హైదరాబాద్ నందు (బంజర హిల్స్, జూబిలీ హిల్స్, మాదాపూర్, కొండాపూర్ ) పరిసర ప్రాంతాల్లో పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ వెంటనే కావాలను. ఆర్మీ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేసి రిటైర్ అయినా వారికీ తగిన ప్రాధాన్యత ఇవ్వ బడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ + 91 8074965869

Monthly Archives: October 2018

హిట్ కొట్టిందా.. ఇక పట్టుకోలేరంతే..!!

Category : Uncategorized

బాలీవుడ్ అందాలు తెలుగు తెర మీద కొత్తేమి కాదు. ఒకప్పుడు వెంకటేష్ సరసన బాలీవుడ్ భామలు చాలామంది జోడి కట్టారు. ఈ ఏడాది భరత్ అనే నేను తో కియారా అద్వానీ టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా హిట్ కాక ముందే రామ్ చరణ్ సరసన బోయపాటి సినిమాలో ఛాన్స్ పట్టేసింది. తాజాగా మరో బాలీవుడ్ భామ తొలి సినిమాతోనే హిట్ కొట్టాలని చూస్తుంది. ఎప్పుడూ హాట్ హాట్ ఫోజులతో సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫొటోస్ లో నిధి అగర్వాల్ కుర్ర కారుని కైపెక్కిస్తుంది. సోషల్ మీడియాలో గ్లామర్ గేట్లు తెరిచి పిచ్చెక్కించే నిధి అగర్వాల్.. నాగ చైతన్యతో కలిసి చందు మొండేటి దర్శకత్వంలో సవ్యసాచి చిత్రంలో నటించింది. గ్లామర్ భామగా మీడియాకి పరిచయమున్న ఈ భామ సవ్యసాచిలో ఎలాంటి గ్లామర్ తో పడేస్తుందో తెలియదు కానీ.. ఈ సినిమాతో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చి ఇక్కడే జెండా పాతాలని చూస్తుంది.

అందాల ఆరబోతలో ఏమాత్రం మొహమాట పడని ఈ భామ సవ్యసాచి సినిమాలో ఎలా వుండబోతుందో అనే ఆసక్తి ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల్లో ఉంది. మంచి అంచనాలున్న సవ్యసాచి ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నాగ చైతన్య మాస్ యాక్షన్, చందూ డైరెక్షన్ స్కిల్స్… అన్నిటికన్నా ముఖ్యంగా తమిళ హీరో మాధవన్ ఈ సినిమాలో నెగెటివ్ రోల్ చేయడమనే ఆసక్తికర అంశాలు ఈ సవ్యసాచిలో కనబడుతున్నాయి. 

మరి నిధి తన నిధిని ఎలా చూపించబోతుందో అనేది మరో రెండు రోజుల్లోనే తెలిసిపోతుంది. అయినా మొదటి సినిమా ఫలితం రాకుండానే మరో అక్కినేని హీరో అఖిల్ పిలిచి మరీ నిధి అగర్వాల్ కి మిస్టర్ మజ్నులో అవకాశమిచ్చాడు. ఒకవేళ సవ్యసాచి హిట్ అయితే గనక అమ్మడు అదృష్టం మాములుగా ఉండదు. అందుకే సవ్యసాచితో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తుంది. మరి నిధి అగర్వాల్ అనుకున్న హిట్ సవ్యసాచితో వస్తుందోలేదో చూడాలి.


‘సర్కార్’.. ఇలా కాంప్రమైజ్ అయ్యారు!

Category : Uncategorized

మురుగదాస్ – విజయ్ కాంబోలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సర్కార్ సినిమా ఈ దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. భారీ అంచనాల నడుమ భారీ క్రేజ్ ఉన్న ఈ సినిమా ఒక వివాదంలో చిక్కుకుంది. విజయ్ – మురుగదాస్ కలయికలో తెరకెక్కిన సర్కార్ సినిమా కథ తనదే అంటూ రైటర్ వరుణ్ రాజేంద్రన్ హైకోర్టుకి ఎక్కాడు. తాను గత కొన్నేళ్ల క్రితమే సెంగోల్ పేరుతో ఈ సర్కార్ కథ  రెడీ చేశానని…. కానీ అదే కథను మురుగదాస్ కాపీ కొట్టి సర్కార్ సినిమాని తెరకెక్కించాడని… దీనికి పరిహారంగా 30 లక్షలు డిమాండ్ చెయ్యడమే కాదు.. సర్కార్ మూవీ కథలో తనకి క్రెడిట్ కావాలంటూ కూర్చున్నాడు.

అయితే ఈ విషయం కోర్టుకెళ్లడంతో.. చాలా రోజులు మురుగదాస్ మౌనంగానే ఉన్నాడు. వరుణ్ చెప్పింది ఒప్పుకుంటే… తన సినిమా కథ కాపీ అని తేలిపోయి పరువు పోతుందన్న భయంతో మురుగదాస్ మధ్యలో అనేక కథలు చెప్పాడు. కానీ సినిమా విడుదల సమయం దగ్గర పడ్డాక కోర్టులో హియరింగ్ కి వచ్చిన ఈ కేసు విషయంలో మురుగదాస్ తాజాగా రాజీకి వచ్చాడు. గొడవలెందుకు అనుకున్నాడో ఏమో… సర్కార్ సినిమా స్టోరీ విషయంలో కేసు పెట్టిన రైటర్ వరుణ్ రాజేంద్రన్ కి 30 లక్షలు ఇవ్వడానికి మాత్రమే కాదు…  టైటిల్స్‌లో రైటర్ వరుణ్ రాజేంద్రన్ పేరు వేయటానికి కూడా మురుగదాస్ అంగీకరించాడు. ఇక సమస్య ఒక కొలిక్కి రావడంతో.. నవంబర్ 6 న ఈ సినిమా విడుదలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా పోయాయి.


‘సవ్యసాచి’ అలా ఉండదంటున్నాడు..!

Category : Uncategorized

తెలుగులో ఉన్న యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్స్‌లో చందు మొండేటికి ప్రత్యేకస్థానం ఉంది. నిఖిల్‌తో ‘కార్తికేయ’ వంటి థ్రిల్లర్‌ కాన్సెప్ట్‌ని ఆయన తెరకెక్కించిన విధానం అవార్డులు, ప్రేక్షకుల రివార్డులు కొల్లగొట్టింది. మొదటి చిత్రంతోనే ఆయనకు ఓ పెద్ద విజయం లభించింది. ఆ తర్వాత ఆయన నాగచైతన్యతో ‘చాణక్య’ అనే చిత్రం చేయాలని భావించాడు. కానీ చివరకు మలయాళంలో అద్భుత విజయం సాధించిన ‘ప్రేమమ్‌’ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులోకి రీమేక్‌ చేశాడు. ఒరిజినల్‌ వెర్షన్‌లోని ఫీల్‌ని మిస్‌ కాకుండా ఈ మూవీని ఆయన తెరకెక్కించిన విధానం కూడా ఎంతో మంది ప్రశంసలను పొందింది. దీని ద్వారా ఆయన ఏ తరహా చిత్రాలైనా చేయగలడనే నమ్మకం ఏర్పడటంతో పాటు నాగచైతన్య ఏరికోరి ఆయన మూడో చిత్రంలో నటించేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చాడు. అదే ‘సవ్యసాచి’. 

నవంబర్‌ 2న ఈ మూవీ విడుదల కానుంది. ఎంతో అభిరుచి ఉన్న చిత్రాలను నిర్మిస్తూ, వరుస విజయాలతో దూసుకెళ్తోన్న ‘మైత్రి మూవీ మేకర్స్‌’ ఈ మూవీని నిర్మిస్తుండటం, దేశం గర్వించదగ్గ నటుడు, తన ప్రతి చిత్రం వైవిధ్యంగా ఉంటే మాత్రం చేయడనే పేరు తెచ్చుకుని, భాషా సమస్య వల్ల తాను తెలుగులో నటించనని చెప్పిన మాధవన్‌ ఈ కథను విని వెంటనే ఓకే చేయడం, కీరవాణి సంగీతం అందించడానికి ఒప్పుకోవడం వంటి ఎన్నో ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. తాజాగా ‘సవ్యసాచి’ గురించి దర్శకుడు చందు మొండేటి మాట్లాడుతూ, దర్శకునిగా నాకు థ్రిల్‌తో కూడిన డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ చిత్రాలే నచ్చుతాయి. అవే ప్రేక్షకులకు చెప్పాలని నేను ప్రయత్నిస్తూ ఉంటాను. ‘ట్విన్‌ వానిషింగ్‌ సిండ్రోమ్‌’కి సంబంధించిన ఓ ఆర్టికల్‌ని నాకు నా స్నేహితుడు చూపించాడు. చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఈ పాయింట్‌ని నా కథలో మిళితం చేసి చైతు, మైత్రి నిర్మాతలకు వినిపించాను. అందరు బాగా ఎగ్జైట్‌ అయ్యరు. కొత్తగా ఉంటుందని అనుకున్నాం. అప్పుడే ‘సవ్యసాచి’ అనే టైటిల్‌ అయితే బాగుంటుందని డిసైడ్‌ అయ్యాం. 

