ లిరికల్ వీడియోను విడుదల చేశాం. అజనీష్ అద్బుతమైన సంగీతం అందించారు. ఈ పాటను ఆయనే పాడటం విశేషం. శ్రీమణి గారు మంచి మెలోడియస్ సాహిత్యం అందించారు. తాజాగా విడుదల చేసిన పాటతో ఈ చిత్రంలోని మిగిలిన పాటలు ఎలా ఉండబోతున్నాయో అర్థం చేసుకోవచ్చు. మ్యూజికల్ గా మంచి ఆల్బమ్ అందించారు. ముఖ్యంగా హీరో, హీరోయిన్ క్యారెక్టరైజేషన్స్ కి అంద‌రూ క‌నెక్ట్ అయ్యారు. ఈ చిత్రాన్ని సెప్టెంబ‌ర్ 13న విడుద‌ల చేసేందుకు సిద్ధమౌతున్నాం. సెప్టెంబర్ 12 నే ప్రీమియర్ షోస్ వేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. సమ్మోహనం లాంటి మంచి బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రం త‌రువాత సుధీర్‌బాబు గారి నుంచి వ‌స్తున్న చిత్రం కావ‌టంతో ప్రేక్ష‌కుల నుంచి అంచ‌నాలు భారీగా వున్నాయి. సుధీర్ బాబు గారి ఫస్ట్ ప్రొడక్షన్ లో నన్ను నమ్మి, నా కథను నమ్మి అవకాశం ఇచ్చారు.

సమ్మోహనం సూపర్ హిట్ అయిన తర్వాత నాకు అవకాశం ఇచ్చి ప్రోత్సహించిన సుధీర్ బాబు గారికి స్పెషల్ గా థాంక్స్ తెలియజేస్తున్నాను. సినిమా అనుకున్న ప్రకారం పూర్తి చేశాం. సినిమా మీదున్న నమ్మకంతో ప్రమోషన్ ను కూడా భారీగా ప్లాన్ చేశాం. అందుకు ఈ చిత్ర ప్ర‌మోష‌న్ లో తెలుగు ప్రేక్ష‌కులంద‌రినీ ఇన్‌వాల్వ్ చేస్తున్నాము. అలాగే ఈ చిత్రం ప్రొడ‌క్ష‌న్ వాల్యూస్ ఎక్క‌డా త‌గ్గ‌కూడ‌దనే సంకల్పంతోనే సుధీర్‌బాబు గారు ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా నిర్మించారు. అని అన్నారు.


మళ్లీ లీక్: ‘అరవింద సమేత’ ఇలా అయితే కష్టమే!

Category : Uncategorized

యంగ్ టైగర్ ఎన్టీఆర్ గత చిత్రం ‘జై లవ కుశ’ టైం లో ‘జై లవ కుశ’ టీజర్  విడుదలకు ముందే ఆ టీజర్ లోని కొన్ని సన్నివేశాలు యూట్యూబ్ లో హల్చల్ చేశాయి. అలాగే ఆ టీజర్లోని జై పాత్రధారి ఎన్టీఆర్ పిక్స్ లీకవడమే కాదు క్షణాల్లో అవి మీడియాలో వైరల్ అయ్యాయి. అప్పుడు జై లవ కుశ నిర్మాత కళ్యాణ్ రామ్ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగాడు లీకుల రాయుళ్లను పట్టుకోవడానికని. ఇప్పుడు ఎన్టీఆర్ ‘అరవింద సమేత – వీర రాఘవ’ సినిమాని కూడా ఈ లీకులు.. దడ పుట్టిస్తున్నాయి. మొన్నటికి మొన్న అరవింద సమేతలోని ఎన్టీఆర్ అండ్ నాగబాబు కలిసి నటించిన సన్నివేశాలలో ఒక పిక్ లీకై పెద్ద సెన్సేషన్ క్రియేట్ అయ్యింది. ఇక అప్పటినుండి అరవింద సమేత టీమ్ లో ఎవరు ఫోన్ లు కానీ… ఎలాంటి ఎలక్ట్రికల్ పరికరాలు కూడా అనుమతించొద్దని త్రివిక్రమ్ చెప్పినప్పటికీ.. మరో పిక్ లీకవడంతో యూనిట్ షాకయ్యింది.

