హైదరాబాద్ నందు (బంజర హిల్స్, జూబిలీ హిల్స్, మాదాపూర్, కొండాపూర్ ) పరిసర ప్రాంతాల్లో పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ వెంటనే కావాలను. ఆర్మీ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేసి రిటైర్ అయినా వారికీ తగిన ప్రాధాన్యత ఇవ్వ బడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ + 91 8074965869

Monthly Archives: December 2018

ల‌క్కీ హీరోయిన్ చైతూకు హిట్టిచ్చేనా?

Category : Uncategorized

మ‌న ల‌క్కు బాగోన‌ప్పుడు ప‌క్క‌వారి ల‌క్కుమీద ఆధార‌ప‌డ‌టం అన్న‌ది కామ‌న్‌. ఆ ల‌క్కు చిక్కితే ఫేటు మారిన‌ట్టే. ఇదే సూత్రాన్నిస‌మంత త‌న భ‌ర్త నాగ‌చైత‌న్య కోసం వాడుతోంది. `యుద్ధం శ‌ర‌ణం` సినిమా నుంచి నిన్న‌టి `స‌వ్య‌సాచి` వ‌ర‌కు చైతూకు క‌లిసిరావ‌డం లేదు. అత‌న్ని ఈ మ‌ధ్య‌ వ‌రుస ఫ్లాపులు ప‌ల‌క‌రిస్తున్నాయి. దీంతో త‌న వ‌ల్లే చైతూకు హిట్టు రావ‌డం లేద‌ని అంతా భావిస్తార‌ని ఊహించిందో ఏమో తెలియ‌దు కానీ చైతూకు హిట్టు రావాలంటే ల‌క్కీ మ‌స్క‌ట‌ర్‌ను వాడాల్సిందే అన్న నిర్ణ‌యానికి స‌మంత వ‌చ్చేసింది. అందు కోసం ల‌క్కీ హీరోయిన్ నిత్యామీన‌న్‌ను రంగంలోకి దింపేసింద‌ట‌. 

`నిన్నుకోరి` ఫేమ్ శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో నాగ‌చైత‌న్య `మ‌జిలీ` పేరుతో ఓ సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా అండ‌ర్ ప్రొడ‌క్ష‌న్‌లో వుండ‌గానే యువీ బ్యాన‌ర్‌లో ఓ సినిమా చేయ‌డానికి రెడీ అయిపోతున్నాడు. మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న ఈ సినిమా కోసం స‌మంత త‌న భ‌ర్త నాగ‌చైత‌న్య‌కు జోడీగా నిత్యామీన‌న్ ను సెలెక్ట్‌ చేయాల‌ని యువీ వ‌ర్గాల‌ని ప‌ట్టుబ‌ట్టి మ‌రీ ఓకే చేయించింద‌ట‌. స‌మంత అంత‌గా నిత్యామీన‌న్ నే ఎంచుకోవ‌డానికి కార‌ణం నిత్య ట్రాక్ రికార్డేనని, ఆమె న‌టించిన ఏ సినిమా ఫ్లాప్ అయిన దాఖ‌లాలు లేక‌పోవ‌డం, పైగా సినిమా కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ కావ‌డం వ‌ల్లే నిత్య‌ను క‌థానాయిక‌గా ఖ‌రారు చేయించింద‌ని చెబుతున్నారు. వ‌రుస ఫ్లాపుల్లో వున్న చైతూకు నిత్యామీన‌న్ హిట్టిస్తుందేమో చూడాలి.


షాకింగ్: మహర్షి సెట్స్ నుంచి మహేష్ వాకౌట్

Category : Uncategorized

బహుశా మహేష్ బాబు కెరీర్ లో ఇప్పటివరకూ ఏ ఒక్క సినిమాకి కూడా “మహర్షి” సినిమాకి జరిగినంత హడావుడి కానీ.. ఈ సినిమా విషయంలో పుట్టుకొస్తున్నన్ని గాసిప్పులు కానీ రాలేదనుకుంటా. ఇప్పుడు ఈ సినిమా విషయంలో ఫిలిమ్ సిటీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్న తాజా వార్త ఏమిటంటే.. “మహర్షి” సెట్స్ నుంచి మహేష్ బాబు వాకౌట్ చేశాడని. అది కూడా తన తోటి ఆర్టిస్టులందరూ సెట్ లో వెయిట్ చేస్తుండగా మహేష్ సెట్స్ నుంచి సైలెంట్ గా వెళ్లిపోయాడట. అది కూడా డైరెక్టర్ కి ఇన్ఫార్మ్ చేయకుండా. 

