హైదరాబాద్ నందు (బంజర హిల్స్, జూబిలీ హిల్స్, మాదాపూర్, కొండాపూర్ ) పరిసర ప్రాంతాల్లో పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ వెంటనే కావాలను. ఆర్మీ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేసి రిటైర్ అయినా వారికీ తగిన ప్రాధాన్యత ఇవ్వ బడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ + 91 8074965869

Monthly Archives: June 2019

తాగి తాగి లావెక్కిన హాట్ బ్యూటీ.. మూవీ మిస్!

Category : Uncategorized

అవును మీరు వింటున్నది నిజమే.. హాట్ బ్యూటీ రాధికా ఆప్టే గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. రీల్ అయినా.. రియల్ అయినా ఈమె క్రేజే వేరని చెప్పుకోవాలి. అయితే ఇటీవల ‘బీఎఫ్ఎఫ్’ షోలో పాల్గొన్న ఆమె ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ హాట్ బ్యూటీ తాగి తాగి.. ఫుల్‌గా తిని తెగ లావెక్కిపోయిందట. దీంతో సినిమా చాన్స్‌ మిస్సయ్యిందట ఈ విషయాన్ని స్వయంగా ఆమె చెప్పుకొచ్చింది.

ఇక అసలు విషయానికొస్తే.. గతంలో నేను బాగా మద్యం సేవించడంతో లావెక్కిపోయాను. దీంతో ‘విక్కీ డోనర్’ చిత్రంలో కథానాయికగా వచ్చిన అవకాశాన్ని కోల్పోయాను. ఈ చిత్రంలో కథానాయికగా ఎంపికైన అనంతరం చిత్రీకరణకు కాస్త సమయం ఉండటంతో రాధిక కొన్ని రోజుల పాటు విహార యాత్రకు వెళ్లాను. అయితే అక్కడ బీరు తాగి, బాగా తిని లావైపోయాను. దీంతో నన్ను సినిమా నుంచి తప్పించారు” అని చెబుతూ రాధికా ఒకింత ఆవేదనకు లోనైంది.

అయితే తనకు కొంత సమయం ఇస్తే సన్నబడతానని వేడుకున్నానని కూడా ఈ బ్యూటీ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. తన స్థానంలో యామీ గౌతమ్‌ను తీసుకున్నారు. అందుకే అప్పట్నుంచి తాను తిండి విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నానని స్పష్టం చేసింది.


రెజీనాతో రిలేషన్‌షిప్‌పై పెదవి విప్పిన హీరో!

Category : Uncategorized

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ లవ్ గురించి ఇప్పటికే పలుమార్లు పెద్ద ఎత్తున పుకార్లు వినిపించిన సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా రెజీనాతో ఈ కుర్ర హీరో రిలేషన్‌షిప్‌లో ఉన్నాడన్న వార్తలు నాటి నుంచి ఇప్పటి వరకూ ఆగట్లేదు. అయితే తాజాగా ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన లవ్ ట్రాక్.. రెజీనాతో రిలేషన్‌షిప్‌పై ఆయన పెదవి విప్పారు.

తనకు రెజీనాతో ఏదో ఉన్నట్టు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని అవన్నీ ఒట్టి పుకార్లేనని.. అందులో ఎలాంటి వాస్తవం లేదని కొట్టిపారేశారు. మా ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషిన్‌లేదని.. ఓన్లీ ఫ్రెండ్‌షిప్ మాత్రమేనని పుకార్లకు కుర్ర హీరో ఫుల్‌స్టాప్ పెట్టేశాడు. తామిద్దరం డైలీ ఫోన్‌లో టచ్‌లో ఉంటామని కూడా చెప్పుుకొచ్చారు.

