హైదరాబాద్ నందు (బంజర హిల్స్, జూబిలీ హిల్స్, మాదాపూర్, కొండాపూర్ ) పరిసర ప్రాంతాల్లో పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ వెంటనే కావాలను. ఆర్మీ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేసి రిటైర్ అయినా వారికీ తగిన ప్రాధాన్యత ఇవ్వ బడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ + 91 8074965869

Monthly Archives: April 2019

చివరికి ‘వి’ని ఫిక్స్ చేశారు

Category : Uncategorized

నాని, సుధీర్ బాబు కాంబినేష‌న్‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ ప్రొడక్ష‌న్ నెం.36 చిత్రం ‘వి’ ప్రారంభం

నేచుర‌ల్ స్టార్ నాని, హీరో సుధీర్‌బాబు, అదితిరావు హైద‌రి, నివేదా థామ‌స్ హీరో హీరోయిన్లుగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ ప్రొడ‌క్ష‌న్ నెం.36 చిత్రం ‘వి’ సోమ‌వారం హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైంది. శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శిరీష్‌, ల‌క్ష్మ‌న్‌, హ‌ర్షిత్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ద‌ర్శ‌కుడు. దిల్‌రాజు, శిరీష్, ల‌క్ష్మ‌ణ్‌ ఆధ్వ‌ర్యంలో పూజా కార్య‌క్ర‌మాల‌ను జ‌రిగాయి. ముహూర్త‌పు స‌న్నివేశానికి ద‌ర్శ‌కుడు ‘ఎంసిఎ’ డైరెక్ట‌ర్ శ్రీరామ్ వేణు క్లాప్ కొట్ట‌గా.. ‘నేను లోక‌ల్‌’ ద‌ర్శ‌కుడు త్రినాథ‌రావు న‌క్కిన కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ‘ఎఫ్‌2’ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. త్వ‌ర‌లోనే సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. మ‌రిన్ని వివ‌రాల‌ను త్వరలోనే తెలియ‌జేస్తామ‌ని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది. 

న‌టీన‌టులు:

నాని

సుధీర్ బాబు 

అదితిరావు హైద‌రి

నివేదా థామ‌స్‌

త‌నికెళ్ళ‌భ‌ర‌ణి

వి.కె.న‌రేష్‌

రోహిణి

వెన్నెల‌కిశోర్ త‌దిత‌రులు

 

సాంకేతిక నిపుణులు:

మేక‌ప్‌: అర్జున్‌

కాస్ట్యూమ్స్‌: య‌న్‌.మ‌నోజ్‌కుమార్‌

కాస్ట్యూమ్ డిజైన‌ర్‌: రాజేష్‌, అశ్విన్‌

ప్రొడ‌క్ష‌న్ కంట్రోట‌ర్‌: వి.చంద్ర‌మోహ‌న్‌

కో డైరెక్ట‌ర్‌: కోట సురేష్ కుమార్‌

పాటలు: సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి

ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌:  ర‌వీంద‌ర్‌

స్టంట్స్‌: ర‌వివ‌ర్మ‌

ఎడిట‌ర్‌: మార్తాండ్ కె.వెంక‌టేష్‌

డైరెక్ట‌ర్ ఆఫ్ ఫోటోగ్ర‌ఫీ: పి.జి.విందా

సంగీతం: అమిత్ త్రివేది

నిర్మాత‌లు: శిరీష్‌, ల‌క్ష్మ‌ణ్, హ‌ర్షిత్ రెడ్డి

ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి


రానా ఆల్‌మోస్ట్‌ ఏడిచినట్టున్నాడు : నాని

Category : Uncategorized

‘జెర్సీ’ సినిమా ఎప్పటికీ మా టీమ్‌కి స్పెషల్‌గా ఉంటుంది. ‘అందరూ పాతబడిపోవచ్చు కానీ, ‘జెర్సీ’ సినిమా ఎప్పటికీ పాతబడిపోదు. చాలా చాలా స్పెషల్, ప్రౌడ్‌ సినిమాగా మిగిలిపోతుంది’ అని నాని అన్నారు. ఆయన హీరోగా, శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోయిన్‌గా ‘మళ్ళీరావా’ ఫేం గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జెర్సీ’. పీడీవీ ప్రసాద్‌ సమర్పణలో, సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ  నిర్మించిన ఈ సినిమా ఈ నెల 19న విడుదల అయింది. నాటి నుంచి అప్రతిహతంగా చిత్ర విజయం సరికొత్త రికార్డ్ లను నెలకొల్పుతోంది.

ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో నిర్వహించిన ‘థ్యాంక్యూ మీట్‌’లో నాచురల్ స్టార్ నాని మాట్లాడుతూ– ‘జెర్సీ’ రిలీజ్‌ తర్వాత నాకు వచ్చిన మెసేజెస్‌ కానీ, ఎక్కడికెళ్లినా ప్రేక్షకులు సినిమా గురించి, నటన, టెక్నీషియన్స్‌ గురించి మాట్లాడుతున్న విధానం కానీ.. నేనెప్పుడూ ఎక్స్‌పీరియన్స్‌ చేయని ఒక ఫీలింగ్‌. ఏ సినిమాకైనా తొలి మూడు రోజులు బోల్డన్ని మెసేజ్‌లు, ఫీడ్‌బ్యాక్‌ వస్తుంటాయి. వారం తర్వాత ఆ ఫీడ్‌బ్యాక్‌ తగ్గుతూ ఉంటుంది. కానీ ‘జెర్సీ’ కి రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఏ రోజుకారోజు మెసేజ్‌లతో మా ఫోన్లు నిండిపోతున్నాయి. రివర్స్‌లో మాకు థ్యాంక్యూ మెసేజ్‌లు వస్తున్నాయి. అందుకే టీమ్‌ అందరి తరుపున ఒక ఫైనల్‌ థ్యాంక్యూ చెప్పాలని ఈ మీట్‌ ఏర్పాటుచేశాం. చాలా ఎమోషన్‌ ఉన్న సినిమా కదా రిపీట్‌గా చూసేవాళ్లకి ఎలా ఉంటుందనుకున్నాం. కానీ, చాలా మంది మళ్లీ మళ్లీ చూసి మెసేజ్‌లు చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి వీటిని మెసేజ్‌లు అనలేను.. ఎందుకంటే ఓ చిన్న లవ్‌లెటర్స్‌లా ఉన్నాయి.. అందరికీ థ్యాంక్యూ సోమచ్‌. ‘జెర్సీ’ సినిమా చూసిన రానా కాల్‌ చేసినప్పుడు ఆ వాయిస్‌ నాకు గుర్తుంది.. వాడు(రానా) ఆల్‌మోస్ట్‌ ఏడిచినట్టున్నాడు.. కచ్చితంగా రానాను ఈ ఫంక్షన్‌కి పిలుద్దామనుకున్నా. లాస్ట్‌ మినిట్‌లో ఫోన్‌ చేసినా వస్తాడులే అన్న నమ్మకం.. ఎందుకంటే వాడికి సినిమా ఎంత నచ్చిందో నాకు తెలుసు. మా కష్టానికి అంత రెస్పెక్ట్‌ చూపించిన ప్రేక్షకులందరికీ, మీడియాకి థ్యాంక్స్‌’’ అన్నారు.  