హీరోకి తెలియకుండానే ఆయన ఎడమచేయి పనిచేస్తుందనే పాయింట్‌ని ట్రైలర్‌లో చూసి ‘హలో బ్రదర్‌’ చిత్రంతో పోలుస్తున్నారేమో..! కానీ అలాంటిదేమీ లేదు. వీలున్న చోట మాత్రమే ఆ పాయింట్‌ చూపించాం. ఈ ఒక్క పాయింట్‌ చుట్టూనే కథ తిరగదు. ఇందులో ఫ్యామిలీ ఎమోషన్స్‌, థ్రిల్స్‌, ఫైట్స్‌, మంచి లవ్‌స్టోరీ వంటివి సమపాళ్లలో ఉంటాయి.. అని చెప్పుకొచ్చాడు. 


రామ్‌లో ఇంత గొప్పనటుడు దాగి ఉన్నాడా?

Category : Uncategorized

టాలీవుడ్‌లో ప్రస్తుతం ఉన్న మోస్ట్‌ వాంటెడ్‌ బ్యాచ్‌లర్స్‌లో మొదటి స్థానం ప్రభాస్‌ది. ఈయన కూడా ప్రతి సినిమా షూటింగ్‌ ముందు.. సినిమా పూర్తయితే తర్వాత పెళ్లి గురించి ఆలోచిస్తానని దాట వేస్తూ ఉంటాడని ఇప్పటికే కృష్ణంరాజు తెలిపాడు. ఇక తెలుగులో ప్రభాస్‌ తర్వాత నితిన్‌, విజయ్‌దేవరకొండ, దగ్గుబాటి రానా వంటి వారితో పాటు ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్స్‌లో హీరో రామ్‌ కూడా ఒకరు. ఇక ‘నేను..శైలజ’కి ముందు తర్వాత కూడా పెద్దగా హిట్స్‌లేని ఆయనకు తాజాగా దిల్‌రాజు-త్రినాధరావు నక్కినలు ‘హలో గురు ప్రేమకోసమే’ చిత్రం ద్వారా ఊరటనిచ్చారు. 

ఈ చిత్రం చూసి దర్శకుడు త్రినాథరావు నక్కినకు ఏకంగా వెంకటేష్‌ ఛాన్స్‌ ఇచ్చాడని వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రం విజయయాత్రలలో ప్రస్తుతం రామ్‌ హ్యాపీగా ఉన్నాడు. ఈ సందర్భంగా ఆయన తన పెళ్లికి సంబంధించిన విషయాలను మీడియాతో పంచుకున్నాడు. ఆయన మాట్లాడుతూ, మా ఇంట్లో పెళ్లి చేసుకోమని ఒకటే గోల పెడుతున్నారు. ఎప్పుడు సినిమాలే అంటావు. సినిమాలోనే గడిపేస్తున్నావ్‌. పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ్‌? అని అడుగుతున్నారు.. అని తెలిపాడు.

ఆ సమయంలో కాస్త విననట్లు ‘నటించి’, ప్రస్తుతం ఏమీ మాట్లాడొద్దు. సినిమా అయిపోగానే చర్చిద్దామని ఆ విషయాన్ని దాటవేస్తూ ఉంటాను. పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడల్లా తర్వాతి చిత్రంతో ముడిపెట్టి తప్పించుకుంటాను అని చెప్పుకొచ్చాడు. దీనిని బట్టి రామ్‌ సినిమాలలోనే కాదు.. కుటుంబ సభ్యుల ముందు కూడా బాగానే నటిస్తాడని అర్ధమవుతోంది. 


