హైదరాబాద్ నందు (బంజర హిల్స్, జూబిలీ హిల్స్, మాదాపూర్, కొండాపూర్ ) పరిసర ప్రాంతాల్లో పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ వెంటనే కావాలను. ఆర్మీ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేసి రిటైర్ అయినా వారికీ తగిన ప్రాధాన్యత ఇవ్వ బడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ + 91 8074965869

Monthly Archives: May 2019

నిజంగా ఇది నా అదృష్టం: చింతకింద ‘మల్లేశం’

Category : Uncategorized

ప‌ద్మ‌శ్రీ అవార్డు గ్ర‌హీత చింత‌కింది మ‌ల్లేశం జీవిత‌క‌థ‌ను ఆధారంగా చేసుకుని రూపొందుతున్న చిత్రం ‘మ‌ల్లేశం’. వెండితెర‌పై ఈయ‌న పాత్ర‌లో ప్రియ‌దర్శి క‌నిపించ‌నున్నాడు. రాజ్‌.ఆర్ ద‌ర్శ‌కుడు. రాజ్‌.ఆర్‌, శ్రీఅధికారి నిర్మాత‌లు. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో జూన్ 21న సినిమా విడుద‌ల‌వుతుంది. ఈ సినిమా ట్రైల‌ర్‌ను బుధ‌వారం హైద‌రాబాద్‌లో విడుద‌ల చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ప‌ద్మ‌శ్రీ అవార్డు గ్ర‌హీత చింత‌కింది మ‌ల్లేశం, పల్లెసృజ‌న నిర్వాహ‌కులు గ‌ణేశం, త‌రుణ్ భాస్క‌ర్‌, సందీప్‌కిష‌న్‌, ప్రియ‌ద‌ర్శి, రాజ్‌.ఆర్‌, శ్రీఅధికారి త‌దిత‌రులు పాల్గొన్నారు.  ఈ సంద‌ర్భంగా…

గ‌ణేశం మాట్లాడుతూ – ‘‘నేను సినిమాలు చూస్తాను కానీ.. ఇండ‌స్ట్రీ గురించి పెద్ద‌గా తెలియ‌దు. రెండేళ్ల క్రితం రాజ్‌గారు న‌న్ను క‌ల‌సి ఇలా మ‌ల్లేశం గారి సినిమా తీద్దామ‌నుకుంటున్నాను అని చెప్పారు. నిజ‌మైన క‌థ‌ను త‌క్కువ స‌మ‌యంలో చెప్ప‌డ‌మ‌నేది చాలా గొప్ప విష‌యం’’ అన్నారు. 

చింత‌కింది మ‌ల్లేశం మాట్లాడుతూ – ‘‘ఒక‌రోజు రాజ్‌గారు ఫోన్ చేసి యూట్యూబ్‌లో మీరు మాట్లాడింది చూశాను. దాని గురించి సినిమా తీయాల‌ని అనుకుంటూ ఉన్నాను అన్నారు. రెండున్న‌రేళ్లు క‌ష్ట‌ప‌డి క‌థ‌ను సిద్ధం చేసుకున్నారు. ఫైన‌ల్‌గా ఈరోజు సినిమా చూస్తున్నాను. సామాన్య మాన‌వుడి జీవితాన్ని సినిమాగా తీయ‌డం చాలా గొప్ప విష‌యం. ప్ర‌పంచానికి మ‌ల్లేశం గురించి చెప్పాల‌నే రాజ్‌గారి సంక‌ల్పం నేర‌వేరింది. సినిమా చూశాను ప్రియ‌ద‌ర్శిగారు అద్భుతంగా న‌టించారు. ఝాన్సీ గారు మా అమ్మ‌గారి పాత్ర‌లో న‌టించారు. సినిమాలో ఆమెను చూస్తే మా అమ్మ‌గారిని చూసిన ఫీలింగే క‌లిగింది. అలాగే చ‌క్ర‌పాణిగారు మా నాన్న‌పాత్ర‌లో అద్భుతంగా న‌టించారు. సినిమా చూసే సంద‌ర్భంలో ఓసారి క‌ళ్ల‌లో నీళ్లు కూడా తిరిగాయి. నా క‌థ‌ను నేను తెర‌పై చూసుకోవ‌డం నా అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు. 

వెంక‌ట సిద్ధారెడ్డి మాట్లాడుతూ – ‘‘80 బ్యాక్‌డ్రాప్‌లో సినిమా తీయ‌డం అంటే ఎంత క‌ష్ట‌మో నాకు తెలుసు. యూనిట్ అంద‌రూ చాలా క‌ష్ట‌ప‌డి చేసిన సినిమా ఇది. జూన్ 14న విడుద‌లవుతున్న ఈ సినిమా మంచి విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు. 

గొరేటి వెంకన్న మాట్లాడుతూ – ‘‘ఈ సినిమాలో రెండు అద్భుత‌మైన పాట‌లు రాసే అవ‌కాశం క‌లిగింది. ఆద‌ర్శవంత‌మైన వ్య‌క్తి బ‌యోపిక్ ఇది. ట్రెండ్ సెట్ట‌ర్ మూవీ అవుతుంది’’ అన్నారు. 

మ్యూజిక్ డైరెక్ట‌ర్ మార్క్ కె.రాబిన్స్ మాట్లాడుతూ – ‘‘రాజ్‌గారితో సినిమా చేసే క్ర‌మంలో చాలా దూరం ట్రావెల్ చేశాం. ద‌ర్శిలో మ‌ల్లేశంగారు క‌న‌ప‌డ్డారు. ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు థాంక్స్‌. ఎంటైర్ యూనిట్‌కు అభినంద‌న‌లు’’ అన్నారు. 

మ‌ధుర శ్రీధ‌ర్ రెడ్డి మాట్లాడుతూ – ‘‘అ సినిమా చూసిన తొలి ప్రేక్ష‌కుడిని నేనే. దీన్ని తెలుగు సినిమా అన‌డం కంటే ఇండియ‌న్ మూవీ అంటే క‌రెక్ట్‌. బ‌యోపిక్ కా బాప్‌. ఆర్ట్ మూవీ కాదు. ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ మూవీ’’ అన్నారు. 