హీరో రానా మాట్లాడుతూ– ‘‘నేను సక్సెస్‌ మీట్‌కి వచ్చి చాలా రోజులు అయింది. కానీ, ‘జెర్సీ’ సినిమాకి రావాలనుకున్నా. ఎందుకంటే.. నాకు లైఫ్‌లో బేసిక్‌గా కొన్ని అర్థంకావు. క్రికెట్, పెళ్లి, అమ్మాయిలు, పిల్లలు. ఇవన్నీ అర్థం కాని నాకే ఈ సినిమా చూసి ఏడుపు వచ్చిందంటే ప్రేక్షకుల పరిస్థితి ఏమై ఉంటుందో నాకు తెలుసు. నాని నటన సూపర్‌. ప్రతిరోజు నాకు స్ఫూర్తినిస్తుంటాడు. వారంలో మూడు సార్లు తనని చూస్తాను. అయినా కానీ సినిమాపై అతనికి ఉన్న ప్రేమ చూస్తే ఎంతో కొత్తగా చేయాలని స్ఫూర్తినిస్తూ ఉంటుంది. గౌత‌మ్ స్టోరీ టెల్ల‌ర్‌గా.. ఫిలింమేక‌ర్‌గా జెర్సీతో అంద‌రినీ ట‌చ్ చేశాడు. యు టర్న్ నుండి శ్ర‌ద్ధాశ్రీనాథ్‌కు నేను పెద్ద ఫ్యాన్‌ని.  ‘జెర్సీ’ కి పనిచేసిన వారందరికీ చెబుతున్నా. సినిమా అన్నది శాశ్వతం.. అందులో ‘జెర్సీ’ సినిమా కోసం ఎప్పుడూ ఒక పేజీ తప్పకుండా ఉంటుంది అన్నారు. ఎంటైర్ టీంకు ఇదొక మెరిట్‌లా మిగిలిపోతుంది’’ అన్నారు.

ద‌ర్శ‌కుడు గౌతమ్‌ తిన్ననూరి మాట్లాడుతూ– ‘‘మా సినిమాకి ప్రేక్షకుల నుంచి, మీడియా నుంచి వచ్చిన అభినందనలకు అందరికీ కృతజ్ఞతలు. ఈ సినిమాను నాకు చేసే అవ‌కాశం క‌ల్పించిన నిర్మాత‌లు పిడివి. ప్ర‌సాద్‌, సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ గారికి, సినిమా కోసం వ‌ర్క్‌చేసిన ప్ర‌తి ఒక ఆర్టిస్ట్‌, టెక్నీషియ‌న్‌కి థాంక్స్‌. నాని సార్‌కి స్పెష‌ల్ థాంక్స్‌. శ్ర‌ద్ధాశ్రీనాథ్‌కి థాంక్స్‌. నా డైరెక్ష‌న్ టీం ఎంత‌గానో స‌పోర్ట్ చేశారు. సినిమాను చూడ‌ని వాళ్లు ఎవ‌రైనా ఉంటే.. చూడమ‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు. 

హీరోయిన్ శ్ర‌ద్ధా శ్రీనాథ్ మాట్లాడుతూ  – ‘‘ఈ రోజు ఏం చెప్పాలో తెలియ‌డం లేదు. థాంక్యూ చెబితే స‌రిపోదు. ప్రేక్ష‌కులు చూపించిన ప్రేమ‌కు థాంక్స్‌. ఇంకా మంచి సినిమాలు చేయాల‌నుకుంటున్నాను. సారా క్యారెక్ట‌ర్ చేయ‌డం ఆనందంగా ఉంది. సింగిల్ ఫాద‌ర్స్‌కు, సింగిల్ మ‌ద‌ర్స్‌కు .. ఈ సినిమాను అంకితం చేస్తున్నాను’’ అన్నారు.  

విశ్వంత్ మాట్లాడుతూ – ‘‘సినిమా ఓ బ్యూటీఫుల్ ఎక్స్‌పీరియెన్స్‌. డైరెక్ట‌ర్ గౌత‌మ్ తొలి సినిమా నుండి ప‌రిచ‌యం. ఒక‌ప్ప‌టితో పోల్చితే ఇప్పుడు త‌ను న‌వ్వుతున్నాడు. ఓ మంచి సినిమా చూసిన‌ప్పుడు చాలా శాటిస్పాక్ష‌న్ క‌లుగుతుంది. అదే అలాంటి సినిమాలో పార్ట్ అయితే ఆ ఆనందం రెండు, మూడు రెట్లు ఎక్కువ‌గా ఉంటుంది. అలాంటి అనుభూతిని ఇచ్చిన సినిమా ఇది’’ అన్నారు. 

పాట‌ల ర‌చ‌యిత కృష్ణ కాంత్ మాట్లాడుతూ – ‘‘న‌న్ను న‌మ్మి నాకు ఈ సినిమాలో అవ‌కాశం ఇచ్చిన గౌత‌మ్‌కి వంద‌సార్లు థాంక్స్ చెప్పినా స‌రిపోదు. అలాగే త‌మిళంలో స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అయిన అనిరుధ్ ఈ సినిమాలో నాతో సింగిల్ కార్డ్ రాయించినందుకు త‌న‌కు కూడా థాంక్స్‌. ఓ మంచి సినిమాను.. మాస్ట‌ర్ పీస్‌లాంటి సినిమా కోసం పాటు ప‌డ్డ నానిగారికి థాంక్స్‌. మంచి సినిమాను మిస్ కాకుండా చూడండి’’ అన్నారు.

