హైదరాబాద్ నందు (బంజర హిల్స్, జూబిలీ హిల్స్, మాదాపూర్, కొండాపూర్ ) పరిసర ప్రాంతాల్లో పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ వెంటనే కావాలను. ఆర్మీ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేసి రిటైర్ అయినా వారికీ తగిన ప్రాధాన్యత ఇవ్వ బడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ + 91 8074965869

Monthly Archives: September 2018

తనుశ్రీ దత్తా మరోసారి సంచలన వ్యాఖ్యలు

Category : Uncategorized

ఇటీవలే కేరళకి చెందిన క్రైస్తవ సన్యాసిని బిషప్‌ రేప్‌ విషయంలో మహిళలను కించపరిచే విధంగా మాట్లాడి ట్విట్టర్‌ నిర్వాహకుల నుంచి వార్నింగ్‌ అందుకున్న వివాదాస్పద దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి. ఈయన నిజానికి ఓ సంఘసంస్కర్త, వామపక్ష భావాలకు వ్యతిరేకంగా పలు పుస్తకాలు, ఎన్జీవో సంస్థలను నడుపుతున్నాడు. ఎన్నో సంస్కృత పురాణాలు, వేదాలు క్షుణ్ణంగా చదివాడు. థ్రిల్లర్స్‌, స్పోర్ట్స్‌, రాజకీయం, నాటకం, శృంగార సాహిత్యంపై కూడా సినిమాలు తీశాడు. మంచి ప్రసంగీకుడు, రచయిత కూడా. తన భార్య, నటి పల్లవి జోషితో కలిసి ఎన్జీవో సంస్థ అయిన ఎన్‌ఐఎం బుద్దని నడుపుతున్నాడు. ‘చాక్లొట్‌, ధన్‌ధన్‌గోల్‌, హేట్‌స్టోరీ, జిద్‌, ట్రాఫిక్‌ జామ్లే బుద్దుడు, జునీనియత్‌’ వంటి చిత్రాలను తీశాడు. 

ఇక విషయానికి వస్తే నానాపాటేకర్‌, కొరియోగ్రాఫర్‌ గణేష్‌ ఆచార్య కలిసి తనని లైంగికంగా వేధించారని బాంబు పేల్చిన సంగతి తెలిసిందే. దాదాపు పదేళ్ల కిందట వచ్చిన ‘హార్న్‌ ఓకే ప్లీజ్‌’ సినిమా సెట్‌లో వారు వేధించారని మీడియా ముందుకు వచ్చింది. తాజాగా తనుశ్రీ మరో సంచలన విషయం ప్రకటించింది. బాలీవుడ్‌ దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని, లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించింది. చాక్‌లేట్‌, డీప్‌ డార్క్‌ సీక్రెట్స్‌ షూటింగ్‌ సమయంలో ఓ పాటలో దుస్తులు విప్పి డ్యాన్స్‌ చేయాల్సిందిగా వివేక్‌ తనని వేధించాడని చెప్పుకొచ్చింది. అక్కడే ఉన్న సునీల్‌ శెట్టి, ఇర్ఫాన్‌ ఖాన్‌ తనని కాపాడారని తెలిపింది. 

ఈ సందర్భంగా వారిద్దరిపై కూడా వివేక్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడని పేర్కొంది. మరోవైపు బాలీవుడ్‌లో తనుశ్రీకి మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే తనుశ్రీకి ఫర్హాన్‌అక్తర్‌, ప్రియాంకాచోప్రా, రిచ్చాచద్దా, ట్వింకిల్‌ఖన్నా మద్దతుగా నిలిచారు. ఈ విషయంలో సునీల్‌శెట్టి, ఇర్ఫాన్‌ ఖాన్‌లు నోరు విప్పందే తప్పు ఎవరిదనేది తేలదు. 


సెన్సేషనల్‌ స్టార్‌పై ఐటిదాడులు..!

Category : Uncategorized

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కొందరినీ టార్గెట్‌ చేసుకుని కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా వేధింపులకు పాల్పడుతోంది. ఇప్పటికే తమిళనాడులోని శశికళ అనుయాయులు, కమల్‌హాసన్‌ వంటి వారిని టార్గెట్‌ చేశారు. మరోవైపు తెలంగాణలో జగ్గారెడ్డి, రేవంత్‌రెడ్డిలపై ఇలాంటి దాడులే జరుగుతున్నాయి. మరోవైపు చంద్రబాబుని బాబ్లీ ఉద్యమ నేపధ్యంలో 8ఏళ్ల తర్వాత మరలా కోర్టు నుంచి నోటీసులు వచ్చాయి. త్వరలో ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డితో పాటు చంద్రబాబు నాయుడుని కూడా సోదాలు, అరెస్ట్‌ చేయడం ఖాయమనే వార్తలు వస్తున్నాయి. నిజానికి ఇలాంటి ఐటి దాడులు, ఈడీ దాడులను కూడా మనం ఖండించాల్సిన అవసరం లేదు. కానీ అందులో పొలిటికల్‌, కక్ష్యసాధింపు కోణం ఉంటే వాటిని ఖండించాల్సి వస్తోంది. నేడు ఓ రవాణాశాఖ, రిజిస్ట్రేషన్‌ శాఖలతో పాటు పలు చిన్నస్థాయి ఉద్యోగుల వద్దే కోట్లలో రాబడికి మించిన ఆస్తులు కనిపిస్తున్నాయి. 