అంతటితో ఆగని సందీప్.. ప్రస్తుతానికి తాను లవ్‌లో లేనని.. సింగిల్‌గానే ఉన్నానని రెండేళ్ల క్రితం వరకు ఒక అమ్మాయితో రిలేషన్ షిప్‌లో ఉన్నానని చెప్పుకొచ్చాడు. ఆ రిలేషన్ షిప్ కొన్ని అనివార్య కారణాల వల్ల కట్ అయ్యిందని.. ఆ అమ్మాయి పేరు చెప్పడం తప్పని అందుకే తానేమీ చెప్పలేకపోతున్నానని సందీప్ కిషన్ తెలిపారు. సో.. ఇకనైనా ఇలాంటి పుకార్లకు సంబంధించిన వార్తలు ఆగుతాయో లేదో వేచి చూడాల్సిందే మరి.


‘గుణ 369’తో మరో మల్లూభామ దిగుతోంది

Category : Uncategorized

మ‌ల‌యాళ ముద్దుగుమ్మ‌తో ‘గుణ 369’ రొమాన్స్

మ‌ల‌యాళ ముద్దుగుమ్మ‌లకు తెలుగులో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ద‌శాబ్దం క్రితం తెలుగులో ఓ ఊపు ఊపిన అసిన్‌, న‌య‌న‌తార‌, ప్రియ‌మ‌ణి వంటివారంద‌రూ మ‌ల్లువుడ్ భామ‌లే. ఇప్పుడు టాప్ హీరోల‌తో్ జ‌త‌క‌డుతోన్న నిత్యామీన‌న్‌, కీర్తి సురేష్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, నివేదా థామ‌స్‌, ప్రియా పి వారియ‌ర్‌… ఓపిగ్గా తెలుసుకోవాలేగానీ, ఈ లిస్టు చాంతాడంత పెరుగుతూనే ఉంటుంది. ఈ లిస్ట్ లో యాడ్ ఆన్ అవుతున్నారు మ‌రో మ‌ల‌బారు బ్యూటీ. ఆమె పేరు అన‌ఘ. ‘ఆర్.ఎక్స్.100’ ఫేమ్ కార్తికేయ స‌ర‌స‌న ‘గుణ 369’లో అన‌ఘ జోడీ క‌డుతున్నారు. స్ప్రింట్‌ ఫిలిమ్స్‌, జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌జీ మూవీ మేక‌ర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘గుణ 369’. కార్తికేయ హీరోగా న‌టించారు. అనిల్‌ కడియాల, తిరుమల్‌ రెడ్డి నిర్మాతలు. అర్జున్‌ జంధ్యాల ఈ చిత్రంతో దర్శకుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు.

ద‌ర్శ‌కుడు అర్జున్ జంధ్యాల మాట్లాడుతూ.. ‘‘కంటెంట్ డ్రైవ‌న్ ఫిల్మ్స్ తెలుగులో రావ‌డం లేద‌నుకునేవారికి స‌మాధానం చెప్పే విధంగా మా ‘గుణ 369’ ఉంటుంది. టీజ‌ర్ చూసిన వారంద‌రూ అదే మాట అంటున్నారు. టీజ‌ర్‌లో హీరోయిన్‌ని చూసిన‌ప్ప‌టి నుంచి చాలా మంది ఆమె గురించి ఆరా తీస్తున్నారు. ఆమె పేరు అన‌ఘ. కేర‌ళ భామ‌. మ‌ల‌యాళ న‌టీమ‌ణుల‌కు మ‌న ద‌గ్గ‌ర ఎప్పుడూ మంచి ఆద‌ర‌ణ ఉంటుంది. అనఘ కూడా టాప్ రేంజ్‌కి వెళ్తుంద‌నే న‌మ్మ‌కం ఉంది. త‌మిళ చిత్రం ‘న‌ట్పే తునై’లో అన‌ఘ న‌టించారు. అందులో కొన్ని సీన్లు చూసి ఈ సినిమాకు ఎంపిక చేసుకున్నాం. చాలా బాగా పెర్ఫార్మ్ చేసింది’’ అని అన్నారు.