ఈ కార్యక్రమంలో చిత్ర సమర్పకుడు పీడీవీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా చిత్ర నటీ నటులకు, సాంకేతిక నిపుణులకు, డిస్ట్రిబ్యూటర్ లకు ప్రముఖ కదా నాయకుడు రాణా, హీరో నాని, దర్శకుడు గౌతమ్, చిత్ర సమర్పకుడు పిడివి ప్రసాద్, నిర్మాత సూర్యదేవర నాగవంశీ  జ్ఞాపికలను బహుకరించారు. 


‘మహేష్ 26’ వార్తలు ఎక్కువైనాయ్!

Category : Uncategorized

వరుసగా రెండు మూడు పరాజయాల తర్వాత మహేష్‌బాబు మరలా శ్రీమంతుడు, భరత్‌ అనే నేను చిత్రాలతో పెద్ద హిట్స్‌ కొట్టాడు. ప్రస్తుతం ఆయన తన ప్రతిష్టాత్మక 25వ చిత్రంగా మహర్షి చిత్రం చేస్తున్నాడు. ఇందులో పూజాహెగ్డే , అల్లరి నరేష్‌లు ప్రధానపాత్రలు పోషిస్తుండగా.. దిల్‌రాజు, అశ్వనీదత్‌, పివిపి వంటి భారీ నిర్మాతలు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. వంశీపైడిపల్లి దీనికి సంగీతం అందిస్తూ ఉండటం విశేషం. ఇక ఈ మహర్షి చిత్రాన్నిమొదట ఏప్రిల్‌ 5, తర్వాత ఏప్రిల్‌ 25న విడుదల చేయాలని భావించి, వాయిదా వేశారు. ఈ మూవీ మే 9న విడుదల కానుంది. నిజంగా మహర్షిని మే 9కి లాక్‌ చేయడమే ఈ చిత్రానికి మేలు చేసిందని చెప్పాలి. ఎందుకంటే ఏప్రిల్‌ 25న ఈ చిత్రాన్ని విడుదల చేసి ఉంటే ఎవేంజర్స్‌ రూపంలో పెద్ద పోటీ వచ్చి ఉండేది. సాధారణ తెలుగు చిత్రాలకంటే, స్టార్‌ హీరోల చిత్రాలకు ధీటుగా ఎవెంజర్స్‌ పోటీ ఉంది. మే 9వ తేదీ అంటే అప్పటికి ఎవేంజర్స్‌ మూవీ విడుదలై రెండు వారాలు అవుతుంది కాబట్టి ఆ ఊపు ఉండదు. కాబట్టి పోటీ లేకపోవడం, కావాల్సినన్ని థియేటర్లు లభించడం, సోలో రిలీజ్‌ కావడం వంటివి మహర్షికి ప్లస్‌ అవుతాయి. 

ఇక ఈ చిత్రం తర్వాత మహేష్‌, దిల్‌రాజు-అనిల్‌సుంకర కాంబినేషన్‌లో ఎఫ్‌2 ఫేమ్‌ అనిల్‌రావిపూడి దర్శకత్వంలో చిత్రం చేస్తున్నాడు. ఇది మహేష్‌ 26వ చిత్రం కానుంది. ఇందులో రష్మికా మందన్న హీరోయన్‌గా నటిస్తోందని వార్తలు వస్తున్నాయి. ఇక ఎంతో కాలంగా సినిమాల నుంచి బయటకు వచ్చి రాజకీయ నాయకురాలిగా మారిన విజయశాంతి ఈ చిత్రంలో నటించేందుకు ఓకే చెప్పిందన్న మాట సంచలనంగా మారింది. ఇక ఇందులో జగపతిబాబుతో పాటు తనదైన పాత్రలను అద్భుతంగా పోషించి రక్తి కట్టించే శివగామి రమ్యకృష్ణ మరో కీలకపాత్రలో నటిస్తోందని తెలుస్తోంది. 

విశేషం ఏమిటంటే గతంలో జగపతిబాబు, విజయశాంతితో ఆశయం, రమ్యకృష్ణతో ఆయనకు ఇద్దరు వంటి పలు చిత్రాలు చేసి ఉన్నాడు. ఇలా ఈ ముగ్గురు కలిసి మహేష్‌ 26వ చిత్రంలో నటిస్తున్నారన్న వార్త నిజమైతే ఇక ఈ చిత్రంపై ఇప్పటి నుంచే భారీ అంచనాలు ఏర్పడటం ఖాయమని చెప్పాలి. మహర్షి హడావుడి పూర్తి అయిన తర్వాత ఈ చిత్రం పట్టాలెక్కనుంది. ఎలాగైనా వచ్చే సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు. మరోవైపు ఈ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. 


‘మహర్షి’కి వారే ప్రాబ్లమ్‌గా మారారు

Category : Uncategorized

మహేష్ బాబు – వంశి పైడిపల్లి సినిమా మొదలయ్యేనాటికి కేవలం దిల్ రాజు మాత్రమే ఆ సినిమాకి నిర్మాత. అశ్విని దత్ మాత్రం సమర్పకుడిగా వ్యవహరిస్తానని.. మొదట్లో చెప్పాడు. కానీ చివరికి దిల్ రాజుతో పాటుగా అశ్వినీదత్ కూడా మహర్షి సినిమాకి నిర్మాతగా మారాడు. ఇక దిల్ రాజు, అశ్వినీదత్ నిర్మాతలుగా మహర్షి సినిమా పట్టాలెక్కే టైంకి.. నిర్మాత పీవీపీ, మహేష్ తనకి సినిమా చేస్తానని మాటిచ్చి.. తనకి డేట్స్ కూడా ఇచ్చాడని…. అది ఇప్పట్లో జరిగేలా లేదు కనక.. తాను కూడా మహర్షికి నిర్మాతగా ఉంటానని.. అడగ్గా. దానికి దిల్ రాజు ఒప్పుకోలేదు. దానితో జూన్ లో మొదలవ్వాల్సిన మహర్షి సినిమా కోర్టు మెట్లెక్కింది. పివిపి తన వ్యవహారం తేలేవరకు సినిమాని మొదలెట్టనివ్వని మంకు పట్టు పట్టుకుని కూర్చున్నాడు. ఇక చేసేది లేక దిల్ రాజు కోర్టు బయట కాంప్రమైజ్ చేసుకుని పివీపిని కూడా మహర్షి నిర్మాతగా చేసాడు.

ఇక మహర్షి షూటింగ్ విషయంలో ఏ ఆటంకం లేకుండా సాఫీగా జరిగినా.. మధ్యలో దిల్ రాజు పెత్తనాన్ని అశ్వినీదత్  తట్టుకోలేకపోతున్నాడనే టాక్ సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. తాజాగా అశ్వినీదత్ వలన దిల్ రాజు తలపట్టుకున్నాడనే టాక్ మొదలైంది. ఇప్పటికే 140 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన మహర్షి సినిమా విషయంలో అశ్వినీదత్ ముందు నుండి ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా ఇప్పుడు బిజినెస్ విషయంలో డిమాండ్స్ చేస్తున్నట్లు సమాచారం. గత ఏడాది అశ్వనీదత్ నిర్మించిన దేవదాసు తాలూకు బకాయిలు నైజాం డిస్ట్రిబ్యూటర్ సునీల్ కి కోటి అరవై లక్షల వరకు చెల్లించాల్సివుందట. అయితే ఇప్పటివరకు వాటి సెటిల్మెంట్ జరగలేదు. 

అందుకే ఇప్పుడు మహర్షి బిజినెస్ లో దాన్ని అడ్జస్ట్ చేయమని సునీల్.. అశ్వినీదత్ ని అడిగినట్లు సమాచారం. మరి దానికి అశ్వనీదత్ ఒప్పుకున్నా.. మిగిలిన ఇద్దరు నిర్మాతలు దిల్ రాజు, పివిపిల నుండి వ్యతిరేకత వచ్చిందట. అంత బిజినెస్ చేసిన మహర్షికి ఇంత చిన్న మొత్తం అడ్జెస్ట్ చెయ్యడం కష్టం కాదుగా అని అంటున్నారట. ఒకవేళ అది అడ్జెస్ట్ చేయకపోతే కృష్ణా ఏరియా రైట్స్ అయినా తనకు ఇవ్వమని అశ్వినీదత్ పట్టుపడుతున్నట్లుగా సమాచారం. వాటాగా ఓ ఏరియా ఇలా ఇచ్చేస్తాం..లాభాల్లో షేర్ ఇస్తామని అగ్రిమెంట్ చేసుకున్నాం కదా అని మిగతా ఇద్దరు నిర్మాతలు చెప్తున్నారనే న్యూస్ ఇప్పుడు మీడియాలో హల్చల్ చేస్తుంది.


ఎట్టకేలకు ‘డియర్ కామ్రేడ్’కు పేకప్ చెప్పారు

Category : Uncategorized

సెన్సేష‌న‌ల్ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న జంట‌గా న‌టిస్తోన్న చిత్రం ‘డియ‌ర్ కామ్రేడ్‌’. ‘ఫైట్ ఫ‌ర్ వాట్ యు ల‌వ్‌’ అనే ట్యాగ్‌లైన్‌తో ఈ ఎమోష‌న‌ల్ డ్రామా తెర‌కెక్కుతోంది. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, బిగ్ బెన్ సినిమా సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని ద‌క్షిణాది భాష‌లైన తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. 

ఈ సినిమా చిత్రీక‌ర‌ణంతా పూర్త‌య్యింది. షూటింగ్ చివ‌రి రోజున యూనిట్ చిన్న గెట్ టు గెద‌ర్ పార్టీని సెల‌బ్రేట్ చేసుకున్నారు. చిత్ర ద‌ర్శకుడు భ‌ర‌త్ క‌మ్మ సినిమా మేకింగ్‌లో భాగ‌మైన అంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. 

రీసెంట్‌గా విడుద‌లైన టీజ‌ర్‌తో సినిమాపై అంచ‌నాలు మ‌రింత పెరిగాయి. జ‌స్టిన్ ప్ర‌భాక‌ర్ సంగీత సార‌థ్యం వ‌హించిన ఈ సినిమాలో విడుద‌లైన సాంగ్‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. 

న‌టీన‌టులు: 

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్నా త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు:

క‌థ‌, స్క్రీన్‌ప్లే, దర్శ‌క‌త్వం:  భ‌ర‌త్ క‌మ్మ‌

బ్యాన‌ర్స్‌:  మైత్రీ మూవీ మేక‌ర్స్‌, బిగ్ బెన్ సినిమాస్‌

నిర్మాత‌లు:  న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, మోహ‌న్ చెరుకూరి(సి.వి.ఎం), య‌ష్ రంగినేని

