హైదరాబాద్ నందు (బంజర హిల్స్, జూబిలీ హిల్స్, మాదాపూర్, కొండాపూర్ ) పరిసర ప్రాంతాల్లో పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ వెంటనే కావాలను. ఆర్మీ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేసి రిటైర్ అయినా వారికీ తగిన ప్రాధాన్యత ఇవ్వ బడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ + 91 8074965869

Monthly Archives: November 2018

మైత్రీ మూవీస్.. కోతలు మొదలైనాయ్..!

Category : Uncategorized

మెగా హీరోలలో ఒకరైన సాయి ధరమ్ తేజ్ కు ప్రస్తుతం క్రేజ్ తగ్గటమే కాదు మార్కెట్ కూడా పడిపోయింది. వరసగా మూడు సినిమాలు డిజాస్టర్ అవ్వడంతో అతని మార్కెట్ షేర్‌ దారుణంగా పడిపోయింది. తేజ్‌ నటించిన ‘నక్షత్రం’, ‘ఇంటిలిజెంట్‌’, ‘తేజ్‌ ఐ లవ్యూ’.. అన్నీ మూడు, నాలుగు కోట్ల వసూళ్లతోనే సరిపెట్టుకున్నాయి అంటే అతని మార్కెట్ ఎంతలా పడిపోయిందో అర్ధం చేసుకోవచ్చు.

ఇతను ప్రస్తుతం ‘నేను శైలజ’ ఫేమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో ‘చిత్రలహరి’ అనే సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఈసినిమా కోసం తేజు తన మేకోవర్‌నే మార్చేశాడు. అయితే ప్రస్తుతం ఇతనికి మార్కెట్ లేకపోవడంతో తేజ్‌కి ఇచ్చే పారితోషికంలో కూడా కోత విధించారు నిర్మాతలు. ఈ సినిమాకు సంబంధించి హయ్యస్ట్‌ చెక్‌ అందుకుంది మాత్రం మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ అట.

దేవి తన సినిమాల్లో రెండు మూడు పాటలకు మంచి ట్యూన్స్ ఇస్తాడు కాబట్టి అవి సినిమాను మరింత హైప్ తీసుకుని వెళ్తాయి కాబట్టి ప్రొడ్యూసర్స్ దేవి విషయంలో కాంప్రమైజ్‌ అవలేదట. ఒక్కప్పుడు మైత్రి మూవీస్ వారు సినిమాలో పనిచేసే అందరికి ఇష్టం వచ్చినట్టు డబ్బులు ఇచ్చేవారు. కానీ వరసగా రెండు సినిమాలు డిజాస్టర్స్ అవ్వడంతో కొంచం జాగ్రత్త పడుతున్నట్టు తెలుస్తుంది. ‘చిత్రలహరి’ విషయంలో అటువంటి జాగ్రత్తలే తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈసినిమాకి ఖర్చులు తగ్గించి, తక్కువ ధరలకి విక్రయించి ఎలా అయినా హిట్ చేయాలనీ డైరెక్టర్ పై ఒత్తిడి పెడుతున్నారని సమాచారం. మరోవైపు తేజు కూడా ఈసినిమాతో తిరిగి ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు.


సినీజోష్ రివ్యూ: 2.0

Category : Uncategorized

 

 

 

లైకా ప్రొడక్షన్స్, ఎన్.వి.ఆర్. సినిమా

2.0

తారాగణం: రజనీకాంత్, అమీ జాక్సన్, అక్షయ్‌కుమార్, సుధాంశు పాండే, అనంత్ మహదేవన్, ఆదిల్ హుస్సేన్ తదితరులు

సినిమాటోగ్రఫీ: నిరవ్ షా

ఎడిటింగ్: ఆంటోని

సంగీతం: ఎ.ఆర్.రెహమాన్

బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: ఎ.ఆర్.రెహమాన్, కుతుబ్-ఎ-క్రిప

నిర్మాత: సుభాస్కరన్

రచన, దర్శకత్వం: శంకర్

విడుదల తేదీ: 29.11.2018

సృష్టిలోని ప్రతి ప్రాణికీ జీవించే హక్కు ఉంది. తమ స్వలాభం కోసం మరొక ప్రాణిని చంపే హక్కు ఎవరికీ లేదు. ముఖ్యంగా మనిషికి పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది. తమ విలాసాల కోసం సెల్ ఫోన్లు వాడుతూ, వాటి ద్వారా వ్యాపించే రేడియేషన్‌తో పక్షుల ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు. సెల్ ఫోన్స్ వాడినా రేడియేషన్‌ను తగ్గించే మార్గం చూడాలి. సెల్ నెట్‌వర్క్‌లు పదుల సంఖ్యలో కాకుండా అంకెల వరకే పరిమితం కావాలి. ఇదీ ఈ గురువారం విడుదలైన రజనీకాంత్, శంకర్‌ల 2.0 చిత్ర కథాంశం. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన రోబో ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. దానికి కొనసాగింపుగా రూపొందిన ఈ 2.0 చిత్రం హాలీవుడ్ స్థాయి విజువల్స్‌తో ఇండియన్ సినిమాలోనే భారీ బడ్జెట్‌తో నిర్మించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ చిత్ర యూనిట్ నాలుగేళ్ళు పడిన కష్టాని ప్రతిఫలంగా నవంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో ఈ సినిమా విడుదలైంది. మరి 2.0 చిత్రం ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని కలిగించింది? శంకర్ చెప్పిన పాయింట్‌కి ప్రేక్షకులు ఎంతవరకు కనెక్ట్ అయ్యారు? కలెక్షన్ల పరంగా ఈ సినిమా ఎలాంటి రికార్డులను సృష్టిస్తుంది? అనే విషయాలు తెలుసుకోవాలంటే సమీక్షలోకి వెళ్ళాల్సిందే. 