ఆ లీకులను ఎలా ఆపాలో అనే విషయమై తర్జన భర్జన పడుతూనే… నిన్న ఆగష్టు 9 న అరవింద సమేత – వీర రాఘవ సినిమా టీజర్ ని విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించగానే.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. మరి ఫ్యాన్స్ ఇంకా అరవింద సమేత టీజర్ రాక కోసం సోషల్ మీడియాలో హంగామా స్టార్ట్ చేసిన టైం లోనే  ఇలా.. అరవింద సమేత లీక్డ్ టీజర్ బైటికొచ్చేసింది.అరవింద టీజర్ లోని కొన్ని పిక్స్ ఇపుడు సోషల్ మీడియాలో, ఇంటర్నెట్ లో వీర విహారం చేస్తున్నాయి. ఎంతో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా లీకులు అరవింద సమేత టీమ్ కి ఒణుకు పుట్టిస్తున్నాయి. 

మరి లీకైన అరవింద టీజర్ పిక్స్ లో ఎన్టీఆర్ ఉగ్రరూపంతో పాటుగా.. నాగబాబు ఉన్న ఫొటోస్ కనబడుతున్నాయి. అంటే… ఈ సినిమా లో ఎన్టీఆర్ – నాగబాబుకు సంబంధించిన కొన్ని సీన్స్ కనబడుతున్నాయి. అరవింద టీజర్ ని తండ్రీకొడుకుల సెంటిమెంట్ మీదే ఎక్కువగా కట్ చేశారనిపిస్తుంది. మరి ఈరకంగా సినిమాలోవి అన్ని లీకవుతుంటే… సినిమా మీద ఎఫెక్ట్ పడే ప్రమాదం ఉంది. అయినా అరవింద సమేతలోని లీకైన టీజర్ పిక్స్ ఒరిజినల్ వా… లేదంటే ఇంటర్నెట్ మాయాజాలమా అనేది మాత్రం అరవింద సమేత ఒరిజినల్ టీజర్ బయటికొచ్చాక గాని క్లారిటీ రాదు.


ప్రేమకు రెయిన్ చెక్ చెప్పబోతున్నారు..!

Category : Uncategorized

ఆగస్ట్ 23న విడుదలకు సిద్దంగా ఉన్న యూత్ ఫుల్ లవ్ స్టొరీ ‘ప్రేమకు రెయిన్ చెక్’

శరత్ మరార్ – నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ సంస్థ సమర్పణలో స్టోన్ మీడియా ఫిలిమ్స్ ప్రొడక్షన్ ‘ప్రేమకు రెయిన్ చెక్’ చిత్రం ట్రైలర్ ఈ రోజు విడుదలయ్యింది. కొత్త తారాగణంతో నూతన దర్శకులు ఆకెళ్ళ పేరి శ్రీనివాస్ ‘ప్రేమకు రెయిన్ చెక్’ ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తెస్తున్న సంగతి మనకు తెలిసిందే.

‘ప్రేమకు రెయిన్ చెక్’ టైటిల్ నుంచే కొత్తదనాన్ని ప్రేక్షకులకి అందించిన చిత్ర బృందం ఈ రోజు విడుదల చేసిన ట్రైలర్ తో అంచనాలని పెంచేసింది. ప్రస్తుత యువత (మిల్లెనిఅల్స్) ని దృష్టిలో ఉంచుకొని ఈ కథ చెప్పే ప్రయత్నం చేశామని ఇంతకముందే దర్శకులు ఆకెళ్ళ పేరి శ్రీనివాస్ తెలిపారు. ట్రైలర్ చూస్తుంటే, కొత్తదనంతో పాటు ఛాయాగ్రహణం మనల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఈ ట్రైలర్ లో మొదట ఆకర్షించే విషయం ఈ చిత్ర ఛాయాగ్రహణం, శరత్ గురువు గారు తన కెమెరాతో చూపించిన విజువల్స్ అధ్బుతంగా ఉన్నాయి. 

చిత్ర సంగీతం విడుదలైన మూడు పాటల రుచి చూసిన ప్రేక్షకులు, ట్రైలర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి కచ్చితంగా ఆకర్షితులు అవుతారు. లవ్ స్టోరీస్ లో మెలోడీ ముఖ్యమైన అంశం, ‘ప్రాణమా’ పాట కొంచెం చూపించిన చిత్ర బృందం, ఈ పాట ఇంకా వినాలన్న ఉత్సాహాన్ని పెంచి, ప్రేక్షకులని ఊరించారు. ఈ పాట విడుదల కోసం ప్రేక్షకులు వేచి చూస్తున్నారు. చిత్ర ఛాయాగ్రహణం, మ్యూజిక్ ఒక దానికి ఒకటి పోటి పడుతునట్టు కనపడుతుంది.  వీటితో పాటు ఈ ట్రైలర్ లో మనము గమనించాల్సిన కొత్త నటీనటులతో పాటు సుమన్, రఘు కారుమంచి, కిరీటి దామరాజు కూడా ముఖ్య పాత్రలు పోషించారు.