నిర్మాత‌లు మాట్లాడుతూ.. ‘‘త‌మిళంలో ‘న‌ట్పే తునై’లో న‌టించిన అన‌ఘ‌కు తెలుగులో ఇదే తొలి చిత్రం. ఆమె స్టార్ మెటీరియ‌ల్ అని మా న‌మ్మ‌కం. మా సినిమాలో న‌ట‌న‌కు స్కోప్ ఉన్న పాత్ర ఆమెది. చాలా చ‌క్క‌గా న‌టించింది. అదే స‌మ‌యంలో గ్లామ‌ర్ విష‌యంలోనూ ఎక్క‌డా రాజీప‌డ‌లేదు. ఆమె స్వ‌త‌హాగా క్లాసిక‌ల్ డ్యాన్స‌ర్ కావ‌డంతో, డ్యాన్సుల విష‌యంలోనూ చాలా హెల్ప్ అయింది. ఫ‌క్తు క‌మ‌ర్షియ‌ల్ హీరోయిన్‌కి ఉండాల్సిన అన్ని ల‌క్ష‌ణాలు ఆమెలో ఉన్నాయి. మా హీరో కార్తికేయ స‌ర‌స‌న చ‌క్క‌గా స‌రిపోయింది. వారిద్ద‌రి మ‌ధ్య కెమిస్ట్రీ గురించి సినిమా విడుద‌ల‌య్యాక అంద‌రూ త‌ప్ప‌క మాట్లాడుకుంటారు. ‘గుణ 369’ షూటింగ్ పూర్త‌యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే విడుద‌ల తేదీని ప్ర‌క‌టిస్తాం’’ అని చెప్పారు.

ఈ చిత్రానికి సంగీత దర్శకుడు: చైతన్ భరద్వాజ్‌, కెమెరామెన్‌: ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ రామ్, ఆర్ట్‌ డైరెక్టర్‌: జీయమ్‌ శేఖర్, ఎడిటర్: తమ్మిరాజు, డాన్స్: రఘు, భాను, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్: స‌త్య కిశోర్‌, శివ మల్లాల.


సూర్య ఈసారి ‘బందోబస్త్’తో వస్తున్నాడు

Category : Uncategorized

సూర్య హీరోగా లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న సినిమా టైటిల్ ‘బందోబస్త్’

ప్రతి సినిమాకు స్టయిల్ చేంజ్ చేసే హీరోల్లో సూర్య ఒకరు. ప్రతిసారీ కొత్తగా కనిపించాలని, ప్రేక్షకులకు డిఫరెంట్ సినిమాలు అందించాలని ప్రయత్నిస్తారు. ప్రయోగాలు చేయడానికి ఏమాత్రం వెనుకాడరు. ‘సింగం’ వంటి పక్కా కమర్షియల్ సినిమాలు.. ‘గజినీ’, ‘సెవెన్త్ సెన్స్’, ‘24’ వంటి డిఫరెంట్ సినిమాలు… ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ వంటి లవ్ స్టోరీలు చేయడం ఆయనకు మాత్రమే సాటి. ప్రస్తుతం సూర్య నటిస్తున్న తమిళ సినిమా ‘కప్పాన్’. తెలుగులో ఈ సినిమా ‘బందోబస్త్’గా ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ సినిమా తెలుగు టైటిల్, లుక్ ను దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి విడుదల చేశారు. ‘రంగం’తో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ఏర్పరుచుకున్న కె.వి. ఆనంద్ ఈ చిత్రానికి దర్శకుడు. ‘వీడొక్కడే’, ‘బ్రదర్స్’ తరవాత సూర్య, కె.వి. ఆనంద్ కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా ఇది. ‘నవాబ్’, ‘2.0’ వంటి హిట్ సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరణ్ ఖర్చుకు వెనుకాడకుండా నిర్మిస్తున్నారు.