నగరంలో హఠాత్తుగా సెల్ ఫోన్లు మాయమవుతూ ఉంటాయి. ప్రజల చేతుల్లోని సెల్ ఫోన్స్ రెక్కల్లొచ్చి గాల్లోకి ఎగిరిపోతుంటాయి. ఆఖరికి రోబో సైంటిస్ట్ డా.వశీకర్(రజనీకాంత్) సెల్ ఫోన్ కూడా మాయమవుతుంది. ఆ సెల్‌ఫోన్లన్నీ ఒక సమూహంగా మారతాయి. సెల్ ఫోన్ల షోరూమ్ ఓనర్‌ని, మినిస్టర్‌ని… ఇలా వరసగా ఆ సెల్‌ఫోన్  సమూహం అంతం చేస్తుంటుంది. ఊహించని ఈ పరిణామంతో ఒక్కసారిగా నగరం ఉలిక్కిపడుతుంది. అత్యవసరంగా సైంటిస్టులతో సమావేశమై సమస్యపై తీవ్రంగా చర్చిస్తారు. డా.వశీకర్, అతని అసిస్టెంట్ రోబో వెన్నెల(అమీ జాక్సన్) కలిసి ఆ సెల్‌ఫోన్లు ఉన్న చోటును కనుక్కుంటారు. సెల్‌ఫోన్లన్నీ ఒక పెద్ద పక్షిగా మారుతుంది. ఆ పక్షి వారిపై దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. సెల్‌ఫోన్లన్నీ పక్షిగా ఎందుకు మారాయి అంటే దానికో ఫ్లాష్‌బ్యాక్ ఉంది. అతని పేరు పక్షిరాజు(అక్షయ్‌కుమార్). పక్షులంటే అతనికి ప్రాణం. కొన్ని వేల పక్షులు అతని దగ్గర ఆశ్రయం పొందుతుంటాయి. అయితే సెల్ ఫోన్ రేడియేషన్ వల్ల పక్షులు అంతరిస్తున్నాయని గ్రహిస్తాడు పక్షిరాజు. దానిపై పోరాటం చేసేందుకు సిద్ధమవుతాడు. సెల్ ఫోన్లు వాడకండి, పక్షుల్ని కాపాడండి అంటూ ప్రజల్ని చైతన్యవంతుల్ని చెయ్యాలనుకుంటాడు. అందులో భాగంగానే దానికి సంబంధించిన మినిస్టర్‌ని, సెల్ కంపెనీ అధిపతిని కలుస్తాడు. కానీ, ఎవరూ అతనికి అనుకూలంగా స్పందించరు. దీంతో మనస్తాపం చెందిన పక్షిరాజు ఒక సెల్ టవర్‌కి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంటాడు. ఆత్మగా మారిన పక్షిరాజుకు అప్పటివరకు చనిపోయిన పక్షుల ఆత్మలు కూడా తోడై అతన్ని మహా బలవంతుడుగా మారతాడు. పక్షుల మరణానికి కారణం అవుతున్న సెల్ ఫోన్లను నిర్మూలించడమే ఇప్పుడు పక్షిరాజు లక్ష్యం. అందుకే సెల్ ఫోన్లను మాయం చేస్తుంటాడు. పక్షిరాజును అంతం చేసేందుకు డా. వశీకర్‌ను ఆశ్రయిస్తుంది ప్రభుత్వం. అతను సృష్టించిన చిట్టి(రోబో) చట్ట వ్యతిరేకమైందని అప్పట్లో ప్రభుత్వం నిషేధించింది. అయితే చిట్టి రాక అనివార్యం కావడంతో దాన్ని అనుమతిస్తారు. చిట్టి సాయంతో డా.వశీకర్… పక్షిరాజును ఎలా అంతం చేశాడు అనేది మిగతా కథ. 

శంకర్ గతంలో చేసిన సినిమాలతో పోలిస్తే 2.0 కథ పూర్తి భిన్నమైంది. అతని ప్రతి సినిమాలో ఒక సందేశం ఉంటుంది. అతని మొదటి సినిమా జెంటిల్‌మేన్‌లో చదువుకోవాలని ఉన్నా ఆర్థిక వనరులు లేక ఇబ్బంది పడుతున్న విద్యార్థుల గురించి ఆ సినిమా చేశాడు. లంచగొండితనం వల్ల సామాన్య ప్రజలు ఎలా నష్టపోతున్నారనేది భారతీయుడులో చూపించాడు. ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పం ఉంటే ఒక్కరోజు ముఖ్యమంత్రిగా ఉన్నా చేయగలం అని ఒకే ఒక్కడు చిత్రంలో చెప్పాడు… ఇలా ప్రతి సినిమాలో సమాజానికి ఉపయోగపడే ఏదో ఒక మెసేజ్ ఉంటుంది. 2.0 విషయానికి వస్తే పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికీ ఉంది అనే విషయాన్ని ఒక విజువల్ వండర్ రూపంలో చెప్పాడు. ఆ సినిమాలకు, ఈ సినిమాకి ఉన్న తేడా… ఎమోషన్… ఎంటర్‌టైన్‌మెంట్ లేకపోవడం. సెల్ ఫోన్ల వల్ల పర్యావరణం కలుషితమైపోతుందనేది హాట్ టాపిక్కే అయినా కథలోని క్యారెక్టర్లు ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వకపోవడం, ముఖ్యంగా కామన్ ఆడియన్ ఒక విజువల్ ఎఫెక్ట్స్‌తో చేసిన సినిమా చూస్తున్న భావనతోనే ఉంటాడు తప్ప కంటెంట్‌కి, క్యారెక్టర్స్‌కి ఎక్కడా కనెక్ట్ అవ్వడు. ఈ సినిమా మొదటి భాగం రోబోలో కథ ఉంది, ఎమోషన్ ఉంది, సెంటిమెంట్ ఉంది, ఎంటర్‌టైన్‌మెంట్ ఉంది. అందుకే ఆ సినిమాను సగటు ప్రేక్షకుడు కూడా ఎంతో క్లారిటీగా చూస్తాడు. 

కథ, కథనాలు పక్కన పెడితే ఈ సినిమాకి ఉన్న ఒకే ఒక బలం విజువల్ ఎఫెక్ట్స్. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ప్రతి షాట్‌ని ఎంతో కష్టపడి చేశారు. విజువల్‌గా ఒక వండర్‌ని క్రియేట్ చేసారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సెల్‌ఫోన్ల వరద, సెల్‌ఫోన్లన్నీ పక్షిగా మారడం, సెల్‌ఫోన్లు మిలటరీ కంపెనీపై దాడి చేయడం, చిట్టి-పక్షిరాజు మధ్య భారీ ఫైట్…ఇలా సినిమాలోని ప్రతి విజువల్ వండర్‌గా అనిపిస్తుంది. క్లైమాక్స్‌లో 3.0 పేరుతో కనిపించే చిన్న రోబోలను అద్భుతంగా క్రియేట్ చేశారు. హాలీవుడ్ సినిమాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా విజువల్ ఎఫెక్ట్స్‌ని చేయడంలో 2.0 టీమ్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయింది. ఇండియన్ డైరెక్టర్లు కూడా ఇలాంటి సినిమాలు తియ్యగలరని ప్రపంచానికి మరోసారి చాటి చెప్పాడు డైరెక్టర్ శంకర్. ఈ సినిమా టెక్నీషియన్స్‌లో మరో ముఖ్యపాత్ర పోషించింది ఎ.ఆర్.రెహమాన్. ఈ సినిమాలో పాటలు ఎక్కువ లేవు. ఉన్న మూడు పాటల్ని తనదైన శైలిలో చెయ్యగలిగాడు రెహమాన్. ఇక బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అత్యద్భుతంగా చేశాడు. నిరవ్‌షా ఫోటోగ్రఫీ సినిమాలోని రిచ్‌నెస్‌ని చూపించింది. ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్ విషయానికి వస్తే వశీకర్‌గా, చిట్టిగా రజనీకాంత్ ఎప్పటిలాగే మంచి నటనను ప్రదర్శించారు. పక్షిరాజుగా ఓల్డ్ గెటప్‌లో అక్షయ్‌కుమార్ పెర్‌ఫార్మెన్స్ అందర్నీ ఆకట్టుకుంటుంది. రోబో వెన్నెలగా అమీ జాక్సన్ తన పాత్ర పరిధి మేరకు బాగానే చేసింది. 