అయ్యబాబోయ్.. ఏంటీ సినిమాలు..?

Category : Uncategorized

శుక్రవారం అంటే సినీ ప్రేక్షకులకి ఎంతో ఇష్టమైన రోజు ఎందుకంటే ఆ రోజు ఏదొక సినిమా రిలీజ్ అవుతుంటది. చిన్న సినిమా నుండి పెద్ద సినిమాల వరకు రిలీజ్ అవుతుంటాయి. కొన్ని నెలలు నుండి శుక్రవారం అంటే సినీ ప్రేక్షకులకి ఇంట్రెస్ట్ పోయింది. ఏదో పెద్ద సినిమా వస్తుంటే తప్ప చిన్న సినిమాలను ఎంకరేజ్ చేసే పరిస్థితులు లేవు. దాంతో బాక్సాఫీస్ డల్‌గా మారింది. తెలుగులో గత శుక్రవారం నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

అందులో చెప్పుకోదగ్గ సినిమా శ్రీ విష్ణు, నారా రోహిత్, సుధీర్ బాబు నటించిన ‘వీరభోగవసంతరాయలు’. ఈసినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి. రిలీజ్ ఎప్పుడు అయిది..ఎప్పుడు చూద్దాం అన్నట్టుగా జనాలు ఈ సినిమా కోసం వెయిట్ చేశారు. అయితే రిలీజ్ కి మూడు రోజులు ముందే యుఎస్ లో ప్రీమియర్లు వేసి ఏదో సాధించాలి అనుకున్న నిర్మాతల ఎత్తుగడ అడ్డంగా బెడిసి కొట్టింది. దాంతో ఈ సినిమాను ఇక్కడ చూడడానికి కూడా ఎవరు ఇష్టపడకపోవడంతో మొదటి రోజే హౌస్ ఫుల్స్ అవ్వలేకపోయింది.

మరో చిన్న సినిమా ‘బంగారి బాలరాజు’ పేరుతో వచ్చింది. దీనికి ప్రమోషన్స్ అవి ఇవి బాగానే చేశారు కానీ ప్రేక్షకుల నుండి కనీస స్పందన కరువైంది. ఇంకా మీసాలు కూడా పూర్తిగా మొలవని కుర్రాడిని సరైన శిక్షణ ఇవ్వకుండా హీరోగా పెట్టి తీయడంతో సినిమా డిజాస్టర్ గా నిలిచింది. అలానే ‘రథం’ అనే మరో ఆణిముత్యం కూడా ప్రేక్షకులను పలకరించింది. ‘ఆర్‌ఎక్స్100’ రేంజ్ లో బిల్డప్ ఇచ్చుకున్నారు కానీ వర్క్ అవుట్ అవ్వలేదు. కాకపోతే ‘బంగారి బాలరాజు’ మీద కొంత నయం అంతే. ఇంకా అదే రోజు ‘2 ఫ్రెండ్స్’ అనే చిన్న సినిమా వచ్చింది. అసలు ఈసినిమా ఎక్కడ రిలీజ్ అయిందో కూడా తెలియదు. 

వీటితో పాటు ఆర్య తమన్నా జంటగా విశాల్  క్యామియో చేసిన తమిళ  డబ్బింగ్ ‘ఐశ్వర్యాభిమస్తు’ సినిమా రిలీజ్ అయింది. దీనికి ఓపెనింగ్స్ దారుణంగా వచ్చాయి. ఇలా అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. సో ఈ శుక్రవారం పూర్తిగా తేడా కొట్టేసినట్టే .


RRR ఊహించని విధంగా మలుపులు!!

Category : Uncategorized

ఎన్టీఆర్‌తో రామ్ చరణ్‌తో కలిసి డివివి దానయ్య నిర్మాణంలో బడా మల్టీస్టారర్ సినిమా చెయ్యబోతున్నానంటూ ఒకే ఒక్క ఫొటోతో సెన్సేషన్ క్రియేట్ చేసిన రాజమౌళి.. అప్పటినుండి ఈ రోజు వరకు మళ్ళీ ఆ మల్టీస్టారర్ ముచ్చట్లు ఎక్కడైనా నోరు జారితే ఒట్టు. కానీ రాజమౌళి స్టార్ హీరోల కాంబోలో సినిమా ఉంటుందని ఎనౌన్స్ చేసాక.. మీడియాకి బాగా మేత దొరికింది. ఇక రాజమౌళి మల్టీస్టారర్‌పై బోలెడన్ని వార్తలు సోషల్ మీడియాలో ప్రచారంలోకొచ్చాయి. ఆ సినిమా కథ ఇదని.. అదని… ఎన్టీఆర్ విలన్ గా రామ్ చరణ్ హీరోగా ఇలా చాలానే వార్తలు ఫిలింనగర్ సాక్షిగా చక్కర్లు కొట్టాయి.