ఇంతకీ విషయం ఏంటంటే.. మహేష్ బాబు నడుచుకుంటూ వచ్చే ఓ సన్నివేశాన్ని అప్పటికే ఒక పడిసార్లు రీటేక్ చేసిన వంశీ పైడిపల్లి అలా ఒకటికి రెండుసార్లు రిపీట్ చేయడంతో.. మహేష్ బాబు సహనం కోల్పోయాడట. అప్పటికీ చాలా రీటేక్స్ వరకు ఓపిగ్గా ఉన్న మహేష్ రీటేక్స్ సంఖ్య పెరగడం తప్ప.. చాలా చిన్న సన్నివేశం అయిన ఆ షాట్ ఎంతకీ ఫైనల్ అవ్వకపోవడంతో కాసేపు బ్రేక్ అడిగిన మహేష్.. క్యారీ వ్యాన్ నుంచి సైలెంట్ గా వెళ్లిపోయాడట. ఆ తర్వాత మహేష్ వెళ్ళిన విషయం తెలుసుకున్న వంశీ పైడిపల్లి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ప్యాకప్ చెప్పాడని తెలుస్తోంది. 

మరి ఈ విషయంలో నిజమెంత, అబద్ధమెంత అనేది తెలియదు కానీ.. “మహర్షి” సినిమా కోసం వెయిట్ చేస్తున్న మహేష్ అభిమానులు మాత్రం కాస్త నీరసించే అవకాశం ఉంది. ఏప్రిల్ 2019లో విడుదలకానున్న ఈ చిత్రంలో మహేష్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది.  


మురుగదాస్ కి రజనీ హ్యాండ్ ఇచ్చాడా?

Category : Uncategorized

“కబాలి, కాలా” లాంటి సినిమాలు దారుణంగా నిరాశపరిచినప్పటికే.. “2.0”తో రజనీ ఈజ్ బ్యాక్ అనిపించుకున్న సూపర్ స్టార్ ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో “పెట్ట” సినిమాలో నటిస్తూ యమ బిజీగా ఉన్నాడు. జనవరిలో విడుదలకానున్న ఈ చిత్రంపై రజనీకాంత్ మాత్రమే కాక ఆయన అభిమానులు కూడా భారీ అంచనాలు పెట్టుకొన్నారు. అందుకు కారణం దర్శకుడిగా కార్తీక్ సుబ్బరాజ్ మీద ప్రేక్షకులకి ఉన్న ధీమా. దానికి తోడు నిన్న అనిరుధ్ విడుదల చేసిన “మరణ మాస్” అనే సింగిల్ కే‌యూ‌డి‌ఏ మ్యూజిక్ లవర్స్ ని విశేషంగా ఆకట్టుకొంది.

ఈ సినిమా అనంతరం సన్ పిక్చర్స్ బ్యానర్ లోనే మురుగదాస్ దర్శకత్వంలో మరో చిత్రం సైన్ చేశాడు రజనీ. ఆల్రెడీ అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ ఇవ్వడమే కాక క్యాస్ట్ & క్రూ సెలక్షన్ కూడా జరిగిపోతోంది. కానీ.. రజనీ సడన్ గా పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు మన మురుగదాస్ కి. రానున్న ఎన్నికల్లో కీలకపాత్ర పోషించడమే కాక సొంత పార్టీని పేరు ప్రకటించి బలోపేతం చేసేందుకు రజనీ సన్నాహాలు మొదలెట్టాల్సి ఉండడంతో మురుగదాస్ సినిమాను వాయిదా వేయడమే లేక మొత్తానికి క్యాన్సిల్ చేయాలా అనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 

దాంతో.. “సర్కార్” కాస్త అటు ఇటు అయినా రజనీకాంత్ సినిమాకి దర్శకత్వం వహించే ఛాన్స్ వచ్చింది అని తెగ సంబరపడిపోయిన మురుగదాస్ ఈ విషయం తెలిసేసరికి కంగారుపడుతున్నాడట. మరి మురుగ పరిస్థితి ఏమిటో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. 