మోహన్ లాల్, బోమన్ ఇరానీ, ఆర్య, సాయేషా సైగల్, సముద్రఖని, పూర్ణ, నాగినీడు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి పీఆర్వో: సురేంద్రకుమార్ నాయుడు – ఫణి కందుకూరి, రైటర్: పి.కె.పి & శ్రీ రామకృష్ణ, లిరిక్స్: వనమాలి, చంద్రబోస్, ఆర్ట్ డైరెక్టర్: డి.ఆర్.కె. కిరణ్, ఎడిటర్: ఆంటోనీ, స్టంట్స్: దిలీప్ సుబ్బరాయన్, పీటర్ హెయిన్స్, డాన్స్: బాబా భాస్కర్, శోభి, గణేష్ ఆచార్య, సినిమాటోగ్రఫీ: ఎం.ఎస్. ప్రభు, సంగీతం: హారీస్ జయరాజ్, నిర్మాత: సుభాస్కరణ్, దర్శకత్వం: కె.వి. ఆనంద్.


‘సాహో’ అప్డేట్: 1368 అడుగుల ఎత్తులో..!

Category : Uncategorized

బాలీవుడ్  కొరియోగ్రాఫ‌ర్ వైభ‌వి మ‌ర్చంట్ ఆధ్వర్యంలో ఆస్ట్రియాలో 1368 అడుగుల ఎత్తులో  ‘సాహో’ సాంగ్ పూర్తి

‘బాహుబలి’ 1, 2 తరువాత  ప్ర‌పంచంలో వున్న ప్ర‌తి సినిమా ల‌వ‌ర్ చూపు యంగ్ రెబల్‌స్టార్ ప్ర‌భాస్ వైపు తిరిగింది. ఈ త‌రుణంలో సాహో మేకింగ్ మెద‌ల‌య్యే స‌రికి వారి ఆనందానికి అవ‌ధులు లేవు. సోష‌ల్ మీడియాలో అయితే వ‌ర‌ల్డ్ వైడ్ గా ప్ర‌భాస్ న‌టిస్తున్న సాహో సినిమా నెక్ట్స్ అప్‌డేట్ ఏమటి అనే సెర్చ్ విప‌రీతంగా జ‌రుగుతుంది. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెబెల్ స్టార్ ప్రభాస్ అభిమానుల ఉత్కంఠని మరింత పెంచుతూ మూడు భాషల్లో భారీ బడ్జెట్ తో టాలీవుడ్ ప్రేస్టేజియ‌స్ ప్రోడ‌క్ష‌న్ హౌస్ యువి క్రియేష‌న్స్ బ్యాన‌ర్ లో వంశీ, ప్ర‌మోద్, విక్ర‌మ్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇదిలావుంటే ఈ చిత్రానికి సంబంధించిన ఆస్ట్రియాలోని అత్య‌ద్భుత‌మైన లోకేష‌న్స్ లో బాలీవుడ్ ఫేమ‌స్ కొరియోగ్రాఫ‌ర్ వైభ‌వి మ‌ర్చంట్ కొరియోగ్ర‌ఫిలో సాంగ్ చిత్రీక‌ర‌ణ చేశారు. ఈ సాంగ్ కోసం చాలా అంద‌మైన లొకేష‌న్స్ చూడ‌టం జ‌రిగింది. ఈ సాంగ్ చిత్రీక‌ర‌ణ 1368 అడుగుల ఎత్తులో కేబుల్ కార్స్ తీసుకుని చేయ‌టం జ‌రిగింది. అయితే అంత ఎత్తులో షూట్ జ‌రుగుతున్న‌ప్పుడు యూనిట్ అంతా కంగారుప‌డ‌కుండా హీరో ప్ర‌భాస్ అంద‌ర్ని స‌పోర్ట్ చేస్తూ ఎంక‌రేజ్ చేశారు. చిత్ర యూనిట్ అంతా ఇంత‌లా స‌పోర్ట్ చేసినందుకు  సోష‌ల్ మీడియా ద్వారా నిర్మాత‌లు ధన్య‌వాదాలు తెలిపారు. ఈ చిత్రానికి జిబ్రాన్ అందించిన‌ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రత్యేకంగా నిలవనుంది. ప్రతీ సీన్ ని ఎలివేట్ చేసే విధంగా వరల్డ్ క్లాస్ క్వాలిటీ రీ రికార్డింగ్ అందించనున్నారు జిబ్రాన్. ఇక ఈ సాహో చిత్రం ఇండిపెండెన్స్ డే కానుకగా అగ‌స్ట్ 15 న ప్ర‌పంచ‌వ్యాప్తంగా బిగ్గెస్ట్ ఫిల్మ్ ఆఫ్ ద ఇయ‌ర్ గా విడుద‌లకి సిద్ధ‌మౌతోంది. 