అభిలాష్, ప్రియల మధ్య కెమిస్ట్రీ ఎలా ఉండబోతుందో వెండి తెరపై చూడాలి. 

ఈ చిత్రంలో ఒక వ్యక్తి  తన ప్రేమకు రెయిన్ చెక్ ఇచ్చి కెరీర్ కి ప్రాముఖ్యత ఇచ్చి తన జీవితాన్ని ఎలా కాంప్లికేట్ చేశాడు అన్నది కథ అన్నది దర్శకులు తెలిపినప్పటికీ, ప్రేమ, అడ్వెంచర్ స్పోర్ట్స్, కార్పొరేట్ సెటప్  ట్రైలర్లో చూస్తే ఇంకా కథాంశాలు ఉన్నాయి అని తెలుస్తుంది. మాటలు కూడా కొత్తగా నేటి యువతను ఆకర్షించేలా ఉన్నాయి.  ట్రైలర్ తో అంచనాలు పెంచిన ఈ చిత్ర బృందం, ఈ చిత్రాన్ని ఈ నెల 23 న ప్రేక్షకుల ముందుకు  తీసుకొచ్చే సన్నాహాలు చేస్తున్నారు.


భర్తతో కలిసి బాగానే ఎంజాయ్‌ చేస్తోంది!

Category : Uncategorized

క్రికెట్‌ క్రీడాకారులు, ఇతర ఆటగాళ్లు, సినిమా రంగంలోని వారు తమ భర్తలు ఎక్కడ ఉంటే అక్కడ ప్రత్యక్షమైపోతుంటారు. పనిలో పనిగా ఆయా ప్రదేశాలలో భార్యాభర్తలు, ప్రేయసి ప్రియుళ్లు షూటింగ్‌ గ్యాప్‌లో చక్కర్లు కొడుతూ ఎంజాయ్‌ చేస్తూ ఉంటారు. ఇక గడుసుపిల్ల సమంత గురించి వేరే చెప్పాలా? ఆమె తాజాగా గోవాలో ప్రత్యక్షమైంది. రోమ్‌లో ఉంటే రోమన్‌లా ఉండమన్న సూక్తి ప్రకారం సమంత గోవాలో ఎలా ఉండాలో అలానే కనిపించి తన ఫొటోలను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసింది. చాలా మందిని పెళ్లయినా కూడా ఇలాంటి బీచ్‌ దుస్తుల్లో ఎలా కనిపిస్తారు? అని అడిగితే వారిచ్చే సమాధానం బీచ్‌లో బికినీ కాకుండా చీర కట్టుకుంటామా? అని ప్రశ్నిస్తారు. 

అదే విధంగా సమంత కూడా వైట్‌ టాప్‌, బ్లాక్‌ షార్ట్‌లో కనిపిస్తూ ఉంది. చిరునవ్వులు చిందిస్తోన్న ఈ అల్లరిపిల్ల కాస్ట్యూమ్స్‌ని చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఈ ఫొటోలను పోస్ట్‌ చేసిన గంటలోనే ఈ పిక్‌కి రెండు లక్షలకు పైగా లైక్స్‌ వచ్చాయంటే ఆమె ఎలా నెటిజన్లను ఆకర్షిస్తోందో అర్ధం అవుతోంది. మరోవైపు ఆమె భర్త నాగచైతన్య ప్రస్తుతం గోవాలోనే ‘శైలజారెడ్డి అల్లుడు’కి సంబంధించి అను ఇమ్మాన్యుయేల్‌తో కలిసి డ్యూయెట్‌ పాడుకుంటున్నాడు. 

షూటింగ్‌లో అను ఇమ్మాన్యుయేల్‌తో షూటింగ్‌ గ్యాప్‌లో సమంతతో మన అక్కినేని బుల్లోడు బాగానే ఎంజాయ్‌ చేస్తున్నాడన్నమాట. ఇక ఈ పాటతో ‘శైలజారెడ్డి అల్లుడు’ చిత్రం పూర్తవుతుంది. ఈనెల 31న సినిమాను విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు. మరోవైపు సమంత ‘యూటర్న్‌’ షూటింగ్‌లో బిజీగా ఉంది.


‘రిషి’కి విషెస్ చెబుతూ రవి దొరికేశాడు!

Category : Uncategorized

మహేష్ బాబు – వంశీ పైడిపల్లి కాంబినేషన్ వస్తున్న మహేష్ 25వ సినిమా అంచనాలు తగ్గట్టుగానే తన మొదటి లుక్ తో ఆకట్టుకున్నాడు మహేష్. ఈ సినిమాకు ‘మహర్షి’ అనే టైటిల్ పెట్టారు. ఇందులో మహేష్ పాత్ర పేరు రిషి. మహేష్ ఇందులో స్టూడెంట్ గా కనిపించబోతున్నాడని.. ఇప్పుడు నుండే ఆ సినిమాను ఎప్పుడు ఎప్పుడు చూద్దాం అని తన ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇక ఈ సినిమాలో అల్లరి నరేష్ ఓ ప్రధాన పాత్ర చేస్తున్నాడనేది తెలిసిన విషయమే. ఇందులో అతని పాత్ర చాలా కీలకం అని తెలుస్తుంది. గతంలో ‘గమ్యం’..’శంభో శివ శంభో’ సినిమాల్లో అల్లరి నరేష్ తన నటనతో ఎంతగా ఆకట్టుకున్నాడో తెలిసిన విషయమే. ఆ పాత్రలకి ఆడియెన్స్ నుంచి ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభించింది. ఇప్పుడు అటువంటి పాత్ర ఈ సినిమాలో ఉంటుందని అంటున్నారు. మహేష్ కి స్నేహితుడిగా నరేష్ నటించనున్నట్లు అనేక రూమర్స్ వస్తున్నాయి. 

అయితే మహేష్ పుట్టినరోజు సందర్భంగా అల్లరి నరేష్ విషెస్ చెబుతూ ట్వీట్ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. అందులో రవి (అల్లరి నరేష్) టూ రిషి అని మహేష్ కు విషెస్ చెప్పాడు నరేష్. ఈ మూవీలో రిషి (మహేష్) తన స్నేహితుడు కోసం అమెరికా నుండి ఇండియా వస్తాడని గత కొన్ని రోజులు నుండి ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. సో ఈరోజు అల్లరి నరేష్ ట్వీట్ తో ఫ్యాన్స్ ఆ రూమర్ నిజమే అని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇందులో వీళ్ల ఫ్రెండ్ షిప్ ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.


`విశ్వరూపం 2`కి అడ్డంకులు తొలగినట్లేనా!!

Category : Uncategorized

కమల్ హాసన్ హీరోగా నటించిన `విశ్వరూపం 2` వరల్డ్ వైడ్ రేపు రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మొన్న తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి చనిపోవడంతో ఈ చిత్రం వాయిదా పడే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి చిత్ర యూనిట్ ఓ క్లారిటీ కూడా ఇచ్చింది. ఈ సినిమాను భారీగా రిలీజ్ చేస్తున్నారు కాబట్టి వాయిదా వల్ల ఇబ్బందులు తలెత్తుతాయని… అందుకే ఈ సినిమాను అనుకున్న డేట్ కే రిలీజ్ చేయాలనీ నిర్నయయించుకున్నారు మేకర్స్.

అంటే రేపు సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవ్వబోతుంది. ఈ సందర్భంగా పార్ట్ 2 కలెక్షన్స్ ఎలా ఉంటాయో అన్న ఆసక్తికర చర్చ ట్రేడ్ లో సాగుతోంది. ‘విశ్వరూపం’ మొదటి పార్ట్ ఏకంగా 250 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాకు దాదాపు 95 కోట్ల బడ్జెట్ అయింది. అప్పుడు ఆ సినిమా రిలీజ్ అవ్వడానికి ఎన్నో సందిగ్ధతలు… ఎన్నో ఆటంకాలు .. ఎన్నో సంక్లిష్టతలు ఎదురైయ్యాయి. అయినా కూడా  రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది. అయితే ఆ పరిస్థితులు పార్ట్ 2 కి లేవు. అటు హిందీలోనూ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ఓవరాల్ గా ఈ సినిమా మొదటి పార్ట్ కంటే ఎక్కువ కలెక్షన్స్ ను రాబట్టే అవకాశం ఉందని చెబుతున్నారు ట్రేడ్ నిపుణులు. ట్రైలర్ కి కూడా మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా ఎలా ఉంటుందోనన్న ఆసక్తికర చర్చా సాగుతోంది. అయితే కమల్ ఫ్యాన్స్ ను ఇబ్బంది పెట్టే విషయం ఏంటంటే ఈ సినిమా తర్వాత కమల్ సినిమాలకు గుడ్ బాయ్ చెప్పబోతున్నాడు అని కోలీవుడ్ మీడియా టాక్.


సినీజోష్‌ రివ్యూ: శ్రీనివాస కళ్యాణం

Category : Uncategorized

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ 

శ్రీనివాస కళ్యాణం 

తారాగణం: నితిన్‌, రాశిఖన్నా, నందితా శ్వేత, రాజేంద్రప్రసాద్‌, గిరిబాబు, జయసుధ, ప్రకాష్‌రాజ్‌, నరేష్‌, సత్యం రాజేష్‌, ఆమని, విదుల్లేఖా రామన్‌, సితార తదితరులు 

సినిమాటోగ్రఫీ: సమీర్‌రెడ్డి 

ఎడిటింగ్‌: మధు 

సంగీతం: మిక్కీ జె.మేయర్‌ 

నిర్మాతలు: రాజు, శిరీష్‌, లక్ష్మణ్‌ 

రచన, దర్శకత్వం: సతీష్‌ వేగేశ్న 

విడుదల తేదీ: 09.08.2018 

పెళ్ళి అంటే ఒక ఈవెంట్‌గా భావించే నేటి తరానికి శ్రీనివాస కళ్యాణం చిత్రం ద్వారా పెళ్ళికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటో తెలియజెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు సతీష్‌ వేగేశ్న, నిర్మాత దిల్‌రాజు. నితిన్‌, రాశి ఖన్నా జంటగా రూపొందిన ఈ సినిమాని కంప్లీట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించారు. సతీష్‌ వేగేశ్న ఇదే బేనర్‌లో చేసిన శతమానం భవతి క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా విజయం సాధించడమే కాకుండా అవార్డులు కూడా సొంతం చేసుకుంది. పెళ్ళి అనే కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమాతో దర్శకనిర్మాతలు మరోసారి ప్రేక్షకుల్ని అలరించగలిగారా? దిల్‌ తర్వాత నితిన్‌ ఈ బేనర్‌లో చేసిన ఈ రెండో సినిమా అతనికి ఎలాంటి పేరు తెచ్చింది? అలాగే దర్శకుడు సతీష్‌ వేగేశ్న శతమానం భవతి తరహాలో మరోసారి మ్యాజిక్‌ చెయ్యగలిగాడా? అనేది సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం. 

అతని పేరు వాసు(నితిన్‌). ఉద్యోగరీత్యా చండీగఢ్‌లో ఉంటాడు. అతనిది చాలా పెద్ద ఫ్యామిలీ. వారంతా సఖినేటిపల్లిలో ఉంటారు. చిన్నతనంలోనే పెళ్ళి గురించి బామ్మ(జయసుధ) చెప్పిన మాటలు వాసు మనసులో బలంగా నాటుకున్నాయి. చండీగఢ్‌లోనే ఉంటున్న హైదరాబాద్‌ అమ్మాయి శ్రీ అలియాస్‌ శ్రీదేవి(రాశీఖన్నా)తో వాసుకి పరిచయం అవుతుంది. అది ప్రేమగా మారతుంది. ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాత పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. పెద్దలంటే గౌరవం ఉన్న వాసు తమ పెళ్ళి విషయాన్ని శ్రీ తండ్రి(ప్రకాష్‌రాజ్‌)తో చెప్తాడు. కోటీశ్వరుడైన శ్రీ తండ్రికి పెళ్ళి అంటే ఒక ఈవెంట్‌ అనే అభిప్రాయం ఉంటుంది. దాని కోసం రోజుల తరబడి టైమ్‌ వేస్ట్‌ చెయ్యకూడదు అనుకుంటాడు. అంతకుముందే అతని పెద్ద కూతురు పెళ్ళి పెటాకులు అవుతుంది. విడాకుల వరకు వచ్చి ఉంటుంది. అలాంటి టైమ్‌లో వాసు, శ్రీల ప్రేమ విషయం తెలుసుకున్న శ్రీ తండ్రి.. వాసుతో ప్రీ మారిటల్‌ అగ్రిమెంట్‌ చేసుకుంటాడు. తన కూతురికి నచ్చకపోతే ఏ క్షణంలోనైనా విడాకులు తీసుకునేందుకు వీలుగా ఉన్న అగ్రిమెంట్‌ అది. దానిమీద సంతకం పెడితే పెళ్ళికి ఒప్పుకుంటానంటాడు. దానికి వాసు ఒక షరతు పెడతాడు. పెళ్ళికి సంబంధించిన పనుల్లో అమ్మాయి తండ్రి చెయ్యాల్సిన కార్యక్రమాలన్నీ దగ్గరుండి చేయించాలని చెప్తాడు. దానికి అతను ఓకే అంటాడు. అలా వాసు, శ్రీ తండ్రి మధ్య ఒక ఒప్పందం జరుగుతుంది. పెళ్ళి పనులు మొదలవుతాయి. ఆ తర్వాత ఏం జరిగింది. మామా అల్లుళ్లు చివరి వరకు తమ మాట మీద నిలబడ్డారా? ఎలాంటి అవాంతరాలు లేకుండా పెళ్ళి జరిగిందా? పెళ్ళి అంటే మంచి అభిప్రాయం లేని శ్రీ తండ్రి మారాడా? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. 

వాసుగా నితిన్‌ పెర్‌ఫార్మెన్స్‌ బాగానే ఉంది. అయితే గతంలో నితిన్‌ చేసిన చాలా సినిమాల్లోని క్యారెక్టర్‌లాగే ఈ సినిమాలోనూ అనిపిస్తుంది. సినిమా చూస్తున్నంత సేపు ఆ మధ్య వచ్చిన అఆ సినిమా గుర్తొస్తుంది. కమర్షియల్‌ ఎలిమెంట్స్‌కి స్కోప్‌ లేకపోవడం వల్ల సినిమాలో డాన్సులకుగానీ, ఫైట్స్‌కిగానీ ఇంపార్టెన్స్‌ ఇవ్వలేదు. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు నితిన్‌ డైలాగ్స్‌కి, అతని లిప్‌ మూమెంట్స్‌కి ఎక్కడా మ్యాచ్‌ అవ్వదు. శ్రీగా నటించిన రాశీఖన్నా క్యూట్‌గా చాలా బాగుంది. అయితే ఆమె క్యారెక్టర్‌ కేవలం పెళ్ళికూతురు వరకే పరిమితమైంది తప్ప ఆమెకు పెర్‌ఫార్మ్‌ చేసే అవకాశాలు చాలా తక్కువగా వచ్చాయి. పైగా ఆమె ప్రతి డైలాగ్‌ చాలా లో వాయిస్‌లో రహస్యం చెప్తున్నట్టుగా అనిపిస్తుంది. కోటీశ్వరుడుగా ప్రకాష్‌రాజ్‌ తనకు కొట్టిన పిండైన క్యారెక్టర్‌తో ఆకట్టుకున్నాడు. వాసు మరదలు పద్మావతి(నందిత శ్వేత)గా నటన బాగుంది. మిగతా క్యారెక్టర్స్‌లో రాజేంద్రప్రసాద్‌, నరేష్‌, జయసుధ, ఆమని, సితార తదితరులు ఫ్యామిలీ మెంబర్స్‌గా ఫర్వాలేదు అనిపించారు. అక్కడక్కడ కామెడీ చేసేందుకు హీరో ఫ్రెండ్స్‌గా సత్యం రాజేష్‌, ప్రవీణ్‌, విద్యులేఖా రామన్‌ ప్రయత్నించారు. నందిత శ్వేత, ప్రభాస్‌ శ్రీను మధ్య వచ్చే సీన్స్‌తో కామెడీ చెయ్యాలని ట్రై చేసినా అంతగా వర్కవుట్‌ అవ్వలేదు. 

