హైదరాబాద్ నందు (బంజర హిల్స్, జూబిలీ హిల్స్, మాదాపూర్, కొండాపూర్ ) పరిసర ప్రాంతాల్లో పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ వెంటనే కావాలను. ఆర్మీ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేసి రిటైర్ అయినా వారికీ తగిన ప్రాధాన్యత ఇవ్వ బడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ + 91 8074965869

Monthly Archives: March 2019

నాని సినిమాకు టైటిల్ ఫిక్సయింది..!

Category : Uncategorized

కెరీర్‌లో హిట్స్ కి పొంగిపోయి.. ప్లాప్స్ కి కుంగిపోకుండా వరస సినిమాల్తో ఠారెత్తిస్తున్న నేచురల్ స్టార్ నాని జోరు మాములుగా లేదు. సినిమాల మీద సినిమాలు చేస్తూ… వరసగా సినిమాలను కూడా లైన్ లో పెట్టేస్తున్నాడు. గత ఏడాది కృష్ణార్జున యుద్ధం ప్లాప్ తర్వాత నాని ‘మళ్ళీ రావా’ ఫేమ్ గౌతమ్ తిన్నసూరి దర్శకత్వంలో క్రికెట్ నేపథ్యం ఉన్న జెర్సీ సినిమా చేసాడు. జెర్సీ ఏప్రిల్ 19న విడుదల కాబోతుంది. ప్రస్తుతం జెర్సీ షూటింగ్ తోనూ, ప్రమోషన్స్ తోనూ బిజీగా వున్న నాని.. ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్ లో మరో మూవీ ఒప్పేసుకున్న విషయం తెలిసిందే.

అష్టాచెమ్మా, జెంటిల్మన్ లాంటి హిట్స్ ఇచ్చిన ఇంద్రగంటితో మూడో సినిమాకి నాని సైన్ చేసాడు. అయితే ఇంద్రగంటి సినిమా జంటిల్మన్‌లో నాని ఒక నెగెటివ్ కేరెక్టర్ కూడా చేసాడు. తాజాగా ఇంద్రగంటితో నాని చెయ్యబోయే సినిమాలో కూడా నాని విలన్ రోల్ ప్లే చేయబోతున్నాడనే న్యూస్ ఉంది. ఈ సినిమాలో మరో హీరో కూడా నటిస్తున్నాడు. అతనే సుధీర్ బాబు. 

సుధీర్ బాబు హీరోగా… నాని విలన్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమాకి ఇంద్రగంటి టైటిల్ ఫిక్స్ చేసినట్లుగా వార్తలొస్తున్నాయి. నాని – సుధీర్ బాబు – ఇంద్రగంటి కాంబోలో రాబోయే సినిమా పేరు ‘వ్యూహం’ అనే టైటిల్‌ని ఫిలిం ఛాంబర్‌లో రిజిస్టర్ చేయించినట్లుగా ప్రచారం జరుగుతుంది. మరి నాని ఎలాంటి ‘వ్యూహం’తో సుధీర్ బాబుతో ఆడుకుంటాడో చూద్దాం.


సినీ ప్ర‌ముఖుల చ‌మ్మ‌క్కులు పుస్త‌క ఆవిష్క‌ర‌ణ‌

Category : Uncategorized

ఆనాటి సినీ ప్ర‌ముఖులు, ర‌చ‌యిత‌లు, న‌టులు, ద‌ర్శ‌కులు, సాంకేతిక నిపుణులు వారి మ‌ధ్య జ‌రిగే వివిధ సంద‌ర్భాల్లో చెప్పిన సంభాష‌ణ‌లు అన్ని సేక‌రించి ఒక గ్రంధంగా చేసి మ‌న ముందు ఉంచారు స‌హ‌ద‌ర్శ‌కులు క‌న‌గాల జ‌య‌కుమార్‌గారు. విద్యాసాగ‌ర్‌గారు ఈ పుస్త‌కాల‌ను ప్ర‌చురించారు. బుధ‌వారం ఫిలిం ఛాంబ‌ర్‌లో ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో హీరో శ్రీ‌కాంత్ చేతుల మీదుగా ఆవిష్క‌రించి తొలి ప్ర‌తిని వాసిరెడ్డి విద్యాసాగ‌ర్‌కి అందించారు. ఈ సంద‌ర్భంగా విలేక‌రుల స‌మావేశంలో…