ఒక్కో ఎమ్మెల్యే రేపు ఎన్నికల్లో 50కోట్లు, ఎంపీలు 100కోట్లపైగా ఖర్చుపెట్టడానికి రెడీ అవుతున్నారు. మరి ఇలాంటి తరుణంలో లక్షల్లో మాత్రమే పట్టుబడిన వారిపై ఇలాంటి దాడులు అంటే కాస్త ఆలోచించాల్సిన విషయమే. అయితే వీటిని కక్ష్యసాధింపు చర్యలు గా కాకుండా అవినీతిపై పోరాటం చేస్తున్నామనే భ్రమను ప్రజల్లోకి పంపేందుకు మరికొందరిపై కూడా దాడులు చేస్తున్నారు. ఇక విషయానికి వస్తే తాజాగా విడుదలైన మణిరత్నం చిత్రం ‘నవాబ్‌’ తెలుగు ప్రేక్షకులను మెప్పించలేకపోయినా తమిళంలో బాగానే ఆడుతోంది. మణి మ్యాజిక్‌ మిస్‌ అయిన ఈ చిత్రంలో సెన్సేషనల్‌ హీరో విజయ్‌ సేతుపతి కూడా నటించాడు. ఇక ఈయన ప్రస్తుతం చిరంజీవి ‘సై..రా’, త్రిషతో ’96’, ‘సీతకత్తి, సూపర్‌డీలక్స్‌’ చిత్రాలలో నటిస్తున్నాడు. త్రిషతో ఆయన నటించిన ’96’ చిత్రం అక్టోబర్‌ 4న విడుదల కానుంది. 

అలాగే విజయ్‌సేతుపతి రజనీకాంత్‌ హీరోగా నటిస్తున్న ‘పెటా’ చిత్రంలో ప్రతినాయకునిగా నటిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్‌ కోసం ఆయన ఔట్‌డోర్‌కి వెళ్లిన నేపధ్యంలో ఆయన ఆఫీసర్‌, ఇళ్లపై ఐటీ సోదాలు జరిగాయి. ఈ విషయాన్ని విజయ్‌ ఆఫీసు సిబ్బంది ధృవీకరించలేదు అలాగని నిజం కాదని ఖండించను లేదు. ఈ దాడులు కోలీవుడ్‌లో కలకలం రేపుతున్నాయి. కొందరు మాత్రం ఇవి మామూలు దాడులేనని అంటున్నారు. 


‘దేవదాస్’ ఎడిటింగ్ టేబుల్‌పై ఏదేదో జరిగింది!!

Category : Uncategorized

మొన్నామధ్యన దేవదాస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దేవా పాత్ర చేసిన నాగార్జున ఒక మాట అని వదిలేసాడు. అదేమిటంటే దేవదాస్ మూడు రోజుల క్రితమే చూసాను. పది రోజుల ముందు చూస్తే ఎమన్నా చెయ్యగలిగేవాళ్లమని అని దర్శకుడు శ్రీరామ్ ఆదిత్యను ఇరకాటంలో పడేశాడు. నాగార్జున అలా మాట స్లిప్ అయినందుకు మీడియా మాత్రం రకరకాల న్యూస్ లు దేవదాస్ విషయంలో వండి వార్చింది. అయితే ఏమనుకున్నాడో ఏమో నాగార్జున ఆ వార్తలకు రిపేరు చేయబోయి మళ్ళీ టంగ్ స్లిప్ అయ్యాడు. అదేమిటంటె దేవదాస్ రేపు విడుదలవుతుంది అన్న సమయంలో జరిగిన ఒక ఇంటర్వ్యూ లో దేవదాస్ సినిమా ఈ రోజే చూసాను. సినిమా చాలా బావుంది అందరూ చూడండి అన్నాడు. అయితే అప్పటినుండి అందరికి ఏదో మూల నాగార్జున మొదట్లో మాట్లాడిన మాటలు మీద అనుమానాలు అలానే ఉన్నాయి.

తాజాగా గురువారం విడుదలైన దేవదాస్ సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతుంది. నాగార్జున, నాని కాంబో సీన్స్ కి థియేటర్స్  లో విజిల్స్ పడుతున్నాయి. అంత బాగా సెట్ అయ్యారు నాగ్ – నాని.. దేవా, దాస్ పాత్రల్లో. మరి సినిమాలో ఒకరు ఎక్కువ  కాదు, ఒకరు తక్కువ కాదు అన్నట్టుగా  సినిమా మొత్తం ఇద్దరూ నాగ్, నాని లు ఇరగదీసారు. అయితే నాగ్, నాని నటనకు ఎంతైతే పేరొచ్చిందో… అలాగే సినిమా లో ఉన్న లోపాలను క్రిటిక్స్ ఉతికి ఆరేశారు. దేవదాస్ సినిమాలో చాలానే లోపాలున్నాయి. అయితే వాటిలో సినిమా నిడివి కాస్త ఎక్కువ అవడం, ఎడిటింగ్ లో తలెత్తిన లోపాలు కూడా వున్నాయి. అయితే ఎడిటింగ్ లో లోపాలుండడానికి కారణాలు చాలానే ఉన్నాయంటున్నారు. 

సినిమా షూటింగ్ మొత్తం ఒక ఎత్తైతే.. సినిమా ఎడిటింగ్ ఒక ఎత్తు అన్నట్టుగా ఉంటుంది వ్యవహారం.  ఎడిటింగ్ విషయంలో చిన్న చిన్న మార్పులే.. సినిమా భ‌విష్య‌త్తుని మార్చేస్తాయి. అందుకే సదరు హీరోలు ఎడిటింగ్ విషయంలో ఎలెట్టి కెలుకుతారు. దర్శకుడు, నిర్మాత, హీరోలు ఇలా ఎడిటింగ్ విషయంలో ఎడిటర్ ని తన పని తాను చేసుకోనివ్వరు. తాజాగా దేవదాస్ విషయంలో అదే జరిగిందనే టాక్ వినబడుతుంది. ఈ సినిమాలో నాగ్, నాని హీరోలు కాబట్టి… నాని ఒక టైం లో వ‌చ్చి… కొన్ని మార్పులు ఎడిటర్ కి చెప్పి వెళ్లిపోయేవాడ‌ట‌. 