సాంకేతిక నిపుణుల గురించి చెప్పాలంటే సమీర్‌రెడ్డి ఫోటోగ్రఫీ అద్భుతమని చెప్పాలి. ప్రతి సీన్‌ని ఎంతో రిచ్‌గా, మరెంతో అందంగా చూపించే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా పెళ్ళి తంతుకి సంబంధించిన సీన్స్‌ అన్నీ ఎంతో కలర్‌ఫుల్‌గా అనిపిస్తాయి. మిక్కీ జె. మేయర్‌ చేసిన పాటల్లో టైటిల్‌ సాంగ్‌తోపాటు మరో రెండు పాటలు వినసొంపుగా ఉన్నాయి. సిట్యుయేషన్‌కి తగ్గట్టు బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా బాగానే చేశాడు. నేరేషన్‌ చాలా స్లోగా ఉండడం వల్ల రెండు గంటల ఇరవై నిమిషాల సినిమా అయినా చాలా లెంగ్తీగా అనిపిస్తుంది. ఈ విషయంలో ఎడిటర్‌ మధుని తప్పుపట్టలేం. ఎ.ఎస్‌.ప్రకాష్‌ ఆర్ట్‌ వర్క్‌ కూడా చాలా రిచ్‌గా ఉంది. వెంకటేశ్వర క్రియేషన్స్‌ ప్రొడక్షన్‌ వేల్యూస్‌ బాగున్నాయి. పెళ్లి బ్యాక్‌డ్రాప్‌ కావడం వల్ల దానికి కావాల్సినవన్నీ ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా ప్రొవైడ్‌ చేశారు. ఇక దర్శకుడు సతీష్‌ వేగేశ్న గురించి చెప్పాలంటే సంప్రదాయ బద్దంగా పెళ్లి ఎలా చెయ్యాలి అనే ఒక్క లైన్‌తో కథ రాసుకున్నట్టుగా అనిపిస్తుంది. కోటీశ్వరుడి కూతురు, లక్షాధికారి కొడుకు పెళ్లి చెయ్యాలంటే సహజంగానే రిచ్‌గా ఉంటుంది. దానికి తగ్గట్టుగానే సినిమాలో రిచ్‌ మ్యారేజ్‌ ఎలా చెయ్యాలనేది చూపించాడు. అబ్బాయి తరఫు వాళ్ళకి, అమ్మాయి తరఫు వాళ్ళకి పెళ్ళి విషయంలో ఎలాంటి అభ్యంతరాలు లేనపుడు ప్రీ మారిటల్‌ అగ్రిమెంట్‌ని మధ్యలోకి తీసుకొచ్చి దానితో కాన్‌ఫ్లిక్ట్‌ని క్రియేట్‌ చేయడం కృతకంగా అనిపించిందే తప్ప అది ఒక స్ట్రాంగ్‌ పాయింట్‌ అని ప్రేక్షకులు ఫీల్‌ అయ్యేలా లేదు. పెళ్ళి అంటే మంచి అభిప్రాయం లేని హీరోయిన్‌ తండ్రిని మార్చడమే హీరో ధ్యేయంగా కనిపించింది తప్ప గుండెలు బరువెక్కే విషయం ఏముంది అనిపిస్తుంది. కథలో బలమైన ఎలిమెంట్‌ లేకపోవడం వల్ల నెక్స్‌ట్‌ ఏం జరగబోతోంది అనే క్యూరియాసిటీ ఆడియన్స్‌కి కలగదు. ఫస్ట్‌హాఫ్‌ అంతా ఫ్యామిలీ వాతావరణంలో జరిగే కొన్ని సీన్స్‌, హీరో ఫ్రెండ్స్‌తో కొన్ని సీన్స్‌, హీరో, హీరోయిన్‌ మధ్య కొన్ని సీన్స్‌తో కాలక్షేపం చేసిన తర్వాత సెకండాఫ్‌లో పెళ్ళి పనులతో అసలు కథ ప్రారంభమవుతుంది. క్లైమాక్స్‌లో నితిన్‌ చెప్పిన పెళ్ళి మంత్రాలు, వాటి అర్థాలు ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించేలా ఉన్నాయి. ఆ తర్వాత ప్రకాష్‌రాజ్‌ రియలైజ్‌ అవుతూ చెప్పే డైలాగ్స్‌ మరింత నీరసం తెప్పిస్తాయి. దాదాపు 20 నిమిషాల పాటు సాగే ఈ సీన్‌ ఎప్పుడు కంప్లీట్‌ అవుతుందా? ఎప్పుడు థియేటర్‌ నుంచి బయట పడదామా? అని ఆడియన్స్‌ ఎదురుచూసే పరిస్థితి ఏర్పడింది. ఫైనల్‌గా చెప్పాలంటే సంప్రదాయ బద్దమైన వివాహం గురించి అందరికీ చెప్పే ప్రయత్నంలో ఓ సినిమాలా కాకుండా టీవీ సీరియల్‌గా సినిమాని నడిపించేశారు. ఏ దశలోనూ మనకు సినిమా చూస్తున్న ఫీలింగ్‌ కలగదు. ఫస్ట్‌హాఫ్‌ కాస్తో కూస్తో ఫన్నీ సీన్స్‌తో సినిమాని నడిపించిన దర్శకుడు సెకండాఫ్‌కి వచ్చేసరికి పూర్తిగా పెళ్ళి పనుల్లో నిమగ్నమైపోయి సగటు ప్రేక్షకుడిని పట్టించుకోలేదు. పెళ్ళి పనులు చూస్తూ, హీరో, అతని ఫ్యామిలీ చెప్పే నీతి వాక్యాలు వింటూ కాలక్షేపం చెయ్యాల్సి వచ్చింది. శతమానం భవతి తరహాలో ఒక ఫీల్‌ గుడ్‌ మూవీ చెయ్యాలన్న దర్శకనిర్మాతల ఆలోచన మంచిదే అయినా అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా తెరకెక్కించడంలో విఫలమయ్యారని చెప్పొచ్చు. 