రేలంగి న‌ర్సింహారావు మాట్లాడుతూ… జ‌య్‌కుమార్‌కి నాకు మ‌ద్రాస్ నుంచి ప‌రిచ‌యం ఉంది. మేమిద్ద‌రం రూమ్‌మేట్స్‌. అప్ప‌టి నుంచి కూడా ఆయ‌న‌కు సాహిత్యం మీద చాలా అభిలాష‌ ఉండేది. అప్ప‌ట్లో మ‌న జ‌య్‌కుమార్‌గారిని దేవుల‌ప‌ల్లికృష్ణ‌శాస్ర్తిగారు చాలా గౌర‌వించేవారు. ఆయ‌నతో క‌లిసి జ‌య్‌కుమార్‌గారు వెళితే ఆయ‌న మై యంగ్ ఫ్రెండ్ అని చెప్పేవారు. రెండుసార్లు డైరెక్ట‌ర్‌గా ఆయ‌న‌కు అవ‌కాశాలు వ‌చ్చి కూడా ఆయ‌న ఎందుకో డైరెక్ట‌ర్ కాలేక‌పోయారు. ఆయ‌న‌లో చాలా మంచి సాహిత్యం ఉంది. ఆయ‌న పాట‌లు రాస్తారు, క‌విత‌లు రాస్తారు. చాలా సింపుల్‌గా ఉంటారు. జ‌య్‌కుమార్‌గారి కోసం ఈ పుస్త‌కంలో బ్ర‌హ్మానందం గారు, త‌నికెళ్ళ‌భ‌ర‌ణి గారు ముందుమాట రాసినందుకు వాళ్ళ‌కు ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు అన్నారు. ఇ.వి.వి.గారి ద‌గ్గ‌ర రెండు సినిమాల‌కు ప‌ని చేశారు. జ‌య్‌కుమార్‌ గారికి ఇద్ద‌రు భార్య‌లు ఒక‌రు గుంటూరులో ఉంటే మ‌రొక‌రు విద్యాసాగ‌ర్‌గారు. ఎంతో మంచి మ‌న‌సుతో శ్రీ‌కాంత్ పుస్త‌క ఆవిష్క‌ర‌ణ చేయడం చాలా ఆనందంగా ఉంది. విద్యాసాగ‌ర్‌ గారికి రెండు పెద్ద విద్యాశాల‌లు ఉన్నాయి ఆయ‌న వాటికి చైర్‌మెన్‌. కాని చాలా సింపుల్‌గా ఉంటారు ఎవ్వ‌రికీ చెప్ప‌నివ్వ‌రు అని అన్నారు.

వాసిరెడ్డి విద్యాసాగ‌ర్ మాట్లాడుతూ… సినిమాలు అంటే నాకు చాలా ప్యాష‌న్‌. నేను జ‌య్‌కుమార్ మంచి ఫ్రెండ్స్ ఆయ‌న నేను రెగ్యుల‌ర్‌గా క‌లుస్తుంటాము. ఆయ‌న క‌వితలు, పాట‌లు బాగా రాస్తారు. ఆయ‌నే బుక్స్ ప‌బ్లిష్ చెయ్య‌డం పెద్ద విష‌యం ఏమీ కాదు. లైమ్‌లైట్‌లోకి రాని వాళ్ల‌కి ఇండ‌స్ర్టీ ఇలాగే చేయూత నివ్వాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.

ఎండ్లూరి సుధాక‌ర్‌రావు (ప్రొఫెస‌ర్ ఆఫ్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ) మాట్లాడుతూ… వాల్మీకి లేక‌పోతే రామాయ‌ణం లేదు. సాహిత్యంలో రెండు జ‌కారాలు ఉన్నాయి. జాషువా 18, 20 వ‌య‌సులో ఆరోజుల్లో మూకీ చిత్రాల‌ను తీశారు. 1920లో క‌దిలేబొమ్మ‌ల‌కు కంఠం క‌ల‌ప‌డం గుర్రం జాషువా. అటువంటి వారే మా క‌న‌గాల జ‌య్‌కుమార్‌గారు. ఇప్ప‌టికీ ఆ పాత సినిమాలు నా గుండె తెర‌మీద వేసుకుంటే హాయిగా నిద్ర‌ప‌డుతుంది. ఈ పుస్త‌కానికి మంచి పుర‌స్కారం రావాల‌ని కోరుకుంటున్నాను అని అన్నారు.

క‌ర‌పాల సుధాక‌ర్(జ‌డ్జి) మాట్లాడుతూ… పుస్త‌కం చూడ‌గానే చ‌ద‌వాల‌నిపిస్తుంది. చిరిగిన చొక్కాతొడుక్కో కాని మంచి పుస్త‌కం కొనుక్కో అన్నారు ఓ మ‌హా క‌వి. పుస్త‌క ప‌రిజ్ఞానంతో విద్యాప‌రిజ్ఞానం  వ‌స్తుంది. జ‌య్‌కుమార్‌ గారి కృషికి అభినందిస్తున్నాను అన్నారు.

మ‌రుడూరి రాజా మాట్లాడుతూ… నేను ఇండ‌స్ర్టీలో పెద్ద‌వారిని ఎవ్వ‌రినీ చూడ‌లేదు. పుస్త‌కాలంటే చాలా ఇష్టం. ఎవ‌రైనా ప్రొడ్యూస‌ర్లు డ‌బ్బులు, పుస్త‌కాలు ఇస్తే డ‌బ్బులు వ‌దిలేసి పుస్త‌కాన్ని తెచ్చుకుంటా పుస్త‌కాలంటే అంత ఇష్టం. నాకు జ‌య్‌కుమార్‌ గారికి చాలా త‌క్కువ స‌మ‌యంలోనే ఎక్కువ అనుబంధం ఏర్ప‌డింది. ఈ పుస్త‌కంలో ఎన్నో మంచి అనుభ‌వాల‌ను సేక‌రించారు. ఇవ‌న్నీ గొప్ప అనుభ‌వాలు దీన్ని పుస్త‌క రూపంలో అందించ‌డం చాలా గొప్ప ప‌ని అని అన్నారు. 

రాం ప్ర‌సాద్ మాట్లాడుతూ… నాకు జ‌య్‌కుమార్‌గారు గుంటూరులో ప‌రిచ‌యం. ఈ పుస్త‌కం ద్వారా పాత జ్ఞాప‌కాల‌ను నెమ‌ర‌వేసుకోవ‌చ్చు. క‌ళారంగానికి ఎంతో స‌హాయ‌ప‌డిన విద్యాసాగ‌ర్‌ గారికి నా కృత‌జ్ఞ‌త‌లు అన్నారు.

హేమ‌సుంద‌ర్ మాట్లాడుతూ… ఈ పుస్తం పార్ట్ -2 కూడా రావాల‌ని నా కోరిక  త‌ప్ప‌కుండా ఇలాంటిది మ‌రిన్ని విశేషాల‌తో మ‌రో పుస్త‌కం రావాలి అని అన్నారు.