ఇప్పటివరకు ఇండియన్ సినిమాలో చేయని ఒక గ్రాండియర్ మూవీ 2.0. మంచి మెసేజ్ ఇస్తూనే కళ్ళు చెదిరే విజువల్స్‌తో ఒక అద్భుతాన్ని సృష్టించారు శంకర్. ఇలాంటి ఓ అద్భుతాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడంలో శంకర్, అతని టీమ్ చేసిన కృషిని తప్పకుండా ప్రశంసించి తీరాలి. భావి తరం దర్శకులు కూడా ఇలాంటి అద్భుతాలను చేయడానికి శంకర్ మార్గదర్శిగా మారాడని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఫైనల్‌గా చెప్పాలంటే 2.0 విజువల్‌గా అందర్నీ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా పిల్లల్ని ఈ సినిమా విశేషంగా అలరిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. 

ఫినిషింగ్ టచ్: శంకర్ మరో అద్భుత సృష్టి


ఈ హీరో సెకండ్‌ ప్రభాస్‌ అనిపించుకోడట..!

Category : Uncategorized

ఒకప్పుడు దక్షిణాదిన కోలీవుడ్‌లోనే బహుభాషా చిత్రాలు వచ్చేవి. కమల్‌హాసన్‌, రజనీకాంత్‌, సూర్య, విక్రమ్‌ వంటి వారికి అన్నిచోట్లా ఫాలోయింగ్‌ ఉండటంతో దీనిని తమిళ సినీ ప్రముఖులు బాగా ఉపయోగించుకున్నారు. కానీ ప్రస్తుతం దక్షిణాదిన తమిళంతో పాటు తెలుగు చిత్రాలు కూడా బహుభాషల్లో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్నాయి. బహుభాషల్లో సినిమాలను నిర్మించడం వల్ల బడ్జెట్‌ పరంగా ఎన్నో సానుకూలాంశాలు ఉంటాయి. ఎక్కువ బడ్జెట్‌ని పెట్టడానికి ధైర్యం వస్తుంది. ఇక నిన్న మొన్నటి వరకు మలయాళ, కన్నడ చిత్రాలు అతి తక్కువ బడ్జెట్‌తో, తక్కువ పారితోషికాలతో రూపొందేవి. కానీ నేడు వాటిల్లో కూడా భారీ బడ్జెట్‌, బహుభాషా చిత్రాలు వస్తూ ఉన్నాయి. ఇక మరో విశేషం ఏమిటంటే.. కొంత మందికి తెలియకుండానే వారికి కొన్ని బిరుదులు వస్తూ ఉంటాయి. ఉదాహరణకు కృష్ణవంశీని చిన్నవంశీ అంటారు. నిన్నటి క్రియేటివ్‌ దర్శకుడైన వంశీ పేరును కృష్ణవంశీకి వాడటం నిజంగా గర్వించదగ్గ విషయమే. కానీ చిన్న వంశీ అంటే కృష్ణవంశీకి ఇష్టం ఉండదు. అలాగే పెద్ద వంశీ అంటే వంశీకి కూడా ఇష్టం ఉండదు. 

ఇక విషయానికి వస్తే గత కొన్నిరోజులుగా టాలీవుడ్‌లో కన్నడ మాస్‌ హీరో యష్‌ గురించి పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. కన్నడ స్టార్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న యష్‌ ‘కేజీఎఫ్‌’ అనే చిత్రం ద్వారా డిసెంబర్‌ 21న కన్నడతో పాటు తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో కూడా ఒకేసారి వచ్చేందుకు సిద్దమవుతున్నాడు. ఈ చిత్రం కోలార్‌ బంగారు గనుల్లో పనిచేసే కార్మికుల నేపధ్యంలో రూపొందింది. కాగా కన్నడస్టార్‌ కిచ్చా సుదీప్‌ని రాజమౌళి తన ‘ఈగ’ ద్వారా విలన్‌గా పరిచయం చేసినట్లు, యష్‌ని కూడా జక్కన్న, రామ్‌చరణ్‌ ఎన్టీఆర్‌ మూవీలో విలన్‌గా తీసుకున్నాడనే ప్రచారం సాగుతోంది. వాటిని యష్‌ ఖండించాడు. డిసెంబర్‌ 21న ‘కేజీఎఫ్‌’ చిత్రం వరుణ్‌తేజ్‌ ‘అంతరిక్షం’, శర్వానంద్‌-సాయిపల్లవి-హనురాఘవపూడిల ‘పడిపడిలేచె మనసు’తో పోటీ పడుతూ వస్తోంది. 

ఈ సందర్భంగా యష్‌ మాట్లాడుతూ, ఈ చిత్రం ‘ఛత్రపతి’కి దగ్గరగా ఉంటుందనే ప్రచారం సాగుతోంది. అందులో వాస్తవం లేదు. ఇక నా ఫిజిక్‌ని చూసిన వారంతా దక్షిణాదిలో సెకండ్‌ ప్రభాస్‌ అని పిలుస్తున్నారు. నాకు సెకండ్‌ ప్రభాస్‌ అనిపించుకోవడం ఇష్టం ఉండదు. మొదటి యష్‌ అనిపించుకోవడమే ఇష్టంగా ఉంటుంది. ఇప్పటికే నాలుగు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులను సొంతం చేసుకున్న నేను ‘కేజీఎఫ్‌’తో మరో అవార్డు సాధించడం ఖాయమంటున్నారు. కానీ నాకు అవార్డులు ముఖ్యం కాదు. ప్రేక్షకులు కొట్టే చప్పట్లే నాకు ఇష్టం అని చెప్పుకొచ్చాడు. 


న్యూ ఏజ్ లవ్‌స్టోరి ‘నీ కోసం’ అంటున్నారు

Category : Uncategorized

అరవింద్ రెడ్డి, శుభంగి పంత్, అజిత్ రాధారాం, దీక్షిత హీరోహీరోయిన్లుగా తీర్థసాయి ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తున్న మూవీ ‘‘నీ కోసం’’. రీ ఫ్రెషింగ్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ మూవీతో అవినాష్ కోకటి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అల్లూరమ్మ (భారతి) నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సోమశేఖర రెడ్డి, అల్లూరి రెడ్డి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రేమలోని భిన్నమైన కోణాలను స్పృశిస్తూ రూపొందుతున్న ఈ సినిమా టీజర్ రిలీజైంది. టాకీ పార్ట్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు.

ఈ సందర్భంగా దర్శకుడు అవినాష్ కోకటి మాట్లాడుతూ.. ‘‘మా ‘నీ కోసం’ మూవీ ఈ మధ్య వస్తున్న ప్రేమకథలకు భిన్నంగా ఉంటుంది. రెండు ప్రేమజంటల కథలను ఇందులో డిఫరెంట్ గా ప్రజెంట్ చేస్తున్నాం. న్యూ ఏజ్ లవ్ స్టోరి అని చెప్పొచ్చు. ఎంటర్‌టైన్‌మెంట్ ను మిస్ అవ్వకుండానే ప్రేమలోని సున్నితమైన ఎమోషన్స్ ను టచ్ చేస్తున్నాం. ఫిబ్రవరిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్న మా మూవీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాం’’.. అన్నారు. 


బాహుబలిని బీట్ చేసిందండోయ్..!

Category : Uncategorized

ఇండియా వైడ్‌గా ఇప్పుడు ఎక్కడ చూసినా రోబో 2.ఓ సినిమా ఫీవర్ తో ఉన్నారు సినీ ప్రియులు. గురువారం వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతున్న 2.ఓ సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి.  ఇక సోషల్ మీడియాలో రాజమౌళి తెరకెక్కించిన బాహుబలితో 2.ఓ సినిమాని పోలుస్తూ అనేక రకాల న్యూస్ లు గత రెండు నెలలుగా వస్తూనే ఉన్నాయి. బాహుబలిని తలదన్నే హిట్ అవుతుందని రజినీకాంత్ అభిమానులంటుంటే… బాహుబలి మీద ఒక్క రూపాయి అయినా ఎక్కువ సాధిస్తేనే 2.ఓ హిట్ కింద లెక్క అంటున్నారు కొందరు. యావరేజ్ హిట్ కాదు, సూపర్ హిట్ కాదు బాహుబలి కలెక్షన్స్ ని 2.ఓ క్రాస్ చేస్తేనే 2.ఓ సూపర్ హిట్ అంటున్నారు.

మరి బాహుబలిని కలెక్షన్స్ విషయంలో క్రాస్ చేస్తుందో లేదో తెలియదు కానీ… ప్రస్తుతం బాహుబలిని ఒక విషయంలో 2.ఓ క్రాస్ చేసేసింది. ఇప్పటివరకు బాహుబలి ఆ విషయంలో ఏ సినిమా క్రాస్ చెయ్యలేకపోయింది కానీ.. ఇప్పుడు 2.ఓ మాత్రం క్రాస్ చేసేసింది. ఎందులో అంటే.. వరల్డ్ వైడ్‌గా 7వేలకు పైగా స్క్రీన్స్ లో ఒకేసారి బాహుబలి సినిమా విడుదలైంది. ఇప్పుడా రికార్డుని 2.ఓ క్రాస్ చేసేసింది. 2.ఓ వరల్డ్ వైడ్ గా అత్యథిక తెరలపై విడుదలవుతున్న ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించబోతోంది. ఈ సినిమా విడుదలకు కొన్ని గంటలు టైం ఉందనగా…. ఇప్పటికే ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 10వేల 500 స్క్రీన్స్ లాక్ అయ్యాయి. విడుదల టైమ్‌కి ఈ థియేటర్స్ మరో 300 వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

మరి సూపర్ స్టార్ రజిని – శంకర్ ఇద్దరు కలిసి చెయ్యబోయే మ్యాజిక్ కోసం కోట్లాది ప్రజలు వేచి చూస్తున్నారు. మరి ఈ అధిక థియేటర్స్ లో సినిమాని విడుదల చేసి మొదటి రోజే భారీ ఓపెనింగ్స్ తో పెట్టిన పెట్టుబడిలో సగం వెనక్కి తేవాలనే యోచనలో 2.ఓ నిర్మాతలున్నట్టుగా కనబడుతుంది. మరి విడుదలలో అత్యధిక థియేటర్స్ లో విడుదలవుతూ రికార్డులను సొంతం చేసుకున్న 2.ఓ సినిమా విడుదలై హిట్ టాక్ తో బాహుబలి కలెక్షన్స్ రికార్డులను కూడా తుడిచేస్తుందనే ధీమాలో రజిని అభిమానులున్నారు. చూద్దాం.. బాహుబలిని 2.ఓ బీట్ చేస్తుందా.. లేదంటే…. 2.ఓ మాటలకే పరిమితమవుతుందా?


అజిత్ క్రేజ్‌కి ఇది ఉదాహరణ..!

Category : Uncategorized

తమిళంలో రజనీకాంత్‌ తర్వాత అజిత్‌, విజయ్‌లు ఆ స్థానం కోసం ఎంతో పోటీపడుతూ ఉంటారు. క్రేజ్‌ విషయంలో ఇద్దరిదీ దాదాపు సమాన స్థాయే అయినా ఒక అడుగు ముందు అజితే ఉంటాడని చెప్పవచ్చు. ఆయన వ్యక్తిగత జీవితంలోని మంచితనం కూడా దీనికి ప్లస్‌ అవుతుంది. కాగా అజిత్‌ ఇప్పటి వరకు కెమెరామెన్‌ కమ్‌ డైరెక్టర్‌ శివ దర్శకత్వంలో ‘వీరం, వేదాళం, వివేగం’ వంటి చిత్రాలలో నటించాడు. ‘వివేగం’ చిత్రంలో వివేక్‌ ఒబేరాయ్‌ విలన్‌గా నటించగా, కాజల్‌ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం అజిత్‌ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందింది. ఈ మూవీ పెద్దగా అన్ని రకాల ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయినా కూడా కేవలం అజిత్‌ పుణ్యాన రికార్డు కలెక్షన్లు సాధించింది. 