అయితే రాజమౌళి కామ్‌గా ఉన్నప్పటికీ.. చరణ్, ఎన్టీఆర్‌ల మల్టీస్టారర్ కోసం ఎప్పుడో రంగంలోకి దిగాడని.. ఇప్పటికే స్క్రిప్ట్ కూడా లాక్ చేసాడని.. రామ్ చరణ్ తో ఎన్టీఆర్ తో కలిసి, విడివిడిగా వర్క్ షాప్స్ కూడా నిర్వహించాడని చెబుతున్నారు. అలాగే ఈ సినిమాని నవంబర్18 నుండి పూజా కార్యక్రమాలతో మొదలు పెట్టి రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలెడతారని నిన్నగాక మొన్న వచ్చిన న్యూస్. కానీ తాజాగా రాజమౌళి ఆలోచన మారినట్లుగా తెలుస్తుంది. నవంబర్ 18 కన్నా ముందే అంటే… న‌వంబ‌రు తొలి వారంలోనే రాజమౌళి మల్టీస్టారర్ సినిమాకి కొబ్బ‌రికాయ కొట్టేస్తార‌ని స‌మాచారం. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్, చరణ్ పక్కన ఇద్ద‌రు హీరోయిన్ల‌కు చోటుంది. అయితే వాళ్లిద్ద‌రు కాక‌… ఒక విదేశీ హీరోయిన్ కూడా ఇందులో న‌టిస్తుంద‌ని తెలుస్తోంది. 

అయితే ప్రస్తుతం ఈ హీరోల కోసం హీరోయిన్స్ ని హడావిడిగా వెతికే పనిలేదట. ఎందుకంటే… RRR మొదటి షెడ్యూల్ కేవలం ఎన్టీఆర్, చరణ్ ల మీదే ఉండబోతుంది. ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌ల‌తో మొదటి షెడ్యూల్ కి సంబందించిన సన్నివేశాలు పూర్తి చేస్తార‌ని తెలుస్తోంది. ఆ తర్వాతే అంటే.. సెకండ్ షెడ్యూల్ లోనే హీరోయిన్లు రంగంలోకి దిగుతారని…. అందుకే రాజమౌళి హీరోయిన్ల ఎంపిక విష‌యంలో ఎలాంటి కంగారు ప‌డ‌డం లేదని టాక్. రెండో షెడ్యూల్‌కి ముందు హీరోయిన్స్ ఎంపిక చేసి…. అన్ని వివరాలు మీడియాకి తెలుపుతారని చెబుతున్నారు. మరి ఈ సినిమా కోసం స్టార్ హీరోలిద్దరూ 200 రోజుల డేట్స్ కేటాయించారట. అలాగే రెమ్యునరేషన్ కింద లాభాల్లో వాటాలు కూడా అందుకోబోతున్నారనే టాక్ ఉంది. 


చంద్రబాబు బయోపిక్ ఎంత వరకు వచ్చిందంటే?

Category : Uncategorized

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బయోపిక్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ‘చంద్రోదయం’. ఈ బయోపిక్‌ను పి.వెంకటరమణ దర్శకత్వంలో జి.జె. రాజేంద్ర నిర్మిస్తున్నారు. మోహన శ్రీజ సినిమాస్, శ్వేతార్క గణపతి ఎంటర్‌ప్రైజెస్ బ్యానర్స్‌పై సంయుక్తంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి చిత్రీకరణ పూర్తయింది. ఇటివలే ముఖ్యమంత్రి కార్యాలయంలో చంద్రబాబునాయుడుని కలిసింది చిత్రయూనిట్.