ఆ త‌ర్వాత నాగ్ వ‌చ్చి..అలా కాదు.. ఇలా మార్చండి అనేస‌రికి ఆ మార్పులు మ‌ళ్లీ మొద‌టికి వ‌చ్చేవ‌ని… చివ‌ర్లో ద‌ర్శ‌కుడు రంగంలోకి దిగి..అలా కాదు… ఇలా మార్చండి అనే స‌రికి సినిమా మ‌రో రూపంలోకి వెళ్లేపోయేద‌ని.. ఇక హీరోలు, దర్శకుడు చెప్పిన తర్వాత తాపీగా అశ్వ‌నీద‌త్‌, ప్రియంక‌, స్వ‌ప్న‌… ఇలా ఈ సినిమాలోని బృందంతా త‌లో స‌ల‌హా ఇవ్వ‌డం వలన దేవదాస్ ఎడిటింగ్ విషయంలో చాలా సమస్యలు తలెత్తాయని అంటున్నారు. మరి ఇదంతా చూస్తుంటే నాగార్జున మొదట్లో మాట్లాడిన మాటలు ఇప్పుడు ఎడిటింగ్ విషయంలో తెలిసిన విషయాలకు కరెక్ట్ గా సింక్ అవుతున్నాయి. సినిమా త్వరగా రెడీ అయితే… ఆ సినిమా చూసి మార్పులు చేర్పులు చేసుకునేవారు హీరోలు. కానీ సినిమా రెడీ అవడానికి విడుదలవడానికి మధ్య ఎక్కువ గ్యాప్ లేకపోవడం వలెనే దేవదాస్ కి ఎడిటింగ్ లో ప్రాబ్లమ్స్ వచ్చాయన్నమాట. 


‘పందెంకోడి2’ నెక్స్‌ట్‌ లెవల్‌లో ఉంటది: విశాల్

Category : Uncategorized

మాస్‌ హీరో విశాల్‌ హీరోగా ఎన్‌.లింగుస్వామి దర్శకత్వంలో 2005లో విడుదలైన చిత్రం ‘పందెంకోడి’ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. మళ్లీ ఈ హిట్‌ కాంబినేషన్‌లో ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘పందెంకోడి 2’ రూపొందుతోంది. ఠాగూర్‌ మధు సమర్పణలో విశాల్‌ ఫిలిమ్‌ ఫ్యాక్టరీ, లైకా ప్రొడక్షన్స్‌, పెన్‌ స్టూడియోస్‌ పతాకాలపై తెరకెక్కుతోన్న ఈ మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను దసరా సందర్భంగా ఈ చిత్రాన్ని అక్టోబర్‌ 18న విడుదల చేయనున్నారు. విశాల్‌ నటించిన 25వ చిత్రం ‘పందెంకోడి 2’. ఈ సినిమా ట్రైలర్‌ను శనివారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఏషియన్‌ ఫిలింస్‌ అధినేత నారాయణ దాస్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు. 

మాస్‌ హీరో విశాల్‌ మాట్లాడుతూ – ఇండస్ట్రీలోకి వచ్చి పాతికేళ్లయ్యింది. నేను ఈరోజు ఇలా మీ ముందు నిలబడి మాట్లాడుతున్నానంటే అందుకు కారణం ముందు తల్లిదండ్రులు. మా అన్నయ్య విక్రమ్ కృష్ణ. వారి ప్రోత్సాహంతోనే హీరోగా కెరీర్‌ను ప్రారంభించాను. ‘పందెంకోడి’తో తమిళంలో సక్సెస్‌ కాగానే తెలుగు రీమేక్‌ కోసం చాలా మంది నిర్మాతలు వచ్చి అడిగినా నాన్నగారు ఒప్పుకోకుండా తెలుగులో రిలీజ్‌ చేసి సక్సెస్‌ను ఇచ్చి నన్ను ఇక్కడ కూడా హీరోగా నిలబెట్టారు. మంచి కంటెంట్‌ ఉన్న సినిమాలను ఆదరించే తెలుగు ప్రేక్షకులు నన్ను ఇప్పటికీ ఆదరిస్తూనే ఉన్నారు. వారందరికీ థాంక్స్‌. ఈ ప్రయాణంలో ప్రతి సినిమా మంచి విజయాన్ని సాధించాలనే కష్టపడ్డాను. ప్రతి సినిమాలో గొప్ప నటీనటులు, సాంకేతిక నిపుణులతో పనిచేశాను. లింగుస్వామి ‘పందెంకోడి’ సినిమాతో యాక్షన్‌ హీరోని చేశారు. అలాగే నాతో చాలా మంది నిర్మాతలు పనిచేశారు. నిర్మాతలు సినిమాకు ఊపిరిలాంటోళ్లు. ‘పందెంకోడి 2’ సినిమా విషయానికి వస్తే…13 ఏళ్ల తర్వాత వస్తున్న సీక్వెల్‌. మేకింగ్‌ పరంగా నెక్స్‌ట్‌ లెవల్‌లో ఉండే సినిమా. ఏడురోజుల పాటు జరిగే జాతర నేపథ్యంలో సీక్వెల్‌ ఉంటుంది. యువన్‌ శంకర్‌ రాజా ఎక్స్‌ట్రార్డినరీ మ్యూజిక్‌ ఇచ్చాడు. లైకా ప్రొడక్షన్స్‌, జయంతి లాల్‌ గడ, తెలుగులో సినిమాను విడుదల చేస్తున్న ఠాగూర్‌ మధుగారికి థాంక్స్‌. తెలుగు, తమిళంలో సినిమాను దసరా సందర్భంగా అక్టోబర్‌ 18న విడుదల చేస్తున్నాం. లింగుస్వామితో ఆ స్వామి(దేవుడు) రెండో సినిమాగా పందెంకోడి చేయించాడు. ఇప్పుడు మళ్లీ 25వ సినిమా చేయించాడు. మహానటి జాతీయ అవార్డు గెలుచుకునే స్థాయిలో గొప్ప నటనను కనపరిచిన కీర్తి సురేశ్‌ మా సినిమాలో మరో అద్భుతమైన పాత్రను పోషించింది. ఈ సినిమాతో తను యాక్షన్‌ సన్నివేశాలతో కూడా ఆకట్టుకుంటుంది. పందెంకోడి పార్ట్‌ 3 చేస్తే అందులో కూడా కీర్తి సురేశ్‌నే హీరోయిన్‌గా తీసుకోవాలనిపించింది. తను అంత బాగా నటించింది. ఇక వరలక్ష్మి పాత్ర సినిమా తర్వాత అందరికీ గుర్తుండిపోతుంది. అలాగే రాజ్‌కిరణ్‌ గారు హుందా పాత్రలో మళ్లీ చక్కగా నటించారు. అందరూ గుర్తుకు వచ్చిన తర్వాతే ప్రేక్షకులకు నా పాత్ర గుర్తుకు వచ్చేంత గొప్పగా అందరూ నటించారు. తెలుగులో సినిమాను గ్రాండ్‌ రిలీజ్‌ చేస్తున్న ఠాగూర్‌ మధు గారికి థాంక్స్.. అన్నారు. 