యువీ క్రియేషన్స్ అధినేతలు వంశీ-ప్రమోద్ ఏ విషయంలోనూ రాజీ పడకుండా అత్యంత భారీ బడ్జెట్ తో ఏక కాలంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

బ్యానర్  – యువి క్రియేషన్స్

దర్శకుడు – సుజీత్

నిర్మాతలు – వంశీ-ప్రమోద్-విక్కీ

సినిమాటోగ్రాఫర్ – మధి

ఆర్ట్ డైరెక్టర్ – సాబు సిరీల్

ఎడిటర్ – శ్రీకర్ ప్రసాద్

పిఆర్వో – ఏలూరు శ్రీను


వీవీ వినాయక్‌కు GHMC షాక్.. భవనం కూల్చివేత

Category : Uncategorized

తెలుగు రాష్ట్రాల్లో అక్రమ, అవినీతి.. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన.. నిర్మిస్తున్న భవనాలను వైఎస్ జగన్, కేసీఆర్‌ సర్కార్‌లు కూల్చేసే పనిలో బిజిబిజీగా ఉంటున్నారు. ఇప్పటికే ఏపీలో ప్రజావేదికను కూల్చివేసిన సంగతి తెలిసిందే. మరోవైపు తెలంగాణ సర్కార్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న నిర్మాణాలను కూల్చివేస్తోంది. తాజాగా.. టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ వీవీ వినాయక్‌కు చెందిన ఓ భవనాన్ని జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు.

పూర్తి వివరాల్లోకెళితే.. భాగ్యనగరంలోని శివారు ప్రాంతమైన వట్టినాగులపల్లిలో వినాయక్ కొంతకాలంగా నాలుగు అంతస్తుల భవంతి నిర్మించుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న జీహెచ్ఎంసీ అధికారులు బుధవారం రాత్రి అక్కడికి చేరుకుని పర్మిషన్ పత్రాలు అన్నీ పరిశీలించగా.. సరైన అనుమతులు లేవని గుర్తించారు. దీంతో వెంటనే దర్శకుడు వినాయక్‌కు అధికారులు నోటీసులు జారీ చేయడం జరిగింది. 111 జీవోకు వ్యతిరేకంగా నిర్మాణం ఉందంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. 

జీహెచ్ఎంసీ నోటీసులకు వినాయక్ స్పందించకపోవడంతో అధికారులు ఇక తమ పని కానిచ్చేశారు. బుధవారం రాత్రి రంగంలోకి దిగిన అధికారులు వట్టినాగులపల్లిలో నిర్మాణంలో ఉన్న భవనాన్ని కూల్చివేయడం జరిగింది. అయితే ఇది నిజంగా అనుమతి తీసుకోని నిర్మాణామా..? లేదా అన్ని అనుమతులు సక్రమంగా ఉన్నాయా..? అనే విషయంపై వినాయక్ మాత్రం ఇంత వరకూ మీడియా ముందుకు గానీ.. సోషల్ మీడియాలో గానీ రియాక్ట్ అవ్వలేదు.


పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో `నా పేరు రాజా`

Category : Uncategorized

అమోఘ్ ఎంట‌ర్ ప్రైజెస్ ప‌తాకంపై రాజ్ సూరియ‌న్ హీరోగా ఆకర్షిక‌, నస్రీన్  హీరోయిన్స్ గా అశ్విన్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘నా పేరు రాజా’.  (ఈడో రకం -డెఫెనెట్లీ డిఫ‌రెంట్ ట్యాగ్ లైన్ ) రాజ్ సూరియ‌న్‌, ప్ర‌భాక‌ర్ రెడ్డి, కిర‌ణ్ రెడ్డి నిర్మాత‌లు. తెలుగు, క‌న్న‌డ రెండు భాష‌ల్లో రూపొందుతోన్న ఈ చిత్రం ప్ర‌స్తుతం డ‌బ్బింగ్, డిఐ కార్య‌క్ర‌మాలు జరుపుకుంటోంది. యాక్ష‌న్ అండ్ రొమాంటిక్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కుతోన్న

ఈ చిత్రం గురించి ద‌ర్శ‌క నిర్మాత‌లు మాట్లాడుతూ… ‘‘తిరుగుబోతు, ద్వార‌క చిత్రాల‌తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన యాక్ష‌న్ స్టార్ రాజ్ సూరియ‌న్ ఈసారి మూడు డైన‌మిక్ అండ్ డిఫ‌రెంట్ గెట‌ప్స్ లో న‌టిస్తోన్న చిత్రం ‘నా పేరు రాజా’.  ఏపి, తెలంగాణ‌, కేర‌ళ మరియు క‌ర్ణాట‌క ప్రాంతాల్లో దాదాపు 65 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసాం. మ‌ల‌యాళం మెగాస్టార్ మ‌మ్ముట్టి న‌టించిన చిత్రానికి సంగీతం అందించిన ఎల్విన్ జాషువా ఈ చిత్రానికి అద్భ‌తుమైన సంగీతం స‌మ‌కూర్చారు. ఇందులో ప్ర‌తి పాట సంద‌ర్భానుసారంగా సాగుతూ డిఫ‌రెంట్ సౌండింగ్ తో  ఆక‌ట్టుకునేలా ఉంటాయి. ఎల్విన్ జాషువా అద్భుత‌మైన బాణీల‌కు సాహితి, శ్రీమ‌ణి గార్లు అర్థ‌వంత‌మైన సాహిత్యాన్ని స‌మకూర్చారు. ఈ పాట‌ల‌ను సంచిత్ హెగ్డే, మోహ‌న్ భోగ‌రాజు, లిప్పిక‌, అభినంద‌న్, చేత‌న్ నాయ‌క్ ఆల‌పించ‌గా న‌గేష్‌.వి ఎక్స్ లెంట్ కొరియోగ్ర‌ఫీ అందించారు.

సిజి, విఎఫ్ఎక్స్ విష‌యంలో ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా  ఖ‌ర్చు పెట్టాం. థియేట‌ర్స్ లో ఆడియ‌న్స్ క‌చ్చితంగా థ్రిల్ ఫీల‌య్యేలా ప్ర‌తి స‌న్నివేశం ఉంటుంది. థ్రిల్ల‌ర్ మంజు, మాస్ మ‌ద కంపోజ్ చేసిన ట‌ఫ్  ఫైట్స్ సినిమాకు హైలెట్స్ గా నిలుస్తాయ‌న‌డంలో సందేహం లేదు. అలాగే రామ్ గోపాల్ వ‌ర్మ‌లాంటి గొప్ప ద‌ర్శ‌కుల సినిమాల‌కు ప‌ని చేసిన వెంకట్ సినిమాటోగ్రఫీ మా సినిమాకు అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌.  ఇలా ఎంతో టాలెంటెడ్ టెక్నీషియ‌న్స్, ఆర్టిస్ట్స్  మా చిత్రానికి ప‌ని చేసారు. ప్ర‌స్తుతం డ‌బ్బింగ్, డిఐ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. అతి త్వ‌ర‌లో పాట‌లు, సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. 