త‌రుణ్ భాస్క‌ర్ మాట్లాడుతూ – ‘‘యూనిట్‌లో ప్ర‌తి ఒక్క‌రికి అభినంద‌న‌లు. సినిమా ట్రైల‌ర్ చూస్తుంటే చాలా ప్రేమ‌తో సినిమా చేసిన‌ట్లుగా అనిపించింది. ద‌ర్శ‌క నిర్మాత‌లు ఎంత ప్యాష‌నేట్‌గా సినిమా చేశారో చూస్తేనే అర్థ‌మైపోతుంది.  వెంక‌ట‌సిద్ధారెడ్డిగారు క్రూసేడ‌ర్‌. ఎన్నో మంచి సినిమాల‌కు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌. ఈ సినిమాకు డైరెక్ష‌న్ చేసే అవ‌కాశం నాకు ద‌క్కింది. కానీ నేను వ‌దులుకున్నాను. మ‌ల్లేశంగారి క‌థ విన్న‌ప్పుడు తెలుగు ప్రేక్ష‌కుల‌కే కాదు.. ప్యాన్ ఇండియా ప్రేక్ష‌కుల‌కు చెప్పాల్సిన చిత్ర‌మ‌ది అనిపించింది. ఇండ‌స్ట్రీలో మ‌నం చేసే వ‌ర్క్‌కి మీడియా అటెన్ష‌న్ రాగానే దేవుళ్లం అయిపోతాం. నిజానికి మ‌ల్లేశంగారి లాంటి వ్య‌క్తులు ఇన్‌స్పిరేష‌న్‌. చాలా మంది ఇన్‌స్పైరింగ్ స్టోరీస్ రాక అలాగే ఉండిపోతున్నారు. మ‌న ప‌క్కింట్లోనే, ఊర్లోనే జ‌రిగే ఇలాంటి క‌థ‌ను తెర‌కెక్కించ‌డం అనేది ఓ బాధ్య‌త‌. స్టీరియో టైప్ వంటి సిని వ‌ర్గీక‌ర‌ణ‌లు ఫేడ్ అవుట్ అయిపోతున్నాయి. నేను భ‌య‌ప‌డ‌లేదు. భ‌య‌ప‌డ‌ను.. ఫ్యూచ‌ర్ జ‌న‌రేష‌న్ కూడా భ‌య‌ప‌డ‌దు. ఎందుకంటే.. మాకు క‌థ‌లు కావాలి. ఎన్నో విభిన్న‌మైన క‌థ‌ల‌ను వినాల‌ని ప్రేక్ష‌కులుగా అనుకుంటున్నాం. 

మ‌న తాత‌లాంటి సినిమాల‌ను వేరే భాష‌ల్లో చేస్తున్నారు. మ‌నం ఆగే ప‌రిస్థితి రాకూడ‌దు కూడా. ఏ క‌థ‌నైనా మూవీ మేక‌ర్స్‌గా వెతికి ప‌ట్టుకుని బ‌య‌ట‌కు తెస్తాం. ఇది ఆర్ట్ సినిమానా, క‌మ‌ర్షియ‌ల్ సినిమానా?  హీరో ఉన్నాడా?  క‌మెడియ‌న్ ఉన్నాడా? అని చూడొద్దు. ట్యాగ్ లైన్ ఫేడ్ అవుట్ అయిపోవాలి. హీరో, క‌మెడియ‌న్ అనే ట్యాగ్‌లైన్ యాక్ట‌ర్ అనే ట్యాగ్‌లైన్ వ‌స్తుందో ఆరోజు చాలా ముందుకు వెళ‌తాం. మ‌న భ‌విష్య‌త్ త‌రాల‌కు ఎన్నో విలువ‌ల‌ను అందిస్తాం. సినిమా అనేది ఒక వ్య‌క్తిని గ్లోరిఫై చేయ‌దు.. సోసైటీని గ్లోరిఫై చేస్తుంది. స్టోరీ ఆఫ్ ఫ్యూచ‌ర్‌. సినిమా అనేది ట్రూ ఫామ్ ఆఫ్ డెమోక్ర‌సీ. ప్రియ‌ద‌ర్శి ఒక్కొక్క పాత్ర‌లో ఎంతో క‌ష్ట‌ప‌డి జీవం పోసుకుంటున్నాడు. ‘పెళ్లిచూపులు’ స‌మ‌యంలో త‌న‌కు బెస్ట్ క‌మెడియ‌న్ అవార్డ్ రాగానే, బ‌య‌ట‌కు వ‌చ్చేశాను. త‌ను క‌మెడియ‌న్ అనే మోడ్ నుండి ఈరోజు బ‌య‌ట‌కు వ‌చ్చేశాడు. ‘మ‌ల్లేశం’ ఓ  గ్రేట్ ఫిలిం. దీన్ని ప్ర‌మోట్ చేయ‌డానికి ఎలాంటి స్టార్స్ అవ‌స‌రం లేదు’’ అన్నారు. 

సందీప్‌కిష‌న్ మాట్లాడుతూ – ‘‘మ‌ల్లేశంగారి లాంటి గొప్ప వ్య‌క్తి బ‌యోపిక్‌ను ప్రియ‌ద‌ర్శి త‌న రెండు భుజాల‌పై మోశాడు. త‌న స్నేహితుడిగా నేను ఇక్క‌డికి రావ‌డం ఆనందంగా ఉంది. రాజ్‌గారికి పెద్ద ఫ్యాన్‌ని అయ్యాను. ఆయ‌న ఇన్‌టెన్స్‌, నిజాయ‌తీతో కూడిన ఆయ‌న ఆలోచ‌న‌కు నేను ఫ్యాన్‌గా మారాను. ఈ సినిమాకు నా కాంట్రీబ్యూష‌న్ ఏదీ లేదే అని బాధ‌గా కూడా ఉంది. మ‌నం తెలుగు ఇండ‌స్ట్రీలో ఉన్నామ‌ని గ‌ర్వంగా చెప్పుకోవ‌చ్చు. మ‌న ప్రేక్ష‌కులు పెళ్లిచూపులు చూస్తారు.. ఒక అర్జున్ రెడ్డి చూస్తారు.. ఒక గూఢ‌చారి చూస్తారు.. ఒక బాహుబ‌లి చూస్తారు. అదే స‌మ‌యంలో వేరే భాష నుండి డ‌బ్ చేసుకుని వ‌స్తే కె.జి.య‌ఫ్ బ్లాక్ బ‌స్ట‌ర్ చేస్తారు. కంటెంట్ బావుంటే చూడ‌టానికి మ‌న జ‌నాలంతా గొప్ప జ‌నాలు లేరు. నాకు ఈ సినిమా పరంగా ఏదైనా చేయాల‌ని అనుకుంటున్నాను. అందుక‌ని తొలి వంద టికెట్ల‌ను నేనే కొంటాను’’ అన్నారు. 

ద‌ర్శ‌క నిర్మాత రాజ్‌.ఆర్ మాట్లాడుతూ – ‘‘సినిమా చేయ‌డానికి ప‌ర్మిష‌న్ ఇచ్చిన ప‌ల్లె సృజ‌న నిర్వాహ‌కులు గ‌ణేశంగారికి, మ‌ల్లేశంగారికి థాంక్స్‌. బ‌యోపిక్ అంటే ఓ బాధ్య‌త దాన్ని ఎంతో స‌మ‌ర్ధ‌వంతంగా నిర్వ‌ర్తించాం. టీం అందరం నిజాయ‌తీతో సినిమాను పూర్తి చేశాం. ఇది ఆర్ట్ ఫిలిం కాదు. కమ‌ర్షియ‌ల్ మూవీ. ముందు ఇందులో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, నానిల‌ను హీరోలుగా అనుకున్నాను.  కానీ డేట్స్ స‌మ‌స్య రావ‌డంతో ప్రియ‌ద‌ర్శిని తీసుకున్నాం. అలాగే త‌రుణ్ భాస్క‌ర్‌ను సినిమాను డైరెక్ట్ చేయ‌మ‌ని అడిగాను కానీ కుద‌ర‌లేదు. ఇంట‌ర్మీడియ‌ట్ విద్యార్థులు ప‌రీక్ష‌ల్లో ఫెయిల్ అయ్యామ‌ని ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్నారు. కానీ ఆరో త‌ర‌గ‌తి డ్రాప్ అవుట్ అయి.. ప‌ద్మ‌శ్రీ అవార్డు అందుకోవ‌డం వ‌ర‌కు ఎదిగిన మ‌ల్లేశం గారిని స్ఫూరిగా తీసుకోవాలి. నా ప్ర‌యాణంలో స‌హ‌కారం అందించిన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ వెంక‌ట్ సిద్ధారెడ్డిగారికి, ఆర్ట్ డైరెక్ట‌ర్ లక్ష్మణ్ ఏలే, మ‌హేష్ స‌హా ఎంటైర్ యూనిట్‌కు థాంక్స్‌’’ అన్నారు


హవీష్, అభిషేక్ పిక్చర్స్ మూవీ మొదలైంది

Category : Uncategorized

హవీష్ హీరోగా రాఘవ ఓంకార్ శశిధర్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ దేవాన్ష్ నామా సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా ప్రొడక్షన్ నెంబర్ .5 గా ఓ రొమాంటిక్ లవ్ స్టోరీని రూపొందిస్తున్నారు. ఈ నయా చిత్రం బుధవారం హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ దైవసన్నిధానంలో ఘనంగా ప్రారంభమైంది. హీరోపై చిత్రీకరించిన ముహూర్త‌పు సన్నివేశానికి అతిధిగా విచ్చేసిన ప్రముఖ దర్శకుడు సుకుమార్ క్లాప్ నివ్వగా, సధానంద్ కెమెరా స్విచ్చాన్ చేశారు. ఏషియన్ సునీల్ నారంగ్ స్క్రిప్ట్ అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో చిత్ర దర్శకుడు శశిధర్ మాట్లాడుతూ, ‘14 ఏండ్లుగా సినీ రంగంలో ఉన్నా. ‘ఓంకార’ అనే ఇండిపెండెంట్ చిత్రాన్ని, ‘లడ్డు’, ‘నన్ను క్షమించు’ వంటి లఘు చిత్రాల్ని రూపొందించాను. వాటికి ప‌లు నంది అవార్డులు, జాతీయ‌, అంత‌ర్జాతీయ పుర‌స్కారాలు వ‌రించాయి. నన్ను ఈ ప్రపంచానికి పరిచయం చేసిన తల్లిదండ్రులు ఎంత గొప్పవారో, ఓ దర్శకుడికి తొలి అవకాశం ఇచ్చిన నిర్మాత, హీరో అంతే గొప్పవారు. నన్ను నమ్మిన నిర్మాత అభిషేక్ గారికి, హీరో హ‌వీష్ గారికి థ్యాంక్స్. న‌న్ను ద‌ర్శ‌కుడిగా ఎంపిక చేసిన సుకుమార్‌కి ధ‌న్య‌వాదాలు.  వారి న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకుంటాను. ఓ కొత్త రకమైన రొమాంటిక్ లవ్ డ్రామా చిత్ర‌మిది. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉంటుంది. భావోద్వేగ‌భ‌రితంగానూ ఉంటుంది. జూలై చివ‌రి వారం నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్‌ని జ‌రుప‌నున్నాం’ అని అన్నారు. 

హీరో హ‌వీష్ మాట్లాడుతూ, ‘నేను హీరోగా న‌టించిన ‘సెవెన్’ చిత్రం నెక్ట్స్ వీక్ విడుద‌ల‌వుతుంది. అభిషేక్ నామా ఆ సినిమాని రిలీజ్‌ చేస్తున్నారు. అభిషేక్ గారు ప్యాష‌నేట్ ప్రొడ్యూస‌ర్‌. మా సినిమాని విడుద‌ల చేస్తున్న‌ ఆయ‌న‌కు ధ‌న్య‌వాదాలు. శ‌శిధ‌ర్ ఎక్స్ ట్రీమ్లీ టాలెంటెడ్ డైరెక్ట‌ర్‌. త‌ను భ‌విష్య‌త్‌లో పెద్ద ద‌ర్శ‌కుడ‌వుతాడు. ఫ్యామిలీ, రొమాంటిక్ ల‌వ్ స్టోరీ ఇది. ఇందులో హీరోగా న‌టిస్తున్నందుకు, అభిషేక్ ప్రొడ‌క్ష‌న్‌లో వ‌ర్క్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇక మా ‘సెవెన్’ సినిమా ఈ స‌మ్మ‌ర్ లో బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ కాబోతుంది. చూసి ఆద‌రించాల‌ని కోరుకుంటున్నా’ అని చెప్పారు. 

చిత్ర నిర్మాత అభిషేక్ నామా చెబుతూ, ‘చాలా రోజులుగా శ‌శిధ‌ర్‌తో ట్రావెల్ అయ్యాం. సుకుమార్, మేం నిర్వ‌హించిన షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ లో శ‌శిధ‌ర్ మొద‌టి బ‌హుమ‌తిని పొందారు. దాని ఆధారంగా ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వ అవ‌కాశం క‌ల్పించాం. ఫ్యామిలీ అంతా క‌లిసి చూసేలా ఈ సినిమాని తెర‌కెక్కించ‌బోతున్నాం. ఇందులో న‌టించే ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్ల వివ‌రాలు త్వ‌ర‌లో వెల్ల‌డిస్తాం’  అని అన్నారు. ఈ కార్యక్ర‌మంలో నిర్మాతలు సి.క‌ళ్యాణ్‌, బెక్కం వేణుగోపాల్‌, సుధాక‌ర్ రెడ్డి, మ‌ల్టీ డైమెన్ష‌న్ వాసు, ద‌ర్శ‌కుడు ర‌మేష్ వ‌ర్మ త‌దిత‌ర సినీ ప్ర‌ముఖులు పాల్గొన్నారు. 

టెక్నీషియ‌న్లు- 

బ్యాన‌ర్: అభిషేక్ పిక్చ‌ర్స్ 

స‌మ‌ర్ప‌ణ: దేవాన్ష్ నామా

నిర్మాత: అభిషేక్ నామా

ద‌ర్శ‌కుడు: రాఘ‌వ ఓంకార్ శ‌శిధ‌ర్ 

సంగీతం: చైత‌న్ భ‌ర‌ద్వాజ్ 

ఎడిట‌ర్: అమ‌ర్ రెడ్డి కుడుముల‌

డీఓపీ: సాయి శ్రీరామ్‌

పీఆర్ ఓ: వంశీ శేఖ‌ర్‌


175 ప్లస్ కోట్ల దిశగా ‘మహర్షి’

Category : Uncategorized

175 కోట్లు క్రాస్‌ చేసిన సూపర్‌స్టార్‌ మహేష్‌ ఎపిక్‌ బ్లాక్‌బస్టర్‌ ‘మహర్షి’ 

సూపర్‌స్టార్‌ మహేష్‌, వంశీ పైడిపల్లి కాంబినేషన్లో రూపొందిన ఎపిక్‌ బ్లాక్ బస్టర్ ‘మహర్షి’ 19 రోజుల్లోనే 175 కోట్లు క్రాస్ చేసి 200 కోట్లకు పరుగులు తీస్తోంది. వైజయంతి మూవీస్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, పివిపి సినిమా సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలై  యునానిమస్‌గా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ని సొంతం చేసుకుంది. సూపర్‌స్టార్‌ మహేష్‌ ట్రెమండస్‌ పెర్‌ఫార్మెన్స్‌, వంశీ పైడిపల్లి ఎక్స్‌లెంట్‌ టేకింగ్‌, దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌, వైజయంతి మూవీస్‌, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌, పివిపి సినిమా భారీ నిర్మాణ విలువలు చిత్రాన్ని ఎపిక్‌ బ్లాక్‌బస్టర్‌గా నిలిపాయి. సినిమా రిలీజ్‌ అయిన అన్ని ఏరియాల్లోనూ సూపర్‌స్టార్‌ మహేష్‌ గత కలెక్షన్‌ రికార్డులను క్రాస్‌ చేసి 175 కోట్లకు పైగా కలెక్ట్‌ చేసి దిగ్విజయంగా ప్రదర్శింపబడుతోంది. ఈ హ్యాపీ న్యూస్ ను ఎస్ వి సి సంస్థ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.


వైఎస్ జగన్‌ సక్సెస్‌ఫుల్‌ పొలిటీషియన్‌: సూర్య

Category : Uncategorized

‘ఎన్‌జికె’ ఇప్పటివరకూ మనం చూసిన పొలిటికల్‌ సినిమాలకు విభిన్నంగా ఉంటుంది: హీరో సూర్య 

‘గజిని’, ‘యముడు’, ‘సింగం’ లాంటి విభిన్న తరహా చిత్రాలతో ప్రేక్షకులలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ సంపాదించుకున్న హీరో సింగం సూర్య, ‘7/జి బృందావన కాలని’, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ చిత్రాల దర్శకుడు శ్రీరాఘవ దర్శకత్వంలో డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌, రిలయెన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై నిర్మించిన చిత్రం ‘ఎన్‌.జి.కె (నంద గోపాల కృష్ణ)’. ఈ సినిమాను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలలో ‘ఏమైంది ఈవేళ’ అధినేత, ‘బెంగాల్‌ టైగర్‌’ వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత, శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ అధినేత కె.కె.రాధామోహన్‌ అందిస్తున్నారు. ఈ చిత్రం మే 31 న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న సందర్భంగా హీరో సూర్య ఇంటర్వ్యూ.

‘యువ’ తర్వాత పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌తో వస్తున్నారు కదా! ఎలా అన్పిస్తోంది? 

– ‘యువ’ అనేది పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌తో పాటు అన్నీ ఇంగ్రీడియంట్స్‌ ఉంటాయి. కానీ ఇప్పుడు ‘ఎన్‌జికె’ మనం అందరం ఇప్పటివరకూ చూసిన పొలిటికల్‌ సినిమాలకు విభిన్నంగా ఉంటుంది. ప్రేక్షకులు పొలిటికల్‌ సినారియోను పూర్తిగా ఎక్స్‌పీరియన్స్‌ చేస్తారు. ఈ సినిమా ద్వారా శ్రీరాఘవ పొలిటికల్‌ సినిమాల్లో ఒక డిఫరెంట్‌ లేయర్‌ను ఏర్పాటు చేయబోతున్నారు. 

‘ఎన్‌జికె’ ఎలా ఉండబోతోంది? 

– ఎలాంటి పొలిటికల్‌ బ్యాక్‌గ్రౌండ్‌ లేని ఒక సాధారణ వ్యక్తి తనకు తెలియకుండానే అతన్ని పొలిటికల్‌ సిస్టమ్‌లోకి కొన్ని శక్తులు లాగితే.. ఆ వ్యక్తి వల్ల సమాజానికి ఎలాంటి మంచి జరిగింది? అనేది కథాంశం. ఇది  గ్రాస్‌ రూట్‌ పొలిటికల్‌ ఫిల్మ్‌. ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా ఒక జెన్యూన్‌ పర్సన్‌ ఈ సమాజాన్ని ఎలా మార్చాడు అనే అంశం మీదే సినిమా ఉంటుంది. రియాలిటీకి చాలా  దగ్గరగా ఉంటుంది. ఈ సినిమాలో మేము ఏ రాజకీయపార్టీని విమర్శించలేదు. 

శ్రీరాఘవ, మీ కాంబినేషన్‌ కోసం ఆడియన్స్‌ చాలాకాలంగా ఎదురు చూస్తున్నారు? 

– అవునండీ. ఆడియన్స్‌తో పాటు నేను కూడా 2001 నుండి ఆయన డైరెక్షన్‌లో వర్క్‌ చేయడానికి వెయిట్‌ చేస్తున్నాను. ఒక శ్రీరాఘవ ఫ్యాన్‌గా ఆయన సినిమాలో నటించడానికి నాకు 19 సంవత్సరాలు పట్టింది. అలాగే ఈ సినిమా ప్రొడ్యూసర్‌ డ్రీమ్‌ వారియర్స్‌ కూడా విభిన్నమైన చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తున్నారు. వారితో కలిసి వర్క్ చేయడం కూడా చాలా హ్యాపీ.

శ్రీరాఘవగారితో వర్క్‌ చేయడం ఎలా అనిపించింది? 

– ఈ సినిమా కథ రాయడానికి శ్రీరాఘవగారికి సంవత్సరంన్నర కాలం పట్టింది. ఆయన ఒక్కరే కూర్చుని ఈ కథను రాసుకున్నారు. స్క్రీన్‌ప్లే కూడా చాలా ఎఫెక్టివ్‌గా ఉండేలా చూసుకున్నారు. ప్రతి సీన్‌ని ఆయన ఎలా విజువలైజ్‌ చేయాలనుకుంటున్నారో మనకి ముందే తెలిసేలా చేస్తారు. ఆయన మంచి నటుడు కాబట్టే ఇప్పటివరకూ మనకి  అన్ని యూనిక్‌ ఫిలింస్‌ ఇవ్వగలిగారు. 

ఈమధ్యకాలంలో ఆయన ఫామ్‌లో లేరు కదా? 

– ఒకానొక సందర్భంలో ప్రతి ఒక్కరూ అలాంటి ఫేజ్‌ను ఫేస్‌ చేస్తూనే వస్తారు. ధోని కూడా ఒక సందర్భంలో ఫేస్‌ చేశారు. కొంతమంది పీపుల్‌ వెరీ యూనిక్‌గా ఉంటారు. వారిని ఇంకొకరితో రీప్లేస్‌ చెయ్యలేం.  శ్రీ రాఘవ లాంటి టాలెంటెడ్‌ ఫిల్మ్‌ మేకర్‌. ఇంతవరకూ ఏ దర్శకుడు కూడా ఆయనలాంటి సినిమా చేయలేదు. యాక్టింగ్‌ తెలియని వారితో  కూడా యాక్టింగ్‌ చేయించగలరు. ఆయన సాంగ్స్‌ సీక్వెన్స్‌ కూడా రెగ్యులర్‌  ఫార్మాట్లో ఉండదు. ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా ఒక డిఫరెంట్‌ సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ని ఆడియన్స్‌కి ఇవ్వడానికి తానెప్పుడూ కృషి చేస్తూనే ఉంటారు. 

ఆయన సెట్‌లో ఎలా ఉంటారు? 

– శ్రీరాఘవగారి షూటింగ్‌ సెటప్‌ ఆశ్రమంలా ఉంటుంది. సెల్‌ఫోన్‌లు ఉండవు. వేరే ఎవ్వరితో మాట్లాడకూడదు. ప్రతి ఒక్కరూ ఒక మెడిటేషన్‌ మోడ్‌లో ఉండి చాలా ఫోకస్డ్‌గా ఉంటారు. ప్రతి సీన్‌ కోసం అదే ఎమోషన్‌ను మనం కూడా ఫీల్‌ అవ్వాల్సి ఉంటుంది. చాలా సంవత్సరాల తర్వాత బాల సార్‌ లాంటి ఒక డైరెక్టర్‌ని ఎక్స్‌పీరియన్స్‌ చేసినట్టు అన్పించింది. ఆయన దృష్టంతా మానిటర్‌పైనే ఉంటుంది. ఒక షాట్‌ అయిపోగానే అది ఎలా వచ్చింది అని అన్నీ కోణాలు నుండి సరిచూసుకొని ఓకే అంటారు. ఆయన ఓకే అనడం చాలా రిలీఫ్‌గా అన్పిస్తుంది. 

తమిళ్‌ రాజకీయాలకి ఏమైనా సంబంధం ఉందా? 

– ఇది ఏ రీజన్‌ బేస్డ్‌ ఫిల్మ్‌ కాదు అలాగని ఏ లొకాలిటీతో సంబంధం లేదు . ఇది జనరల్‌ పాలిటిక్స్‌కి సంబంధించిన అంశం మాత్రమే. 

మీరు ఫస్ట్‌టైమ్‌  బయోపిక్‌లో నటిస్తున్నారు కదా! ఎలా అన్పిస్తోంది? 

– శూర‌రై పోట్రు ఎగ్జాక్ట్‌గా బయోపిక్‌లా ఉండదు. కొంత సినిమాటిక్‌ లిబర్టీ తీసుకోవడం జరిగింది. కానీ మేం ఎవ్వరి బయోపిక్‌ అయితే తీస్తున్నామో, వారి పట్ల పూర్తి గౌరవంగా ఉన్నాం. కానీ.. ఆడియన్స్‌కి సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇవ్వడం కోసం అలా చేశాం. సుధ చాలాకాలంగా నా రాఖీ సిస్టర్‌. మేమిద్దరం ‘యువ’ మూవీ దగ్గర నుండి చాలా క్లోజ్‌ ఫ్రెండ్స్‌. తను చెప్పిన స్క్రిప్ట్‌ నాకు నచ్చింది. అలాగే తను కూడా ఈ సినిమా కోసం మూడు సంవత్సరాలు చాలా పేషెన్స్‌గా వెయిట్‌  చేసి ఈ స్క్రిప్ట్ రాసింది. ఈ సినిమాను మా యూనిట్ అందరూ  చాలా ఎంజాయ్‌ చేస్తూ చేస్తున్నాం. 

మీ సినిమా ఫస్ట్‌టైమ్‌ సౌత్‌ కొరియాలో రిలీజ్‌ అవుతుంది కదా? 

– మనలో చాలామంది సౌత్‌ కొరియా సినిమాలను ఇష్టపడతారు. అలాగే ‘ఎన్‌జికె’ సౌత్‌ కొరియాలో రిలీజవుతున్న తొలి తమిళ్‌ సినిమా. అక్కడినుండి నలుగురు వచ్చి సినిమా చూసారు. నాకు కూడా చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. సౌత్‌ కొరియా నుండి ఎలాంటి ఫీడ్‌ బ్యాక్‌ వస్తుందని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. 

జగన్‌గారు మీకు చాలా క్లోజ్‌ కదా? 

– నేనెప్పుడూ ఆయన్ని జగన్‌ అన్నా అని పిలుస్తాను. అనీల్‌ రెడ్డి నా క్లాస్‌మేట్‌. పది సంవత్సరాల క్రితం వారి కుటుంబానికి  హ్యూజ్‌ లాస్‌ జరిగింది. ఇప్పుడు పది సంవత్సరాల తర్వాత జగనన్న ఇంత పెద్ద విజయాన్ని సాధించడం సామాన్యమైన విషయం కాదు. ప్రజలందరూ దాని గురించే మాట్లాడుకుంటున్నారు. ఆయన సెకండ్‌ యంగెస్ట్‌ సీయం. ప్రజలు కోరుకునే మార్పును ఆయన ద్వారా సాధిస్తారని అనుకుంటున్నాను. జగన్‌ ఒక సక్సెస్‌ఫుల్‌ పొలిటీషియన్‌ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆయన ఎప్పటికీ అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. 

ఈ సినిమాను తెలుగులో రిలీజ్‌ చేస్తున్న రాధామోహన్‌ గురించి చెప్పండి? 

– రాధామోహన్‌గారి కన్విక్షన్‌ చాలా గొప్పది. ఆయన ఇంతవరకు సినిమాని చూడకుండా తెలుగులో రిలీజ్‌ చేయడానికి ముందుకొచ్చారు. అందులోనూ హోల్‌ హార్టెడ్‌గా మా సినిమాకు మంచి పబ్లిసిటీ ఇస్తున్నారు. మా అందరి సపోర్ట్‌ ఆయనకి ఎప్పుడూ ఉంటుంది. 

రకుల్‌, సాయి పల్లవిలతో కలిసి నటించడం ఎలా ఉంది? 

– వాళ్ళిద్దర్నీ శ్రీరాఘవ సార్‌ సెలెక్ట్‌ చేశారు. ఇప్పటివరకు ఒకేసారి ఇద్దరి హీరోయిన్‌లతో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం ఇది రెండోసారి అనుకుంటా.. రకుల్‌, సాయి పల్లవి ఇద్దరూ చాలా మంచి పెర్‌ఫార్మ్‌ చేశారు. ఈ సినిమా ఇద్దరికీ మంచి పేరు తెస్తుంది. 

టైటిల్‌ ఇంగ్లీష్‌ లెటర్స్‌ పెట్టడం ఎవరి ఛాయిస్‌? 

– మేం ప్రతి ఒక్కరికీ కనెక్ట్‌ అయ్యే టైటిల్‌ కోసం వెదుకుతున్న సమయంలో తమిళ్‌, తెలుగు భాషల్లో వేర్వేరు టైటిల్స్‌ అనుకున్నాం. కానీ ‘శివాజీ’, ‘రోబో’, ‘2.0’లా రెండు భాషల్లో ఒకే టైటిల్‌ పెడితే బాగుంటుందని మా పి.ఆర్‌ టీమ్‌, అలాగే డిస్ట్రిబ్యూటర్స్‌ సలహా ఇవ్వడం జరిగింది. అలాగే ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌లో ఎలాంటి న్యూస్‌ వచ్చినా టైటిల్‌ ఒకటే ఉంటే తొందరగా ఆడియన్స్‌కి రీచ్‌ అవుతుందని ‘ఎన్‌జికె’ని సెలెక్ట్‌ చేయడం జరిగింది.


ఎఫ్ 2 ఎఫెక్ట్: 50 నుంచి ఒకేసారి 80కి..!!

Category : Uncategorized

రవితేజ, నాని వంటి హీరోల సరసన నటించి హిట్ సినిమాలు చేసిన మెహ్రీన్ కౌర్ కి మాత్రం యంగ్ అండ్ స్టార్ హీరోల సినిమాల్లో నటించడం అనేది కలగానే మిగిలిపోయేలా కనబడుతుంది. ఈ ఏడాది అనుకోకుండా బిగ్గెస్ట్ హిట్ అయిన ఎఫ్ 2 సినిమాలో హీరోయిన్ గా నటించిన మెహ్రీన్ ఫేట్ మారుతుంది అనుకున్నారు అంతా. అలాగే అవకాశాలు క్యూ కడతాయన్నారు. ఓ అన్నంత అవకాశాలు లేకపోయినా… గోపీచంద్ సరసన ఒక సినిమా, నాగశౌర్య సరసన ఐరా క్రియేషన్స్ లో మరో సినిమాలో మెహ్రీన్ నటిస్తుంది.

అయితే నాగశౌర్య సరసన ఐరా క్రియేషన్స్ లో ముందుగా ఛలో హీరోయిన్ రష్మిక మందన్నని ఎంపిక చేశారు. అయితే ప్రస్తుతం టాప్ లెవల్లో దూసుకుపోతున్న రష్మిక డేట్స్ ఖాళీ లేక చెయ్యనందో… రెమ్యూనరేషన్ సరిపోక నో చెప్పిందో తెలియదు కానీ…. రష్మిక ప్లేస్ లోకి మెహ్రీన్ వచ్చి చేరింది. అయితే ఇప్పటివరకు రెమ్యూనరేషన్ కింద 50 లక్షలు మాత్రమే అందుకుంటున్న మెహ్రీన్ ఈ ఐరా క్రియేషన్స్ లో నాగశౌర్య సరసన నటిస్తునందుకు గాను అక్షరాలా 80 లక్షలు అందుకుంటుంది. మరి ఈ రెమ్యూనరేషన్ పెరుగుదలకు కారణం ఎఫ్ 2 హిట్ కావొచ్చు.


శర్వా, నిర్మాతల మధ్య ‘రణరంగం’ అందుకేనా?

Category : Uncategorized

‘ర‌ణ‌రంగం’..ఈ టైటిల్‌తో శర్వానంద్ మన ముందుకు వస్తున్నాడు. సుధీర్ వర్మ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను నిర్మాత సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తున్నారు. ఆగస్టులో ఈమూవీ రిలీజ్ కానుంది. నిజానికి ఈ వేసవిలో రిలీజ్ కావాలి కానీ షూటింగ్ లేట్ అవ్వడం వల్ల సినిమా రిలీజ్ డేట్ ఆల‌స్య‌మైంది.

అయితే ఈమూవీ షూటింగ్ లేట్ అవ్వడానికి, షూటింగ్ స‌జావుగా జర‌క్క‌పోవ‌డానికి శ‌ర్వానే కార‌ణ‌మ‌ని నిర్మాత సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ కాస్త గుర్రుగా ఉన్నాడ‌ట‌. ‘ప‌డి ప‌డి లేచె మ‌న‌సు’, ‘ర‌ణ‌రంగం’ షూటింగులు రెండూ స‌మాంత‌రంగా సాగాయి. అయితే ముందుగా ప‌డి ప‌డి లేచె మ‌న‌సు రిలీజ్ అయ్యి డిజాస్టర్ గా మిగిలిపోయింది. దాంతో  శ‌ర్వా నిరాశ‌కు లోన‌య్యాడ‌ని, అందుకే త‌ర‌చూ ‘ర‌ణ‌రంగం’ షూటింగ్‌కి డుమ్మా కొట్టేవాడ‌ని తెలుస్తోంది. 

ఆ మూవీ ఫ్లాప్‌ అవ్వడంతో శ‌ర్వా మూడ్ అప్ సెట్ అవ్వ‌డం వ‌ల్ల చాలాసార్లు రణరంగం షూటింగ్ పేకప్ చెప్పాల్సివచ్చిందని… అందుకే బడ్జెట్ కూడా అనుకోకుండా పెరిగిపోయిందని.. దాంతో శర్వా తీరుతో నిర్మాత అప్ సెట్ అయ్యాడ‌ని టాలీవుడ్‌లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు కూడా నిర్మాత, హీరోల మధ్య సరిగా మాటలు లేవని టాక్ నడుస్తుంది. 


‘ఎర్రచీర’ అప్‌డేట్ ఇదే!

Category : Uncategorized

శరవేగంగా ‘ఎర్రచీర’ షూటింగ్‌.. రెండో షెడ్యూల్‌ పూర్తి

బేబీ ఢమరి సమర్పణలో శ్రీ సుమన్‌ వెంకటాద్రి ప్రొడక్షన్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘ఎర్రచీర’. సీహెచ్‌ సుమన్‌ బాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. అనుకున్న రీతిలో ఈ నెల 25న రెండో షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది.

ఈ సందర్భంగా దర్శకుడు సుమన్‌ బాబు మాట్లాడుతూ.. సిటీ బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కిన రెండో షెడ్యూల్‌లో భాగంగా శ్రీరాంపై చిత్రీకరించిన యాక్షన్‌ సన్నివేశాలు, అజయ్‌ మహేష్‌పై తీసిన ఛేజింగ్‌ సీన్స్‌ ఎక్స్‌పెక్టేషన్స్‌కు మించి సంతృప్తినిచ్చిందన్నారు. అలాగే సీనియర్‌ హాస్యనటుడు అలీతో తీసిన హారర్‌, కామెడీ సన్నివేశాలు కూడా చక్కగా వచ్చాయని, ఈ సన్నివేశాలు ప్రేక్షకులను బాగా మెప్పిస్తాయని చెప్పారు.

ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ తోట సతీష్‌ మాట్లాడుతూ.. ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా సినిమాను రూపొందిస్తున్నామన్నారు. ఆగస్టు చివరి వారంలో గానీ, సెప్టెంబర్‌ మొదటి వారంలో గానీ రిలీజ్‌ చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నామని చెప్పారు.


ఓడినా పవన్‌ వెంటేనంటున్న యంగ్‌ హీరో..!

Category : Uncategorized

మొన్న జరిగిన ఎన్నికల్లో ఏపీలో జనసేన పార్టీ వామపక్షాలు, బిఎస్పీ వంటి పార్టీలతో పొత్తు పెట్టుకున్నా కూడా కేవలం రాజోలు సీటుతోనే సరిపెట్టుకోవాల్సివచ్చింది. ఒకే ఒక్క ఎమ్మెల్యే సీటు వచ్చింది. అనూహ్యంగా పవన్‌కళ్యాణ్‌ స్వయంగా పోటీ చేసిన ‘భీమవరం, గాజువాక’ రెండు స్థానాల్లో ఓటమి పాలయ్యాడు. మరోవైపు పవన్‌ పట్టుపట్టి నరసాపురం ఎంపీగా పోటీ చేయించిన మెగాబ్రదర్‌ నాగబాబు గానీ, విశాఖ నుంచి పోటీ చేసిన జేడీ లక్ష్మీనారాయణ కూడా విజయం సాధించలేకపోయారు. కానీ పవన్‌ మాత్రం తాత్కాలిక, వెంటనే అధికారం సాధించాలని పార్టీ పెట్టలేదు. 

25ఏళ్ల విజన్‌తో ముందుకు వెళ్దాం, ప్రజల పక్షం వహిస్తూ వారి సమస్యలను పరిష్కరిద్దామని తన అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు, ఓడిన అభ్యర్ధులకు దిశానిర్దేశం చేశాడు. ఈ విషయంలో పవన్‌ మనోధైర్యాన్ని, దృఢసంకల్పాన్ని మెచ్చుకోవాల్సిందే. ఇక జీరో పాలిటిక్స్‌, ధన ప్రభావం లేని ఎన్నికలు, అధికారంలో ఉన్న వారిని ప్రశ్నించడం వంటి పలు సమూల మార్పుల ఉద్దేశ్యంతో పవన్‌ పాలిటిక్స్‌లోకి వచ్చాడు. నేడు ప్రతి ఒక్కరు అయ్యోపాపం అంటున్నారు. మరికొందరు మాత్రం పవన్‌ ప్రస్తుతం ఓడిపోయినా మీవెంటే మేమున్నామని భరోసా ఇస్తున్నారు. 

యంగ్‌హీరో నిఖిల్‌ ఈ విషయంలో మరింత ముందుకు వచ్చాడు. ఈయన ‘విత్‌ పీకే’ హ్యాష్‌ ట్యాగ్‌తో పవన్‌ ఓడిపోయినా, గెలిచినా మేమంతా పవన్‌వెంటే ఉంటామనే అర్ధం వచ్చేలా ఉద్వేగంగా స్పందించాడు. విత్‌పీకే హ్యాష్‌ట్యాగ్‌తో జనసేన క్యాడర్‌లోనూ, పవన్‌కళ్యాణ్‌లోనూ ఆత్మస్ధైర్యం నింపేలా ఆయన మాటలు ఉన్నాయి. ఈ హ్యాష్‌ట్యాగ్‌తో జనసేన అభిమానులు, కార్యకర్తలు, కేడర్‌, సాధారణ ప్రజలు కూడా పవన్‌కి పెద్ద ఎత్తున మెసేజ్‌లు పెడుతున్నారు. 


తెలుగు ‘గోలీసోడా’ తుస్సుమంది..!

Category : Uncategorized

తమిళంలో మంచి విజయం సాధించిన ‘గోలీసోడా’ తెలుగు రీమేక్‌ని లగడపాటి శ్రీధర్‌ తన కుమారుడు విక్రమ్‌ సహదేవ్‌ని హీరోగా పరిచయం చేస్తూ తీశాడు. ఈ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘ఎవ్వడు తక్కువ కాదు’ అనే టైటిల్‌లో వచ్చిన ఈ చిత్రంలో అన్ని తక్కువేనని చెప్పాలి. ఈ చిత్రం బాగా ఆడితే తన కుమారుడితో వరుస చిత్రాలను నిర్మాత లగడపాటి శ్రీధర్‌ ప్లాన్‌ చేశాడు. కానీ ఈ చిత్రం చూసిన వారికి విక్రమ్‌ సహిదేవ్‌ చివరి చిత్రం ఇదే అయితే బాగుండును అనిపించింది. ఈ చిత్ర పరాజయంలో దర్శకుడు రఘురాజా తడబాటుకి గురయ్యాడు. దాంతో ఒరిజినల్‌లోని ఆత్మని పట్టుకోవడంలో ఆయన తీవ్రంగా విఫలమయ్యాడని చెప్పాలి. ఈ చిత్రం నలుగురు అనాథలకు, ఓ మాఫియా డాన్‌ మధ్య జరిగే మైండ్‌ గేమ్‌ చిత్రం. కానీ దీనిని ఇంటెలిజెంట్‌గా ప్రజెంట్‌ చేయడంలో దర్శకుడి లోటుతనం స్పష్టంగా కనిపిస్తోంది. 

ఇక క్యాస్టింగ్‌ కూడా ఈ మూవీ మైనస్‌కి ప్రధాన కారణాల్లో ఒకటిగా నిలిచింది. మొత్తానికి ఎంత వేగంగా ఈ చిత్రం వచ్చిందో అంతకు మించిన స్పీడ్‌తో గోడను తాకిన బంతిలా తిరిగి వెళ్లిపోవడం ఖాయమనే చెప్పాలి. ఇక గతంలో విక్రమ్‌ సహిదేవ్‌ లగడపాటి శ్రీధర్‌నిర్మాణంలో వక్కంతం వంశీ దర్శకునిగా పరిచయం అవుతూ, అల్లుఅర్జున్‌ హీరోగా నిర్మించిన ‘నాపేరు సూర్య..నా ఇల్లు ఇండియా’ చిత్రంలో కూడా నటించాడు. సినిమా డిజాస్టర్‌ కావడంతో ఎక్కువమందికి ఆయన రీచ్‌ కాలేకపోయాడు. ఇక ‘ఎవడు తక్కువ కాదు’ చిత్రం డెబ్యూ మూవీగా విక్రమ్‌ సహిదేవ్‌కి పీడకలగా భావించాల్సిన పరిస్థితే కనిపిస్తోంది.


లారెన్స్‌ను మరింత హర్ట్ చేశారట!

Category : Uncategorized

కాంచన.. ఈమూవీ సౌత్ ఇండియాలో ఓ ఊపు ఊపింది. ఇప్పుడు ఈసినిమా బాలీవుడ్‌లో రీమేక్ అవుతోంది. ఒరిజినల్ సినిమా తీసినా దర్శకుడు రాఘవ లారెన్స్ కొంత భాగం వరకు హిందీ రీమేక్‌ను షూట్ చేసారు. కానీ తనకు తెలియకుండా నిర్మాతలు ‘లక్ష్మీబాంబ్’ ఫస్ట్ లుక్ లాంచ్ చేయడంతో హర్టయి సినిమా నుంచి వైదొలిగాడు.

అయితే అతను హర్ట్ అయినా విషయం ప్రొడ్యూసర్స్ ఏమి పటించుకోకుండా మరో ఆప్షన్‌ని వెతికోవడంతో మరింత హర్ట్ అయ్యాడు లారెన్స్‌. కనీసం అతన్ని బుజ్జగించే ప్రయత్నం ఏదీ చేయలేదని స్పష్టమవుతోంది. లారెన్స్ వైదొలిగిన వారం రోజుల్లోనే అతడి రీప్లేస్మెంట్ రెడీ అయిపోవడం విశేషం. ఈమూవీకి రచయితగా పని చేస్తున్న ఫర్హద్ సంజికి ఈ చిత్ర దర్శకత్వ బాధ్యతలు కూడా అప్పగించారు.

ఇతను ఓ ప్రముఖ రైటర్. ఫర్హద్.. సాజిద్ అనే మరో రచయితతో కలిసి ఎన్నో చిత్రాలకు రచన అందించాడు. వీరిద్దరూ కలిసి ‘హౌస్ ఫుల్’ సిరీస్‌లో రెండు చిత్రాలకు డైరెక్షన్ కూడా చేశారు. కామెడీ రాయడంలో వీరు ఎక్స్పర్ట్స్. అందుకే ఏమి ఆలోచించకుండా నిర్మాతలు డైరెక్షన్ బాధ్యతలు ఫర్హద్‌కు  అప్పగించారు. మొత్తం వ్యవహారాన్ని పరిశీలిస్తే లారెన్స్‌ను పొమ్మనకుండా పొగబెట్టేశారేమో అని కూడా అనిపిస్తోంది.