సి.ఇ.ఒ:  చెర్రీ

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌:  వై.అనీల్‌

మ్యూజిక్‌:  జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్‌

సినిమాటోగ్ర‌ఫీ:  సుజిత్ సారంగ్

ఎడిటింగ్ & డి.ఐ: శ‌్రీజిత్ సారంగ్‌

డైలాగ్స్‌:  జె కృష్ణ‌

ఆర్ట్ డైరెక్ట‌ర్‌:  రామాంజ‌నేయులు

సాహిత్యం:  చైత‌న్య ప్ర‌సాద్‌, రహ‌మాన్‌, కృష్ణ‌కాంత్‌

కొరియోగ్రాఫర్‌:  దినేష్ మాస్ట‌ర్‌

కాస్ట్యూమ్ డిజైన‌ర్‌:  అశ్వంత్ బైరి, ర‌జ‌ని

యాక్ష‌న్ డైరెక్ట‌ర్‌:  జి.ముర‌ళి

ప‌బ్లిసిటీ డిజైన్‌:  అనీల్, భాను

పి.ఆర్‌.ఒ: వ‌ంశీ శేఖ‌ర్‌


అస‌త్య‌పు వార్త‌ల‌తో బాధ‌పెట్టొద్దు: సుధాక‌ర్

Category : Uncategorized

నువ్వు తోపురా సినిమా కోసం  రెండేళ్ల పాటు శ్ర‌మించామ‌ని, మా క‌ష్టాన్ని నీరుగార్చే ప్ర‌య‌త్నం చేయ‌వ‌ద్ద‌ని అన్నారు ద‌ర్శ‌కుడు హ‌రినాథ్‌బాబు. మే 3న విడుద‌ల‌కానున్న నువ్వు తోపురా సినిమా ప్ర‌మోష‌న్స్ నిమిత్తం గుంటూరు వెళుతున్న క్ర‌మంలో చిత్ర‌బృందం ప్ర‌యాణిస్తున్న కారు మంగ‌ళ‌గిరి వ‌ద్ద ప్ర‌మాదానికి గురైంది. ఈ ప్ర‌మాదంలో హీరో సుధాక‌ర్ కోమాకుల‌తో పాటు యూనిట్ స‌భ్యులు గాయాల‌పాల‌య్యారు. వీరి కారు ఢీకొని ఓ కార్మికురాలు మృతిచెందింది. ఈ ప్ర‌మాదంపై ఆదివారం హైద‌రాబాద్‌లో చిత్ర‌బృందం స్పందించింది. ఫిలిం ఛాంబ‌ర్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో

స‌హ‌నిర్మాత జేమ్స్  వాట్ కొమ్ము మాట్లాడుతూ.. క‌మ‌ర్షియ‌ల్ ఈవెంట్ కోసం గుంటూరు వెళుతున్న క్ర‌మంలో ఈ ప్ర‌మాదం జ‌రిగింది.  ఈ సంఘ‌ట‌న‌ మ‌మ్మ‌ల్ని షాక్‌కు గురిచేసింది.  సీటు బెల్ట్ పెట్టుకోక‌పోవ‌డంతో డ్రైవ‌ర్ తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. హీరో సుధాక‌ర్ గాయాల‌పాల‌య్యారు. సినిమా విడుద‌ల అవుతుంద‌న్న ఎక్సైట్‌మెంట్‌లో ఉన్న త‌రుణంలో ఈ ప్ర‌మాదం జ‌ర‌గ‌డం షాక్‌కు గురిచేసింది అని అన్నారు.

ద‌ర్శ‌కుడు హ‌రినాథ్‌బాబు మాట్లాడుతూ.. ఇంకా బాధ‌లోనే ఉన్నాం.  భ‌గ‌వంతుడి ఆశీస్సుల వ‌ల్లే క్షేమంగా బ‌య‌ట‌ప‌డ్డాం.  సీటుబెల్ట్ మ‌మ్మ‌ల్ని ర‌క్షించింది. మా త‌ప్పిందం లేక‌పోయినా ఓ నిండు ప్రాణంపోవ‌డం మ‌మ్మ‌ల్ని క‌లిచివేసింది.  ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన ల‌క్ష్మి కుటుంబానికి ఆర్థికం స‌హాయం చేస్తాం. ఏం జ‌రిగిందో తెలుసుకోకుండా హీరో కారు న‌డుపుతున్నాడ‌ని వార్త‌లు రాశారు.  ఇలాంటి వార్త‌ల‌తో మా రెండేళ్ల క‌ష్టాన్ని నీరుగార్చే ప్ర‌య‌త్నం చేయ‌వ‌ద్దు అని చెప్పారు.

హీరో  సుధాక‌ర్ కోమాకుల మాట్లాడుతూ.. నా జీవితంలో అత్యంత బాధాక‌ర‌మైన రోజు ఇది. ఇంకా షాక్‌లోనే ఉన్నాను. కారులో  నేను ప్యాసింజ‌ర్ సీటులో కూర్చున్నాను. అనుకోకుండా మా కారు ట్రాక్ట‌ర్‌ను ఢీకొంది. ఈ ప్ర‌మాదంలో నా క‌ళ్ల‌కు, చేతుల‌తో పాటు త‌ల‌కు గాయాల‌య్యాయి.  ప్ర‌మాదంలో షాక్‌లో ఉన్న స‌మ‌యంలో కారును నేనే డ్రైవ్ చేశానంటూ కొంద‌రు వార్త‌లు రాశారు. ఇలా రాయ‌డం స‌రికాదు. ఈ వార్త‌లు చూసి అమెరికాలో ఉన్న నా భార్య బాధ‌ప‌డింది. ఇలాంటి వార్తల‌తో మా కుటుంబాల్ని ఇబ్బంది పెట్ట‌వ‌ద్దు అని చెప్పారు. ఈ కార్య‌క్ర‌మంలో హీరోయిన్ నిత్యాశెట్టి, నిర్మాత శ్రీ‌కాంత్‌, ఎడ్మండ్‌రోజ్ తదిత‌రులు పాల్గొన్నారు.


‘మహర్షి’.. సోషల్ మీడియా దున్నేస్తున్నాడు

Category : Uncategorized

మన సెలబ్రిటీస్ లైఫ్ లో సోషల్ మీడియా కూడా ఒక పార్ట్ అయిపోయింది. తమ సినిమాల ప్రమోషన్స్ దగ్గర నుండి వేరే సినిమాల గురించి మాట్లాడడం వరకు అంతా సోషల్ మీడియానే ఒక ప్లాట్ ఫామ్ గా ఎంచుకున్నారు. ప్రధాన మంత్రి సైతం తన సోషల్ మీడియా అకౌంట్ ని యాక్టీవ్ గా ఉంచుకుంటున్నారు అంటే అర్ధం చేసుకోవచ్చు ఇది ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో అని.

బాలీవుడ్ స్టార్స్ కూడా సోషల్ మీడియా తెగ వాడేస్తున్నారు. అలానే మన టాలీవుడ్ స్టార్స్ కూడా. ఇందులో సూపర్ స్టార్ మహేష్ ముందు ఉన్నాడు. మహేష్ ఏకంగా తనకంటూ సపరేట్‌ టీమ్‌ని ఏర్పాటు చేసుకుని వారికి భారీ మొత్తం చెల్లిస్తూ తన సోషల్‌ మీడియా హ్యాండిల్స్‌ యాక్టివ్‌గా వుండేట్టు చూసుకుంటున్నాడు. ‘స్పైడర్‌’ టైమ్‌లో సరైన టీమ్‌ లేక చాలా ఇబ్బంది పడ్డ మహేష్‌ వెంటనే తన సోషల్‌ మీడియా యాక్టివిటీని పెంచాడు.