ప్ర‌భు సూర్య‌, ఆయుశ్రీ, ఇరాన్, సూప‌ర్ మోడ‌ల్ అవా స‌ఫాయి, ఆరాధ్య త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి.. సంగీతం: ఎల్విన్ జాషువా, సినిమాటోగ్రాఫ‌ర్: ఎ.వెంక‌ట్, ఎడిట‌ర్: వెంకీ యుడివి,  ఫైట్స్:  థ్రిల్ల‌ర్ మంజు, మాస్ మద‌,  కొరియోగ్రాఫ‌ర్: న‌గేష్‌.వి,  లిరిక్స్: శ్రీమ‌ణి, సాహితి, నిర్మాత‌లు: రాజ్ సూరియ‌న్‌, కిర‌ణ్ రెడ్డి, ప్ర‌భాకర్ రెడ్డి, ర‌చ‌న‌-ద‌ర్శ‌కత్వం: అశ్విన్ కృష్ణ‌.


బంగార్రాజు కి రెమ్యూనరేషన్ లేదంట!

Category : Uncategorized

అన్నపూర్ణ స్టూడియోస్ లో వరసగా రెండు సినిమాలు తీసి హిట్ అందుకున్నాడు దర్శకుడు కళ్యాణ్‌కృష్ణ. ఆ రెండు హిట్స్ తరువాత ఆ సంస్థ నుండి బయటికి వెళ్లి రవితేజతో ‘నేల టిక్కెట్టు’ అనే సినిమా తీసి అంతకుముందు తీసిన రెండు సినిమాలతో వచ్చిన పేరు చెడగొట్టుకున్నాడు. దాంతో మనోడికి ఛాన్సులు రావడంలేదు. చేసేది ఏమి లేక మళ్లీ తన సొంత గూటికి అంటే అన్నపూర్ణ స్టూడియోస్‌ కాంపౌండ్‌లో అడుగుపెట్టాడు.

‘సోగ్గాడే చిన్నినాయనా’ సీక్వెల్‌ ‘బంగార్రాజు’ ను లైన్ లోకి తీసుకువచ్చాడు. ఈమూవీలో నాగార్జున, నాగచైతన్య ఇద్దరూ కలిసి నటిస్తున్నారు. ఇందులో చైతు బంగార్రాజుకి మనవుడిగా కనిపించనున్నాడు. ఆల్మోస్ట్ స్టోరీ మొత్తం ఓకే అయిపోయింది. త్వరలోనే ఈమూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే కళ్యాణ్ కృష్ణ  ఆ రెండు హిట్స్ వచ్చిన తరువాత కూడా అక్కడే ఉండి ఉంటే అన్నపూర్ణ కాంపౌండ్‌లో బాగా వెయిట్‌ వుండేది. రెమ్యూనరేషన్ బాగా పెరిగేది. 

కానీ బయటకు వెళ్లి నేల టిక్కెట్టుతో నేల మీదకి వచ్చేసిన ఆ దర్శకుడికి ఇప్పుడు ఫిక్స్‌డ్‌ రెమ్యూనరేషన్‌ లేదట. ఓన్లీ ఎక్స్‌పెన్సస్‌ మాత్రమే ఇస్తున్నారట. ఒకవేళ సినిమా హిట్ అయితే అందులో షేర్ ఇస్తానని నాగ్ ముందుగానే చెప్పాడట. దానికి కృష్ణ ఒప్పుకునే ఈమూవీ చేస్తున్నాడు అని టాక్ నడుస్తుంది.


ప్రమోషన్స్ కి సపోర్ట్ ఇవ్వడంలో ఈ హీరోయిన్ టాప్!

Category : Uncategorized

సాధారణంగా హీరోయిన్స్ తమ సినిమా షూటింగ్ అయ్యిపోయాక ఆ సినిమా గురించి అసలు పట్టించుకోరు. పైగా ప్రమోషన్స్ కి రమ్మన్న తెగ ఇబ్బంది పెడుతుంటారు. కానీ సమంత అందుకు వ్యతిరేకం. తను నటించిన సినిమాలో తన పాత్ర నచ్చితే చాలు ఎంతవరకు అయినా వెళ్తుంది సామ్. సినిమా పూర్త‌య్యాక ప్ర‌మోషన్ ఘ‌ట్టాన్నీ త‌న నెత్తిమీద వేసుకుంటుంది.