 ఈ సందర్భంగా దర్శకుడు వెంకటరమణ మాట్లాడుతూ.. ‘‘ఆకులు ఎన్ని కాల్చినా బొగ్గులు కావు బ్రదర్. జిత్తులమారి నక్కలు, తోడేళ్ళు ఎన్ని ఏకమైనా అడవికి రాజు, మృగరాజు నా అల్లుడే’ అనే ఎన్టీఆర్ క్యారెక్టర్ డైలాగ్‌తో చిత్ర షూటింగ్ విజయవాడ‌లో పూర్తయింది. చంద్రబాబు నాయుడు.. దేశ చరిత్రలోనే ఆదర్శవంతమైన నాయకుడు. ఆయన జీవితం అందరికీ తెలియ చెప్పాలనే సంకల్పంతో ఈ బయోపిక్‌ను తెరమీదకు తీసుకువస్తున్నాము. చిత్రీకరణ పూర్తిచేశాము. ఓ సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్యమైన స్థాయికి చేరిన ఆయన జీవితాన్ని అత్యద్భుతంగా తెరమీదకు తీసుకువస్తున్నాము..’’ అన్నారు.

నిర్మాత రాజేంద్ర మాట్లాడుతూ.. ‘‘నారావారి పల్లె, హైదరాబాద్, అమరావతి, సింగపూర్ లోని లొకేషన్స్‌లో సినిమా షూటింగ్ చేశాము. మహా నాయకుడి బయోపిక్‌ను మేము ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నందుకు గర్వంగా ఉంది. పాటలను నవంబర్ 2వ వారంలో విడుదల చేస్తాము. సంక్రాంతికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాము..’’ అన్నారు.

 వినోద్ నువ్వుల, శివానీ చౌదరి, మౌనిక, భాస్కర్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి డిఓపి: కార్తీక్ ముకుందన్, సంగీతం: రాజ్ కిరణ్, పి.ఆర్, మార్కెటింగ్: వంశీ చలమలశెట్టి, నిర్మాత : జి.జె.రాజేంద్ర, దర్శకత్వం: పి.వెంకటరమణ.


‘అనగనగా ఓ ప్రేమకథ’కు గోపీచంద్ సపోర్ట్

Category : Uncategorized

 

‘అనగనగా ఓ ప్రేమకథ’. ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ను శనివారం ఉదయం ప్రముఖ హీరో గోపీచంద్ తన సోషల్ మీడియా ‘ట్విట్టర్’ ఖాతా ద్వారా విడుదల చేసి చిత్రం యూనిట్‌కు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరో అశ్విన్, దర్శకుడు ప్రతాప్ తాతంశెట్టి, నిర్మాత కె.ఎల్.ఎన్.రాజు లు పాల్గొన్నారు.

హీరో గోపీచంద్  మాట్లాడుతూ.. ‘అనగనగ ఓ ప్రేమకథ’ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ఎంతో ప్రామిసింగ్ గా ఉంది. చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. చిత్ర నిర్మాత కె.ఎల్.ఎన్.రాజు గారు పరిశ్రమలోని అందరికీ కావలసిన వ్యక్తి. ఆయన చేసిన ఈ ప్రయత్నం మంచి విజయం సాధించాలని ఆశిస్తున్నాను.. అన్నారు. మార్తాండ్.కె.వెంకటేష్ గారు నాకు అన్న లాంటి వారు. ఆయన అక్క కొడుకు అశ్విన్. ఈ చిత్ర హీరో. సన్నివేశాలలో గానీ, సంభాషణలు పలకటంలోగానీ, పోరాటాలలో గానీ అశ్విన్ మంచి ప్రతిభ కనబరిచారు. ఇదే అతని తొలి చిత్రం అనిపించటం లేదు. అంతలా నటించాడు. మంచి హీరో అవ్వాలని అభినందిస్తున్నాను. చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని, ఆదరించాలని కోరుకుంటున్నాను.. అన్నారు. 

తమ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ను గోపీచంద్  విడుదల చేయటం పట్ల చిత్ర నిర్మాత సంతోషాన్ని వ్యక్తం చేసి కృతఙ్ఞతలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రం టీజర్‌ను ప్రముఖ హీరో రానావిడుదల చేశారు. అలాగే చిత్రంలోని గీతాలను  ప్రముఖ దర్శకులు మణిరత్నం, పూరి జగన్నాధ్, శేఖరకమ్ముల, పరశురామ్ లు విడుదల చేశారు. ఇంతమంది విజయవంతమైన చిత్రాల దర్శకులు విడుదల చేయటం, ఈ చిత్రం కూడా మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు నిర్మాత కె.ఎల్.ఎన్.రాజు.  ఈ చిత్రం హైదరాబాద్, అరకు, విశాఖపట్నం , మలేషియా లలోని పలు లొకేషన్‌లలో చిత్రీకరణ జరుపుకుంది. షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకొన్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. త్వరలోనే చిత్రం  విడుదల తేదీని ప్రకటిస్తామని నిర్మాత  తెలిపారు.