శివ‌నాగేశ్వ‌ర‌రావు మాట్లాడుతూ… 130 సినిమాలు చేసిన మా శ్రీ‌కాంత్‌కి ఇంకా మొహ‌మాటం పోలేదు. శ్రీ‌కాంత్ చాలా మంచి మ‌న‌సున్న వ్య‌క్తి. జ‌య్‌కుమార్‌ గారు ఎప్పుడూ ఎక్క‌డా ఏ విష‌యంలో కూడా టెన్ష‌న్‌ప‌డ‌రు. చాలా కూల్‌గా ఉంటారు. ఆయ‌న నేను క‌లిసి కొంత కాలం ప‌ని చేశాం. ఈ పుస్తకం పార్ట్ -2 రావ‌డం అనేది చాలా మంచి ఆలోచ‌న ఆల్ ద బెస్ట్ జ‌య్‌కుమార్ అని అన్నారు.

హీరో శ్రీ‌కాంత్ మాట్లాడుతూ… 5రోజుల క్రితం నాకు ప్ర‌భు గారు ఫోన్ చేసి చెప్పారు ఇలా పుస్త‌కం ఆవిష్క‌ర‌ణ చేయాల‌ని గుంటూరు నుంచి జ‌య్‌కుమార్‌గారు కూడా చెప్పారు. నా సినిమాల‌కు కూడా ఆయ‌న కో డైరెక్ట‌ర్‌గా ప‌ని చేశారు. ఆయ‌న‌ది ఎంత చ‌క్క‌టి ప్లానింగ్ ఉంటుందంటే… చాలా ప‌ర్‌ఫెక్ట్ ప్లానింగ్ ఉంటుంది. ఇటువంటి మంచి పుస్త‌కాన్ని నా చేతుల మీదుగా ఆవిష్క‌రించ‌డం నా అదృష్టంగా భావిస్తున్నాను. పుస్త‌కం చ‌దువుతుంటే చాలా ఆనందంగా ఉంది. ఈ పుస్త‌కం మంచి స‌క్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు. 

సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ వినాయ‌క‌రావ్ మాట్లాడుతూ… చాలా మంచి ఫంక్ష‌న్‌లో పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి పుస్త‌కాలు రావ‌డం చాలా ఆనందంగా ఉంది అన్నారు.

జ‌య్‌కుమార్ మాట్లాడుతూ… 40ఏళ్ళ నుంచి ఈ ఫీల్డ్‌లో ఉన్నాను. దీనికి బ‌దులు ఏ రెవెన్యూ  డిపార్ట్ మెంట్‌లోనో ఉండేవాడ్ని కాని ఈ ఆనందం ఏ డిపార్ట్‌మెంట్‌లోనూ ఉండ‌దు. ఇంత పెద్ద‌వాళ్ళ‌తో ప‌రిచ‌యం ఎంతోమంది ప్ర‌ముఖుల‌తో పంచుకున్న ఆనందం ఇవ‌న్నీ ఎప్పుడూ ఉంటాయి. విద్యాసాగ‌ర్‌గారు ఫిల్మ్ అప్రిసియేష‌న్ క్లాసెస్ అని త‌న క‌ళాశాల‌లో నాకు ఒక ఉద్యోగం ఇచ్చారు. ఆయ‌న‌కు అది చాలా చిన్న జాబ్ కావొచ్చు.. కాని నాకు అది చాలా పెద్ద ఉద్యోగం. నాకు ఉద్యోగం ఇచ్చి న‌న్ను ప్రోత్స‌హించారు. నేను అడ‌గ‌కుండానే నా పుస్త‌కాల‌ను ప్ర‌చురించినందుకు చాలా కృత‌జ్ఞ‌త‌లు. ఈ పుస్త‌కంలోని జోకులు చాలా మంది చ‌దివి చాలా బావున్నాయ‌ని చెప్పారు. ఇవ‌న్నీ నాకు మ‌ధుర‌జ్ఞాప‌కాలు. ముఖ్యంగా మా చైర్మెన్‌గారికి నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు అన్నారు


వెనుకపడ్డా.. ఇకపై జాగ్రత్తగా ఉంటా: హీరోయిన్

Category : Uncategorized

తెలుగులో ఎప్పుడూ పరభాషా హీరోయిన్లు, విలన్ల హవా సాగుతూనే ఉంటుంది. ఇదే సమయంలో కెరీర్‌ విషయంలో ఆచితూచి అడుగులు వేయాలి. ఏ మాత్రం పొరపాటు చేసినా కెరీర్‌ పూర్తిగా నాశనం అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇక విషయానికి వస్తే మలయాళ కుట్టిగా పేరు తెచ్చుకున్న చికాగో భామ అను ఇమ్మాన్యుయేల్‌. 2011లో మలయాళంలో ‘స్వప్నసంచారి, యాక్షన్‌ హీరో బిజ్జూ’ చిత్రాలలో నటించింది. తెలుగులోకి ‘మజ్ను’ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది. 

ఆ తర్వాత టాలీవుడ్‌లో ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త, ఆక్సిజన్‌, అజ్ఞాతవాసి, నాపేరు సూర్య..నా ఇల్లు ఇండియా, శైలజారెడ్డి అల్లుడు’ చిత్రాలతో పాటు కోలీవుడ్‌లో విశాల్‌ సరసన ‘తుప్పరివారన్‌’ మూవీలో నటించింది. అందం, నటన, ప్రతిభ, ముక్కు తీరు అద్బుతంగా ఉండే ఈమె సరైన హిట్‌ రాకపోవడంతో అవకాశాలు తగ్గిపోయాయి. 

