హైదరాబాద్ నందు (బంజర హిల్స్, జూబిలీ హిల్స్, మాదాపూర్, కొండాపూర్ ) పరిసర ప్రాంతాల్లో పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ వెంటనే కావాలను. ఆర్మీ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేసి రిటైర్ అయినా వారికీ తగిన ప్రాధాన్యత ఇవ్వ బడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ + 91 8074965869

Monthly Archives: January 2019

హైపర్ ఆది అక్కడ హిట్.. ఇక్కడ ఫట్!

Category : Uncategorized

బుల్లితెర మీద జబర్దస్త్ ప్రోగ్రాం ద్వారా చాలామంది కమెడియన్స్ వెండితెర మీద వెలిగిపోతున్నారు. ఈటివిలో ప్రసారం అయ్యే జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ ద్వారా చాలామంది కమెడియన్స్ బాగా పాపులర్ అయ్యారు. అటు ఆస్తులు, ఇటు ఛాన్స్ లతో వారు ఒక వెలుగు వెలుగుతున్నారు. సుడిగాలి సుధీర్, చంటి, శ్రీను వంటి వాళ్ళు బుల్లితెర మీద అనేక రకాల షోస్ తో పాపులర్ అయ్యారు. ఇక చమ్మక్ చంద్ర లాంటి వాళ్ళు వెండితెర మీద కామెడీ చేస్తున్నారు. ఇక హైపర్ ఆది వంటి వాళ్ళు జబర్దస్త్ లో స్క్రిప్ట్ రైటర్స్ గాను, స్టేజ్ మీద కమెడియన్ గానే కాదు.. వెండితెర మీద కూడా కామెడీ చేస్తూ తమ సత్తా చాటుతున్నారు.

జబర్దస్త్ లో హైపర్ ఆది స్కిట్ అంటే పడి చచ్చే ప్రేక్షకులు చాలామంది ఉన్నారు. స్కిట్ లో అదరగొట్టే పంచ్ లతో ప్రేక్షకులను పడెయ్యడం.. కాస్త డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో షేక్ చెయ్యడంతో ఆది జబర్దస్త్ స్టేజ్ మీద బాగా పాపులర్ అయ్యాడు. కానీ వెండితెర మీద మాత్రం అంతగా పేరు తెచ్చుకున్నట్లుగా అనిపించడం లేదు. ఎందుకంటే అల్లరి నరేష్ తో మేడ మీద అబ్బాయి సినిమాకి కథ అందించిన ఆది ఆ సినిమాలో నరేష్ ఫ్రెండ్ గా, కమెడియన్ గా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. అలాగే తొలిప్రేమ సినిమాలో యుఎస్ లో వరుణ్ రూమ్మేట్ గా ఆది పంచ్ లు పెద్దగా పేలలేదు. 

ఇకపోతే తాజాగా హైపర్ ఆది నటించిన మిస్టర్ మజ్ను కూడా ప్లాప్ అవడం.. అందులో హైపర్ ఆది కామెడిని ప్రేక్షకులు పెద్దగా ఎంజాయ్ చేయలేకపోతున్నారు. ఇక గత రెండు నెలలుగా జబర్దస్త్ కి దూరమైన హైపర్ ఆది మళ్ళీ జబర్దస్త్ స్టేజ్ మీద రీఎంట్రీ ఇవ్వడం… మళ్ళీ స్కిట్ ని అదరగొట్టెయ్యడంతో.. హైపర్ ఆది.. బుల్లితెర మీదే కానీ.. వెండితెర మీద తుస్సే అంటున్నారు. ఇక మరోపక్క ఆది పవన్ కళ్యాణ్ జనసేన కోసం రాజకీయాల్లోనూ కాస్త బిజీగా కనబడుతున్నాడు.


ఫ్లాప్ హీరోకి లైఫ్ ఇస్తున్న దిల్ రాజు

Category : Uncategorized

అగ్ర నిర్మాత దిల్ రాజుకి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది. అదేంటంటే.. తన బ్యానర్ లో సినిమా తీసి ఫ్లాప్ కొట్టిన హీరోకి కానీ డైరెక్టర్ కి కానీ మరో సినిమాతో హిట్ ఇచ్చేవరకూ వదిలిపెట్టడు. తన బ్యానర్ లో నటించిన హీరోహీరోయిన్లు. దర్శకులు కనీసం మూడు సినిమాలు చేయాలని అగ్రిమెంట్ చేసుకొనే దిల్ రాజు.. తాజాగా తన బ్యానర్ లో రాజ్ తరుణ్ హీరోగా ఒక సినిమా ప్రోడ్యూస్ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఆల్రెడీ దిల్ రాజు ఈ యంగ్ హీరోతో లవర్ అనే సినిమా తీసి డిజాస్టర్ అందుకున్నాడు. ఈ రిజల్ట్ ను తాను ముందే గెస్ చేశానని దిల్ రాజు స్వయంగా ప్రకటించుకోవడం కొసమెరుపు అనుకోండి. 

సో, తన బ్యానర్ లో ఫ్లాప్ కొట్టిన హీరోకి హిట్ ఇవ్వాలని నిశ్చయించుకున్నాడో ఏమో కానీ రాజ్ తరుణ్ తో మరో ప్రొజెక్ట్ ను త్వరలోనే సెట్స్ మీదకు తీసుకొస్తున్నాడు దిల్ రాజు. ఆర్కే అనే యువ ప్రతిభాశాలిని దర్శకుడిగా పరిచయం చేస్తూ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. నిజానికి ఈ దర్శకుడి దర్శకత్వంలో మంత్రి  జయదేవ్ గల్లా తనయుడు అశోక్ గల్లా హీరోగా ఒక సినిమా మొదలెట్టాడు దిల్ రాజు. కారణాంతరాల వలన ఆ ప్రొజెక్ట్ ప్రారంభోత్సవంతోనే ఆగిపోయింది. దాంతో ఇప్పుడు అదే స్క్రిప్ట్ ను రాజ్ తరుణ్ తో తెరకెక్కిస్తున్నాడు దిల్ రాజు. 

ఈ ఏడాది ఆల్రెడీ “ఎఫ్ 2″తో సూపర్ హిట్ అందుకున్న దిల్ రాజు 2019ని తనకు అనుకూలంగా మార్చుకుంటున్నాడు. మహేష్ తో తెరకెక్కిస్తున్న సినిమా ఏప్రిల్ లో విడుదలవుతుండగా.. ఈ ఏడాదిలో ఎట్టి పరిస్థితుల్లోనూ కనీసం అయిదు సినిమాలు విడుదల చేయాలని ఫిక్స్ అయ్యాడట.


వీవీఆర్ కంటే.. కథానాయకుడికే నష్టం ఎక్కువ!

Category : Uncategorized

మంచి సినిమాలు వేరు.. కమర్షియల్‌ హిట్స్‌ వేరు అనేది జగమెరిగిన సత్యం. షకీలా, సన్నిలియోన్‌లు నటించే చిత్రాలు అతి తక్కువ బడ్జెట్‌లో సాఫ్ట్‌పోర్న్‌ చిత్రాలుగా రూపొంది, పెట్టుబడికి పదింతలు లాభాలు తీసుకుని రావచ్చు. గతంలో షకీలా చిత్రాలు దానిని నిరూపించాయి. షకీలా చిత్రం విడుదల అవుతోందంటే మలయాళ స్టార్స్‌ కూడా తమ చిత్రాల రిలీజ్‌ డేట్స్‌ని మార్చుకునేవారు. కానీ కె.విశ్వనాథ్‌ వంటి వారు తీసే కళాత్మక చిత్రాలు కమర్షియల్‌గా పెద్దగా ఆడనంత మాత్రాన వాటికంటే షకీలా చిత్రమే బాగుందని, మంచి చిత్రమని అనుకోకూడదు. 

ఇక సోషల్‌ మీడియా విస్తారం అయిన తర్వాత సినిమాలపై విమర్శకుల అభిప్రాయాలు, పాజిటివ్‌ రివ్యూలు, రేటింగ్‌లపై ఇండస్ట్రీ పెద్దలు మండిపడుతున్నారు. కానీ రివ్యూలు, పాజిటివ్‌ టాక్‌, రివ్యూల రేటింగ్స్‌ కొత్తదనం, సినిమాని ఎంత బాగా తీశారనే పాయింట్‌ మీదనే ఇస్తారని, అది సాధించబోయే కలెక్షన్లు, టాక్‌కి సంబంధం ఉండదనేది వాస్తవం. ఇక తాజాగా ఈ విషయం మరోసారి రుజువైంది. 

ఎన్టీఆర్‌ బయోపిక్‌ మొదటి పార్ట్‌ ‘కథానాయకుడు’కి పాజిటివ్‌ టాక్‌, మంచి రివ్యూలు, రేటింగ్స్‌ వచ్చాయి. అదే ‘వినయ విధేయ రామ’కి బ్యాడ్‌ ఫీడ్‌బ్యాక్‌, పూర్‌ రేటింగ్స్‌లు, తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తాయి. కానీ బాక్సాఫీస్‌ వద్ద మాత్రం ‘వినయ విధేయ రామ’ టాక్‌, రివ్యూలతో సంబంధం లేకుండా 60కోట్లు రాబట్టింది. నష్టం కేవలం 30 కోట్లకి అటు ఇటుగా వచ్చింది. ‘కథానాయకుడు’కి మంచి రివ్యూలు వచ్చినా 70కోట్లకు గాను 20కోట్లు కష్టపడి వచ్చాయి. 50కోట్ల నష్టం వచ్చింది. మరి దీనిని బట్టి విషయం స్పష్టంగా అర్ధమవుతోంది. 

‘కథానాయకుడు’ విషయానికి వస్తే ఈ చిత్ర నిర్మాణ భాగస్వాములలో వారాహిచలన చిత్రం అధినేత సాయికొర్రపాటి ఒకరు. ఇటీవలే ‘కేజీఎఫ్‌’ ద్వారా ఈయనకు మంచి లాభాలు వచ్చాయి ‘కథానాయకుడు’కి భారీస్థాయిలో ప్రీరిలీజ్‌ బిజినెస్‌ జరగడంతో విడుదలకు ముందే దాదాపు 5కోట్ల లాభం తన వంతుగా వచ్చింది. దీనికితోడు ‘కథానాయకుడు’ బాగా ఆడుతుందని, ఫలితంగా మరిన్ని లాభాలు వస్తాయని భావించిన ఆయన ఈ మూవీని రెండు ఏరియాలలో విడుదల చేశాడు.దీనివల్ల ఆయనకు 8కోట్ల నష్టం వచ్చింది. 

అంటే లాభం పోను ఈయనకు ఫైనల్‌గా మూడు కోట్ల నష్టం వచ్చింది. దాంతో ‘మహానాయకుడు’ని ఉచితంగా ఇస్తుండటంతో దాని ద్వారా అయినా తన నష్టాలు పూడుతాయనే ఆశతో సాయికొర్రపాటి ఉన్నాడు. 


ఈ విషయంలో అల్లుఅర్జున్‌ని కొట్టేవారే లేరు

Category : Uncategorized

పొరుగింటి పుల్లకూర రుచి.. అనే సామెత నిజంగా అక్షరసత్యం. మనం ఇంతకాలం బాలీవుడ్‌లో వస్తున్న విభిన్న చిత్రాలు, ‘దంగల్‌, సీక్రెట్‌ సూపర్‌స్టార్‌’ వంటివి మన భాషలో ఎందుకు రావని బాధపడేవారం. ఇక తమిళం, మలయాళం, కన్నడ భాషలో వచ్చే ప్రయోగాత్మక చిత్రాలు, అవార్డు సినిమాలు మన వారు తీయలేకపోతున్నారని బాధపడుతున్నాం. కానీ అదేమి విచిత్రమో గానీ ఇటీవల పక్కా మాస్‌, యాక్షన్‌ చిత్రాలు, మనం రొంపకొట్టుడు పక్కా మాస్‌ చిత్రాలు అని విమర్శించే వాటిని ఇతర భాషల వారు శాటిలైట్‌, యూట్యూబ్‌, డిజిటల్‌ ఫార్మాట్స్‌లో బ్రహ్మరథం పడుతున్నారు. 

దీనికి ఉదాహరణ తెలుగులో సరిగా ఆడని పక్కాకమర్షియల్‌, హైఓల్టేజ్‌ యాక్షన్‌, భారీ చిత్రాలు మలయాళంలో అద్భుత విజయాలు సాధిస్తున్నాయి. ఇలాంటి చిత్రాల ద్వారానే స్టైలిష్‌స్టార్‌ అల్లుఅర్జున్‌ అంటే మలయాళీలు పడి చచ్చిపోతూ ఉండటమే కాదు.. ఆయనను మల్లూ అర్జున్‌ అని పిలుచుకుంటున్నారు. ఆయన డబ్బింగ్‌ చిత్రం మలయాళంలో విడుదల అవుతోందంటే అక్కడి స్ట్రెయిట్‌ చిత్రాల వారు కూడా భయపడుతుంటారు. 

తెలుగు చిత్రాలకు తమిళ, కన్నడ రాష్ట్రాలలో కూడా ఎంతో ఆదరణ లభిస్తోంది. ఇక ‘బాహుబలి’ తర్వాత తెలుగు చిత్రాలపై బాలీవుడ్‌ కన్నుకూడా పడింది. దీనికి ఉదాహరణ.. పక్కా రొటీన్‌ చిత్రాలుగా భావించిన బన్నీ ‘సరైనోడు, దువ్వాడజగన్నాధం(డిజె)’లు. ‘సరైనోడు’ చిత్రం యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేస్తే 25 మిలియన్ల వ్యూస్‌ వచ్చాయి.

ఇక తాజాగా ‘డిజె’ హిందీ వెర్షన్ ‌‘డిజె’ను దిల్‌రాజు తన అధికార యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేస్తే ఇప్పటివరకు 50మిలియన్ల వ్యూస్‌ని సాధించింది. ఈ చిత్రాన్ని గోల్డ్‌మైన్‌ టెలిఫిలిమ్స్‌ వారు తమ అధికార యూట్యూబ్‌లో పెడితే, 72 మిలియన్లకు పైగా వ్యూస్‌ వచ్చాయి. ఈ ఘనత సాధించిన తొలి తెలుగు చిత్రం ఇదే కావడం విశేషం.


డిజాస్టర్ దిశగా మిస్టర్ మజ్ను

Category : Uncategorized

అఖిల్ తాను నటిస్తున్న సినిమాలను సరిగా విడుదల చేయించుకోవడంలో శ్రద్ధ చూపడం లేదో లేక తనకు సినిమాలు అచ్చిరావడం లేదో లేక పరిచయ చిత్రం మొదలుకొని మొన్న విడుదలైన మిస్టర్ మజ్ను వరకూ అన్నీ ఫ్లాప్ సినిమాలుగానే మిగిలిపోతున్నాయి. అఖిల్ లాంటి డిజాస్టర్ సినిమా కూడా మొదటి రోజు 7 కోట్లు వసూలు చేసింది, ఇక హలోకి పాజిటివ్ రిపోర్ట్ వచ్చినా కూడా నానితో పోటీపడడం వల్ల కమర్షియల్ ఫ్లాప్ గా మిగిలిపోయింది. ఇక మూడో చిత్రం మిస్టర్ మజ్నుకి సోలో రిలీజ్ దొరికినప్పటికీ.. అఖిల్ టైమ్ బాగోకపోవడం వల్ల లాంగ్ వీకెండ్ లో కూడా వరల్డ్ వైడ్ గా కనీసం 10 కోట్ల రూపాయలు కూడా వసూలు చేయలేకపోయింది. ఓవర్సీస్ లో ఈ చిత్రాన్ని 3 కోట్ల రూపాయలకు కొనగా ఇప్పటివరకూ కనీసం పావు వంతు కూడా రాబట్టలేకపోవడంతో అక్కడ ఆల్రెడీ డిజాస్టర్ గా డిక్లేర్ చేసేశారు. 

ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంచుమించుగా అదే పరిస్థితి కనిపిస్తోంది. 22 కోట్ల రూపాయల ప్రీరిలీజ్ బిజినస్ జరగగా.. ఇప్పటివరకూ కనీసం సగం కూడా రాలేదు. ఇకపై వస్తుందన్న నమ్మకం కూడా లేదు. ఆల్రెడీ ప్రమోషన్స్ అంటూ టీం మెంబర్స్ అందరూ థియేటర్ విజిటింగ్స్ మొదలెట్టినప్పటికీ.. ఆడియన్స్ పెద్దగా పట్టించుకోవడం లేదు. 

దాంతో నాగార్జున ఇమ్మీడియట్ గా అఖిల్ నాలుగో సినిమాను ప్లాన్ చేయడంపై దృష్టి సారించాడు. నాగచైతన్య తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్ కాకపోయినా కనీసం నటుడిగా గుర్తింపైనా సంపాదించుకున్నాడు. అఖిల్ కి మాత్రం ఇప్పటివరకూ ఎంత భారీగా ప్లాన్ చేసినా ఏదీ వర్కవుట్ అవ్వడం లేదు. అందుకే ఈసారి ప్రేమకథ కాకుండా ఏదైనా మాస్ సబ్జెక్ట్ ప్లాన్ చేస్తున్నాడు నాగార్జున. ఎలాగూ ఫైట్స్ లో అఖిల్ కి స్పెషల్ ట్రయినింగ్ ఉంది కాబట్టి.. దాన్ని బేస్ చేసుకొని ఒక యాక్షన్ ఫిలిమ్ ను తెరకెక్కించి అఖిల్ ను హీరోగా సెటిల్ చేసే పనిలో పడ్డాడు నాగ్.


లవర్స్ డే‌కి ‘దేవ్’ ట్రీట్..!

Category : Uncategorized

ఫిబ్రవరి 14న విడుదల కానున్న కార్తీ, రకుల్ ప్రీత్ సింగ్‌ల ‘దేవ్’ చిత్రం..!!

కార్తీ, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న ‘దేవ్’ చిత్రం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల కానుంది.  సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14న విడుదలైన ఆడియోకి విశేష స్పందన లభించగా, హారిస్ జయరాజ్ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు. యాక్షన్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి రజత్‌ రవిశంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ‘ఖాకీ’ లాంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ కార్తీ కలయికలో వస్తున్నచిత్రమిది. ప్రకాష్ రాజ్,  రమ్యకృష్ణ పవర్ ఫుల్ రోల్స్ లో నటిస్తుండగా, నిక్కీ గల్రాని మరో కథానాయికగా నటిస్తుంది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకోగా, తెలుగు, తమిళ భాషల్లో ఒకే సమయంలో సినిమా విడుదల అవుతుంది. ప్రిన్స్‌ పిక్చర్స్‌ బ్యానర్‌‌పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు హక్కులను ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు దక్కించుకోగా రిలయన్స్ ఎంటర్‌టైన్మెంట్ సమర్పణలో ప్రేక్షకుల ముందుకు రానుంది.  

 

నటీనటులు: కార్తీ, రకుల్ ప్రీత్ సింగ్, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, నిక్కీ గల్రాని, కార్తీక్ ముత్తురామన్, ఆర్.జె.విగ్నేష్, రేణుక, అమృత, వంశీ, జయకుమార్ తదితరులు

సాంకేతిక నిపుణులు :

దర్శకుడు: రజత్ రవిశంకర్

నిర్మాతలు: ఎస్ లక్ష్మణ్ కుమార్, ఠాగూర్ మధు

బ్యానర్లు: ప్రిన్స్ పిక్చర్స్, లైట్ హౌస్ మూవీ మేకర్స్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్

సమర్పణ :  రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్

సంగీతం: హారిస్ జయరాజ్

సినిమాటోగ్రఫీ: ఆర్ వేల్ రాజ్

ఆర్ట్ : రాజీవన్

ఎడిటర్: రూబెన్

విఎఫ్‌ఎక్స్: హరిహరసుధన్

పి.ఆర్.ఓ : వంశీ – శేఖర్


షాక్‌లో ‘మహర్షి’ టీమ్.. కీలక సన్నివేశం లీక్!

Category : Uncategorized

మహేష్ – వంశీ పైడిపల్లి కాంబోలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘మహర్షి’ సినిమా షూటింగ్ షెడ్యూల్ తాజాగా పొల్లాచ్చిలో పూర్తి చేసుకుంది. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో అల్లరి నరేష్ కీలకపాత్రలో మహేష్‌కి ఫ్రెండ్ గా నటిస్తున్నాడు. ఈ సినిమాలో మహేష్ ఒక బడా కంపెనీ సీయివో గాను.. కార్పోరేట్ అధిపతిగా యూఎస్ నుండి తిరిగివచ్చి వ్యవసాయంలో రైతులకు సరికొత్త విధానాన్ని అందించే పాత్రలో కనిపించబోతున్నాడనే  ప్రచారం జరుగుతుంది. తాజాగా మహర్షిలోని కొన్ని కీలక సన్నివేశాలు ఇప్పుడు ఇంటర్నెట్ లో లీకై సెన్సేషనల్ గా వైరల్ అయ్యాయి.

పొలాచ్చిలో పల్లెటూరి వాతావరణంలో పంట పొలాల మధ్య ఉన్న మహేష్.. మీడియాతో మాట్లాడుతూ ఉన్న షూటింగ్ ఫొటోతో పాటుగా.. ఒక వీడియో కూడా ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది.  ఓ సీన్ షూట్‌ చేస్తున్న వీడియో కూడా ఆన్‌లైన్‌లో లీకైంది. పల్లెటూరి ప్రాంతంలో షూటింగ్ జరుపుతుండడంతో మహేష్ ని చూసేందుకు జనాలు ఎగబడ్డారు. అయితే ఆ గుంపులో నుంచి ఓ వ్యక్తి షూటింగ్‌ సన్నివేశాలను వీడియో తీసి ఫొటోస్ రూపంలోనూ ఆ వీడియో ని కూడా నెట్ లో పెట్టేసినట్లుగా తెలుస్తుంది. మరి ఎంతో కీలకమైన సన్నివేశాలు ఇలా ఇంటర్నెట్ లో రావడం చూసిన మహర్షి టీం షాకైందట. 

అయితే ఎప్పటికప్పుడు భారీ బడ్జెట్ సినిమాల విషయంలో ఇలాంటివి లీకేజ్ విషయాలు తరుచు జరుగుతూనే ఉన్నాయి. సెట్ లో సెల్ ఫోన్స్ అనుమతి లేకపోయినా.. కొన్నిసార్లు హీరోల అభిమానులే ఇలా తమ అభిమాన హీరో సినిమా షూటింగ్ ని సెల్ ఫోన్ లో బందించి లీక్ చేసేస్తున్నారు. ప్రస్తుతం ఈ లీకేజ్ పై మహర్షి టీం టెంక్షన్ తో పాటుగా గుర్రుగా ఉందని తెలుస్తుంది. 


ఈ2మ‌న‌సులు టీజ‌ర్ వదిలారు

Category : Uncategorized

శేఖ‌ర్ మూవీస్ బ్యాన‌ర్ పై చంద్ర‌శేఖ‌ర్ ఎస్‌.నిర్మించిన చిత్రం ఈ 2మ‌న‌సులు. ఆది పినిశెట్టి ద‌ర్శ‌కత్వంలో రూపొందిన ఈ చిత్రం ల‌వ్ అండ్ ఫ్యామిలీ సెంటిమెంట్‌తో తెర‌కెక్కుతుంది. ర‌విచంద్ర‌, సుమ‌య క‌థానాయ‌కులుగా ప‌రిచ‌మ‌వుతున్నారు. ఈ చిత్ర  షూటింగ్ 70శాతం  పూర్తిచేసుకుంది. చివ‌రి షెడ్యూల్‌ ఫిబ్ర‌వ‌రిలో పూర్తి చేసుకుని స‌మ్మ‌ర్‌లో ఈ 2 మ‌న‌సులు కూల్‌గా మీ ముందుకు రానుంది. ఈ సంద‌ర్భంగా శ‌నివారం ఫిలింఛాంబ‌ర్‌లో టీజ‌ర్ మ‌రియు సాంగ్‌ను విడుద‌ల చేశారు. విలేక‌రుల స‌మావేశంలో చిత్ర ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ… ఈ సినిమాలో నాత‌మ్ముడు స‌త్య నాకు చాలా హెల్ప్ చేశారు. స్ర్కిప్ట్ విష‌యంలో చాలా స‌పోర్ట్ చేశారు. మ‌మ్మ‌ల్ని న‌మ్మి మాకు ఈ అవ‌కాశం ఇచ్చిన మా ప్రొడ్యూస‌ర్‌ గారికి మేము రుణ‌ప‌డి ఉంటాము. ఇది ఒక ల‌వ్ స్టోరీ. మీ అంద‌రికీ త‌ప్ప‌కుండా న‌చ్చుతుంది అన్నారు.

ప్రొడ్యూస‌ర్ మాట్లాడుతూ… ఈ చిత్రంలో న‌టీన‌టులు, టెక్నీషియ‌న్లు అంద‌రూ కొత్త‌వాళ్ళు అయినా కూడా సినిమా చాలా బాగా వ‌చ్చింది. స్టోరీ రెడీ అయ్యాక మేం చాలా మంది పెద్ద హీరోల వ‌ద్ద‌కు  వెళ్ళి అడిగితే ఎవ్వ‌రూ మాకు డేట్స్ ఇవ్వ‌లేదు. అంద‌రూ బ్యాన‌ర్ ఏంటి, సినిమా వ‌స్త‌దా లేదా అని అడుగుతున్నారు. దీంతో అంద‌రూ కొత్త‌వాళ్ళ‌నే తీసుకున్నాం. ఎప్ప‌టికైనా ఇది చాలా పెద్ద బ్యాన‌ర్ అవుతుంద‌ని ఆశిస్తున్నాను. మాలాంటి చిన్న ప్రొడ్యూస‌ర్ల‌ను ఎంక‌రేజ్ చేస్తేనే మంచి క‌థ‌ల‌తో మీ ముందుకు రాగ‌ల‌ము అని అన్నారు.

హీరో మాట్లాడుతూ… ఈ మ‌ధ్య వ‌చ్చిన ల‌వ్‌స్టోరీస్ కి చాలా భిన్నంగా ఉంటుంది ఈ చిత్రం. త‌ప్ప‌కుండా మా సినిమాని అంద‌రూ చూసి ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాం. నాకు మా డైరెక్ట‌ర్ గారు అంతా ద‌గ్గ‌రుండి చెప్పి చె యించుకున్నారు. మా నుంచి ఆయ‌న‌కు ఎటువంటి న‌ట‌న కావాలో అది ఆయ‌న రాబ‌ట్టుకున్నారు. ఈ సినిమా మంచి హిట్ అవుతుంద‌ని కోరుకుంటున్నాను అన్నారు. 

ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో చిత్ర యూనిట్ మొత్తం పాల్గొన్నారు. ర‌విచంద్ర‌, సుమ‌య‌, రంగి, మ‌హేష్‌, కాందంబ‌రి కిర‌ణ్‌, తిరుప‌తి, జావెద్‌, స‌తీశ్‌, కిర‌ణ్‌, మౌనిక‌, జ‌న‌తాసురేష్‌, పూజానాయుడు న‌టించిన ఈ చిత్రానికి ప్రొడ్యూస‌ర్ : చంద్ర‌శేఖ‌ర్ ఎస్‌, డైరెక్ట‌ర్ : ఆదిపినిశెట్టి, కెమెరామెన్ : నంద‌న్‌కృష్ణ‌, మ్యూజిక్‌ డైరెక్ట‌ర్ : జి.వి.ఎం.గౌత‌మ్‌, బ్యాన‌ర్ : శేఖ‌ర్ మూవీస్‌, ఎడిట‌ర్ : ఎన్‌.మ‌ల్లేశ్‌బాబు, ఆర్ట్‌డైరెక్ట‌ర్ : రామ్‌ర‌మేష్‌, లిరిక్‌ రైట‌ర్ : సాంబ అనిశెట్టి.


చంద్రబాబు బయోపిక్ ఆడియో ఎప్పుడంటే?

Category : Uncategorized

జనవరి 31న చంద్రోదయం బయోపిక్ ఆడియో 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బయోపిక్ గా తెరకెక్కుతున్న చిత్రం ‘చంద్రోదయం’. పి . వెంకటరమణ దర్శకత్వంలో మోహన శ్రీజ సినిమాస్ అండ్  శ్వేతార్క గణపతి ఎంటర్ ప్రైజెస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటోంది . ఇప్పటికే రాంగోపాల్ వర్మ వెన్నుపోటు పాటకు వ్యతిరేకంగా రిలీజ్ చేసిన పాటతో సంచలనం సృష్టించిన దర్శకుడు పి . వెంకట రమణ చిత్ర విశేషాలను వెల్లడిస్తూ… చంద్రబాబు నాయుడు భారతదేశం గర్వించదగ్గ నాయకుడని , అపారమైన తన మేథా సంపత్తితో ఆంధ్రప్రదేశ్ ని అగ్ర పథాన నిలిపాడని , 68 ఏళ్ల వయసులోనూ తెలుగు ప్రజల కోసం అహర్నిశలు శ్రమిస్తున్నాడని అందుకే అలాంటి మహానుభావుడి కష్టం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువాళ్ళకు తెలియజేయడానికే ఈ చంద్రోదయం చిత్రాన్ని రూపొందిస్తున్నామని … చంద్రబాబు బయోపిక్ ఎందుకు తీస్తున్నావని అడిగే వాళ్లకు మా చంద్రోదయం సరైన సమాధానం చెబుతుందని,  ఈ చిత్ర ఆడియో వేడుక ఈనెల 31న నిర్వహించనున్నామన్నారు. 

చిత్ర నిర్మాత జి జె రాజేంద్ర మాట్లాడుతూ… చంద్రబాబు నాయుడి బయోపిక్ తీసే అదృష్టం నాకు దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది. డిజిటలైజేషన్ వర్క్ కంప్లీట్ అయ్యాక త్వరలోనే సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసి సినిమాని విడుదల చేస్తామన్నారు . 

వినోద్ నువ్వుల, శివానీ చౌదరి, మౌనిక , భాస్కర్ తదితరులు నటిస్తొన్న ఈ చిత్రానికి డిఓపి: కార్తీక్ ముకుందన్, సంగీతం: రాజ్ కిరణ్, పి.ఆర్, మార్కెటింగ్: వంశీ చలమలశేట్టి, నిర్మాత : జి.జె.రాజేంద్ర, దర్శకత్వం: పి.వెంకటరమణ.


అఖిల్ బ్లాక్‌బస్టర్ డ్రీమ్ వాయిదా..?

Category : Uncategorized

అక్కినేని వారసుడిగా.. నాగార్జున తనయుడిగా.. అఖిల్ భారీ అంచనాల మధ్యన అఖిల్ అనే మాస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. క్రికెట్ ఆటలో.. గొప్పమెళకువలు తెలిసిన ఆటగాడిగా ఉన్న అఖిల్‌కి నటనంటే ఫ్యాషన్ ఉండటంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే భారీ అంచనాల మధ్య భారీ బడ్జెట్‌తో సినిమా చేసి హీరోగా నిలబడిపోదామనుకున్న అఖిల్‌కి మొదటి సినిమాతో దర్శకుడు వినాయక్ భారీ డిజాస్టర్ చేతిలో పెట్టాడు. తర్వాత.. ఏదో తెలియక మాస్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చాం.. ఈసారి కూల్ గా ప్రేమకథతో హిట్ కొడదామనుకున్నాడు.

నాగార్జున ఓన్ బ్యానర్‌లో తన కొడుకు కెరీర్ చక్కబెట్టే బాధ్యత తీసుకుని.. ఎంతో జాగ్రత్తగా దర్శకుడు విక్రమ్‌ని సెట్ చేసి ‘హలో’ సినిమా నిర్మించాడు. ఆ సినిమా లవ్ స్టోరీ‌తో తెరకెక్కింది. సోల్మెట్ కోసం వెతికే లవర్ బాయ్‌లా అఖిల్ ఆకట్టుకున్నప్పటికీ… హలో సినిమా యావరేజ్‌తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక మూడో సినిమాని ఆచి తూచి హిట్ డైరెక్టర్ వెంకీ అట్లూరితో చేసాడు అఖిల్. తొలిప్రేమతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న వెంకీ అట్లూరి అఖిల్‌ని లవర్ బాయ్‌లా మిస్టర్ మజ్నులో చూపెట్టాడు. అయితే రెండు చిత్రాల ఎఫెక్ట్ అఖిల్ మూడో చిత్రం మీద బాగానే పడింది. మొదటి నుండి వెంకీ మీదున్న అంచనాలు అఖిల్ మీద లేవు. మీడియం అంచనాలతో శుక్రవారం వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మిస్టర్ మజ్ను మళ్లీ యావరేజ్ టాక్ నే సొంతం చేసుకుంది.

అఖిల్ యాక్టింగ్, డాన్సింగ్ స్టైల్, న్యూ లుక్ అన్ని కుర్రకారుకి నచ్చేలా ఉన్నాయి. కానీ వెంకీ దర్శకత్వం, కథ రొటీన్‌గా ఉండడం, అలాగే ఈ ప్రేమకథలో ఫీల్ మిస్సయింది. ఇంకా అఖిల్‌ని అమ్మాయిలా వెంటపడే అబ్బాయిలా అంటే..  స్త్రీలోలుడిగా చూపించడం.. ఒకానొక టైం లో హీరోయిన్ నిధి అతడిని చూసి అసహ్యించుకోవడం వంటి అంశాలతో చూపించాడు. కానీ చిన్న కారణాలతో తన అభిప్రాయాలు మార్చుకుని అతడితో గాఢమైన ప్రేమలో పడిపోతుంది. అది అంతగా కన్విన్సింగ్‌గా ప్రేక్షకుడికి అనిపించకపోవడంతో సినిమాకి యావరేజ్ టాక్ వచ్చింది. మరి మూడో సినిమాతో అయినా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలన్న అఖిల్ మళ్ళీ యావరేజ్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తన బ్లాక్‌బస్టర్ డ్రీమ్‌ను మళ్లీ వాయిదా వేసుకోకతప్పలేదు అఖిల్.