హీరో విరాజ్.జె .అశ్విన్ మాట్లాడుతూ.. అన్నయ్య గోపీచంద్ చిత్రాలు చూసి పెరిగాను. ఈ రోజు నేను హీరోగా నటించిన ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ను గోపీచంద్ గారు విడుదల చేయటం ఎంతో సంతోషంగా ఉందని అంటూ ఆయనకు కృతఙ్ఞతలు తెలిపారు. 

విరాజ్.జె .అశ్విన్ హీరోగా పరిచయం అవుతుండగా  ‘అనగనగా ఓ ప్రేమకథ’  పేరుతో ఈ చిత్రం నిర్మితమవుతోంది. కె.సతీష్ కుమార్ సమర్పణలో  ప్రతాప్ తాతంశెట్టి  దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నాయికలుగా రిద్ధి కుమార్, రాధా బంగారు నటిస్తున్నారు. సినిమా రంగంలో ప్రముఖ  ఫైనాన్షియర్ గా పేరుపొందిన  నిర్మాత  కె.ఎల్.యన్.రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో కాశీవిశ్వనాధ్, అనీష్ కురువిళ్ళ, వేణు (తిళ్ళు) తదితరులు నటిస్తున్నారు. 


బంటికి రాజేంద్ర‌ప్ర‌సాద్ వాయిస్ ఓవ‌ర్

Category : Uncategorized

అదుగో.. ర‌విబాబు తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్రం న‌వంబ‌ర్ 7న విడుద‌ల కానుంది. ఈ చిత్రంలో ఎన్నో ప్ర‌త్యేక‌త‌లున్నాయి. ఇప్పుడు న‌ట‌కిరీటి రాజేంద్ర‌ప్ర‌సాద్ కూడా అదుగో టీంతో జ‌త క‌లిసారు. ఈ చిత్రానికి రాజేంద్ర‌ప్ర‌సాద్ డ‌బ్బింగ్ చెప్ప‌డం విశేషం. దీవాళి సంద‌ర్భంగా అదుగో చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు నిర్మాత‌లు. పూర్తి ప్ర‌యోగాత్మ‌కంగా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంలో పందిపిల్ల కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తోంది. ఈ పాత్ర‌కే రాజేంద్ర‌ప్ర‌సాద్ డ‌బ్బింగ్ చెప్పారు. ఈయ‌న వాయిస్ ఓవ‌ర్ అదుగో చిత్రానికి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌నుంది. థియేట‌ర్స్ లో ప్రేక్ష‌కుల‌కు కూడా ఇది కొత్త అనుభూతిని ఇస్తుందంటుంది చిత్ర‌యూనిట్. ఇప్ప‌టికే విడుద‌లైన అదుగో ట్రైల‌ర్‌కు అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. బంటిగా పందిపిల్ల అంద‌రి మ‌న‌సుల‌ను దోచేసింది. వినోదాత్మ‌కంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు ర‌విబాబు. పందిపిల్ల నిజంగా ఉండేలా క‌నిపించడానికి లైవ్ యాక్ష‌న్ 3డి యానిమేష‌న్ టెక్నాల‌జీని వాడుకున్నారు. ఓ సినిమా కోసం ఇలాంటి టెక్నాల‌జీ వాడుకోవ‌డం ఇదే తొలిసారి. అభిషేక్ వ‌ర్మ‌, న‌భాన‌టాష్ ఈ చిత్రంలో ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తుండ‌గా.. ప్ర‌శాంత్ విహారి సంగీతం అందిస్తున్నారు. ఫ్లైయింగ్ ఫ్రాగ్ సంస్థ‌పై ర‌విబాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్ర‌ముఖ నిర్మాత సురేష్ బాబు ఈ చిత్రాన్ని స‌మ‌ర్పిస్తున్నారు. 