తాజాగా ఈమె మాట్లాడుతూ, కెరీర్‌ తొలినాళ్లలో వరుసగా గ్లామర్‌పాత్రలు చేసుకుంటూ వెళ్లాను. అదే సమయంలో నాకు పెద్దగా ప్రాధాన్యత లేని పాత్రలు చేసి తప్పు చేశాను. ఆ కారణంగానే కెరీర్‌లో బాగా వెనుకబడిపోయాను. ఇకపై కథల విషయంలో, నాపాత్రల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటాను. గ్లామర్‌తో పాటు నటనకు ప్రాధాన్యం ఉండే పాత్రల్లోనే నటిస్తాను.. రాబోయే రోజుల్లో మీరే నాలోని మార్పుని తప్పకుండా చూస్తారు అని చెప్పుకొచ్చింది. మొత్తానికి నటన, అందం, గ్లామర్‌ వంటివి ఉన్నా గోరంత అదృష్టం కూడా తోడవ్వాలి. ఆ అదృష్టమే ఇంత వరకు అను ఇమ్మాన్యుయేల్‌కి కలిసి రావడం లేదనే చెప్పాలి. మరి భవిష్యత్తులో అయినా ఈమె స్టార్‌ హీరోయిన్‌గా ఎదుగుతుందో లేదో వేచిచూడాల్సివుంది…! 


తెలుగమ్మాయ్ అందం అంటే ఇలా ఉంటది

Category : Uncategorized

టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్స్ ఉన్నారు అంటే వారికీ గ్లామర్ రోల్స్ ఇవ్వాలంటే దర్శకులు కాస్త ఆలోచిస్తారు. ఎందుకంటే మన తెలుగమ్మాయిని గ్లామర్ గా ఏం చూపిస్తాంలే అని. కానీ తెలుగు హీరోయిన్స్ తెలుగులో గ్లామర్ చూపించినా ప్రేక్షకులు కూడా ఇంట్రెస్ట్ గా చూడరు. అందుకే తెలుగు హీరోయిన్స్ పక్క భాషలకు పోయి అందాలు ఆరబోస్తున్నారు. తాజాగా ఒక భామ ఇక్కడ సినిమాలతో మెల్లగా గ్లామర్ షో చెయ్యడానికి సిద్దమయ్యిది. ఆమె మొదటి నుండి గ్లామర్ షో చెయ్యడానికి రెడీ అయినా.. అమెకొచ్చిన పాత్రలన్నీ ట్రెడిషనల్ పాత్రలు కావడంతో.. ఆమె గ్లామర్ హీరోయిన్ గా ఎవ్వరికి కనిపించలేదు. అంతకు ముందు ఆతర్వాత, అ!, అమీతుమీ, సుబ్రమణ్యపురం వంటి సినిమాల్లో ట్రెడిషన్ గా కనబడిన ఈషా రెబ్బా.. ఈమధ్య అందాల ఆరబోతకు సై అనడమే కాదు.. గ్లామర్ షో చేస్తుంది కూడా.

అరవింద సమేతలో సెకండ్ హీరోయిన్ గా ప్రాధాన్యత లేని పాత్రలో ఫోకస్ కానీ ఈషా రెబ్బా… తాజాగా ఓ హర్రర్ థ్రిల్లర్ లో నటించబోతుంది. అయితే ఈషా రెబ్బా లేటెస్ట్ గా చేయించుకున్న ట్రెడిషనల్ హాటెస్ట్ ఫోటో షూట్ ఒకటి ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది. ఇప్పటివరకు అంతగా ఎక్సపోజ్ చెయ్యని ఈషా రెబ్బా ఇప్పుడు లేటెస్ట్ ఫోటో షూట్ లో క్లీవేజ్ అందాలతో మత్తెక్కించేసింది. ఈషా కెరీర్లో ఇప్పటిదాకా ఇంత గ్లామర్ గా సెక్సీ గా, ఇంత హాట్ గా ఎప్పుడూ కనిపించలేదంటే అతిశయోక్తి కాదు. ఒక తెలుగు హీరోయిన్ ఇంత బోల్డ్‌గా కనిపిస్తుందా అని అందరూ షాకవుతున్నారు. మరి ఈ ఫోటో షూట్ చూశాకైనా దర్శకనిర్మాతలెవరైనా పిలిచి పెద్ద సినిమాల్లో ఆఫర్స్ ఇస్తారేమో చూద్దాం. ఎందుకంటే ఈషా ఇప్పటివరకు మీడియం రేంజ్ హీరోలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.


‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఎలా ఉందంటే..? (మినీ రివ్యూ)

Category : Uncategorized

గత రెండు నెలల ఉత్కంఠకి ఫైనల్‌గా తెర పడింది. రామ్ గోపాల్ వర్మ అనుకున్నది సాధించాడు. కానీ ఏపీ సర్కార్ మొత్తానికి ఎలాగోలా లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల కాకుండా అడ్డు కట్ట వేసి.. వర్మకి షాకిచ్చింది. ఏపీ హైకోర్ట్ నుండి స్టే తెచ్చి మరీ లక్ష్మీస్ ఎన్టీఆర్‌ని ఆపేసింది ఏపీ ప్రభుత్వం. కానీ తెలంగాణలోనూ, ఓవర్సీస్ లోను లక్ష్మీస్ ఎన్టీఆర్ షోస్ యధావిధిగా పడుతున్నాయి. తాజాగా లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రీమియర్స్ పూర్తి చేసుకుంది. మరి లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రీమియర్స్ టాక్ ఏమిటంటే.. రామ్ గోపాల్ వర్మ చంద్రబాబు మీద కక్ష తీర్చుకోవడానికే లక్ష్మీస్ ఎన్టీఆర్ ని తెరకెక్కించాడనే ఏదైతే మీడియాలో చాలా రోజులుగా ప్రచారం జరిగిందో.. అది లక్ష్మీస్ ఎన్టీఆర్ చూసిన ప్రతి ఒక్కరికి అర్ధమవుతుంది. నిజంగానే చంద్రబాబు మీద వర్మ ఇంతగా పగ పట్టాడా అని.