ప్రస్తుతం అజిత్‌ మరోసారి శివ దర్శకత్వంలో ‘వి’సెంటిమెంట్‌ని ఫాలో అవుతూ ‘విశ్వాసం’ చిత్రం చేస్తున్నాడు. ఇందులో సౌత్‌ఇండియన్‌ సూపర్‌స్టార్‌గా పేరొందిన నయనతార హీరోయిన్‌గా నటిస్తుండటం విశేషంగా చెప్పాలి. ఇతర పాత్రల్లో జగపతిబాబు, వివేక్‌, తంబి రామయ్య, కోవై సరళ వంటి వారు నటిస్తున్నారు. సత్యజ్యోతి ఫిలింస్‌ బేనర్‌పై టి.త్యాగరాజన్‌ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని పొంగల్‌ బరిలో దించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రం మోషన్‌ పోస్టర్‌ని తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో అజిత్‌ వీర మాస్‌ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఈ మోషన్‌ సోస్టర్‌లో పండుగ వాతావరణాన్ని చూపించారు. దీనికి విశేషమైన స్పందన లభించింది. 24గంటలు కూడా కాకముందే 34లక్షల వ్యూస్‌ని సాధించింది. 

అంతేకాదు.. ఇది యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో మొదటి స్థానంలో ఉంది. 3.5లక్షల మంది ఈ మోషన్‌ పోస్టర్‌ తమకి బాగా నచ్చిందని లైక్‌లు చేయడం విశేషంగా చెప్పాలి. ఇక ‘విశ్వాసం’ చిత్రం తర్వాత అజిత్‌ మరోసారి ఓ ప్రయోగం చేయనున్నాడు. బాలీవుడ్‌లో వచ్చిన ‘పింక్‌’ చిత్రంలో బిగ్‌బి అమితాబ్‌బచ్చన్‌ పోషించిన పాత్రను అజిత్‌ పోషించనుండటం విశేషంగా చెప్పుకోవాలి. 


RRR: మరో స్టోరీ వచ్చేసింది..!

Category : Uncategorized

రీసెంట్ గా షూటింగ్ స్టార్ట్ చేసుకున్న #RRR నుండి రోజుకొక న్యూస్ వైరల్ అవుతుంది. రామ్ చరణ్ – ఎన్టీఆర్ నటిస్తున్న ఈసినిమా కోసం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు బాలీవుడ్ వారు కూడా వెయిట్ చేస్తున్నారు. షూటింగ్ స్టార్ట్ అయ్యి ఇంకా పది రోజులు కూడా కాకముందే ఈసినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుందని సమాచారం. అయితే రాజమౌళి మాత్రం ఇప్పుడే వద్దని రెండు మూడు నెలలు పోయిన తరువాత మంచి రోజు చూసుకుని అప్పుడు ప్రీ రిలీజ్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అని చెప్పాడట.

ఈసినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుండి ఈ సినిమా స్టోరీ ఏమైవుంటది అని..చరణ్ – తారక్ ల పాత్రలు ఎలా ఉండబోతున్నాయి అని అందరిలోనూ ఆసక్తి నెలకుంది. అయితే విశ్వసనీయ సమాచారం మేరకు ఇందులో తారక్ బందిపోటు దొంగగా.. చరణ్ పాత్ర అతన్ని పట్టుకోవడానికి నియమింపబడ్డ పోలీస్ ఆఫీసర్‌గా ఉంటుందని తెలిసింది. ఇండియాకు స్వాతంత్ర్యం రాకముందు 1920నాటి కాలంలో జరిగే కథగా చూపించనున్నాడు జక్కన్న. ఎన్టీఆర్ లుక్ ఇందులో చాలా కొత్తగా ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ – ఎన్టీఆర్ ల మధ్య హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నారు.

ఇద్దరు దేశ భక్తి మెండుగా ఉంటూనే బానిస సంకెళ్ళ నుంచి దేశానికి విముక్తి కలిగించడం ట్రై చేస్తూ ఉంటారు. ఒక టైములో ఇద్దరు ఒక్కటై బ్రిటిష్ సామ్రాజ్యం మీద తిరుగుబాటు జెండా ఎగురవేయడం సినిమాలోని మెయిన్ థీమ్ అని టాక్. ఇది రీసెంట్‌గా వచ్చిన ‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్’ కథకు చాలా దగ్గరగా ఉంది. మరి ఇది నిజమో కాదో తెలియదు కానీ నిజమే అనే ప్రచారం అయితే జరుగుతుంది. రామ్ చరణ్ – ఎన్టీఆర్ తప్ప ఇతర నటీనటులను ఇంకా ఎంపిక చేయలేదు రాజమౌళి. 2020 సమ్మర్‌లో ఈ సినిమా విడుదలకానుంది.