‘భరత్‌ అనే నేను’ ఒకింత అంత సక్సెస్ అవ్వడానికి కారణం మహేష్‌ టీమే. అందుకే ఇప్పుడు ‘మహర్షి’ చిత్రానికి కూడా మహేష్‌ టీమ్‌ దడదడలాడించేస్తోంది. ఈ చిత్రానికి సోషల్ మీడియాలో ఎదో ఒక రకంగా బజ్‌ క్రియేట్‌ చేస్తున్నారు. మాస్ లో ఎంతవరకు ఆకట్టుకుంటుంది అని పక్కన పెడితే….యూత్ లో… ఏ సెంటర్స్‌ ఆడియన్స్‌ని మాత్రం బాగానే ఆకర్షిస్తోంది. మే 1 న ఈ సినిమా యొక్క ప్రీ  రిలీజ్ ఫంక్షన్ జరగనుంది.


‘వజ్రకవచధర గోవింద’కు రిలీజ్ డేట్ ఫిక్స్!

Category : Uncategorized

‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్, సప్తగిరి ఎల్ఎల్‌బీ’ సినిమాల తర్వాత టాప్ కమెడియన్ హీరో సప్తగిరి నటించిన చిత్రం ‘వజ్రకవచధర గోవింద’. శివ శివమ్ ఫిలిమ్స్ పతాకంపై అరుణ్ పవార్ దర్శకత్వంలో నరేంద్ర యెడల, జీవీఎన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం మే 17న రిలీజ్‌కు సిద్ధమవుతున్నది.

ఈ సందర్బంగా హీరో సప్తగిరి మాట్లాడుతూ.. ‘వజ్రం చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. వజ్రాన్ని కవచంగా ధరించడం వల్ల ఎలాంటి లాభ, నష్టాలు జరిగాయనేది ఈ సినిమా కథ. హీరో లక్ష్యం మంచిదై ఉండొచ్చు. కానీ ఎంచుకొన్న మార్గం కూడా మంచిదై ఉండాలి అనేది ఓవరాల్ పాయింట్. మీ లక్ష్యం మంచిదైనా చెడు మార్గంలో వెళితే చెడే జరుగుతుంది అని కథలో మంచి పాయింట్ చెప్పాం. సినిమా ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు యాక్షన్ కూడా ప్రేక్షకులను అలరిస్తుంది. వజ్రకవచధర గోవింద సినిమా కోసం ప్రాణాలకు తెగించి ఫైట్స్, యాక్షన్ సీన్లలో నటించాను. చిన్న సినిమా కావడంతో సెట్లు వేయడం ఖర్చుతో కూడినది కాబట్టి.. కర్నూలుకు సమీపంలోని గుహాల్లో షూట్ చేశాం. నాతోపాటు హీరోయిన్ కూడా సాహసం చేసింది. హీరోయిన్‌కు కూడా మంచి ప్రాధాన్యం ఉన్న సినిమా ఇది. గోవిందుడు చుట్టు నా సినిమా టైటిల్స్ తిరగడం అనేది దేవుడి అనుగ్రహమనే చెప్పాలి. నా తొలిసినిమాలో కానిస్టేబుల్ కథ చెప్పాం. రెండో సినిమాలో రైతుల గురించి చెప్పాం. ఇప్పుడు ప్రాణాంతక వ్యాధి క్యాన్సర్ గురించి చెప్పబోతున్నాం. ప్రతీ మండలానికి ఓ క్యాన్సర్ హాస్పిటల్ కడితేనే గానీ ఆ వ్యాధిగ్రస్తులను బతికించుకోలేని పరిస్థితి ఉంది. ఈ సినిమాతో వినోదంతోపాటు సామాజిక సందేశాన్ని అందజేస్తున్నాం. సినిమా టైటిల్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంది. టైటిల్ పెట్టాల్సిన సమయంలో అన్ని రకాలుగా ఆలోచించి.. కథకు సరితూగే టైటిల్ అని డిసైడ్ అయ్యాం. అందుకే భగవంతుడిని స్మరించుకొనే విధంగా ఉంటుందని, అలాగే సెంటిమెంట్ పరంగా ఆ టైటిల్‌‌ను ఫిక్స్ అయ్యాం’’ అని అన్నారు.

దర్శకుడు అరుణ్ పవార్ మాట్లాడుతూ.. ‘‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్ సినిమా తర్వాత అలాంటి మ్యాజిక్ రిపీట్ చేయాలని అదే కాంబినేషన్‌తో మళ్లీ వస్తున్నాం. సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌లో కామెడీ, ఎమోషన్స్ ఎంత వర్కవుట్ అయ్యాయో.. అంతే రేంజ్‌లో వర్కవుట్ కావాలని వెయిట్ చేశాం. నోట్ల రద్దు తర్వాత కూడా ఆ సినిమా నిర్మాతకు లాభాలు తెచ్చిపెట్టింది. సప్తగిరికి కామెడీ, సినిమాకు ఎమోషన్స్ వర్కవుట్ అయ్యే విధంగా డిజైన్ చేసిన చిత్రమే ‘వజ్రకవచధర గోవింద’. సప్తగిరి బాడీలాంగ్వేజ్‌కు తగినట్టుగా రూపొందింది’’ అని తెలిపారు.

ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ బ్రహ్మయ్య మాట్లాడుతూ.. ‘‘సీడెడ్, ఇతర ఏరియాల్లో 35 ఏళ్లుగా డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబ్యూటర్‌గా ఉన్నాను. సప్తగిరి సినిమాకు ఎంత క్రేజ్ ఉంటుందో స్వయంగా చూసిన దాఖలాలు ఉన్నాయి. సప్తగిరి ఎల్ఎల్‌బీ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేయాలని అనుకొన్నాను. కానీ కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాను. కానీ ‘వజ్రకవచధర గోవింద’ టీజర్ చూసిన తర్వాత ఎలాగైనా తీసుకోవాలని అనుకొన్నాను. ఫ్యాన్సీ రేటుకు వరల్డ్ వైడ్ రైట్స్ దక్కించుకొన్నాను. సినిమాను ఇప్పటికే చూశాను. ఈ సినిమా చాలా బాగా నచ్చింది. ‘వజ్రకవచధర గోవింద’ పెద్ద హిట్ అవుతుంది. ఏపీ మొత్తం సొంతంగా రిలీజ్ చేయబోతున్నాను. ఈ సినిమా మే 17న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నాం’’ అని చెప్పారు.