అడుగడుగునా బాబుని విలన్‌గా చేసి చూపించాడు. ఇక లక్ష్మి పార్వతి మీద సాఫ్ట్ కార్నర్ కలిగేలా.. ఎన్టీఆర్ ఆత్మ క్షోభను చూపించాడు వర్మ. సినిమా మొదలవడమే లక్ష్మి పార్వతి… ఎన్టీఆర్ మీద ఆత్మకథ రాస్తానంటూ ఎన్టీఆర్ లైఫ్ లోకి ఎంటర్ అవడం.. తర్వాత ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతి మధ్య పరిచయం, వారిమధ్యన అన్యోన్యతని ఫస్ట్ హాఫ్ లో చూపించాడు. ఇక తర్వాత సెకండ్ హాఫ్ లో చంద్రబాబు వెన్నుపోటు, ఎన్టీఆర్ మీద నందమూరి ఫ్యామిలీ తిరుగుబాటు, వైస్రాయ్ ఉదంతం, ఎన్టీఆర్ పదవిని కోల్పోవడం వంటి వాటిని చూపించిన వర్మ…. లక్ష్మి పార్వతికి – ఎన్టీఆర్ కి మధ్యన ఉన్న అనుబంధాన్ని మాత్రం చాలా చక్కగా చూపించాడు.

రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా మొత్తం చంద్రబాబు, నందమూరి ఫ్యామిలీ, లక్ష్మి పార్వతి, ఎన్టీఆర్ ల మీద కథ నడిపించాడు. కాకపోతే సినిమా మొత్తం చంద్రబాబు మీద ప్రతీకారంతోనే సినిమాని వర్మ తీసాడా అనిపిస్తుంది సగటు ప్రేక్షకుడికి. ఇక నటీనటులు మాత్రం తమ పాత్రలకు తగిన న్యాయం చేశారు. ముఖ్యంగా చంద్రబాబు పాత్రధారి శ్రీతేజ్ అద్భుతంగా నటించాడు. ఇంకా కళ్యాణ్ మాలిక్ సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ బాగున్నాయి.


ఆ ఈవెంట్‌లో జనసేన గురించి తారక్ మాట్లాడతాడా?

Category : Uncategorized

ఏప్రిల్‌ 5వ తేదీ నుంచి వరుసగా యంగ్‌హీరోలు తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు. ఏప్రిల్‌ 5న నాగచైతన్య ‘మజిలీ’, 12న సాయిధరమ్‌తేజ్‌ ‘చిత్రలహరి’, 19న నాని ‘జెర్సీ’, 25న బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ ఇలా పలువురు లైన్‌లో ఉన్నారు. ఇక ఈ చిత్రాల సంగతేమో గానీ వీటి ప్రీరిలీజ్‌ వేడుకలకు సంబంధించిన వార్తలు ఆసక్తికరంగా మారాయి. ఏప్రిల్‌ 5న నాగచైతన్య-సమంతల ‘మజిలీ’ ప్రీరిలీజ్‌ వేడుక గ్రాండ్‌గా జరుపనున్నారు. పెళ్లయిన తర్వాత చైతుతో సమంత కలిసి నటిస్తున్న మొదటి చిత్రం ఇదే కావడం గమనార్హం. 

ఇక ఈ వేడుకకు నాగచైతన్య తండ్రి, సమంత మామయ్య నాగార్జున, నాగచైతన్యకి మేనమామ విక్టరీ వెంకటేష్‌లు ముఖ్య అతిథులుగా రానున్నారని తెలుస్తోంది. గతంలో నాగచైతన్య మొదటి చిత్రం ‘జోష్‌’ వేడుకకు నాగ్‌, వెంకీలు కలిసి వచ్చారు. ఈ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మించగా, ఈ చిత్రం ఫ్లాప్‌ అయింది. మరి వారిద్దరు మరోసారి ‘మజిలీ’ వేడుకకు వస్తున్నారు. మరి దీని ఫలితం ఎలా ఉంటుందో వేచిచూడాల్సివుంది…! ఇదే సమయంలో మెగా మేనల్లుడు సాయిధరమ్‌తేజ్‌ నటించిన ‘చిత్రలహరి’ వేడుకకు ముఖ్య అతిథి ఎన్టీఆర్‌ అనే ప్రచారం సాగుతోంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో ఎన్టీఆర్‌తో కలసి నటిస్తున్న చరణ్‌ అభ్యర్ధన మేరకే ఎన్టీఆర్‌ వస్తాడనే వార్తలు వినిపిసున్నాయి. 

ఇక మెగా కాంపౌండ్‌ హీరోల వేడుక అంటే వాటికి పవన్‌కళ్యాణ్‌ హాజరైనా కాకపోయినా పవన్‌ అభిమానులు గోలగోల చేస్తారు. తమ హీరో గురించి చెప్పమని, మాట్లాడమని, ఆయన పార్టీ జనసేన గురించి అతిధులు అందరూ మాట్లాడేవరకు వారు ఊరుకోరు. గతంలో ఇదే విషయంలో ‘చెప్పను బ్రదర్‌’ అంటూ బన్నీ బుక్‌ అయ్యాడు. ప్రస్తుతం జూనియర్‌ ఎన్టీఆర్‌ రాజకీయాలకు దూరంగా ఉన్నాడు. టిడిపికి కూడా మద్దతు ఇవ్వలేదు. అలాంటి పరిస్థితుల్లో ఆయన ‘చిత్రలహరి’ ప్రీరిలీజ్‌ వేడుకకు విచ్చేస్తే మాత్రం పవన్‌ గురించి మాట్లాడకుండా ఉండేందుకు అభిమానులు ఒప్పుకోరు. ఇలాంటివి దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే చిత్రలహరికి ఎన్టీఆర్‌ హాజరు అవుతాడా? లేదా? అనే అనుమానాలు మాత్రం కలుగుతున్నాయి. 


‘ఇది నా సెల్ఫీ’.. సెల్ఫీ కొట్టు-గిఫ్ట్ పట్టు

Category : Uncategorized

వినోద్‌, ఆరోహి (అనురాధ) హీరో హీరోయిన్లుగా, సెల్ఫీ వల్ల జరిగిన ఒక యధార్థ సంఘటన ఆధారంగా సి.హెచ్‌. ప్రభాకర్‌ (చరణ్) స్వీయ దర్శకత్వంలో చిరుగురి చెంచయ్య సుగుణమ్మ సమర్పణలో  శ్రీచరణ్ సెన్షేషనల్ మూవీస్ బ్యానర్ సంస్థ వారు  నిర్మిస్తున్న చిత్రం ‘ఇది నా సెల్ఫీ’.. పోతుమర్తి సతీష్ గాయ్ సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు.. ఇటీవలే ఈ చిత్ర ట్రైలర్ ని ప్రముఖ దర్శకుడు మారుతి విడుదల చేయగా ఈ ట్రైలర్ కి మంచి స్పందన దక్కింది..  ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకి సిద్ధంగా ఉంది.. శ్రీనివాస్‌ మాలపాటి సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో ఇప్పటికే విడుదల కాగా ఆ ఆడియో సూపర్ హిట్ అయ్యింది.. కాగా ఈ చిత్రం యొక్క పోస్టర్ ని ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేశారు.. అంతేకాకుండా చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా సెల్ఫీ కాంటెస్ట్ నిర్వహించి విజేతలకు విలువైన బహుమతులను కూడా అందజేయనున్నారు. ప్రేక్షకులు ఆసక్తికరమైన సెల్ఫీని ఫేస్ బుక్ లో ‘ఇది నా సెల్ఫీ’ పేజీకి టాగ్ చేసి పోస్ట్ చేయాలి.. దాంట్లో ఉత్తమమైన సెల్ఫీని ఎంపిక చేసి విజేతలుగా నిర్ణయిస్తారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత , దర్శకుడు సి.హెచ్ ప్రభాకర్ (చరణ్) మాట్లాడుతూ… సినిమాలో ప్రతి ఒక్క ఫ్రేమ్ చాలా బాగా వచ్చింది. రెండు గంటలు ప్రేక్షకులని మెప్పిస్తుంది. సినిమా కోసం ప్రతి ఒక్కరు కష్టపడ్డారు. సెల్ఫీల మోజులకే  పరిమితమయిపోతున్న ఈ జనరేషన్ ని మార్చే సినిమా ఇది. మంచి ఎంటర్ టైన్మెంట్ తో కూడిన కథ. ఈ సినిమాకి సపోర్ట్ చేసిన అందరికి థాంక్స్. సినిమా ఇండస్ట్రీలో చాలా మంది పెద్ద మనుషులు ఉన్నారండి. కానీ పెద్ద మనసున్న మనుషులు కొంతమందే ఉన్నారు. అందులో రాజ్ కందుకూరి గారు ఒకరు. మా చిన్న సినిమాని ఆశీర్వదించడానికి వచ్చిన ఆయనకు మా ప్రత్యేక కృతజ్ఞతలు.  సినిమా ఇంత బాగా రావడానికి కారణమైన టెక్నిషియన్స్, నటీనటులకు నా కృతజ్ఞతలు. నాకు ప్రతి విషయంలో సపోర్ట్ చేసిన పోతుమర్తి సతీష్ గాయ్ గారికి కృతజ్ఞతలు. తప్పకుండా ఈ సినిమాని చూసి ప్రేక్షకులు విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను అన్నారు. 

సహా నిర్మాత సతీష్ గాయ్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో నటించిన అందరికి ధన్యవాదాలు. ఎప్పటికైనా సినిమాల్లోకి రావాలనేది నా కల. అలాటి టైంలో నాకు ప్రభాకర్ గారు పరిచయడం అవడం.. ఈ సినిమా కథ నచ్చి వారితో కలిసి తీయడం జరిగింది. అందరికి నచ్చే సినిమా. మంచి సోషల్ మెసేజ్ ఉంది. మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలకు ప్రత్యేక కృతజ్ఞతలు. తప్పక ఈ సినిమా చూడండి అన్నారు.  

నటుడు  బి హెచ్ ఈ ఎల్ ప్రసాద్ మాట్లాడుతూ..  మా సినిమాని  ఆశీర్వదించడానికి వచ్చిన నిర్మాత రాజ్ కందుకూరి గారికి ధన్యవాదాలు. సినిమా తీయాలనే ప్యాషన్ తో వచ్చిన నిర్మాత ప్రభాకర్ గారు.. అలాంటి నిర్మాత నుంచి వస్తున్న మొదటి సినిమా చాలా మంచి కథతో వస్తున్నారు. టీం అంతా ఎంతో కష్టపడి ఈ సినిమాని చేశారు. మంచి అవుట్ ఫుట్ వచ్చింది. అందరూ తప్పక చూసి ఆనందించండి. మీ అందరికి తప్పకుండా నచ్చుతుంది. అన్నారు..

ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. సినిమా పోస్టర్ చాలా బాగుంది. విజువల్స్ చాలా బాగా కనిపిస్తున్నాయి. డైరెక్టర్ మంచి టేస్ట్ ఉన్న డైరెక్టర్ అని సినిమా చూస్తేనే తెలిసిపోతుంది. నటీనటులు చాలా బాగా చేశారు. ఈ సినిమా అందరు తప్పక చూడండి. అన్నారు. 

హీరో వినోద్ మాట్లాడుతూ.. సెల్ఫీ కాన్సెప్ట్ తో ఒక మంచి సినిమా చేసాం. ఈ సినిమా కోసం అందరం చాలా కష్టపడ్డాం. సినిమా చాలా బాగా వచ్చింది. డైరెక్టర్ గారు ఎంతో కష్టపడి సినిమా చేశారు. అందరు నటీనటులు చాలా బాగా చేశారు. ఈ సినిమాని , మమ్మల్ని అశీర్వదించడానికి వచ్చిన నిర్మాత రాజ్ కందుకూరి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అందరు ఈ సినిమాని తప్పక చూడండి. అన్నారు..

నటీనటులు : సానియా, సి.హెచ్. ప్రభాకర్ (చరణ్) , అనూష, వీర్ కరణ్, దిలీప్, సురేష్,కర్ణాటక శ్రీనివాస్, బి హెచ్ ఈ ఎల్ ప్రసాద్, సుబ్బారెడ్డి.

సాంకేతిక నిపుణులు : 

నిర్మాత & దర్శకుడు : సి.హెచ్‌. ప్రభాకర్‌ (చరణ్)

సహా నిర్మాత : పోతుమర్తి సతీష్ గాయ్ ఎమ్. ఏ, డి.ఎమ్.ఈ

బ్యానర్ : శ్రీచరణ్ సెన్షేషనల్ మూవీస్

సమర్పణ : చెంచయ్య సుగుణమ్మ

మ్యూజిక్ : శ్రీనివాస్‌ మాలపాటి

సినిమాటోగ్రఫీ :  జి.శ్రీకాంత్, పి.జాన్సన్, రెమో, కరణ్ చంద్ర

ఎడిటింగ్ : వీరు

రచయితలు : సి.హెచ్ .ప్రభాకర్, సతీష్ గాయ్, డి. లక్కీ, శ్రీరామ్ రెడ్డి సైకం..

డైరెక్షన్ డిపార్ట్ మెంట్ : సాగర్ చీకటిపల్లి, చోడవరపు లక్ష్మి, నాగభైరవ లీల


‘సైరా’లో రెండే రెండు నిమిషాలు: నీహారిక

Category : Uncategorized

సైరా సినిమాలో నిహారిక నటిస్తుందని క్లారిటీ వచ్చేసింది. లేటెస్ట్ గా నిహారిక ఆన్ లొకేషన్ పిక్ కూడా బయటికి వచ్చింది. అయితే నిహారిక ఇందులో స్క్రీన్ టైం చాలా చాలా తక్కువట. కేవలం రెండే రెండు నిముషాలు అంట. అయినా కానీ తనకు మెగాస్టార్ సినిమాలో నటించాలని కలలు కన్నానని.. కాబట్టి అందులో ఒక్క నిమిషం కనిపించినా తనకు బాధేమీ లేదని చెప్పింది.

ఇందులో ఒక సన్నివేశం లో నేను చేసిన యాక్టింగ్ కి ప్రశంసలు దక్కుతాయని ఆశిస్తున్నానని నిహారిక చెప్పింది. ఇక నిహారిక లేటెస్ట్ మూవీ ‘సూర్యకాంతం’ మూవీ కొన్ని గంటలు ముందే రిలీజ్ అయింది. ఇందులో ఆమె నటన ప్రేక్షకులకి నచ్చిందట.

‘‘ఒక మనసు, హ్యాపీ వెడ్డింగ్‌” రెండు మంచి సినిమాలే కానీ ఫలితాలే నిరాశ పరిచాయి. అందుకే ఈసినిమాపై ఫోకస్ పెట్టింది. భవిష్యత్తులో సినిమాల్లో కొనసాగుతారా లేదా అన్న ప్రశ్నకు… తనకు ప్రొడక్షన్ మీద, వెబ్ సిరీస్ మీద ఆసక్తి ఉందని చెప్పడం ద్వారా మున్ముందు కథానాయికగా కొనసాగడం సందేహమే అని చెప్పకనే చెప్పింది ఈ కొణిదెల అమ్మాయి.


‘ఎఫ్2’తో హిందీకి వెళుతున్న ‘దిల్’ రాజు

Category : Uncategorized

విజయవంతమైన చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ ‘దిల్’ రాజు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఓ ‘దిల్’… ఓ ‘ఆర్య’… ‘భద్ర’, ‘బొమ్మరిల్లు’, ‘పరుగు’,  ‘కొత్త బంగారు లోకం’, ‘బృందావనం’, ‘మిస్టర్ ఫర్ఫెక్ట్’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘ఎవడు’, ‘కేరింత’, ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’, ‘శతమానం భవతి’, ‘నేను లోకల్’, ‘దువ్వాడ జగన్నాథం – డీజే’, ‘ఫిదా’, ‘రాజా ది గ్రేట్’, ‘ఎంసీఏ’, ‘ఎఫ్ 2’ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలను ఆయన ప్రేక్షకులకు అందించారు.