‘2.O’కు ప్రమోషనే అక్కర్లేదు: ర‌జ‌నీకాంత్‌

Category : Uncategorized

ఇండియ‌న్ సినిమా గ‌ర్వ‌ప‌డే చిత్రం ‘2.O’ – సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, అక్షయ్‌కుమార్‌, శంకర్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న విజువల్‌ వండర్‌ ‘2.O’. లైకా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై సుభాష్‌ కరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. నవంబర్‌ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలకాబోతోంది. ఈ సందర్భంగా సోమవారం ‘2.O’ టీమ్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ మాట్లాడుతూ.. ‘‘రోబో విడుదలై ఎనిమిదేళ్లు అవుతుంది. ఆ సినిమా ఆడియో సమయంలో శంకర్‌గారు నాకు తెలుగు తెలియదని చెప్పి ఇంగ్లీష్‌లో మాట్లాడారు. ఇప్పుడు ఆయన చాలా చక్కగా తెలుగులో మాట్లాడటం నేర్చుకోవడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. తెలుగు జనాలు చాలా మంచివాళ్లు. వాళ్లని అందరూ ఇష్టపడతారు. తెలుగు భోజనం లోక ప్రసిద్ధి. తెలుగు మ్యూజిక్‌ ఆనందమైంది. తెలుగు గొప్పతనాన్ని మహాకవి భారతీనే కొనియాడారు. తెలుగు అమ్మాయిలు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రోబోను చేసినప్పుడు పూర్తి సినిమాను త్రీడీగా మార్చాలనుకున్నాం. కానీ కుదరలేదు. ఓ రీల్‌ను త్రీడీలో మార్చి చూసిన తర్వాత శంకర్‌గారు అప్పుడే త్రీడీలో సినిమా చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకని మంచి కథ కోసం వెయిట్‌ చేశారు. మూడు నాలుగేళ్ల ముందు త్రీడీల సినిమా చేద్దామని అనగానే మంచి కథ దొరికేసిందని అనుకున్నాను. ఆయనతో నేను పనిచేసి ఉన్నాను కాబట్టి ఇది సాధ్యమా? అనే సందేహం రాలేదు. బాహుబలి అంత పెద్ద సక్సెస్‌ కావడానికి కారణం మంచి సబ్జెక్ట్‌ అందుకు తగిన బ్రహ్మాండం. రెండు కలిసింది కాబట్టే బాహుబలి పెద్ద సక్సెస్‌ అయ్యింది. ఈ సినిమా విషయానికి వస్తే టెక్నాలజీ, త్రీడీ కరెక్ట్‌ అయిన సబ్జెక్ట్‌ కాంబినేషన్‌ కుదిరింది. 100శాతం సినిమా పెద్ద సక్సెస్‌ అవుతుందనే నమ్మకం నాకుంది. శంకర్‌గారు అడిగినవన్నీ సమకూర్చిన నిర్మాత సుభాష్‌కరణ్‌గారికి థాంక్స్‌. ఈ సినిమాకు ప్రమోషనే అక్కర్లేదు. ప్రసాద్‌గారు ఊరికే డబ్బు వేస్ట్‌ చేస్తున్నారు. ఆల్‌ రెడీ సినిమాపై అంచనాలు ఎక్కడో ఉన్నాయి. సినిమా ఎప్పుడొస్తుందా? అని అందరూ వెయిట్‌ చేస్తున్నారు. సినిమా చూసిన తర్వాత.. చూసినవాళ్లే సినిమాను ప్రమోట్‌ చేస్తారని నేను చెన్నైలోనే చెప్పాను. 1975లో నేను నటించిన తొలి చిత్రం అపూర్వరాగంగల్‌ సినిమాను చూడాలని ఎంత ఉబలాటపడ్డానో.. 43ఏళ్ల తర్వాత 2.0 కోసం అంతే అతృతగా ఉంది. ఇందులో 45 శాతం విజువల్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయి. ఇప్పుడు మేకింగ్‌, ట్రైలర్‌లో, సాంగ్స్‌లో చూసినవన్నీ శాంపిల్సే. ఇది ట్రైలర్‌ మాత్రమే. మీరు ఆశ్చర్యపోయేలా గ్రాఫిక్స్‌, బ్రహ్మాండం అనేలా.. అన్నీ ఈ సినిమాలో ఉన్నాయి. ‘2.O’ మన సినిమా ఇండస్ట్రీకే చాలా గర్వపడే చిత్రం. శంకర్‌గారు చెప్పినట్లు ఈ సినిమాను త్రీడీలో చూస్తే ఆ ఎఫెక్టే మరోలా ఉంటుంది. నేను కూడా 29 కోసం వెయిట్‌ చేస్తున్నాను’’ అన్నారు. 

బాలీవుడ్ స్టార్ అక్షయ్‌ కుమార్‌ మాట్లాడుతూ – ‘2.O’ నాకు సినిమా కాదు. ఓ స్కూల్‌కు వెళ్తున్నట్లుగా భావించాను. మా స్కూల్‌ ప్రిన్సిపాల్‌ శంకర్‌గారు. నేను సినిమా ఇండస్ట్రీలో 28 సంవత్సరాలుగా ఉన్నాను. ఇన్నేళ్లలో నేర్చుకోలేని చాలా విషయాలను ఈ సినిమాలో నేర్చుకున్నాను. ఇలాంటి సినిమాలో బిగ్గెస్ట్‌ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌గారితో కలిసి పనిచేసే అవకాశాన్ని ఇచ్చిన శంకర్‌గారికి థ్యాంక్స్‌. ఓ సింపుల్‌ లైన్‌ ఇస్తే దాని నుండి మేజిక్‌ చేయడం రజనీకాంత్‌గారికే తెలుసు. ఈ సినిమాలో విలన్‌గా నటించాలని అనగానే ఆయనతో దెబ్బలు తినడాన్ని ఓ గౌరవంగా భావించాను. ఈ సినిమాలో ఆయనతో దెబ్బలు తినడమే నాకు బెస్ట్‌ మూమెంట్స్‌. నేను ఈ ప్రాసెస్‌ను ఎంజాయ్‌ చేశాను. నేను కూడా సినిమాను చూడలేదు. విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి సినిమా చేసిన సుభాష్‌కరణ్‌గారికి థ్యాంక్స్‌’’ అన్నారు. 

డైరెక్టర్‌ శంకర్‌ మాట్లాడుతూ.. ‘‘ఇలా నడిస్తే ఎలా ఉంటుంది? అనే ఓ ఇమాజినేషనే ఈ ‘2.O’ సినిమా. ఇది ఒక ఫుల్‌ యాక్షన్ ఎంటర్‌టైనింగ్‌ థ్రిల్లర్‌. ఇందులో మంచి ఎమోషనల్‌ సోషల్‌ స్టోరీ ఉంది. ఇది ఒక టీమ్‌ వర్క్‌. వేలాదిమంది టెక్నీషియన్స్‌ ఈ సినిమా కోసం వర్క్‌ చేశారు. ఆర్టిస్టుల విషయానికి వస్తే రజనీగారు, అక్షయ్‌గారు, ఎమీ జాక్సన్‌..ఇలా చాలా మంది కష్టపడి చేశారు. క్లైమాక్స్‌ని ఢిల్లీలో షూట్‌ చేశాం. 47 డిగ్రీల టెంపరేచర్‌లో చేయడం జరిగింది. రజనీగారు ట్రీట్‌మెంట్‌లో ఉన్నారు. అక్కడికి రావడం చాలా కష్టం. 40 రోజులు షూటింగ్‌. అక్షయ్‌కుమార్‌గారు, ఫారిన్‌ టెక్నీషియన్స్‌, జూనియర్‌ ఆర్టిస్టులు అందరూ 500 మంది వెయిట్‌ చేస్తున్నాం. ఆ షూటింగ్‌ క్యాన్సిల్‌ చేస్తే చాలా నష్టం జరుగుతుంది. అందరినీ 40 రోజుల కోసం అక్కడికి తీసుకురావాలంటే చాలా కష్టం. ఇవన్నీ ఆలోచించిన రజనీగారు తన హెల్త్‌ కండీషన్‌ బాగుండకపోయినా అక్కడికి వచ్చి క్లైమాక్స్‌ కంప్లీట్‌ చేశారు. అక్షయ్‌గారు ఇన్ని సంవత్సరాల కెరీర్‌లో ఇలాంటి మేకప్‌ వేసుకోలేదు. టోటల్‌ కెరీర్‌ మేకప్‌ ఈ ఒక్క సినిమాలోనే వేసేశారు. రెండున్నర, మూడు గంటలపాటు ప్రాస్తటిక్‌ మేకప్‌, విగ్‌, లెన్స్‌, పళ్ళు… ఇవన్నీ వేసుకొని చాలా బాగా పెర్‌ఫార్మ్‌ చేశారు. ఇక రెహమాన్‌ గురించి చెప్పాలంటే సినిమాలోని సీన్స్‌ హెవీగా ఉన్నాయని బాగా చెయ్యాలన్న ఉద్దేశంతో 6 నెలల ముందే బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ స్టార్ట్‌ చేశారు. అతని బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ చూస్తే బ్యాట్‌మేన్‌, స్పైడర్‌మేన్‌లాంటి సినిమాలు చూస్తున్న ఫీలింగ్‌ కలిగేలా చాలా బాగా బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ చేశారు. ఈ క్రెడిట్స్‌ మెయిన్‌గా నిర్మాత సుభాష్‌కరణ్ గారికి ఇవ్వాలి. ఎందుకంటే ఒక ఇండియన్‌ సినిమాకి ఇంత పెద్ద ఇన్వెస్ట్‌మెంట్‌ ఎవ్వరూ చెయ్యరు. కానీ, సినిమా మీద ఉన్న ప్యాషన్‌తోనే ఈ సినిమాను ప్రొడ్యూస్‌ చేశారు. ఈ సీక్వెల్‌లో మళ్లీ సైంటిస్ట్‌ వశీకరన్‌గారు, చిట్టీ, 2.0… వీళ్ళందరినీ చూస్తే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది, చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. ఆ ఎక్సైట్‌మెంట్‌ మీక్కూడా వస్తుందని నమ్ముతున్నాను. నేను మీడియా వారందరికీ నా రిక్వెస్ట్‌ ఏమిటంటే ఇలాంటి సినిమాలను సపోర్ట్‌ చెయ్యండి. ఈ సినిమా కోసం అందరూ టన్నుల కొద్దీ ఎఫర్ట్స్‌ పెట్టి ఉన్నారు. ఇలాంటి సినిమాని సపోర్ట్‌ చేస్తే మన కంట్రీలో కూడా ఇలాంటి సినిమాలు చెయ్యవచ్చు అని వరల్డ్‌కి ప్రూవ్‌ చెయ్యవచ్చు. ఈ సినిమాని తెలుగులో రిలీజ్‌ చేస్తున్న ఎన్‌.వి.ప్రసాద్‌గారికి థ్యాంక్స్‌. ఈ సినిమాని 3డిలో చూడండి. 2డి కంటే 3డిలో పదిరెట్లు బాగుంటుంది’’ అన్నారు. 

హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ.. ‘2.O’ చిత్రాన్ని నాతో ప్రసాద్‌గారు, యు.వి.క్రియేషన్స్‌ కలిసి విడుదల చేస్తున్నారు. రెండు రోజుల క్రితం విడుదలైన సాంగ్‌ ఈ సినిమాపై ఉన్న అంచనాల ఏంటో చెబుతుంది. వన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ ఇండియన్‌ ఫిలిం లిస్ట్‌లో ‘2.O’ నిలవబోతుంది. ఎంటైర్‌ టీమ్‌కు ఆల్‌ ది బెస్ట్‌’’ అన్నారు. 

ఎన్‌.వి.ఆర్ సినిమాస్ అధినేత ఎన్‌.వి.ప్రసాద్‌ మాట్లాడుతూ.. ‘‘నాలుగేళ్లు శంకర్‌గారు ఈ సినిమా కోసం కష్టపడ్డారు. స్క్రూ డ్రైవర్‌ నుండి ప్రతి పిన్‌ ఆయన నుండి వచ్చిన సృష్టి. లైకా ప్రొడక్షన్స్‌ సుభాష్‌ కరణ్‌ అంత గొప్పగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇండియన్‌ సినిమాను వరల్డ్‌ సినిమా చేయడానికి రజనీకాంత్‌గారు.. సుభాష్‌కరణ్‌గారు.. శంకర్‌గారు.. అక్షయ్‌కుమార్‌గారు.. పడిన తాపత్రయం ఏంటో మేకింగ్‌లోనే తెలుస్తుంది. అసలు దీపావళి ఈ నెల 29న స్టార్ట్‌ అవుతుంది. ఈ దీపావళి సంక్రాంతి తర్వాత కూడా కంటిన్యూ అవుతుంది. మన ఇండియన్‌ సినిమా వరల్డ్‌ సినిమా అవడానికి వాళ్లు చేసిన కృషి అమోఘం, అద్భుతం. రియల్‌ త్రీడీలో ఈ నెల 29న ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదలవుతుంది. ఎన్నో సంవత్సరాలు, రాత్రుళ్లు అందరూ పడ్డ కష్టమీ చిత్రం. కేవలం సినిమా ప్రేక్షకులను మెప్పించాలి.. గొప్ప చిత్రం అందించాలని అందరూ కష్టపడ్డారు. కచ్చితంగా వారి కష్టానికి ప్రపంచ వ్యాప్తంగా ఓ గుర్తింపు వస్తుందని, వరల్డ్‌ సినిమాగా నిలబడుతుందనే నమ్మకం ఉంది. సినిమా మీద ప్రేమతో ఇలాంటి ప్రయత్నం చేసిన టీమ్‌కు అభినందనలు. శంకర్‌గారిని, రాజమౌళిగారిని, రాజ్‌కుమార్‌ హీరాణిగారిని మేం మరచిపోం. వారు మరిన్ని గొప్ప చిత్రాలను అందించాలని కోరుకుంటున్నాం’’ అన్నారు. 


చిరు చిన్నల్లుడికి.. ప్రియావారియర్ షాక్!!

Category : Uncategorized

మెగాస్టార్‌ చిన్నల్లుడు కళ్యాణ్‌దేవ్‌ ‘విజేత’ తర్వాత తన రెండో చిత్రానికి రెడీ అవుతున్నాడు. పులి వాసు దర్శకత్వంలో ఓ చిత్రం చేయడానికి ఆయన ఓకే చెప్పాడు. మొదట ఇదే దర్శకునితో, ఇదే బేనర్‌లో సుధీర్‌బాబు హీరోగా ఓ చిత్రం రూపొందనుందని వార్తలు వచ్చాయి. కానీ ఏవో కారణాల వల్ల సుధీర్‌బాబు ఈ చిత్రానికి నో చెప్పడం, దాంతో ఆ కథ కళ్యాణ్‌దేవ్‌ వద్దకు వెళ్లడం వెంట వెంటనే జరిగిపోయాయి. ఇక సుధీర్‌బాబుని హీరోగా అనుకున్నప్పుడు నిర్మాతలు హీరోయిన్‌గా మెహ్రీన్‌ని ఎంపిక చేసుకుని పాతిక లక్షలు అడ్వాన్స్‌ కూడా ఇచ్చారు. ‘కృష్ణగాడి వీరప్రేమగాధ’, ‘రాజా దిగ్రేట్‌, మహానుభావుడు’ వంటి చిత్రాలతో హిట్‌ కొట్టిన మెహ్రీన్‌ ఆ తర్వాత సందీప్‌కిషన్‌ ‘కేరాఫ్‌ సూర్య’ , గోపీచంద్‌ ‘పంతం’లతో మరలా యధాస్థితికి వచ్చింది. 

దిల్‌రాజు నిర్మాణంలో అనిల్‌రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌ హీరోలుగా నటిస్తున్న ‘ఎఫ్‌ 2’ చిత్రంపై ఈమె బోలెడు ఆశలు పెట్టుకుంది. ఇందులో ఆమె వరుణ్‌తేజ్‌కి జంటగా నటిస్తోంది. కానీ ఈమె ఇప్పుడు కళ్యాణ్‌దేవ్‌-పులి వాసు చిత్రంలో నటించనని, అడ్వాన్స్‌ని తిరిగి ఇచ్చేసిందని సమాచారం. దాంతో ఆమె స్థానంలో ఏకంగా ఒకే ఒక్క కన్నుగీటుతో సోషల్‌మీడియా సంచలనంగా మారిపోయిన ‘ఒరు ఆధార్‌లవ్‌’ బ్యూటీ ప్రియా వారియర్‌ని సంప్రదించారట. ఆమె చేత హీరోయిన్‌ పాత్రను చేయిస్తే చిరు చిన్నల్లుడి వల్ల కాకపోయినా, ప్రియా వారియర్‌ వల్లనైనా చిత్రానికి మంచి క్రేజ్‌ వస్తుందనే ఆలోచనలో దర్శకనిర్మాతలు ఉన్నారు. ప్రస్తుతం ప్రియా వారియర్‌ కోసం పలు భాషల నిర్మాతలు, దర్శకులు, హీరోలు క్యూ కడుతున్నారు. 

కాగా కళ్యాణ్‌దేవ్‌ సరసన నటించేందుకు ప్రియాని అడిగితే ఆమె ఏకంగా కోటి రూపాయల రెమ్యూనరేషన్‌ని డిమాండ్‌ చేసేసరికి దర్శక నిర్మాతలకు చుక్కలు కనిపించాయట. కేవలం స్టార్స్‌ చిత్రాలలోనే నటించాలనే ఉద్దేశ్యంతో ప్రియా ఉందని, కాబట్టి చిన్న హీరోలకు నో చెప్పకుండా ఆమె ఇలా పారితోషికం భారీగా చెప్పి తప్పించుకుంటుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అన్నట్లు ఇటీవల ప్రియా వారియర్‌ అఖిల్‌తో కలిసి ఓ యాడ్‌లో హల్‌చల్‌ చేసిన సంగతి తెలిసిందే. 


వినాయక్‌, బోయపాటి.. ఇంకెవరు బాలయ్యా?

Category : Uncategorized

ఒకవైపు ఎమ్మెల్యేగా, టిడిపి పార్టీకి స్టార్‌ క్యాంపెయినర్‌గా ఉంటూనే బాలయ్య వరుస చిత్రాలు చేస్తూ ఈ వయసులో యంగ్‌ హీరోలకు సైతం సవాల్‌ విసురుతున్నాడు. ప్రస్తుతం జరగనున్న తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్దులు నిలబడిన చోట, తన అన్నయ్య హరికృష్ణ తనయ సుహాసిని బరిలో ఉన్న కూకట్ పల్లి నియోజకవర్గంలో కూడా ఆయన జోరుగా ప్రచారం చేస్తాడని వార్తలు వస్తున్నాయి. మరోపక్క త్వరలో లోక్‌సభ ఎన్నికలు, దానితో పాటే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. బహుశా ఏప్రిల్‌, మేలలో ఎన్నికలు ఉంటాయని తెలుస్తోంది. అయినా బాలయ్య మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. బామ్మర్ది బామ్మర్దే.. పేకాట పేకాటే అన్నట్లుగా రాజకీయాలు రాజకీయాలే… సినిమాలు సినిమాలే అని నిరూపిస్తున్నాడు. 

‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ వంటి హిస్టారికల్‌ చిత్రాన్ని, అందునా తన వందో ప్రతిష్టాత్మక చిత్రాన్ని కూడా రెండు నెలల్లో పూర్తి చేసిన ఆయన తర్వాత ‘పైసావసూల్‌, జైసింహా’లను కూడా అంతే వేగంగా పూర్తి చేశాడు. ప్రస్తుతం తానే మొదటిసారి నిర్మాణ భాగస్వామ్యంలో తన తండ్రి ఎన్టీఆర్‌ బయోపిక్‌ని కూడా ఫుల్‌స్వింగ్‌లో పూర్తి చేస్తున్నాడు. సాధారణంగా బయోపిక్‌ అంటే లెక్కలేనన్ని  పాత్రలు, గెటప్‌లు ఉంటాయి అయినా ఎన్టీఆర్‌ బయోపిక్‌ని ‘కథానాయకుడు, మహానాయకుడు’గా ఆయన జనవరి కల్లా షూటింగ్‌ పూర్తి చేయనున్నాడట. మరోవైపు ఆయన తన తదుపరి రెండు చిత్రాలను లైన్‌లో పెట్టాడు. ఈ రెండింటి షూటింగ్‌ను సమాంతరంగా పూర్తి చేయాలని ఆయన నిర్ణయించుకున్నాడట. సి.కళ్యాణ్‌ నిర్మాణంలో ‘జైసింహా’ తర్వాత వినాయక్‌ డైరెక్షన్‌లో ఓ చిత్రం చేస్తున్నాడు. 

గతంలో వినాయక్‌తో బాలయ్య ‘చెన్నకేశవరెడ్డి’ చిత్రం చేశాడు. మరోవైపు గతంలో తనకి ‘సింహా, లెజెండ్‌’ వంటి బ్లాక్‌బస్టర్స్‌ ఇచ్చిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో హ్యాట్రిక్‌ చిత్రంగా ఓ చిత్రం చేయనున్నాడు. ఈ చిత్రాన్ని బాలయ్య, వారాహి చలన చిత్రం సంయుక్త భాగస్వామ్యంలో నిర్మించే అవకాశం ఉంది. వాస్తవానికి బాలయ్య వందో చిత్రాన్ని బోయపాటితో చేయాలని అభిమానుల నుంచి బాగా ఒత్తిడి వచ్చింది. ఆ కోరికను బాలయ్య ఇప్పుడు తీర్చనున్నాడు. ఇదే జోరు చూస్తుంటే బాలయ్య 150 చిత్రాలు చేయడం ఖాయమేమో అనే వ్యాఖ్యలు వినిపిస్తుండటం విశేషం.