హైదరాబాద్ నందు (బంజర హిల్స్, జూబిలీ హిల్స్, మాదాపూర్, కొండాపూర్ ) పరిసర ప్రాంతాల్లో పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ వెంటనే కావాలను. ఆర్మీ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేసి రిటైర్ అయినా వారికీ తగిన ప్రాధాన్యత ఇవ్వ బడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ + 91 8074965869

Monthly Archives: July 2019

సక్సెస్ మీట్‌లో ‘నేను లేను’..!

Category : Uncategorized

ఓ.య‌స్‌.యం విజన్ – దివ్యాషిక క్రియేష‌న్స్ పతాకాలపై సుక్రి కుమార్ నిర్మాతగా రూపొందిన  సైకలాజికల్ థ్రిల్లర్ ‘నేను లేను’… ‘లాస్ట్ ఇన్ లవ్’ అనేది ఉప‌శీర్షిక‌. రామ్ కుమార్ దర్శకుడు. హ‌ర్షిత్‌, వంశీకృష్ణ‌ పాండ్య‌, శ్రీ‌ప‌ద్మ‌, మాధ‌వి, బిశ్వ‌జిత్‌నాధ్‌ ప్రధానపాత్రల్లో నటించిన‌ ఈ చిత్రం జూలై 26న విడుద‌లై మంచి టాక్‌తో విజయవంతంగా ప్రదర్శింబడుతోంది. ముఖ్యంగా ఇంతవరకూ రాని న్యూ ఏజ్ కాన్సెప్ట్, ఇంటలెక్చువల్ స్క్రీన్ ప్లేకి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన  సక్సెస్ మీట్ లో….

దర్శకుడు రామ్ కుమార్ మాట్లాడుతూ – ‘‘మా చిత్రం జూలై 26 న విడుదలై అన్ని సెంటర్స్ లోనూ పాజిటివ్ టాక్ తో రన్ అవుతోంది. అలాగే మా సినిమాలో ఉన్న కాన్సెప్ట్ ఎక్కడి నుండి కాపీ కొట్టలేదు. ఒక జెన్యూన్ పాయింట్ మీద చాలా సంవత్సరాలు కష్టపడి రాసుకున్న స్టోరీ. ఇండియన్ స్క్రీన్ మీద ఇప్పటి వరకు ఇలాంటి కాన్సెప్ట్ మీద ఏ సినిమా రాలేదు. మా సినిమాకి అటు ఆడియన్స్ ఇటు సినీ విశ్లేషకుల నుండి మంచి పాజిటివ్  రెస్పాన్స్ వచ్చినప్పటికీ నిర్మాతలకి  బుక్ మై షోకి మధ్యవర్తిగా పనిచేస్తున్న కొందరి వల్ల మా సినిమాకు సరైన రేటింగ్స్ రాలేదు. దాంతో మాకు మల్టిప్లెక్స్ థియేటర్స్ లభించలేదు. దాంతో కొంత  సినిమాకు నష్టం జరిగింది. అయినప్పటికీ త్వరలోనే అమెజాన్ లో సినిమా రాబోతుంది’’ అన్నారు.

హీరో వర్షిత్ మాట్లాడుతూ – ‘‘మా మూవీకి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా చాలా కొత్త కాన్సెప్ట్ అని నా ఫ్రెండ్స్ ఫోన్ చేసి అభినందిస్తున్నారు. ఇంతవరకు ఎవరూ రైజ్ చేయని ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఇది. ఇంతమంచి సినిమాలో నన్ను భాగం చేసిన దర్శకుడు రామ్ కుమార్ గారికి థాంక్స్. అలాగే ఆర్.ఆర్. క్లైమాక్స్ ఫైట్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఒక థర్డ్ పార్టీ వాళ్ళు చెప్పిన అమౌంట్ ఇవ్వలేదని బుక్ మై షోలో రేటింగ్స్ తగ్గించడం జరిగింది. ఒక చిన్న సినిమాకి ఇలాంటి ఇబ్బందులు పునరావృతం కాకుండా మీడియా సపోర్ట్ కావాలి’’ అన్నారు.

నటుడు వంశీకృష్ణ‌ పాండ్య‌ మాట్లాడుతూ – ‘‘ఈ సినిమాలో  హీరో ఫ్రెండ్ క్యారెక్టర్‌లో నటించాను. సినిమా చూసి బయటకు వచ్చే ఆడియన్స్ నా పేరు కూడా గుర్తుపెట్టుకొని చాలా బాగా చేశాడు అని చెపుతున్నారు. నన్ను నమ్మి ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు దర్శకుడికి థాంక్స్. టెక్నీకల్‌గా సినిమా చాలా బాగా వచ్చింది’’ అన్నారు.

నటుడు రుద్రప్రకాష్ మాట్లాడుతూ – ‘‘సినిమాలో మంచి పోలీస్ ఆఫీసర్  క్యారెక్టర్ చేశాను. సినిమా విడుదలయ్యాక  మా ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేసి అభినందిస్తున్నారు. అలాగే సినిమా రెస్పాన్స్ కూడా బాగుంది. నాకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు థాంక్స్’’ అన్నారు.