చేయనంటూనే ఐటెమ్ సాంగ్ సైన్ చేసిన అనసూయ

Category : Uncategorized

సినిమాల మీద పెద్దగా కాన్సన్ ట్రేట్ చేయకుండానే బుల్లితెరపై కనిపిస్తూనే సినిమాల్లోనూ భీభత్సమైన క్రేజ్ సంపాదించుకున్న యాంకర్ టర్నడ్ యాక్ట్రస్ అనసూయ మొన్నామధ్య “రంగస్థలం” చిత్రంలో రంగమ్మత్తగా నటించి నటిగానూ మంచి పేరు సంపాదించుకొంది. అయితే.. అంతకుముందు మాత్రం “సోగ్గాడే చిన్ని నాయన, విన్నర్” సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో మెరిసింది. ఆ తర్వాత కూడా ఆమెకు బోలెడన్ని ఐటెమ్ సాంగ్ ఆఫర్స్ వచ్చినప్పటికీ కాదనుకున్న అనసూయ.. లేటెస్ట్ గా ఓ ఐటెమ్ సాంగ్ కు అంగీకరించిందని తెలుస్తోంది. 

వెంకటేష్, వరుణ్ తేజ్ కథానాయకులుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “ఎఫ్ 2” చిత్రంలో ఆల్రెడీ తమన్నా, మెహరీన్ లు కథానాయికలుగా నటిస్తుండగా.. ఓ స్పెషల్ సాంగ్ కోసం అనసూయను సంప్రదించారట. తొలుత ఐటెమ్ సాంగ్ అనగానే వెనక్కి తగ్గిన అనసూయ.. అది వెంకీ-వరుణ్ ల కాంబినేషన్ లో అని తెలిసేసరికి ఒప్పేసుకొందట. 

ప్రస్తుతం అనసూయ ప్రధాన పాత్రలో “కథనం” అనే సినిమాతోపాటు మరో రెండు ప్రొజెక్ట్స్ పైప్ లైన్ లో ఉన్నాయి. టీవీ ప్రోగ్రామ్స్ లో యమ బిజీగా ఉంటున్న అనసూయ.. తన టీవీ షెడ్యూల్స్ కు ఎలాంటి ఇబ్బంది కలగకుండానే సినిమాలకు సమయాన్ని కేటాయిస్తుంది.


రాజమౌళి ట్వీట్ కోసం వెయిటింగ్ ఇక్కడ!!

Category : Uncategorized

2.O రిలీజ్‌ టైములో రాజమౌళి – శంకర్ ఒక్కొక్కరు నేను మీ ఫ్యాన్… నేను మీ ఫ్యాన్ అని తెగ హడావిడి చేశారు. సౌత్ ఇండియా లో టాప్ డైరెక్టర్స్ అనగానే మొదటి వీరి పేర్లే వినబడతాయి. అలాంటిది వీరి సినిమాలు వస్తున్నాయి అంటే తమ ఫ్యాన్సే కాదు సెలెబ్రెటీస్ కూడా వెయిట్ చేసి మరీ… ఎంత బిజీగా ఉన్నా సినిమాను చూస్తారు. 2.O సినిమా విడుదలకి ముందు రోజు చాలా ఎగ్జైటెడ్ గా వున్నానని చెప్పిన రాజమౌళి సినిమా విడుదలై మూడు రోజులు అవుతున్నా ఇంకా తన ఒపీనియన్ ని చెప్పలేదు.

ఎంత బిజీగా ఉన్నప్పటికీ…  సినిమాలు చూసి మరీ వాటి గురించి ట్వీట్ వేసే రాజమౌళి ఇంకా ఈసినిమా చూడకపోవటం ఏంటని ఆశర్యపోతున్నారు. ప్రస్తుతం రాజమౌళి RRR షూటింగ్ లో బిజీగా ఉండటంతో ఈసినిమా చూడలేకపోయాడని తెలుస్తుంది. ఇద్దరు స్టార్ హీరోస్ నటిస్తున్న చిత్రం కాబట్టి ఎక్కడా తేడా రాకుండా… కాల్షీట్స్ ని కేర్‌ఫుల్‌గా వాడుకుంటున్నాడు. ఈరోజు ఆదివారం కాబట్టి షూటింగ్ కి సెలవు ఉంటది కాబట్టి ఈరోజు జక్కన్న 2.O చూసే అవకాశముంది.

రాజమౌళి గనక సినిమా చూస్తే కచ్చితంగా తన అభిప్రాయంని చెబుతాడు. బాహుబలి చూసిన శంకర్ తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో చెప్పాడు.  అలానే రాజమౌళి కూడా 2.O ని చూసి ఏం చెప్తాడా అని తమిళ సినీ ప్రియులు, శంకర్‌ అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.


బోయపాటి… తందానె తందానె, ఫ్యామిలీలు పడ్డట్లేనా?

Category : Uncategorized

బోయపాటి ఎంతగా క్లాస్ టైటిల్స్ పెట్టినప్పటికీ.. అటు తిరిగి ఇటు తిరిగి సినిమాలో మాస్ అండ్ యాక్షన్ కే ఇంపార్టెన్స్ ఇచ్చాడనేది జయ జానకి నాయక లో అర్ధమైంది. తాజాగా రామ్ చరణ్ తో కూడా వినయ విధేయ రామ అంటూ టైటిల్ పెటాట్డు కానీ.. సినిమాలో ఊర మాస్ ఉందనేది వినయ విధేయరామ ఫస్ట్ లుక్ లోనే తేలిపోయింది. బోయపాటి ఎందుకు మారతాడు అంటూ… అందరూ రామ్ చరణ్ వినయ విధేయరామ కూడా పక్కా మాస్ మూవీ అని ఫిక్స్ అయ్యారు కూడా. అయితే బోయపాటి ఇపుడు వదులుతున్న లుక్స్ తో ప్రేక్షకులను పక్కదారి పట్టిస్తున్నాడనిపిస్తుంది. ఫస్ట్ లుక్ లోను, టీజర్ లోను రామ చరణ్ ని ఊర మాస్ గా చూపించిన బోయపాటి కార్తీక పౌర్ణమి రోజు రామ్ చరణ్ స్టైలిష్ అండ్ ట్రెడిషనల్ లుక్ ని వదిలాడు.

అలాగే తాజాగా రామ్ చరణ్ క్లాసీ లుక్ లో అమ్మాయిలతో సరదాగా గడుపుతున్న పిక్ ఒకటి.. ఇక నేడు సోమవారం ఫస్ట్ సింగిల్ పోస్టర్ తో సహా.. తాజాగా విడుదలైన తందానే.. తందానే అంటూ సాగే సాంగ్ ని కూడా రామ్ చరణ్ ఫ్యామిలీ అంటే.. అన్నా వదినలతో.. హీరోయిన్ కియారా అద్వానీ తో కలిసి మంచి ఫీల్ ఉండే సాంగ్ నే వదిలాడు. ఆ సాంగ్ మేకింగ్ మొత్తం ఫ్యామిలీ కే ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టుగా ఉంది. దీన్నిబట్టి బోయపాటి వినయ విధేయరామ తో క్లాస్ బిల్డప్ ఇస్తున్నాడనిపిస్తుంది. రామ్ చరణ్ కూల్ అండ్ స్టైలిష్ గా ఉన్న లుక్స్ తోనే ఫామిలీ ఆడియన్స్ ని అందరిని ఇంప్రెస్స్ చేసే ప్రయత్నాలు మొదలెట్టేసాడు.

మరి సాఫ్ట్ టైటిల్ తో మాస్ బిల్డప్ ఇచ్చిన బోయపాటిని మారలేదన్నారు. కానీ ఇప్పుడు వినయ విధేయరామ సాఫ్ట్ టైటిల్ కి తగ్గ లుక్స్ అండ్ సాంగ్ వదిలాడు. చూద్దాం బోయపాటి – రామ్ చరణ్ కాంబోలో వస్తున్న వినయ విధేయరామలో ఎన్ని యాక్షన్ సీన్స్ ఉంటాయో… అలాగే ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో అనేది ఆ సినిమా ట్రైలర్ వచ్చే వరకు ఆగితే సరిపోతుంది.


RRR కోసమేనా.. ఈ లుక్!!

Category : Uncategorized

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న RRR చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. నవంబర్ 19న ఈసినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈసినిమా కథ గురించి రోజుకొక రూమర్ వస్తున్నా… సినిమా బయటికి వచ్చేదాకా ఏది నమ్మలేం. ఇది ఇలా ఉండగా ఇందులో రామ్ చరణ్ చాలా రెగ్యులర్ లుక్ లో ఎన్టీఆర్ డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నాడని వార్తలు వచ్చాయి.

అరవింద సమేత సినిమా కోసం స్లిమ్ గా ఫిట్ గా సిక్స్ ప్యాక్ చూపించిన తారక్ ఇప్పుడు RRR కోసం న్యూ లుక్… అంటే భారీకాయుడిగా మారిపోయాడు. మొన్నటివరకు సన్నగా ఉన్న తారక్ ఈసినిమా కోసం లావు పెరిగాడట. సిక్స్ ప్యాక్ కోసం లాయిడ్ స్టీవెన్స్ అనే సెలబ్రిటీ ఫిట్నెస్ ట్రైనర్ సహాయం తీసుకున్నాడు తారక్. ఇప్పుడు అదే ట్రైనర్ సహాయం తీసుకుని హల్క్ అవతారం లోకి మారాడట.

గుబురు గడ్డం వేసుకుని ఉన్న తారక్ ఫొటోస్ రీసెంట్ గా బయటికి వచ్చాయి. మరి ఈ లుక్ లోనే ఎన్టీఆర్ RRR లో కనిపిస్తాడమేమో. అంటే ఫైనల్ గా ఎన్టీఆర్ RRR లుక్ ఇదే అని మనం ఫిక్స్ అవ్వోచ్చేమో. ఇకపోతే చరణ్ – తారక్ ల మధ్య ఒక భారీ యాక్షన్ బ్లాకును తెరకెక్కిస్తున్నాడు జక్కన్న. దాని కోసం ఒక స్పెషల్ సెట్ ను నిర్మించారు. తాజాగా రామ్ చరణ్ RRR ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్నాడని సమాచారం.


‘మహర్షి’ని ముంచేలా ఉన్నారుగా?

Category : Uncategorized

ఇద్దరు ముగ్గురు నిర్మాతలు ఒకే సినిమా చేస్తున్నారు అంటే… ఆ సినిమా ప్రొడక్షన్ విషయంలో కానివ్వండి, బిజినెస్ విషయంలో కానివ్వండి.. ముగ్గురు నిర్మాతలు ఒకే మాట మీద ఉండరు. ఎవరి మాట వారిదే ఉంటుంది. ఎవరి పంతాలు వాళ్ళవే. ఇదే విషయం మహర్షి విషయంలోనూ జరుగుతుంది. గత ఏడాది అశ్వినీదత్ సమర్పిస్తూ.. దిల్ రాజు నిర్మాతగా వంశి పైడిపల్లి దర్శకుడిగా ప్రారంభమైన మహేష్ 25 వ మహర్షి చిత్రం మొదలయ్యే నాటికీ ముగ్గురు నిర్మాతలు వచ్చి చేరారు. కేవలం సమర్పణతో సరిపెట్టుకుంటానన్న అశ్వినీదత్ నిర్మాతగా మారాడు. ఇక అక్కడే దిల్ రాజుగా అడ్జెస్ట్ అయ్యాడు. కానీ సినిమా మొదలయ్యే సమయానికి పీవీపీ బలవంతంగా మహర్షి నిర్మాణంలోకి వచ్చాడు.

ఇక చేసేది లేక దిల్ రాజు, అశ్వినీదత్ తోనూ, పీవీపీతోనూ సర్దుకుపోవాల్సి వచ్చింది. అయితే సినిమా నిర్మాణంలో మాత్రం ఎంతో పక్కాగా ఉంటున్న ఈ ముగ్గురికి ఆ సినిమా బిజినెస్  విషయంలో తేడాలొస్తున్నట్టుగా ఫిలింసర్కిల్స్ లోను, ఫిలిం నగర్ సాక్షిగా గుసగుసలు మొదలయ్యాయి. ముగ్గురు టాప్ మోస్ట్ నిర్మాతలు కావడంతో.. మహర్షి బిజినెస్ విషయంలో ఎవ్వరూ కాంప్రమైజ్ కావడం లేదంటున్నారు. ఏ నిర్మాత డెసిషన్ తీసుకోవాలన్న మిగతా ఇద్దరినీ కనుక్కుని తీసుకోవాల్సి రావడం, ఒక నిర్మాతకి నచ్చిన డీల్ ఇద్దరు నిర్మాతలకు నచ్చకపోవడం వంటివి జరుగుతున్నాయట.

ఇంతకుముందు మహర్షి హిందీ హక్కుల విషయంలో ఇలానే దిల్ రాజు డీల్ కి పీవీపీ, అశ్వినీదత్ లు అడ్డు చెప్పారని… తాజాగా మహర్షి ఓవర్సీస్ హక్కుల విషయంలో సేమ్ సీన్ రిపీట్ అవుతుందంటున్నారు. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ ఒకరు మహర్షి కోసం ఇచ్చిన 16 కోట్ల  ఆఫర్ దిల్ రాజుకు నచ్చిన మిగతా ఎవరికి నచ్చకపోవడంతో నో చెప్పాల్సి వచ్చిందని… ఏప్రిల్ లో విడుదలయ్యే సినిమాకి ఇప్పటినుండే ఓవర్సీస్ హక్కులను అమ్మడం ఎందుకు ఇంకాస్త ఆగితే మరింత రేటు వస్తుందని.. అశ్వినీదత్, పీవీపీలు చెబుతున్నారట. ఇక మహర్షి బిజినెస్స్ విషయంలో దిల్ రాజు ఏది చేసినా మిగతా ఇద్దరు  నో చెబుతున్నారని టాక్ మాత్రం ఫిలింసర్కిల్స్ లో నడుస్తుంది. 


ఈ దెబ్బతో ఎవరి స్టామినా ఏంటో తెలిసిపొద్ది?

Category : Uncategorized

మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న చిత్రం ‘సైరా’. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా యొక్క టీజర్‌కు రీసెంట్ గా మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. దాంతో ఈసినిమాపై అంచనాలు భారీగా ఏర్పడాయి. దీనికి రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. స్వాతంత్ర్య సమరయోధుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితచరిత్ర ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది.

ఈనేపధ్యంలో ఈసినిమాను వచ్చే ఏడాది  ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం రోజు విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడు రామ్ చరణ్. దీనికనుగుణంగా పనులు కూడా చకచక చేస్తునట్టు టాక్. ఇది ఇలా ఉండగా యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో.. ‘బాహుబలి’ తరువాత ప్రభాస్ చేస్తున్న చిత్రం ‘సాహో’ యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతుంది.

ఈ సినిమాని కూడా అదే రోజు అంటే ఆగస్టు 15వ తేదీన విడుదల చేయాలని భావిస్తున్నారట. ఇదే కనుక నిజం అయితే బాక్సాఫీస్ వద్ద పోటీ మాములుగా ఉండదు. ‘బాహుబలి’ సిరీస్ తో ప్రభాస్ తన మార్కెట్ ను ఇండియా వైడ్  ఓపెన్ చేసాడు. సాహో హిందీ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు. దీనిపై అంచనాలు అయితే ఒక రేంజ్ లో ఉన్నాయి. చిరంజీవి ఖైదీ నెంబర్ 150 తో రీఎంట్రీ ఇచ్చి బాక్సాఫీస్ వద్ద తన స్టామినా ఏంటో నిరూపించుకున్నాడు. సో ఈసినిమాపై కూడా అంచనాలు ఉన్నాయి. సో.. ఆగస్టు 15 న ఇద్దరికి పోటీ తప్పేలా లేదు. పోటీ ఎందుకులే అని ఇద్దరిలో నుండి ఎవరన్నా వెనక్కి తగ్గుతారేమో చూడాలి.


కూడబలుక్కుని రేటింగ్ ఇచ్చినట్టున్నారు..!