చిత్ర నిర్మాతల్లో ఒకరైన జీవిఎన్ రెడ్డి మాట్లాడుతూ .. ‘‘సప్తగిరి సినిమాకు డబ్బులు వస్తాయో రావో అనే విషయాన్ని పట్టించుకోలేదు. సప్తగిరితో సినిమా చేయాలని వచ్చాం. సినిమా ఫీల్డ్‌తో సంబంధం లేకుండా సప్తగిరితో మూవీ చేయాలని వచ్చాం. కర్నూలు గుహల్లో ప్రాణాలకు తెగించి హీరో సప్తగిరి నటించాడు. డబ్బులకు కాంప్రమైజ్ కాకుండా సినిమా చేశాం. సినిమా బ్రహ్మండంగా వచ్చింది’’ అని చెప్పారు.

నటీనటులు: వైభవీ జోషీ, అర్చనా వేద, టెంపర్ వంశీ, అప్పారావు, అవినాష్, రాజేంద్ర జాన్ కొట్టోలి, వీరేన్ తంబిదొరై తదితరులు

కథ: జి టి ఆర్ మహేంద్ర,

సంగీతం: విజయ్ బుల్గానిన్,

కెమెరా: ప్రవీణ్ వనమాలి,

ఎడిటింగ్: కిషోర్ మద్దాలి,

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సలాన బాలగోపాలరావు,

స్క్రీన్ ప్లే-దర్శకత్వం: అరుణ్ పవార్.


‘28 డిగ్రీస్ సెల్సీయస్’కు సుమంత్ సపోర్ట్

Category : Uncategorized

నవీన్ చంద్ర హీరోగా, షాలిని వడ్నికట్టి హీరోయిన్ గా డా.అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో వీరాంజనేయ ప్రొడక్షన్స్, రివర్ సైడ్ సినిమాస్  పతాకాలపై సాయి అభిషేక్ నిర్మిస్తోన్న చిత్రం ‘28 డిగ్రీస్ సెల్సీయస్’. ఈ చిత్రం టీజర్ రిలీజ్ కార్యక్రమం ఏప్రిల్ 27న హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి హీరో సుమంత్, అడవి శేష్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. సుమంత్ టైటిల్ పోస్టర్ రిలీజ్ చేయగా, అడవి శేష్ చిత్ర టీజర్ ని లాంఛ్ చేశారు. ఈ కార్యక్రమంలో హీరో నవీన్ చంద్ర, హీరోయిన్ షాలిని వడ్నికట్టి, దర్శకుడు అనిల్ విశ్వనాథ్, నిర్మాత సాయి అభిషేక్, ఎడిటర్ గారి బిహెచ్, కెమెరామెన్ వంశీ పచ్చిపులుసు, సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకాల, నటులు రాజా రవీంద్ర, వివ హర్ష, నటీమణులు దేవియాని శర్మ, సంతోషి శర్మ తదితరులు పాల్గొన్నారు..

సుమంత్ మాట్లాడుతూ.. అనిల్ నాకు ఐదేళ్లుగా తెలుసు. బేసిగ్గా అతను డెంటిస్ట్. నా సినిమాకు కో ప్రొడ్యూసర్ గా కూడా చేసాడు. అప్పటి నుండి అతనికి డైరెక్షన్ చెయ్యాలని ఫ్యాషన్. సినిమాపై పూర్తి  అవగాహన ఉంది. ఒకసారి ఈ సినిమా లైన్ చెప్పాడు. అంతగా ఎక్కలేదు. కానీ టీజర్ చూసాక బాగా నచ్చింది. కొత్తగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆడియెన్స్ కి రీచ్ అవుతుంది అనిపించింది. సినిమా బాగా తీసాడు. టీమ్ అందరికి ఆల్ ద బెస్ట్ అన్నారు.

అడవి శేష్ మాట్లాడుతూ… ఈ టీమ్ అంతా నాకు బాగా కావాల్సిన వాళ్ళు. క్షణం, గూఢచారి సినిమాలకు వర్క్ చేశారు. అనిల్ నాకు కర్మ సినిమా నుండి తెలుసు. మంచి టాలెంటెడ్. ఈ సినిమా తర్వాత నేను అనిల్ తో సినిమా చెయ్యాలనుకుంటున్నాను. 28 డిగ్రీస్ సెల్సీయస్ టీజర్ జెన్యున్ గా నచ్చింది. సినిమా సక్సెస్ అయి టీమ్ అందరికీ మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను.. అన్నారు. 

హీరో నవీన్ చంద్ర మాట్లాడుతూ… అరవింద సమేతలో బాల్ రెడ్డి క్యారెక్టర్ నాకు మంచి పేరు తెచ్చింది. ఆ సినిమా తర్వాత చాలా ఆఫర్స్ వస్తున్నాయి. అనిల్, అభిషేక్ వచ్చి నాకు కథ చెప్పారు. చాలా బాగుంది. టీమ్ అంతా మనసు పెట్టి వర్క్ చేశారు. వెరీ ఇంటెన్సివ్ లవ్ స్టోరీ. చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది… అన్నారు.

దర్శకుడు డా. అనిల్ విశ్వనాథ్ మాట్లాడుతూ… ఇది నా కల. ఈ టైం కోసం ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నాను. నన్ను, నా కథని నమ్మి అవకాశం ఇచ్చిన నా ఫ్రెండ్ అభిషేక్ కి, మా హీరో నవీన్ చంద్రకి నా థాంక్స్. నవీన్ తన యాక్టింగ్ తో ఇన్స్పైర్ చేసి బెటర్ సీన్స్ తీయడానికి హెల్ప్ చేసాడు. టైటిల్ ఎంత కొత్తగా ఉందో సినిమా కూడా అంతేలా ఉంటుంది. 60 శాతం జార్జియలో షూట్ చేసాం. అక్కడ ఒక తెలుగు వాడి కథ ఇది. శివ ఎక్సలెంటు విజువల్స్ ఇచ్చాడు. ఇదొక ప్రేమ కథ. అన్ని ఎమోషన్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరూ సంతృప్తి చెందుతారు. టీమ్ అంతా బాగా సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేశారు. వారందరికీ నా థాంక్స్.. అన్నారు..