న‌టీన‌టులు: 

అభిషేక్ వ‌ర్మ‌, న‌భా, ర‌విబాబు, ఉద‌య్ భాస్క‌ర్, ఆర్కే, వీరేంద‌ర్ చౌద‌రి..

సాంకేతిక నిపుణులు:

క‌థ‌, ద‌ర్శ‌కుడు: ర‌విబాబు

నిర్మాత‌: ర‌విబాబు

సంస్థ‌: ఫ్లైయింగ్ ఫ్రాగ్

స‌మ‌ర్ప‌ణ‌: సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ 

స్క్రీన్‌ప్లే: స‌త్యానంద్

సంగీతం: ప‌్రశాంత్ ఆర్ విహార్

డిఓపి: ఎన్ సుధాక‌ర్ రెడ్డి 

ఆర్ట్ డైరెక్ట‌ర్: నారాయ‌ణ రెడ్డి 

ఎడిట‌ర్: బ‌ల్ల స‌త్య‌నారాయ‌ణ‌

యాక్ష‌న్: క‌న‌ల్ క‌ణ్ణ‌న్, విజ‌య్, స‌తీష్

లిరిక్స్: భాస్క‌ర‌బ‌ట్ల 

మాట‌లు: ర‌విబాబు, నివాస్ 

పిఆర్ఓ: వ‌ంశీ శేఖ‌ర్


వీరరాఘవుడి టార్గెట్ ఇప్పుడు మెగాస్టారే!

Category : Uncategorized

ఒకనాడు వరుస మూసకొట్టుడు చిత్రాలు చేసిన యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ ఈమధ్య వైవిధ్యభరితమైన కథలను, పాత్రలను ఎంచుకుంటున్నారు. ‘టెంపర్‌’తో మొదలుపెట్టి ‘నాన్నకు ప్రేమతో, జనతాగ్యారేజ్‌, జైలవకుశ’ వంటి చిత్రాలతో తనలోని సత్తాని చాటాడు. ఇక ఆమధ్య ఎన్టీఆర్‌ అంటే కేవలం మాస్‌ హీరో అనే ఇమేజ్‌ ఉండేది. అందుకే ఓవర్‌సీస్‌లో కూడా ఆయన చిత్రాలు కలెక్షన్ల పరంగా పెద్ద ప్రభావం చూపేవి కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఆయన చేస్తోన్న విభిన్నచిత్రాల ద్వారా అన్ని వర్గాల ప్రేక్షకులకు ఆయన చేరువ అవుతున్నాడు. అది ‘అరవింద సమేత వీరరాఘవ’తో మరింత బలపడింది. త్రివిక్రమ్‌కి, ఎన్టీఆర్‌కి ఉన్న క్రేజ్‌ ఈమూవీకి ఎంతో ప్లస్‌ అయింది. 

కాగా ‘అరవింద సమేత వీరరాఘవ’ తాజాగా చిరుని పక్కనపెట్టాడు. ఇప్పటివరకు ‘బాహుబలి-ది కన్‌క్లూజన్‌, బాహుబలి-ది బిగినింగ్‌, రంగస్థలం, ఖైదీ నెంబర్‌ 150, భరత్‌ అనే నేను’ చిత్రాలు ఎక్కువ గ్రాస్‌ని వసూలు చేశాయి. తాజాగా ‘వీరరాఘవుడు’, ‘భరత్‌ అనే నేను’ని దాటి రూ.159కోట్ల గ్రాస్‌తో ముందుకుదూసుకుపోయాడు. 164 కోట్లతో ఉన్న ‘ఖైదీనెంబర్‌ 150’కి ఈ చిత్రం దరిదాపుల్లో ఉంది. కేవలం మరో ఆరుకోట్లు వసూలు చేస్తే చిరు స్థానాన్ని ఎన్టీఆర్‌ ఆక్రమిస్తాడు. అందుకు మరో వారం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్టీఆర్‌ కెరీర్‌లోనే అత్యధిక గ్రాస్‌ని సాధించిన చిత్రంగా ‘అరవింద సమేత వీరరాఘవ’ నిలవడం, ఎన్టీఆర్‌కి తన కెరీర్‌లో తొలి 150కోట్ల చిత్రంగా రికార్డులకు ఎక్కడంతో అభిమానులు ఎంతో ఆనందంగా ఉన్నారు.