చిత్ర దర్శకుడు ఎన్‌.లింగుస్వామి మాట్లాడుతూ – విశాల్‌లోని ఎనర్జీ లెవల్స్‌ను ‘పందెంకోడి’లో చూపించాను. ఇప్పటికీ అదే ఎనర్జీ లెవల్స్‌ ఉన్నాయి. ఈ సీక్వెల్‌లో కూడా అవి కంటిన్యూ అవుతాయి. మా కాంబినేషన్‌లో పదమూడేళ్ల తర్వాత వస్తున్న సినిమా. సినిమా నెక్స్‌ట్‌ లెవల్లో ఉంటుందని నమ్మకంగా చెబుతున్నాను. అసలు ఈ సీక్వెల్‌ చేయడానికి ఇంత సమయం పట్టడానికి కారణం మీరాజాస్మిన్‌లా నటించే హీరోయిన్‌.. లాల్‌లా విలనిజం చూపించే వ్యక్తి దొరకాలని వెయిట్‌ చేశాను. నిజానికి ఐదేళ్ల ముందు కూడా విశాల్‌తో సినిమా చేయాలనుకున్నాను. కానీ స్క్రిప్ట్‌ కుదరలేదు. కీర్తిసురేశ్‌ నటన అందరికీ నచ్చేలా ఉంటుంది. అలాగే వరలక్ష్మి శరత్‌కుమార్‌ చేసిన పాత్ర అందరికీ గుర్తుండిపోతుంది. యువన్‌ మ్యూజిక్‌, శక్తి సినిమాటోగ్రఫీ సినిమాకు మెయిన్‌ ఎస్సెట్‌గా నిలుస్తాయి. విశాల్‌గారు నిర్మాతగా నాకు ఏం కావాలో దాన్ని సమకూర్చారు. దసరా సందర్భంగా అక్టోబర్‌ 18న సినిమా విడుదలవుతుంది..అన్నారు. 

నిర్మాత ఠాగూర్‌ మధు మాట్లాడుతూ – విశాల్‌గారి అసోషియేషన్‌లో తొలిసారి చేస్తున్న సినిమా. మాపై నమ్మకంతో తెలుగులో సినిమాను విడుదల చేయడానికి అవకాశం ఇచ్చిన విశాల్‌ గారికి థాంక్స్‌. తెలుగు, తమిళంలో సినిమాను అక్టోబర్‌ 18న భారీగా విడుదల చేస్తున్నాం. పార్ట్‌ వన్‌ కంటే ఈ సీక్వెల్‌ ఇంకా పెద్ద హిట్‌ సాధిస్తుంది. కీర్తిసురేశ్‌, వరలక్ష్మి శరత్‌కుమార్‌, రాజ్‌కిరణ్‌, సూరి సహా యువన్‌ శంకర్‌ రాజా, సినిమాటోగ్రాఫర్‌ శక్తి సహా ఎంటైర్‌ యూనిట్‌కి ఆల్‌ ది బెస్ట్.. అన్నారు. 

కీర్తి సురేశ్‌ మాట్లాడుతూ – ‘మహానటి’ తర్వాత ఆ రేంజ్‌లో తృప్తి ఇచ్చిన సినిమా ఇది. మీరా జాస్మిన్‌గారి పాత్రలో నటించాలని దర్శకుడు లింగుస్వామి గారు అడగ్గానే చేయాలా? వద్దా? అని ఆలోచించుకుంటూ సెట్స్‌లోకి అడుగుపెట్టాను. విశాల్‌, లింగుస్వామి గారి సహకారంతో చక్కగా పూర్తి చేశాను. వరలక్ష్మిగారు చాలా కీ రోల్‌ చేశారు. ఇందులో చాలా అల్లరి పిల్లలాగా కనపడతాను. టీమ్‌ పడ్డ కష్టానికి సినిమా పెద్ద బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అవుతుంది. అక్టోబర్‌ 17న నా పుట్టినరోజు.. సినిమా అక్టోబర్‌ 18న విడుదలవుతుంది. అదే పెద్ద గిఫ్ట్‌గా భావిస్తున్నాను..అన్నారు. 

వరలక్ష్మి శరత్‌కుమార్‌ మాట్లాడుతూ – ఈ చిత్రం నాకు చాలా స్పెషల్‌ మూవీ. చాలా కీలకమైన పాత్రలో నటించాను. తెలుగు ప్రేక్షకులకు ఇంత మంచి సినిమా ద్వారా పరిచయం అవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన లింగుస్వామి, విశాల్‌ సహా ఎంటైర్‌ యూనిట్‌కు అభినందనలు.. అన్నారు. 


రష్మిక(పూజ) ని సరిగా వాడలేదు కదా..!