హ‌ర్షిత్‌, వంశీకృష్ణ‌ పాండ్య‌, శ్రీ‌ప‌ద్మ‌, మాధ‌వి, బిశ్వ‌జిత్‌నాధ్‌, రుద్ర‌ప్ర‌కాశ్‌, వేల్పుల‌ సూరి, యుగంధ‌ర్ త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి..  

సంగీతం: ఆశ్రిత్‌, ఛాయాగ్ర‌హ‌ణం: ఎ. శ్రీ‌కాంత్ (బి.ఎఫ్‌.ఎ), నృత్యాలు: జోజో, నిర్వాహ‌ణ: సురేష్‌కూర‌పాటి, పి.ఆర్‌.ఓ‌: సాయి స‌తీష్ పాల‌కుర్తి, విఎఫ్ఎక్స్: ప్రభురాజ్‌, ఎస్.ఎఫ్.ఎక్స్: పురుషోత్తం రాజు, ఆడియోగ్ర‌ఫీ: రంగ‌రాజ్‌, క‌ల‌రిస్ట్: క‌ళ్యాణ్ ఉప్పాల‌పాటి, ప్ర‌చార చిత్రాలు: శ్రీ‌క‌, స‌హాయ‌ద‌ర్శ‌కులు: జె.మోహ‌న్‌కాంత్‌, ద‌ర్మేంద్ర‌, సురేశ్‌, స‌హ‌నిర్మాత : య‌షిక,  నిర్మాత : సుక్రి , రచన- దర్శకత్వం : రామ్ కుమార్ ఎమ్.ఎస్.కె.


కామ్రేడ్‌‌పై వర్మ పంచ్‌లు..!

Category : Uncategorized

లేటెస్ట్‌గా రిలీజ్ అయిన చిత్రాల్లో ఇస్మార్ట్ శంకర్ అండ్ డియర్ కామ్రేడ్ లు కలెక్షన్స్ పరంగా స్లో గా నెట్టుకొస్తున్నాయి. డియర్ కామ్రేడ్ చిత్రం తొలి రోజే డివైడ్ టాక్ తో డీసెంట్‌గా పెర్ఫామ్ చేస్తుండగా… ఇస్మార్ట్ మాత్రం చాలా చోట్ల కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఈచిత్రం హిట్ అవుతుందని పూరీనే అనుకోలేదు. ఇది స్వయంగా పూరీనే చెప్పాడు. రామ్ కెరీర్ లో ఇది పెద్ద హిట్.

ఈ హిట్ తో పూరి ఏమో కానీ పూరి గురువు రామ్ గోపాల్ వర్మ మాత్రం తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. ఏదో తన సొంత సినిమా హిట్ అయినట్టు ఆనందపడుతున్నాడు. రీసెంట్ గా ఆయన చేసిన ట్వీట్ హాట్ టాపిక్‌గా మారింది. డియర్ కామ్రేడ్ అండ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాలని పోలుస్తూ ఆయన ఈ ట్వీట్ చేసారు.

‘ఇస్మార్ట్ శంకర్ నాన్‌ఇస్మార్ట్ కామ్రేడ్ కంటే ఇస్మార్ట్‌గా ఉందా.. లేక.. నాన్‌ఇస్మార్ట్ కామ్రేడ్ ఇస్మార్ట్ శంకర్‌ను మించిపోయిందా?.. నిజం రామ్ విజయానికి తెలుసు..’  అని ట్వీట్ చేసారు. అంటే ఇండైరెక్ట్ గా విజయ్ పై సెటైర్ వేశాడు. అంతే కాదు రెండు సినిమాల కలెక్షన్స్ కూడా పోస్ట్ చేసాడు. ఈయన చేసేది ఎలా ఉందంటే ‘కాకి పిల్ల కాకికి ముద్దు’ అన్నట్టు ఉంది అంటూ విజయ్ ఫ్యాన్స్ వర్మని ఏసుకుంటున్నారు.


అలీకి వైఎస్ జగన్ కీలక పదవి ఇచ్చేశారుగా!!

Category : Uncategorized

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కనివినీ ఎరుగని మెజార్టీ సీట్లతో వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అధికారంలోకి వచ్చాక పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలని వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భావించారు. మరీముఖ్యంగా టాలీవుడ్‌ నుంచి పార్టీలోకి వచ్చి సేవలు చేసిన థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి రాజ్‌కు ఇప్పటికే ఎస్వీబీసీ చైర్మన్‌గా నియమిస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేయడమైనది.

ఎన్నికలకు ముందు టీడీపీ, జనసేన పార్టీలను కాదని వైసీపీ తీర్థం పుచ్చుకున్న కమెడియన్ అలీకి కూడా న్యాయం చేయాలని జగన్ యోచిస్తున్నారట. వాస్తవానికి అలీ.. ఎమ్మెల్యే టికెట్ ఆశించారు అది కుదరకపోవడంతో చివరికి ఎమ్మెల్సీ ఇచ్చి వక్ఫ్‌ బోర్డు నియమిస్తారని దీంతో ఆయన ‘డబుల్ ధమాకా’ ఇచ్చినట్లుందని పార్టీ అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. 

అయితే తాజాగా.. ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర నాటక మండలి (ఏపీఎఫ్‌డీసీ) చైర్మన్‌గా నియమించేశారని తెలుస్తోంది. అయితే అధికారికంగా ప్రకటన మాత్రమే వెలువడాల్సి ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. మరో రెండ్రోజుల్లో అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే ