హైదరాబాద్ నందు (బంజర హిల్స్, జూబిలీ హిల్స్, మాదాపూర్, కొండాపూర్ ) పరిసర ప్రాంతాల్లో పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ వెంటనే కావాలను. ఆర్మీ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేసి రిటైర్ అయినా వారికీ తగిన ప్రాధాన్యత ఇవ్వ బడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ + 91 8074965869

Monthly Archives: February 2019

మోసగాడు: కౌశల్ ఆర్మీ రివర్స్ గేర్..!

Category : Uncategorized

గత ఏడాది ఎటువంటి ఇంట్రెస్ట్ లేకుండా మొదలైన బిగ్ బాస్ సీజన్ టు మధ్యలో కౌశల్ ఆర్మీ అంటూ బయట ఒక ఆర్మీ ఫామ్ అయ్యి.. హౌస్ లో ఉన్న కౌశల్ ని సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో చేసిన హంగామాతో …. ఎటువంటి అర్హతలు లేని కౌశల్ బిగ్ బాస్ విన్నర్ గా అవతరించిన సంగతి తెలిసిందే. తోటి కంటెస్టెంట్స్ తో మైండ్ లెస్ గేమ్ తో.. కేవలం కౌశల్ ఆర్మీ తోనే గెలుపొందిన కౌశల్ హౌస్ లోనే కాదు.. బయట కూడా బిగ్ బాస్ విన్నర్ గా వీర విహారం చేసాడు. హౌస్‌లో ఒంటరిని అనే బిల్డప్ తోనే కౌశల్ గెలుపొందాడు. ఒకానొక టైం లో బిగ్ బాస్ యాజమాన్యం కూడా కౌశల్ ఆర్మీ ట్రోలింగ్ కి భయపడి అతనికి టైటిల్ ఇచ్చేసిందనే టాక్ సోషల్ మీడియాలో నడిచింది. ఇక కౌశల్ ఆర్మీ ఫెక్ ఆర్మీ అంటూ తోటి కంటెస్టెంట్ బయటికొచ్చాక మొత్తుకున్నా… కౌశల్ మాత్రం నోరేసుకుని పడిపోయేవాడు.

ఇక బిగ్ బాస్ విన్నర్ గా బయటికొచ్చాక కూడా బోలెడంత బిల్డప్ ఇస్తూ.. కౌశల్ ఆర్మీ పేరుతో హడావిడి చెయ్యడమే కాదు.. బిగ్ బాస్ టైటిల్ ని ఉపయోగించుకోవాలని చాలా తాపత్రయ పడ్డాడు. ఇక బిగ్ బాస్ విన్నర్ గా రెండు మూడు షాప్ ఓపెనింగ్స్ కి పిలిచిన షాప్ యజమానులు తర్వాత్తర్వాత కౌశల్ ని పట్టించుకోలేదు. ఇక తనకి పిఎంఓ కార్యాలయం నుండి ఫోన్ వచ్చేదని.. అలాగే గౌరవ డాక్టరేట్ ఇస్తున్నారని తెగ బిల్డప్ ఇచ్చాడు. ఇక కౌశల్ ఆర్మీని చూసి రెచ్చిపోయిన కౌశల్ కి ఇపుడు కౌశల్ ఆర్మీ షాకిచ్చింది. కౌశల్ ఆర్మీ స్వయానా కౌశల్ మోసగాడని, తన స్వార్ధం కోసమే పని చేస్తాడు కానీ.. ఎవరికీ ఉపయోగపడే మనస్తత్వం కాదని.. కౌశల్ వలన తాము నష్టపోయామని ఛానల్స్ సాక్షిగా మొత్తుకుంటున్నారు.