Category : Uncategorized

ప్రస్తుతం టాలీవుడ్లో కన్నడ భామ రష్మిక మందన్న జోరు మాములుగా లేదు. ఛలో సినిమాతో హిట్ అందుకున్న ఈ భామ గీత గోవిందంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. రెండు సినిమాల హిట్స్ తో ఉన్న రష్మికకి నిన్న విడుదలైన దేవదాస్ కూడా హిట్ టాక్ రావడంతో అమ్మడు మాత్రం ఫుల్ హ్యాపీలో ఉంది. ఎందుకంటే మూడు హిట్స్ తో హ్యాట్రిక్ కొట్టేసింది. రష్మిక మందన్న – నాని, నాగార్జున – ఆకాంక్ష సింగ్ ల కలయికలో శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన దేవదాస్ కి ఫస్ట్ షోకే మిక్స్డ్ టాక్ రావడం. క్రిటిక్స్ నుండి కూడా మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ…. సాయంత్రానికల్లా.. సినిమాకి హిట్ టాక్ వచ్చింది. గీత గోవిందం సినిమా తర్వాత మళ్ళీ అలాంటి కామెడీ మూవీ ఏది థియేటర్స్ లో లేకపోవడంతో బోర్ కొట్టిన ప్రేక్షకులు దేవదాస్ కామెడీని ఎంజాయ్ చేస్తున్నట్టుగా టాక్.

ఇక ఈ సినిమాలో నటించిన నాగార్జున – నాని కాంబో అదరగొట్టేసింది.. కానీ.. ఇద్దరు  స్టార్ ఇమేజ్ ఉన్న హీరోలు కాబట్టి హీరోయిన్స్ ప్రాధాన్యత వద్దనుకున్నాడో ఏమో కానీ శ్రీరామ్ ఆదిత్య రష్మికాని, ఆకాంక్షని  బలవంతంగా ఇరికించినట్టే అనిపిస్తుంది అనే టాక్ సోషల్ మీడియాలో వినబడుతుంది. ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటించిన ర‌ష్మిక‌, ఆకాంక్ష‌.. ఇద్ద‌రివీ అతిథి పాత్ర‌లే అన్నట్టుగా ఉండడం…. గీత గోవిందం త‌ర‌వాత ఏమాత్రం ప్రాధాన్యం లేని పాత్ర‌లో రష్మిక నటించింది. ఇక పోలీస్‌ గెటప్‌లో రష్మిక మరింత కామెడీగా కనిపిస్తుంది అని అంటున్నారు. పైగా రష్మిక మందన్న స్క్రీన్ స్పేస్ చాలా తక్కువగా మొక్కుబడిగా ఉండటం నిరాశ కలిగిస్తుంది. కానీ గ్లామర్ పరంగా రష్మిక ఆకట్టుకుందంటున్నారు ప్రేక్షకులు. ఎలాగూ గీత గోవిందం మేనియాలో ఉన్నాం కాబట్టి రష్మికనే లుక్స్ లో గెలుస్తుంది. కాకపోతే దర్శకుడు నాని – రష్మికల లవ్ ట్రాక్ ఫై ఇంకొంచెం దృష్టి పెడితే బాగుండేది అని అంటున్నారు.

మరి రష్మిక హ్యాట్రిక్ కొట్టింది కానీ…తనకి మంచి పేరు తెచ్చుకోలేకపోయింది. ఛలో సినిమాలో నాగ శౌర్య తో పోటీ పడి నటించిన రష్మిక.. గీత గోవిందంలో విజయ్ దేవరకొండతో నటనలో, లుక్స్ తో పోటీపడి పేరు తెచ్చుకుంది. గీతగా గీర ఎక్కువ ఉన్న అమ్మాయిగా రష్మిక గీత గోవిందంలో అదరగొట్టింది. సింపుల్ లుక్స్ తో, ఆకట్టుకునే అందంతో, మంచి నటనతో మెప్పించింది. దర్శకుడు పరశురామ్ రష్మిక క్యారెక్టర్ ని బాగా హైలెట్ చెయ్యడంతో ఆ సినిమాలో రష్మిక నటనతో మెప్పించింది. కానీ దేవదాస్ లో నటనకు ఆస్కారం లేకుండా లుక్స్ తోనూ, అందంతోను ఎంత సేపు మేనేజ్ చేసినా సరిపోదు కదా. అందుకే రష్మిక పూజ క్యారెక్టర్ కి దేవదాస్ లో పెద్దగా చోటు దక్కలేదు.


నాగ్ వీకీపీడియాని అనుమానిస్తున్న యంగ్‌ హీరో!

Category : Uncategorized

షష్టిపూర్తి వయసులో కూడా యంగ్‌ స్టార్స్‌కి చాలెంజ్‌ విసరడంలో నాగార్జున ముందుంటాడు. ఆయన జీవన విధానం, పాటించే క్రమశిక్షణ నుంచి తన తిండిని కూడా తానే తయారు చేసుకునేంత హెల్త్‌ కాన్షియన్స్‌ తనకి ఉందని గతంలో నాగార్జున ఓ సారి తన హెల్త్‌ సీక్రెట్‌ చెప్పాడు. అందుకే ఆయన ఇంకా నేను యువ సమ్రాట్‌ని కాదు అన్నా కూడా ప్రేక్షకులు మాత్రం ఆయనలో ఇప్పటికీ నవ మన్మథుడు ఉన్నాడంటారు. బాడీ ఫిట్‌నెస్‌ని మెయిన్‌ టెయిన్‌ చేయడంలో ఆయన తరువాతే ఎవరైనా..? అందుకే ‘సంతోషం’ శతదినోత్సవ వేడుకల్లో యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ బహిరంగంగా ‘నీ గ్లామర్‌ సీక్రెట్‌ చెప్పు బాబాయ్‌’ అని అడిగాడు. ఇలా అడిగిన వారి గురించి లెక్కేలేదు. ఇక నాగార్జున తాను నటించిన ‘ఢమరుకం’ చిత్రంలో సిక్స్‌ప్యాక్‌తో కనిపించాడు. 

కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మిగిలిన హీరోల వలే సిక్స్‌ప్యాక్‌ కోసం అంటూ నాగార్జున ప్రత్యేకంగా చేసిన కసరత్తులు ఏమిలేవు. తన బాడీ సహజ సిద్దంగానే అలా ఉంటుందని నాటి ప్రమోషన్స్‌లో ఆయనే చెప్పుకొచ్చాడు. ఇక తాజాగా నాగార్జున, నానిలు కలిసి నటించిన మల్టీస్టారర్‌ ‘దేవదాస్‌’ రిలీజ్‌ అయింది. ఇందులో యంగ్‌ నేచురల్‌ స్టార్‌ నానికి పోటీగా అంతే ఉత్సాహంతో, అంతే ఫిట్‌నెస్‌తో నాగ్‌ కనిపించడం మిగిలిని వారికి ఆశ్చర్యం కలిగిస్తుందేమో గానీ ఆయనను ఎరిగిన వారికి మాత్రం అది పెద్దగా ఆశ్చర్యకరం కాదు. ఇక తాజాగా నాగ్‌పై ‘ఆర్‌ఎక్స్‌ 100’తో సూపర్‌హిట్‌ కొట్టిన హీరో కార్తికేయ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

‘వీకీపీడియో ఏమైనా తప్పు చూపుస్తోందా? ఈ మనిషి వయసు 59 అని చెబుతోంది. నాగార్జున సార్‌.. మీకు నమస్కారం. మీరు ఫిట్‌నెస్‌ విషయంలో 20ఏళ్ల హీరోలకు కూడా సవాల్‌ విసురుతున్నారు. ఏమున్నాడ్రా బాబూ’ అంటూ తన ట్విట్టర్‌ ఖాతాలో ట్వీట్‌ పెట్డాడు. ఈ సందర్భంగా తాజాగా విడుదలైన ‘దేవదాస్‌’లోని నాగార్జున స్టిల్‌ని ఆయన పోస్ట్‌ చేశాడు. ఈ స్టిల్‌ చూస్తుంటే కార్తికేయ చెప్పింది 100శాతం నిజమని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. కండలు తిరిగిన శరీరంతో కనిపిస్తున్న నాగ్‌ యంగ్‌ హీరోలకు నిజమైన చాలెంజ్‌ని విసురుతున్నాడనేది వాస్తవం. కాస్త నాని చెప్పినట్లు నాగార్జునలోని చెడు లక్షణాలను మనం కూడా ఫాలో అయితే అలాగే కనిపిస్తామో లేదో నాగ్‌నే సీక్రెట్‌గా అడిగేయాలి సుమా…! 


ఆ అమ్మాయివి లేని పోని ఆరోపణలు: నానా

Category : Uncategorized

నేడు మీడియా అనేది వింతపొకడలు పోతోంది. ఇందులో మీడియా తప్పే కాదు.. యాజమాన్యాలు, ఆర్థికబలం ఉన్న పెట్టుబడిదారుల చేతుల్లో మీడియా బంధీ కావడం, పార్టీకే మీడియా పుట్టుకొస్తూ ఒకే విషయాన్ని ఎవరు ఎవరికి తగ్గట్టుగా తమకు తాము భాష్యం చెప్పుకుంటున్నారు. చివరకు కోర్టుల తీర్పులను కూడా తమకు అనుగుణంగా మార్చుకుంటున్నారు. ఇదే సమయంలో మీడియాలో బ్రేకింగ్‌ న్యూస్‌లు, సెన్సేషనల్‌ వార్తలను క్యాష్‌ చేసుకుని టీఆర్పీలు, సర్క్యులేషన్స్‌ పెంచుకునే ధోరణి పెరిగింది. నిజానికి మీడియా వారే కాదు.. పలు వివాదాలపై మీడియా ముందుకు వచ్చి తమకిష్టమైన వ్యాఖ్యలు చేస్తున్న వారు కూడా ఏదో విధంగా ఆ వార్తకి మరింత ప్రచారం తేవాలని, తాము ఉచిత పబ్లిసిటీ పొందాలని తాపత్రయ పడుతున్నవారే. అందుకే నిజమైన మేధావులు, విశ్లేషకులు మీడియాలో చర్చలకు కూడా రాకపోవడం మనం బాగా గమనించవచ్చు. దీక్షితులు, ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ వంటి వారిని ఆహ్వానించే వారు, ఆహ్వానించినా రావడానికి సుముఖత చూపని వారు ఎందరో ఉన్నారు. 

ఇదే విషయంలో నానా పాటేకర్‌ తన పరిణతిని చూపాడు. తనుశ్రీ దత్తా లాగా తాను కూడా మీడియా ముందుకు వస్తే తాను మాట్లాడేది ఒకటైతే, వాటిని మసి పూసి మారేడుకాయ చేసే ప్రయత్నాలు జరుగుతాయని, కాబట్టి తాను కూడా ఈ విషయాన్ని మీడియా ముందు మాట్లాడితే తనుశ్రీ దత్తాకు తనకు తేడా ఉండదని భావించాడు. ‘వీరభద్ర’ ఫేమ్‌ తనుశ్రీ దత్తా గతంలో తన పట్ల నానా పాటేకర్‌ అసభ్యంగా ప్రవర్తించాడని, నానా యాగీ చేస్తోంది. దీనిపై నానా పాటేకర్‌ హుందాగా స్పందించాడు. ఆ అమ్మాయి నాపై లేని పోని ఆరోపణలు చేస్తూ ఉంటే ఇక నన్నేం చేయమంటారు? సినిమా చిత్రీకరణ సమయంలో నాతో పాటు వంద మంది యూనిట్‌ వారు ఉన్నారు. ఈ విషయం గురించి నేను ఎంత మాట్లాడినా వృథానే..! నాపై ఆమె చేసిన ఆరోపణలకు చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మాత్రమే భావిస్తున్నాను. నేనేం మాట్లాడినా మీ మీడియా వర్గాలు ఏవేవో రాసేస్తాయి అంటూ తన ఆవేదనను తెలిపాడు. 