‘యూ ట‌ర్న్‌’, ‘మ‌జిలీ’ సినిమాల‌కు ఇదే జ‌రిగింది. ఇప్పుడు లేటెస్ట్ మూవీ ‘ఓ బేబీ’ విష‌యంలోనూ అదే జ‌రుగుతోంది. సామ్ ఈమూవీ యొక్క ప్రమోషన్స్ విషయంలో చాలా శ్ర‌ద్ధ తీసుకుంటోంది. ప్రమోషన్ ఎలా చేయాలి? ఏం చేస్తే ప్రేక్షకులు సినిమాకి కనెక్ట్ అవ్వుతారు? అటువంటి ఇంపుట్స్ అన్ని సామ్ చిత్ర‌బృందం సలహాలు ఇస్తుందట.

ప్రమోషన్ ఘట్టాన్ని ద‌గ్గ‌రుండి చూసుకుంటోంది. ఈసినిమాకి సంబంధించి ప్రమోషన్స్ అన్ని కంప్లీట్ అయిన తరువాతే తన నెక్స్ట్ సినిమా గురించి ఆలోచిస్తా అంటుంది సామ్. తిరుప‌తి, విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం లాంటి ప‌లు న‌గ‌రాల్లో ఓబేబీ ప్ర‌మోష‌న్ ఈవెంట్స్ జ‌ర‌గ‌బోతున్నాయి. ఈ ఈవెంట్స్ లో సామ్ పాలు పంచుకోనుంది. యూట్యూబ్, టీవీ, ఎఫ్ ఎమ్‌, ప్రింట్ మీడియా ఇంటర్వ్యూలు కూడా డైలీ జరుగుతూనే ఉన్నాయి. అలా ఈసినిమా ప్రమోషన్స్ విషయం మొత్తం తానై చూసుకుంటుంది సామ్.


చైతు, సాయిపల్లవి జంటగా సినిమా ప్రారంభం

Category : Uncategorized

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల సినిమా ప్రారంభం. 

నాగచైతన్య, సాయి పల్లవి జంటగా సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా పూజ కార్యక్రమాలు సికింద్రాబాద్ వినాయకుడి టెంపుల్ లో జరిగాయి.

ఫిదా వంటి సెన్సేషనల్ హిట్ అందుకున్న శేఖర్ ఆ తర్వాత ఎలాంటి కథతో వస్తాడా అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. వారి ఆసక్తిని డబుల్ చేస్తూ క్రేజీ కాంబినేషన్ తో సినిమా చేయబోతున్నాడు శేఖర్ కమ్ముల. మజిలీ వంటి సూపర్ హిట్ తర్వాత వరుసగా 

సినిమాలు చేస్తోన్న నాగచైతన్య హీరోగా.. తన డైరెక్షన్ లోనే వచ్చిన ఫిదాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన నేచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా చేయడంతో ఈ  ప్రాజెక్ట్ పై క్రేజ్ పెరిగింది. 

డిస్ట్రిబ్యూటర్స్ గా ఇప్పటి వరకూ వందలాది సినిమాలను విడుదల చేసిన ఏసియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ సినిమాతో ఫస్ట్ టైమ్ నిర్మాణ రంగంలోకి దిగుతోంది. నారాయణదాస్ నారంగ్, పి.రామ్మోహనరావు ఈ చిత్రానికి నిర్మాతలు. ఏషియన్ వంటి పెద్ద కంపెనీ నిర్మిస్తుండటం వల్ల ఇప్పుడీ ప్రాజెక్ట్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. దీంతో పాటు శేఖర్ ఎంచుకున్న కాస్ట్ కూడా ప్రాజెక్ట్ కు పెద్ద ఎస్సెట్ గా అయింది. 

ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ప్రారంభం అయిన ఈ సినిమా ఈ ఇయర్ ఎండ్ లో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఈ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో షూటింగ్ ప్రారంభం కానుంది.

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తోన్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ విజయ్.సి.కుమార్.. ఇతర ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులకు సంబంధించిన వివరాలను త్వరలోనే తెలియజేస్తారు.