కానీ కౌశల్ మాత్రం తాను బిగ్ బాస్ హౌస్ లో ఎలా ఉన్నానో… ఇప్పుడు అలానే ఉన్నానని.. ఎప్పుడూ తనకి తానులా ఉన్నానని.. కానీ కావాలనే కొందరు తన ప్రతిష్టని కిందకి దిగజార్చే ప్రయాణం చేస్తున్నారని.. కౌశల్ ఆర్మీలోనే కొందరు కావాలనే తన మీద లేనిపోని నిందలు వేస్తున్నారని… నాలో ఏ మార్పులేదు.. నా వ్యక్తిత్వంలో ఏ మార్పు లేదని వాదిస్తున్నాడు కౌషల్. మరి షో లో యాంకర్ దీప్తిని, అలాగే నందిని ని ఉపయోగించుకుని.. తర్వాత నాకు నేనుగా పైకి వచ్చానని… తన కుటుంబమే తన బలమంటూ బిల్డప్స్ ఇచ్చి.. కౌశల్ బయట కూడా అదే కంటిన్యూ చేసాడు. అయితే గోగినేని బాబు లాంటి వాళ్ళు కౌశల్ ఆగడాలు హౌస్ లోపల, బయట కూడా ఎండగడుతూనే ఉన్నారు.


‘నేను నా నాగార్జున’ అంటున్న మహేష్

Category : Uncategorized

‘రంగ‌స్థ‌లం’ ఫేమ్ మ‌హేష్ హీరోగా న‌టిస్తున్న ‘నేను నా నాగార్జున’ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను ఆవిష్క‌రించిన క‌ళాబందు డా.టి.సుబ్బ‌రామిరెడ్డి

‘రంగ‌స్థ‌లం’ ఫేమ్ మ‌హేష్, సోమివ‌ర్మ  జంట‌గా న‌టిస్తున్న ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ ‘నేను నా నాగార్జున’. ఆర్‌.బి.గోపాల్ దర్శ‌క‌త్వంలో గుండ‌పు నాగేశ్వ‌ర‌రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా పోస్ట‌ర్‌ను ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త‌, క‌ళాబందు డా టి.సుబ్బ‌రామిరెడ్డి ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా..

డా. టి.సుబ్బ‌రామిరెడ్డి మాట్లాడుతూ – ‘‘సినిమా ఆద్యంతం కామెడీగా ఉంటుంది. నిర్మాత నాగేశ్వ‌ర‌రావుగారు ఈ చిత్రంలో నాగార్జున‌గారి అభిమానిగా, కీల‌క పాత్ర‌లో చ‌క్క‌గా న‌టించారు. నాగార్జున‌ గారిపై అభిమానాన్ని, గౌర‌వాన్ని తెలియ‌జేసేలా ఈ సినిమాను నిర్మించారు. డైరెక్ట‌ర్ ఆర్‌.బి.గోపాల్ సినిమాను చ‌క్క‌గా డైరెక్ట్ చేశారు. మహేష్ హీరోగా న‌టిస్తున్న చిత్ర‌మిది. అలాగే సోమివ‌ర్మ హీరోయిన్‌గా ప‌రిచ‌యం అవుతుంది. వీరిద్ద‌రు స‌హా ఎంటైర్ యూనిట్‌కు అభినంద‌న‌లు. సినిమా చాలా పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు. 

నిర్మాత గుండ‌పు నాగేశ్వ‌ర‌రావు మాట్లాడుతూ – ‘‘సినిమాను నిర్మిస్తూనే .. చాలా కీల‌క‌మైన పాత్ర‌లో నటించాను. డైరెక్ట‌ర్ ఆర్‌.బి.గోపాల్‌ గారు అనుకున్న స‌మ‌యంలో సినిమాను ప్లానింగ్ ప్ర‌కారం పూర్తి చేశారు. మ‌హేష్‌, సోమివ‌ర్మ చ‌క్క‌గా న‌టించారు. సినిమా చాలా బాగా వ‌చ్చింది. ఎంట‌ర్‌టైనింగ్ మూవీ. విశాఖ ప‌ట్నం వాసినైన నేను విశాఖ ప‌ట్నంలోనే షూటింగ్ చేయ‌డం ఆనందంగా ఉంది. సినిమా అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా ఉంటుంది’’ అన్నారు. 

మ‌హేష్‌, సోమివ‌ర్మ హీరో హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి కెమెరా:  నాగార్జున‌, సంగీతం:  ఈశ్వ‌ర్ పెర‌వ‌లి, నిర్మాత‌:  గుండ‌పు నాగేశ్వ‌ర‌రావు, ద‌ర్శ‌క‌త్వం: ఆర్‌.బి.గోపాల్‌.