ఆ చిత్రానికి కొరియోగ్రాఫర్‌గా పనిచేసిన గణేష్‌ ఆచార్య కూడా తనుశ్రీ ఆరోపణలను ఖండించాడు. ఆ సెట్‌లో తాను కూడా ఉన్నానని, నానా ఇచ్చిన సూచనలను ఆమె తప్పుగా అర్ధం చేసుకుందని తెలిపాడు. ఈ విషయంలో నానా పాటేకర్‌ మీడియా విషయంలో చూపిన విజ్ఞత అందరికీ ఆదర్శం కావాలి. మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే అది మీడియాకు కాసులు తెచ్చే పని అవుతుందే తప్ప దీని వల్ల సమస్యలకు పరిష్కారం దొరకడం లేదనే నానా ఆవేదన అర్దం చేసుకోవాల్సిందే. 


ప్రభాస్ పెళ్లి: సెన్సేషనల్ న్యూస్ ఇదే!

Category : Uncategorized

ప్రస్తుతం భారతీయ సినీ చరిత్రలోనే మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌ అంటే ఒకరు సల్మాన్‌ఖాన్‌ పేరు చెబుతారు. మరికొందరు తమకి ఇష్టమైన వివాహం కాని హీరోల పేర్లు చెబుతారు. కానీ నిజానికి అందరిలోకి ‘బాహుబలి’తో నేషనల్‌ ఐకాన్‌గా మారిన యంగ్‌ రెబెల్‌స్టార్‌ ప్రభాస్‌ పేరును మాత్రం ఖచ్చితంగా ఒప్పుకుని తీరుతారు. ఆయన నటించే చిత్రాల కోసమే కాకుండా ఆయన ఎవరిని వివాహం చేసుకుంటాడు? అనే విషయంపై జాతీయ మీడియా కూడా బాగా కన్నుపెట్టి ఉంది. ఆయన నేడు ఇండియాలో కొత్తగా అన్ని భాషా సినీ ప్రేక్షకుల దృష్టిలో విపరీతమైన క్రేజ్‌ ఉన్న నయా సూపర్‌స్టార్‌ అనడంలో సందేహం లేదు. ఇక ‘బాహుబలి’ తర్వాత ఆయన ప్రస్తుతం సుజీత్‌ దర్శకత్వంలో హాలీవుడ్‌ యాక్షన్‌ థ్రిల్లర్స్‌కి థీటుగా రూపొందుతున్న ‘సాహో’ చిత్రంలో నటిస్తున్నాడు. అదే సమయంలో జిల్‌ ఫేమ్‌ రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ పీరియాడికల్‌ లవ్‌స్టోరీని కూడా చేస్తున్నాడు. ‘సాహో’ కోసం ‘బాహుబలి’ నాటి కండల శరీరంతోనే కనిపించనున్న ఆయన జిల్‌ రాధాకృష్ణ చిత్రం కోసం మాత్రం లవర్‌గా కనిపించేందుకు భారీగా బరువు తగ్గి హ్యాండ్సమ్‌ లుక్‌లోకి మారుతున్నాడు. 

ఇక విషయానికి వస్తే అక్టోబర్‌ 23వ తేదీన ఈయన జన్మదినోత్సం, ప్రస్తుతం అందరి చూపు ఇదే తేదీపై పడింది. కారణం ఆరోజున ఆయన నటిస్తున్న ‘సాహో’కి సంబంధించిన అప్‌డేట్స్‌తో పాటు ఆయన వివాహ ప్రకటన కూడా వస్తుందని ప్రచారం మొదలైంది. ఇంకేముంది ఆయన అభిమానుల్లోనే కాదు.. సాధారణ ప్రేక్షకులలోనే కాదు.. దేశవ్యాప్తంగా ఈ తేదీపై అందరి చూపు పడింది. తన 39వ పుట్టినరోజును జరుపుకోనున్న ఆయన పెళ్లికి సంబంధించిన న్యూస్‌ని ఆ తేదీన ఆయన కుటుంబ సభ్యులు ప్రకటిస్తారని తెలుస్తోంది. 

మరి ఇదే నిజమైతే ఈ ఏడాది అత్యంత సంచలన, అందరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే ప్రకటన ఇదే అవుతుందనడంలో సందేహం లేదు. మరి ఈ వార్తలో నిజమెంత అనేది మరికొద్ది రోజుల్లో తెలిసిపోతుంది. ఈ మాట నిజమైతే వచ్చే ఏడాదే ఆయన ఓ ఇంటివాడు కావడం ఖాయమని అంటున్నారు. మరి ఆ వార్త కోసం అందరు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. 


శర్వా, సాయిపల్లవి.. ఈ షాక్ లేంటి?

Category : Uncategorized

శర్వానంద్ మహానుభావుడు సినిమా హిట్ తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో సాయి పల్లవితో కలిసి పడి పడి లేచె మనసు సినిమా చేస్తున్నాడు. అయితే సినిమా మొదలు పెట్టి చాలాకాలం అయ్యింది. ఇక సినిమాని కూడా నిర్మాతలు డిసెంబర్ 21 విడుదల చేస్తున్నట్టుగా ఎప్పుడో ప్రకటించారు. పీరియాడిక్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శర్వా.. ఫుట్ బాల్ ఆటగాడిగా నటిస్తుండగా సాయి పల్లవి వైద్యురాలి పాత్రలో నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ తో పాటుగా… మధ్యమధ్యలో చిత్ర బృందము వదిలిన పడి పడి లేచె మనసు స్టిల్స్ ఆకట్టుకున్నాయి. మహానుబావుడు హిట్ తో ఉన్న శర్వా, వరస హిట్స్ తో ఉన్న సాయి పల్లవిల కలయికలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ట్రేడ్ లోను, ప్రేక్షకుల్లోనూ ఉన్నాయి.