‘దిల్’ నుంచి ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై ఘన విజయం సాధించిన ‘ఎఫ్ 2’ వరకూ దిల్ రాజు నిర్మించిన చిత్రాల్లో అత్యధిక శాతం చిత్రాలు విజయాలు సాధించాయి. హైయెస్ట్ సక్సెస్ రేట్ ఉన్న నిర్మాతల్లో ఆయన ఒకరు. ఎగ్జిబ్యూటర్ గా, డిస్ట్రిబ్యూట‌ర్‌గా, నిర్మాతగా తెలుగులో తనకంటూ ప్రత్యేక గుర్తింపును దిల్ రాజు సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఆయన హిందీ పరిశ్రమలో అడుగు పెడుతున్నారు. కుటుంబ కథా చిత్రాలకు వందకోట్ల రూపాయలు వసూలు చేసే సత్తా ఉందని నిరూపించిన ‘ఎఫ్ 2’ను హిందీలో రీమేక్ చేస్తున్నారు. నిర్మాతగా హిందీలో దిల్ రాజుకు తొలి చిత్రమిది.

ప్రముఖ తెలుగు నిర్మాత దిల్ రాజు, ప్రముఖ హిందీ నిర్మాత బోనీ కపూర్ సంయుక్తంగా ‘ఎఫ్ 2’ హిందీ రీమేక్ నిర్మించనున్నారు. హిందీలో అనీస్ బజ్మీ దర్శకత్వం వహిస్తారు. ఇంతకు ముందు ఈ దర్శకుడు తెలుగులో విజయవంతమైన ‘రెడీ’ చిత్రాన్ని సల్మాన్ ఖాన్, ఆసిన్ జంటగా అదే పేరుతో హిందీలో రీమేక్ చేశారు. అలాగే, ‘పెళ్ళాం ఊరెళితే’ చిత్రాన్ని ‘నో ఎంట్రీ’గా రీమేక్ చేశారు. ఇప్పుడు ‘ఎఫ్ 2’ రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నారు. 

ఈ సినిమాలో నటించే హీరోలు, ఇతర తారాగణం తదితర వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.


త్రివిక్రమ్ – బన్నీ ఎందుకు ఆలోచిస్తున్నారు?

Category : Uncategorized

అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబో సినిమా అనౌన్స్ చేసి దాదాపుగా నాలుగు నెలలు టైం అవుతుంది. కానీ ఇంతవరకు వారి కాంబో పట్టాలెక్కలేదు. అల్లు అర్జున్ మాత్రం మధ్య మధ్యలో అభిమానులకు చిరాకు రాకుండా సర్ది చెబుతూ వస్తున్నాడు. తాజాగా సోషల్ మీడియాలో అల్లు అర్జున్ సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎప్పుడు అంటూ మెగా ఫాన్స్ తొందరపెడుతుంటే… ఈ సినిమా నిర్మాణ సంస్థ హారిక హాసిని వారు.. త్రివిక్రమ్ – బన్నీల సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో జోరుగా పనిచేస్తుంది.. త్వరలోనే సినిమా మొదలవుతుందని అభిమానులను శాంతింపజేశారు. కానీ.. ఎప్పుడునుండి పట్టాలెక్కుతోంది అనేది క్లారిటీ ఇవ్వలేదు.

తాజాగా బన్నీ – త్రివిక్రమ్ సినిమా ఇంతగా లేట్ అవడానికి బడ్జెట్ కారణమంటూ ఒక న్యూస్ ఫిలింసర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. హారిక హాసిని, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమాకి ఎవ‌రు ఎంత పెట్టుబ‌డి పెట్టాల‌నే విష‌యంలో ఇంకా చ‌ర్చ‌లు కొలిక్కి రాలేద‌నేది లేటెస్ట్ టాక్. అలాగే లాభాల్లో కూడా ఎవ‌రు ఎంత వాటా తీసుకోవాలి అనే దానిమీద కూడా చర్చలు జరుగుతున్నాయట. మరి త్రివిక్రమ్ ఎప్పుడు తన సొంత బ్యానర్ లాంటి హారిక హాసిని వారి నిర్మాణంలో సినిమాలు చేస్తూ వస్తున్నాడు.

కానీ ఈసారి త్రివిక్రమ్ క్రేజ్ తగ్గడంతో… బన్నీ ది అప్పర్ హ్యాండ్ అవడంతో… బన్నీ తన ఓన్ నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ ని కూడా కలిపాడు. అయితే అల్లు అర్జున్  క్రేజ్ దృష్ట్యా ఈ సినిమాకి ఎంత పెట్టుబడి పెట్టాలి, బన్నీ పారితోషకం ఎంత… అలాగే సీనియర్ ఆర్టిస్ట్ ల పారితోషకాలతో పాటుగా.. హీరోయిన్ రెమ్యూనరేషన్, విదేశాల్లో షూట్స్ అన్ని కలిపి బన్నీ బడ్జెట్ లెక్కెడితే 70 కోట్లు దాటుతుంది. కానీ ప్రస్తుతం 50 కోట్ల క్రేజున్న అల్లు అర్జున్ మీద 70 కోట్ల పెట్టుబడి పెడితే వర్కౌట్ అవుతుందా అనే మీమాంశలో హారిక హాసినితో పాటుగా గీత్ ఆర్ట్స్ వారు ఉన్నారట. అందుకే బడ్జెట్ ఒక కొలిక్కి రాక త్రివిక్రమ్ – అల్లు అర్జున్ ల కాంబో లేట్ అవుతూ వస్తుందనేది లేటెస్ట్ టాక్.