నిర్మాత సాయి అభిషేక్ మాట్లాడుతూ… ఇదొక సస్పెన్స్, లవ్ థ్రిల్లర్, ఇంటెన్స్ స్టోరీ. నవీన్, షాలిని అందరూ సూపర్బ్ గా యాక్ట్ చేశారు. 28 డిగ్రీన్ సెల్సీయస్ టైటిల్. దానికి తగ్గట్లుగానే మా డైరెక్టర్ అనిల్ సినిమాని తెరకెక్కించాడు. టెక్నికల్ టీమ్ అంతా నాకు బాగా సపోర్ట్ చేశారు. వారికి నా థాంక్స్. సినిమాని మేలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం.. అన్నారు.

నవీన్ చంద్ర, షాలిని వడ్నికట్టి, రాజా రవీంద్ర, ప్రియదర్శి, వివ హర్ష, జయ ప్రకాష్, అభయ్ బెతిగంటి, దేవియాని శర్మ, సంతోషి శర్మ, నితీష్ పాండే, అజయ్, చలపతి రాజు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ-స్క్రీన్ ప్లై-దర్శకత్వం: డా.అనిల్ విశ్వనాథ్, నిర్మాత: సాయి అభిషేక్, కో- ప్రొడ్యూసర్స్: విక్రమ్ జూపూడి, సంజయ్ జూపూడి, అసోసియేట్ ప్రొడ్యూసర్స్: జుంగా పృద్వి, తేజ వర్మ, ఎడిటర్: గారి బిహెచ్, డిఓపి: వంశీ పచ్చిపులుసు, సంగీతం: శ్రావణ్ భరద్వాజ్, రీ రికార్డింగ్: సాయి చరణ్ పాకాల, మాటలు- పాటలు: కిట్టు విస్సా ప్రగడ, కాస్ట్యూమ్ డిజైనర్స్: అనుష, అభినయ, రేకా బొగ్గారపు, వెంకీ, లైన్ ప్రొడ్యూసర్: రాజు కొత్తపెల్లి, వినయ్ ముమ్మిడి


‘అర్జున్‌ సురవరం’కి వచ్చిన ఇబ్బంది ఇదే!

Category : Uncategorized

తెలుగులో వైవిధ్యభరితమైన చిత్రాలను చేసే యంగ్‌ హీరోగా నిఖిల్‌ సిద్దార్ద్‌కి మంచి పేరుంది. హ్యాపీడేస్‌తో మొదలుపెట్టి మధ్యలో యువతతో హిట్‌ కొట్టి స్వామి..రారా నుంచి దూసుకుపోతున్నాడు. స్వామి రా..రా.., కార్తికేయ, సూర్య వర్సెస్‌ సూర్య, ఎక్కడికి పోతావు చిన్నవాడా వంటి భారీ హిట్‌ కొట్టాడు. మధ్యలో శంకరాభరణం ఒక్కటి దెబ్బకొట్టింది. కేశవ, కిర్రాక్‌పార్టీలతో జస్ట్‌ ఓకే అనిపించుకున్నాడు. ప్రస్తుతం తమిళ ‘కణితన్‌’ని తెలుగులో రీమేక్‌ చేస్తూ ఠాగూర్‌ మధు అండతో వస్తున్నాడు. జర్నలిజం బ్యాక్‌డ్రాప్‌లో కెమెరా మెన్‌ గంగతో రాంబాబు మినహా చాలా కాలం తర్వాత వస్తున్న ఈ చిత్రానికి మొదట ‘ముద్ర’ అనే టైటిల్‌ అనుకున్నారు. కానీ అదే టైటిల్‌ని వేరే వారు రిజిష్టర్‌ చేయించడంతో తన క్యారెక్టర్‌ పేరు అయిన ‘అర్జున్‌ సురవరం’గా వస్తున్నాడు. 

ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ఆయన గత ఆరేడు నెలలుగా తీవ్ర ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు కానీ ప్రతి సారి ఏదో ఒక అడ్డంకి వస్తోంది.. మే1న విడుదల ఖాయమన్నాడు. కానీ అంతలో ‘ఎవేంజర్స్‌’ రూపంలో అడ్డు వచ్చిపడింది. ఈ విషయాన్ని యూనిట్‌ దాచుకోలేదు. కేవలం ఎవేంజర్స్‌ పోటీని తట్టుకోలేకనే వాయిదా వేస్తున్నామని ప్రకటించింది. అయితే పెద్దనోట్ల రద్దుతో పాటు పలు పెద్ద చిత్రాల సమయంలో కంటెంట్‌లో దమ్మున్న చిత్రాలు వస్తే మంచి విజయం సాధిస్తాయని ఎక్కడికిపోతావు చిన్నవాడాతో పాటు పలు చిత్రాల ద్వారా నిఖిల్‌ నిరూపించాడు. మరి ఎవేంజర్స్‌ని చూసి మరీ ఇంతలా భయపడాలా? అనే అనుమానం రాకమానదు. 

కానీ నిజానికి మన తెలుగు రాష్ట్రాలలోని మల్టీప్లెక్స్‌ స్క్రీన్స్‌ అన్నింటిని ఎవేంజర్స్‌కే కేటాయించారు. అడ్వాన్స్‌ బుకింగ్‌కి వస్తున్న స్పందన అద్భుతంగా ఉంది. దాంతో వీకెండ్‌ తర్వాత కూడా టిక్కెట్లు ఇప్పటికే హాట్‌ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఈ పరిస్థితి 100శాతం ఆక్యుపెన్సీ వచ్చే ఎవేంజర్స్‌ని కాదని అర్జున్‌ సురవరంకి మల్టీప్లెక్స్‌లలో స్క్రీన్‌లు లభించలేదు. ఇక సింగిల్‌ స్క్రీన్లలో ఇప్పటికీ మజిలీ, జెర్సీ, కాంచన3 వంటివి స్టడీగానే ఉన్నాయి. ఇలా కర్ణుడి చావుకి కోటి కారణాలు అన్నట్లుగా అర్జున్‌ సురవరం వాయిదాకు అన్ని కారణాలు ఉండటం మేకర్స్‌ని బాగా ఇబ్బంది పెట్టడంతో రిస్క్‌ ఎందుకని మరో డేట్‌ చూసుకుంటున్నారు.