ఫినిషింగ్‌ టచ్‌: ఫలించని ప్రయత్నం


హిట్టు టాక్ వచ్చినా ఏం లాభం..?

Category : Uncategorized

వారానికి అరడజను చిన్న సినిమాలు బాక్సాఫీసు వద్దకు రావడం.. అందులో కొన్ని సినిమాల్లో సరైన కంటెంట్ లేక ప్రేక్షకులు ఉసూరుమంటున్నారు. ఎక్కడో చిన్న చితక సినిమా హిట్ అయినా ఆ సినిమా కి కలెక్షన్స్ మాత్రం అంతంత మాత్రంగా ఉంటున్నాయి. ఒక సినిమాని హిట్ అని ప్రేక్షకులు, క్రిటిక్స్ కూడా ఓవరాల్ గా మంచి మార్కులు వేసినా సినిమా కలెక్షన్స్ దగ్గరికి వచ్చేటప్పటికీ మాత్రం తుస్ మంటున్నాయి. అందుకు లేటెస్ట్ ఉదాహరణ సుశాంత్ నటించిన చి.ల.సౌ సినిమానే. ఆ సినిమాకి అక్కినేని కాంపౌండ్ బ్యాగ్రౌండ్ ఉంది.. అలాగే సినిమా విడుదలయ్యాక పాజిటివ్ అంటే హిట్ టాక్ వచ్చింది. అలాగే విమర్శకులు సైతం సినిమాని మంచిగుందన్నారు. కానీ.. చివరికి మిగిలింది ఏమిటి?

అయితే ఇలా కేవలం చి. ల.సౌ సినిమా విషయంలోనే జరగలేదు. ఇలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన బోలెడన్ని చిన్న సినిమాలు హిట్ టాక్ వచ్చి హిట్ అయినా.. కలెక్షన్స్ నిల్. అలా అయిన వాటిలో.. అప్పట్లో ఒకడుండేవాడు, మెంటల్ మదిలో, నీది నాది ఒకే కథ, అలాగే లేటెస్ట్ గా సుధీర్ బాబు సమ్మోహనం సినిమా. మరి ఈ సినిమాలన్నిటికీ క్రిటిక్స్, ప్రేక్షకులు కూడా పాజిటివ్ మార్కులు వేసినా సినిమా కలెక్షన్స్ మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. మంచి కంటెంట్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన ఈ సినిమాలకు ఇలా కలెక్షన్స్ తక్కువ రావడానికి కారణం ఏదో ఉంది.

ఆ ఏదో అనేది ప్రమోషన్స్ అనే టాక్ మాత్రం ఫిలింసర్కిల్స్ లో జోరుగా వినబడుతుంది. స్మమోహనం సినిమాకి సుధీర్ బాబు బావ మహేష్ వంటి వారు సమ్మోహనం సినిమా  విడుదలకు ముందు… అయ్యాక కూడా మీడియా ప్రమోషన్స్ లోను, అలాగే ఆన్ లైన్ ప్రమోషన్స్ లోను జోరు చూపించిన సుధీర్ బాబు – ఇంద్రగంటికి ఒరిగింది లేదు. ఇక అక్కినేని ఫ్యామిలీ హ్యాండ్ వేసినా చి. ల.సౌ పరిస్థితి అంతే. అయితే ఇలా చిన్న సినిమాలు హిట్ అయినా కలెక్షన్స్ రాకపోవడానికి వాటికి సరైన ప్రమోషన్స్ లేవనే టాక్ వినబడుతూనే ఉంది. ఎంతగా మీడియాలో, సోషల్ మీడియాలో ప్రమోట్ చేసినా సినిమాలకు హైప్ రాదని.. బి.సి సెంటర్స్ ని ఆకట్టుకోవాలంటే… కాలేజ్ లకి అలాగే పలు ఊర్లలో థియేటర్స్ కి వెళ్లి సినిమా టీమ్ మొత్తం ప్రమోట్ చేస్తే ఇలాంటి సినిమాలకు కేవలం హిట్ ఆదరణే కాదు.. కలెక్షన్స్ ఆదరణ కూడా దక్కుతుందనే భావన కొందరు మేధావులు వ్యక్తం చేస్తున్నారు.