Category : Uncategorized

శంకర్ – రజినీకాంత్ కాంబోలో తెరకెక్కిన రోబో సీక్వెల్ 2.ఓ చిత్రం గురువారం ప్రపంచవ్యాప్తంగా 10000 కి పైగా స్ర్కీన్లలో విడుదలైంది. 2.ఓ విడుదలైన మొదటి షోకే పాజిటివ్ టాక్ పడింది. ప్రేక్షకులు తలో ఒక మాట చెప్పినప్పటికీ.. 2.ఓ సినిమా ఓవరాల్ గా బావుందని టాక్ ఈవెనింగ్ కి స్ప్రెడ్ అయ్యింది. శంకర్ ఈ సినిమాని విజువల్ వండర్ గా తీర్చిదిద్దాడని అన్నారు. ఈ సినిమాలో లూజ్ పాయింట్స్ ఎన్ని అయితే ఉన్నాయో…. ప్లస్ పాయింట్స్ కూడా అన్నే ఉన్నాయి. భారీ అంచనాల నడుమ భారీగా విడుదలైన 2.ఓ చిత్రంలో రజినీకాంత్ నటన, అక్షయ్ కుమార్ నటన అలాగే రజిని – అక్షయ్ మధ్యన వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్ అన్ని అదుర్స్ అనే రేంజ్ లో ఉండడమే కాదు.. ఏఆర్ రెహ్మాన్ అందించిన నేపధ్య సంగీతం కూడా 2.ఓ ని ఉన్నత శిఖరాన నిలిపాయనడంలో సందేహమే లేదు.

అలాగే నీరవ్ షా సినిమాటోగ్రఫీ అయితే సినిమా మొత్తానికే హైలెట్ అనేలా ఉంది. ఇక ఫుడ్ బాల్‌ స్టేడియంలో సెట్‌ చేసిన క్లైమాక్స్ సన్నివేశాలైతే సినిమాకే ఆయువు పట్టు. హాలీవుడ్ రేంజ్ గ్రాఫిక్స్ కూడా ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ కాగా… నిర్మాతలు పెట్టిన ప్రతి రూపాయి… ప్రతి సీన్ లోని భారీ తనంతో కట్టిపడేసింది. ఇక కేవలం ఈ సినిమాకి విజువల్ ఎఫెక్ట్స్ మాత్రమే ఉంటే సరిపోదు.. సగటు ప్రేక్షకుడికి కథ కూడా అవసరమే అనేలా ఉంది 2.ఓ పరిస్థితి. మరి ఎప్పుడూ కథకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చిన శంకర్ ఈసారి మాత్రం 2.ఓ లో కథ కన్నా ఎక్కువగా విజువల్ ఎఫెక్ట్స్ కే ఇంపార్టెన్స్ ఇచ్చాడనిపిస్తుంది. స్క్రీన్ ప్లే లో కూడా శంకర్ మార్క్ కనబడలేదు. రజినీకాంత్ స్టార్ డం కి లోబడి కొన్ని సీన్స్ ని శంకర్ రాసుకున్నాడా అనిపిస్తుంది. అలాగే చాలా సీన్స్ లాగింగ్ అనిపిస్తాయి. 

2.ఓ సినిమా మొత్తం చాలా సీరియస్ గా సాగుతూ ఉండటం వల్ల.. ఎంటర్టైన్మెంట్ కోరుకునే ప్రేక్షకులు కొంత బోర్ ఫీల్ అవుతారు. ఇక ఎడిటింగ్ లో కూడా చాలా కత్తెర్లు పడాల్సింది. వ‌శీక‌ర్‌లో ప‌క్షిరాజు ఆత్మ చేరిన త‌ర‌వాత‌.. కొన్ని సీన్లు క‌త్తిరించార‌న్న‌ది స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతుంది. రోబోలో కామెడీ, ఎమోషన్, రొమాన్స్, ప్రేమానుబంధాలు అన్ని ఆకట్టుకుంటే.. ఈ 2.ఓ లో మాత్రం అవేం మచ్చుకైనా కనబడవు. మరి ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ తో సమానంగా మైనస్ లు ఉన్నప్పటికీ….ఈ సినిమాకి రివ్యూ రైటర్స్ మాత్రం.. అందరు కలిసి ఒకే రేటింగ్ ఇద్దామనుకున్నారో  ఏమో తెలియదు కానీ… అందరూ కలిసి కట్టుగా ఓవరాల్ గా 3 పైన రేటింగ్స్ ఇచ్చేసి శంకర్ ని రజినీకాంత్ ని గట్టెక్కించేసారు.