మెగా ఫ్యాన్స్ వ్యతిరేకత మొదలైంది

Category : Uncategorized

నాని – విక్రమ్ కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రంకు ‘గ్యాంగ్ లీడర్’ అనే టైటిల్ ను అనౌన్స్ చేసారు మేకర్స్. చిన్న వీడియో బిట్ వదిలి అందులో గ్యాంగ్ లీడర్ అంటూ రిలీజ్ చేసారు. అలా రిలీజ్ చేసారో లేదో వెంటనే మెగా ఫ్యాన్స్ తీవ్ర నిరసన వ్యక్తం చేసారు. చిన్నపాటి వార్నింగ్స్ కూడా ఇచ్చారు.

ఈ సినిమా టైటిల్ మార్చకపోతే బాయ్ కాట్ చేస్తామని వార్నింగ్ ఇస్తూ పోస్టులు పెడుతున్నారు. మెగా ఫ్యామిలీ హీరోస్ అయితే ఆలోచిస్తాం అని అలాంటిది బయట వ్యక్తులు పెట్టుకోవడంపై నిరసన తెలియజేసారు. ట్విట్టర్ లో మైత్రి మూవీస్ బ్యానర్ ని ట్యాగ్ చేస్తూ ఈ పోస్టులు పెట్టారు. నిజానికి ఈ టైటిల్ తో రామ్ చరణ్ వద్దాం అనుకున్నాడు.

బోయపాటితో చేసిన సినిమాకు ఇదే టైటిల్ పెడదాం అని డిసైడ్ అయ్యి చివరికి వద్దు అనుకుని వినయ విధేయ రామ టైటిల్ తో కానిచ్చేశారు. అలానే సాయి ధరమ్ తేజ్ ఈ టైటిల్ ను వాడుకుద్దాం అనుకున్నాడు కానీ వాడుకోలేదు. కానీ మెగా ఫ్యామిలీకి ఎటువంటి సంబంధంలేని నాని ఎలా వాడుకుంటాడు? అని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. వీలైనంత త్వరగా టైటిల్ ని మార్చమని లేదంటే తమ నుంచి బాయ్ కాట్ ఎదురుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. మరి నాని – విక్రమ్ కుమార్ ఈ టైటిల్ పై ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి.


మహేష్‌కు అవమానం.. 5 గంటలు వెయిటింగ్!

Category : Uncategorized

మహేష్ కి కోపం రావడం ఏమిటా అనుకుంటున్నారా… మహేష్ బాబు, వంశి పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి సినిమాలో నటిస్తున్నాడు. సుదీర్ఘంగా షూటింగ్ జరుపుకుంటున్న మహర్షి మూవీ ఏప్రిల్ 5 న విడుదల అని ఆ సినిమా మేకర్స్ ప్రకటించారు. అవడానికి ముగ్గురు నిర్మాతలైనా అన్ని విషయాలను దిల్ రాజే చూసుకుంటున్నాడు. అశ్విని దత్, పివిపిలు మాత్రం సైడ్ నుండి అన్ని చూసుకుంటుండగా.. దిల్ రాజు మాత్రమే మీడియాకి ఫోకస్ అవుతున్నాడు. ఇక ఏప్రిల్ మొదట్లో విడుదలని గత ఏడాది చెప్పిన… చివరికి ఏప్రిల్ 25 న విడుదల అంటూ దిల్ రాజు మరో కొత్త డేట్ ఇచ్చాడు. కానీ తాజాగా మహర్షి రీ షూట్స్ వలన మహర్షి మళ్ళీ ఏప్రిల్ 25 నుండి పోస్ట్ పోన్ అయ్యే సూచనలు కనబడుతున్నాయి.

ఇకపోతే మహేష్ కి కోపం రావడానికి కారణం ఏమిటంటే.. మహర్షి షూటింగ్ ప్రస్తుతం  శంషాబాద్ ఎయిర్ పోర్ట్  పరిసర ప్రాంతాలతో పాటుగా.  శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లోను జరుపుకుంటుంది. అయితే  శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో షూటింగ్ అంటే దానికి అన్ని పర్మిషన్స్ అవసరం. మరి మహర్షి టీం ముందే ఎయిర్ పోర్ట్ లో షూటింగ్ చేసుకోవడానికి గల అనుమతులు సంపాదించింది. ఇక ఎప్పటిలాగే షూటింగ్ కోసం మహేష్ మేకప్ గట్రా వేసుకుని.. ఉదయం 7.30 కే శంషాబాద్ ఎయిర్ పోర్ట్ చేరుకున్నాడట. అయితే మహేష్ ని షూటింగ్ కోసం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లోకి ఎయిర్ పోర్ట్ అధికారులు వెళ్లకుండా అడ్డుకున్నారట.

షూటింగ్ కి కావాల్సిన అనుమతులు ఢిల్లీలోని ఉన్నత అధికారులు ఇచ్చేవరకు మహర్షి షూటింగ్ ఆపమని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ అధికారులు కోరినట్లు తెలుస్తోంది. అయితే షూటింగ్ కి కావాల్సిన పర్మిషన్స్ తమవద్ద ఉన్నాయని మహర్షి మూవీ యూనిట్ ఎంత చెప్పినా ఎయిర్ పోర్ట్ అధికారులు పట్టించుకోకపోవడంతో.. చేసేది లేక మహేష్ కార్ వ్యాన్ లో వెయిట్ చేస్తున్నాడట. అయితే ఐదారు గంటలైనా షూటింగ్ కి అనుమతి లభించకపోవడంతో… మహేష్ కి మహర్షి టీం మీద.. దిల్ రాజు మీద కోపం వచ్చిందని…. ఇక ఆ కోపంలో మహేష్ అక్కడినుండి ఇంటికెళ్లిపోయాడనే న్యూస్ హైలెట్ అయ్యింది.


ఇది బాలకృష్ణ స్వయంకృతాపరాధమే..!!

Category : Uncategorized

బాలకృష్ణ తండ్రి జీవిత చరిత్రని తెరకెక్కించి చేతులు కాల్చుకోవడమే కాదు.. ఎన్టీఆర్‌కున్న గౌరవాన్ని కథానాయకుడు, మహానాయకుడు అంటూ రెండు పార్టులుతో మొత్తం పోగెట్టేసాడు. ఎన్టీఆర్ మీదున్న అభిమానం, గౌరవం అన్నీ ఈ ఎన్టీఆర్ బయోపిక్ తో అభిమానుల్లో తుడిచిపెట్టుకుపోయిందేమో అనిపించేలా ఉంది.. కథానాయకుడు డిజాస్టర్, మహానాయకుడు కలెక్షన్స్ ఉన్నాయి. ఎన్టీఆర్ అంటే తెలుగు ప్రజల గుండెల్లో ఆరాధ్యదైవం. అలాంటి వ్యక్తిని బయోపిక్ పేరుతో బజారుకీడ్చారన్నట్టుగా వుంది తాజా వ్యవహారం. అయితే ఇదంతా బాలకృష్ణ స్వయంకృతాపరాధంగానే అనిపిస్తుంది. ఎందుకంటే కథానాయకుడు సినిమాని ఎన్టీఆర్ ని దైవంగా చూపించినా.. ఆ సినిమా హిట్ అయినా… ఎన్టీఆర్ మీద చేసిన భజన భరించలేక ప్రేక్షకులు ఆ సినిమాని తిప్పికొట్టారు.

మరి మహానాయకుడు అయినా ఒళ్ళు దగ్గర పెట్టుకుని తియ్యాల్సింది పోయి… బాలకృష్ణ ఈ సినిమాలో బావ భజన చూపించాడు. ఎన్టీఆర్ ని హీరోగా చూపించాల్సింది పోయి.. బావ చంద్రబాబు భజన చేయించడంతో ప్రేక్షకులు మాత్రమే కాదు.. నందమూరి అభిమానులు కూడా ఈ సినిమాని తిప్పికొట్టారు. అసలు టిడిపికి ఫేవర్‌గా ఉంటుందనే ఒకే ఒక్క విషయంతో చాలామంది ఈ సినిమా చూడలేదు అంటే నమ్మాలి. మరి అందుకే మహానాయకుడుకి అంత దారుణమైన ఓపెనింగ్స్ వచ్చాయి.

చంద్రబాబు.. బావమరిది బాలకృష్ణకి డబ్బులిచ్చి మరీ టిడిపికి ఆయనకి ఫేవర్‌గా మహానాయకుడు చిత్రాన్ని తీసి 2019 ఎన్నికల్లో గెలిచెయ్యాలనుకుంటే.. ఫలితం ఎలా ఉందో చూసారుగా… మరి ఇదంతా క్రిష్ తప్పుకాదు.. బాలయ్య చెప్పింది చేసాడు క్రిష్. క్రిష్ అనుకున్నది వేరు. కానీ బాలకృష్ణ చెప్పింది చెయ్యకపోతే.. క్రిష్ కి ఇబ్బంది కనుకనే.. ఇలా బాలయ్య చెప్పింది చేసి క్రిష్ కూడా ఇరుక్కున్నాడు. అయినా బాలకృష్ణ ఏదో ఆశించి తండ్రి జీవిత చరిత్రని తెరకెక్కిస్తే… మరేదో అయ్యింది. కనుక ఎన్టీఆర్ బయోపిక్ డిజాస్టర్ బాధ్యతంతా బాలయ్య మోయాల్సిందే.


‘సువర్ణసుందరి’ సెన్సార్‌కు సిద్ధమైంది

Category : Uncategorized

జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘సువర్ణసుందరి’.  సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా దర్శకుడు సూర్య ఎమ్.ఎస్.ఎన్ తెరమీదకు తీసుకు వస్తున్నారు. చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతోందన్న క్యాప్షన్ తో భారీ బడ్జెట్ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోని  రీతిలో ఓ సాంకేతిక అద్బుతంగా ఎస్.టీమ్ పిక్చర్స్ పతాకంపై ఎమ్.ఎల్. లక్ష్మి నిర్మిస్తున్న  ఈ చిత్రం మార్చిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ కు మిలియన్ వ్యూస్ లభించాయి.

ఈ సందర్బంగా డైరెక్ట‌ర్ సూర్య మాట్లాడుతూ… సువర్ణసుందరి  చిత్రంలో ఎఫ్ఎక్స్ కోసం ఏడాదిపాటు వ‌ర్క్ జ‌రిగింది.  లేటు అయినా కూడా ఫ‌లితం చాలా బాగా వ‌చ్చింది. దానికి నిదర్శనం మా చిత్ర ట్రైలర్ ‌కు వచ్చిన రెస్పాన్స్ . సాధారణ ప్రేక్షకుల నుంచి సెలబ్రిటీల వరకు ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకుంది.

మూడు జన్మల కాన్సెప్ట్ తో హిస్టారికల్ థ్రిల్లర్ గా తీసిన ఈ చిత్రం సెన్సార్ కు సిద్దమయింది. మార్చి తొలివారంలో పాటలను రెండో వారంలో  సినిమాను తెలుగు, కన్నడ ,తమిళ్ భాషల్లో ఒకేసారి  విడుదల చేయటానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారన్నారు.

జ‌య‌ప్ర‌ద‌, పూర్ణ‌, సాక్షి, ఇంద్ర‌, రామ్, సాయికుమార్‌, కోటాశ్రీ‌నివాస‌రావు, ముక్త‌ర్‌ఖాన్‌, నాగినీడు, స‌త్య‌ప్ర‌కాష్‌, అవినాష్ న‌టిస్తున్న ఈ చిత్రానికి ప్రొడ్యూస‌ర్ ఎమ్.ఎల్. లక్ష్మి, మ్యూజిక్‌ డైరెక్ట‌ర్: సాయికార్తిక్‌, స్టంట్స్: రామ్‌సుంక‌ర‌, ఆర్ట్ డైరెక్ట‌ర్: నాగు, డి.ఓ.పి. ఎల్లుమహంతి, ఎడిట‌ర్: ప్ర‌వీణ్‌పూడి, స్టోరీ: ఎం.ఎస్‌.ఎన్.సూర్య‌, పి.ఆర్‌.ఓ. సాయిస‌తీష్‌, డైరెక్ట‌ర్: ఎం.ఎస్‌.ఎన్‌.సూర్య‌.


కార్తీ, రష్మిక కాంబినేషన్‌లో మూవీ ఫిక్స్

Category : Uncategorized

కార్తీ, రష్మిక జంటగా డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కొత్త చిత్రం

‘ఖాకీ’ వంటి విభిన్నమైన సినిమాతో సూపర్ హిట్ అందించిన కార్తీ – డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కాంబినేషన్‌లో మరో సినిమా రూపొందనుంది. కార్తీ 19 వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రంలో గీత గోవిందం ఫేమ్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించనుంది. ప్రస్తుతం సూర్యతో ‘ఎన్‌జీకె’ నిర్మిస్తున్న ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు ‘డ్రీమ్ వారియర్ పిక్చర్స్’ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘రెమో’ ఫేమ్ భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వం వహిస్తున్నారు. మార్చి రెండవ వారంలో షూటింగ్ ప్రారంభం కానుంది. 

కార్తీ, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా నటించనున్న ఈ చిత్రానికి నిర్మాతలు – ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు

దర్శకత్వం – భాగ్యరాజ్ కన్నన్


నాని సినిమాకు మెగా పవర్ ఫుల్ టైటిల్‌

Category : Uncategorized

నాని, విక్రమ్‌ కె.కుమార్‌ కాంబినేషన్‌లో మైత్రి మూవీ మేకర్స్‌ చిత్రం పేరు ‘గ్యాంగ్ లీడర్’

నేచురల్‌ స్టార్‌ నాని, వెర్సటైల్‌ డైరెక్టర్‌ విక్రమ్‌ కె.కుమార్‌ కాంబినేషన్‌లో మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, సి.వి.మోహన్‌(సివిఎం) నిర్మిస్తున్న ప్రొడక్షన్‌ నెం.8 గా నిర్మిస్తున్న చిత్రం పేరుని ‘గ్యాంగ్ లీడర్’ గా నాని పుట్టినరోజు సందర్భంగా నిర్మాతలు ప్రకటించారు. రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ లో విడుదల కానుంది.

నాచురల్ స్టార్ నాని, కార్తికేయ, ప్రియాంక, లక్ష్మీ, శరణ్య, అనీష్‌ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిశోర్‌, జైజా, సత్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. 

ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్‌ రవిచందర్‌, సినిమాటోగ్రఫీ: మిరోస్లా కుబా బ్రోజెక్‌, మాటలు: వెంకీ, డార్లింగ్‌ స్వామి, రచనా సహకారం: ముకుంద్ పాండే, పొడక్షన్‌ డిజైనర్‌: రాజీవన్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌: రామ్‌కుమార్‌, ఎడిటింగ్‌: నవీన్‌ నూలి, కాస్ట్యూమ్‌ డిజైనర్‌: ఉత్తర మీనన్‌, స్టిల్స్‌: జి.నారాయణరావు, విఎఫ్ఎక్స్‌ సూపర్‌వైజర్‌: సనత్‌(ఫైర్‌‌ఫ్లై) కో-డైరెక్టర్‌: కె.సదాశివరావు, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: శేషు, సి.ఇ.ఓ.: చిరంజీవి(చెర్రీ), నిర్మాతలు: నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, సి.వి.మోహన్‌(సివిఎం), కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విక్రమ్‌ కె.కుమార్‌. 


రాశిఖన్నాకి ఒకటి పోతేనేం మరోటి వచ్చింది!

Category : Uncategorized

తెలుగులో చిన్నచిన్నగా అడుగులు వేస్తూ, తెలుగుతో పాటు తమిళంలో కూడా గుర్తింపును తెచ్చుకుంటున్న హీరోయిన్‌ రాశిఖన్నా. ఈమె కెరీర్‌ రకుల్‌ప్రీత్‌సింగ్‌తో సమానంగా ప్రారంభం అయినా రకుల్‌ మాత్రం టాప్‌ హీరోయిన్‌ స్థాయికి ఎదిగితే రాశిఖన్నా మాత్రం పెద్ద హీరోల సరసన సెకండ్‌ హీరోయిన్‌, యంగ్‌ హీరోలతో సరిపెట్టుకుంటోంది. అతి తక్కువ కాలంలోనే తెలుగులో డబ్బింగ్‌ చెప్పడమే కాదు… ఏకంగా పాటలు పాడే స్థాయికి ఈమె చేరుకుంది. ఇక ఈమె కెరీర్‌లో ‘జైలవకుశ, తొలిప్రేమ’ వంటి చిత్రాలు మాత్రమే ఆమెకి మంచి పేరును తెచ్చాయి. 

ఇక విషయానికి వస్తే రాశిఖన్నాకి తమిళంలో మంచి సక్సెస్‌ అయిన ‘రాక్షసన్‌’ తెలుగు రీమేక్‌గా బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ హీరోగా రమేష్‌వర్మ దర్శకత్వంలో ప్రారంభమైన చిత్రంలో హీరోయిన్‌ చాన్స్‌ వచ్చింది. దాంతో ఈ అమ్మడు మంచి సినిమా దక్కించుకుందని ఆనందం వెల్లడైంది. కానీ అనుకోని విధంగా ఈ చాన్స్‌ని అనుపమ పరమేశ్వరన్‌ సొంతం చేసుకుంది. దాంతో ఈ అమ్మడిని చూసి అందరు అయ్యో అనుకున్నారు. అదే సమయంలో విక్టరీ వెంకటేష్‌, మేనల్లుడు నాగచైతన్యల కాంబినేషన్‌లో ‘జైలవకుశ’ దర్శకుడు బాబి దర్శకత్వంలో రూపొందుతున్న మల్టీస్టారర్‌ ‘వెంకీమామ’ చిత్రంలో అవకాశం వచ్చింది. 

‘రాక్షసన్‌’ కంటే ‘వెంకీమామ’కే తెలుగులో మంచి క్రేజ్‌ ఉందనేది వాస్తవం. అందునా బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ కంటే నాగచైతన్య స్థాయే ఎక్కువ కావడం విశేషం. మొదట ఈ పాత్రకి రకుల్‌ప్రీత్‌సింగ్‌ని తీసుకోనున్నారని ప్రచారం సాగింది. కానీ అదే సమయంలో రకుల్‌ నాగార్జున నటిస్తున్న ‘మన్మథుడు 2’లో చాన్స్‌ రావడంతో అటు తండ్రి, ఇటు కొడుకుల సరసన ఏకకాలంలో నటించడం బాగా లేదని భావించిన సురేష్‌బాబు, నాగచైతన్య, బాబిలు కలిసి రాశిఖన్నాకి ఓటు వేశారు. మరి ఈ చిత్రం హిట్టు అయితే అయినా ఈమెకి మరిన్ని మంచి అవకాశాలు వస్తాయో లేదో వేచిచూడాలి…!


మాటలేనా.. సత్తా చాటేదేమైనా ఉందా?

Category : Uncategorized

కెరీర్‌ప్రారంభంలో మంచి మంచి కంటెంట్స్‌తో చిత్రాలు తీస్తూ వచ్చిన వర్మ ఈ మధ్యకాలంలో కేవలం పబ్లిసిటీలో తప్ప సినిమా కంటెంట్‌లో దమ్ము చూపలేకపోతున్నాడు. దాంతో ఆయన వీరాభిమానులు కూడా మొదటి రోజు ఆయన చిత్రాలను చూడటానికి సంకోచిస్తున్నారు. వారి నమ్మకాలను నిజం చేస్తూ వర్మ కూడా డిజాస్టర్స్‌ చిత్రాలను, అసలు ఆయనే తీశాడా? ఏదో తమాషాకి తీశాడా? అన్నట్లుగా నాసిరకం చిత్రాలను తీస్తున్నాడు. ఇక ఇటీవల ఎంతో బిల్డప్‌ ఇచ్చి మరీ నాగార్జునని ఒప్పించి చేసిన ‘ఆఫీసర్‌’ ఎంతటి ఘోరపరాజయాన్ని మూటగట్టుకుందో అందరికీ తెలిసిందే. 

ఇక విషయానికి వస్తే తన తండ్రికి నిజమైన నివాళి అంటూ, ఆ మహానుభావుడు ఎన్టీఆర్‌ బయోపిక్‌ అంటూ బాలయ్య తీసిన ‘కథానాయకుడు, మహానాయకుడు’ కూడా డిజాస్టర్‌గా నిలుస్తున్నాయి. కథానాయకుడుకి కాస్త క్రేజ్‌ అయినా వచ్చింది. దాంతో మొదటి షోకి ముహూర్తంగా తెల్లవారు ఝామున 4గంటల 50 నిమిషాలకు సినిమాని థియేటర్లలో వేశారు. కానీ మహానాయకుడుకి మాత్రం ఉదయం 11 గంటల వరకు షో పడలేదు. బెనిఫిట్‌ షో కావాలని ఎవ్వరూ అడగకపోవడం, అలా షో వేసినా కనీస ప్రేక్షకులు కూడా రారని నిర్ణయించేసుకున్న బయ్యర్లు, ఎగ్జిబ్యూటర్లు ఈ విషయంలో ముందుగా జాగ్రత్త పడ్డారు. వంద చిత్రాలకు పైగా వైభవం ఉన్న బాలయ్య చిత్రం అసలు విడుదలైందా? లేదా? అనే అనుమానాలు వచ్చేలా విడుదల కావడం ఇదే ప్రధమం అని చెప్పాలి. దీంతో మహానుభావుల బయోపిక్స్‌ని తీసేటప్పుడు ఒకటికి రెండు సార్లు కాదు.. ఏకంగా ఒకటికి వందసార్లు ఆలోచించాలనే గుణపాఠాన్ని ‘ఎన్టీఆర్‌ బయోపిక్‌’ కల్పించింది. 

ఇక ప్రస్తుతం అందరి దృష్టి వర్మ తీస్తోన్న ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’పైనే ఉంది. ఎన్టీఆర్‌ బయోపిక్‌లో అసలైన కథ మొదలయ్యే రెండోసారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కడం నుంచి లక్ష్మీపార్వతి ఆయన జీవితంలోకి ఎంటర్‌ కావడం, ఆపై ఎన్టీఆర్‌కి వెన్నుపోటు వంటివి దాచిన ఫలితంగా మహానాయకుడు పెదవి విరుపులకు గురైంది. అయితే బాలయ్య అండ్‌ టీం ఎక్కడ ఆపారో వర్మ అక్కడి నుంచే తన చిత్రం ప్రారంభించనున్నాడు. లక్ష్మీపార్వతి ఎన్టీఆర్‌ జీవితంలోకి వచ్చిన తర్వాత కథను ఆయన ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’లో చూపించనున్నాడు. వర్మ గత చిత్రాల కంటే ఈ చిత్రం కోసం చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారనేది వాస్తవం. 

ముఖ్యంగా లక్ష్మీపార్వతిని వివాహం చేసుకున్న తర్వాత ఎన్టీఆర్‌ జీవితంలో జరిగిన సన్నివేశాలను తన చిత్రంలో చూపిస్తానని వర్మ జోరుగా ప్రచారం చేస్తున్నాడు. దాంతో ఈ చిత్రం ట్రైలర్‌కే కాదు.. ఈ చిత్రం విడుదల కోసం కూడా ఎంతో మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనిని చూస్తే ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’కి డీసెంట్‌ ఓపెనింగ్స్‌ రావడం ఖాయమని తేలిపోతోంది. మరి ఇంత మంచి అవకాశం ద్వారా అయినా వర్మ ప్రేక్షకులు ఈ చిత్రంపై పెట్టుకున్న అంచనాలను అందుకుని మరలా ఫామ్‌లోకి వస్తాడా? లేక పబ్లిసిటీ, మాటలకే పరిమితం అవుతాడా? అనేవి వేచిచూడాల్సివుంది…!