ప్రస్తుతం చివరి షెడ్యూల్ లో ఉన్న ఈ చిత్ర షూటింగ్ అతి త్వరలోనే పూర్తి కానుందని చిత్ర బృందం ప్రకటించింది. ఇక ప్రస్తుతం సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకున్నప్పటికీ.. పోస్ట్ ప్రొడక్షన్ కోసం ఈ రెండు నెలలు కేటాయించి మంచి ప్రమోషన్స్‌తో హను ఈ చిత్రాన్ని అనుకున్న టైం కి విడుదల చేస్తాడని అనుకుంటున్నారు. అయితే మధ్యలో సాయి పల్లవి మీద కొన్ని రూమర్స్ రావడం, శర్వా, సాయి పల్లవి మీద అలిగి షూటింగ్ కి కొన్ని రోజులు ఎగ్గొట్టాడని.. ఇలా ఏవేవో రూమర్స్ ప్రచారంలో కొచ్చాయి.

ప్రస్తుతం సాయి పల్లవి మీద ఎటువంటి రూమర్స్ గాని, ఆమె గురించిన లేటెస్ట్ సినిమా అప్ సెట్స్ గాని బయటికి రావడం లేదు. ఇక శర్వా కూడా ఎక్కడా బయట ఫోకస్ అవ్వడం లేదు. మరోపక్క శర్వా, సుధీర్ వర్మల సినిమా ఎక్కడి వరకు వచ్చిందో అనేది కూడా ప్రస్తుతానికి ఎటువంటి క్లారిటీ లేదు. అయితే తాజాగా హను రాఘవపూడి – శర్వానంద్ ల పడి పడి లేచె మనసు అనుకున్న సమయానికి విడుదలకావడం లేదట. మరి ముందుగా పడి పడి లేచె మనసు డిసెంబర్ 21న విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ… ఇప్పుడు సినిమా విడుదల వాయిదా పడే అవకాశాలు వున్నాయట. అయితే ఆ సినిమా వాయిదా ఎందుకు పడుతుందో అనే కారణాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. మరి గత ఏడాది ఇదే టైంలో అంటే దసరాకి శర్వానంద్ జై లవ కుశ, స్పైడర్ చిత్రాలతో పోటీ పడి మహానుభావుడుతో హిట్ కొట్టాడు. కానీ ఈ ఏడాది మాత్రం చడీ చప్పుడు లేకుండా ఉన్నాడు.


‘అరవింద సమేత’.. దీన్ని వర్ణించడానికి మాటల్లేవ్!

Category : Uncategorized

ఏమాటకామాటే చెప్పుకోవాలి… చిన్నపదంతోనే జీవితసారాన్ని చెప్పగలిగే నేటి పాటల రచయితల్లో సిరివెన్నెల సీతారామశాస్త్రిని మించిన లెజెండ్‌, జీనియస్‌ లేరనే చెప్పాలి. ఏదో ప్రాస కోసం ప్రయాసలు పడుతూ, నానా చెత్త రాసే వారు ఎక్కువైన నేటిరోజుల్లో ఒక పాటలో జీవితసారాన్ని శాస్త్రి చాటిచెప్పి, తన కలానికి ఆకాశమే హద్దు అని మరోసారి నిరూపించుకున్నారు. ఆయన రాసిన పాటకు పెంచలదాస్‌ అనే ఓ వ్యక్తి తన గాత్రం ద్వారా జీవం పోశాడు. ఇది ‘అరవింద సమేత వీరరాఘవ’ నుంచి విడుదలైన మూడో లిరికల్‌ సాంగ్‌ని వింటే ఎవరైనా ఒప్పుకుని తీరాల్సిందే. 

అనారోగ్యకారణాల రీత్యా పాటలు రాయడం తగ్గించిన శాస్త్రి మరోసారి తన అభిమానులందరికీ అద్భుతమైన కానుక ఇచ్చారు. ‘ఏ కోనలో కూలినాడో..ఏ కొమ్మలో చేరినాడో.. ఏ ఊరికో, ఏ వాడకో, ఏడ బొయ్యాడో… రమ్‌.. రుధిరం.. సమరం.. శిశిరం.. ’ అంటూ సాగిన ఈ లిరికల్‌ సాంగ్‌ని వర్ణించడానికి పదాలు సరిపోవనే చెప్పాలి. బహుశా దీనిని వర్ణించాల్సి వస్తే దానిని కూడా శాస్త్రిగారే వర్ణించగలరేమో అని చెప్పడం అతిశయోక్తికాదు. ఈ అద్భుత గీతాన్ని రాసిన సిరివెన్నెల ఈ వీడియోలో మాట్లాడుతూ, ‘కత్తి మీద సామే నడకనుకుంటే.. పాడె పడకవుతుంది… ఆ పాడె మీద పడుకున్న వాడిని చూసి అయిన వాళ్ల కడుపుకోత ఎలాగుంటుందనేది ఈ పాట’ అని తానే ఆ పాటకు భాష్యం చెప్పారు. 

ఈ పాటను పాడే అద్భుతమైన అవకాశాన్ని అందుకున్న పెంచలదాస్‌ మాట్లాడుతూ.. ఈ పాటను నన్ను పాడమనడం నా అదృష్టం. బతుకుకు ఓ సారాంశమైన పాట అని భావించాను అని చెప్పుకొచ్చాడు. ఇక తనలో ఇంత ప్రతిభ దాగి ఉందని నిరూపించుకుని సెహభాష్‌ అనిపించుకున్న సంగీత దర్శకుడు తమన్‌ మాట్లాడుతూ, ఈ పాటను పాడిన పెంచలదాస్‌ ఎక్స్‌ట్రీమ్లీ టాలెంటెడ్‌. అద్భుతంగా పాడారు.. అని కితాబునిచ్చాడు. ఈ చిత్రంలో మొత్తం నాలుగు పాటలున్నాయి. ‘అనగనగా అరవింద తన పేరు’, ‘పెనిమిటి’ లిరికల్‌ వీడియోస్‌ ఇప్పటికే విడుదలై సినిమాపై అంచనాలను పెంచిన నేపధ్యంలో తాజాగా విడుదలైన పాట ఆ అంచనాలను ఆకాశాన్నితాకే స్థాయికి తీసుకెళ్లిందని ఖచ్చితంగా చెప్పవచ్చు. 

Click Here for Song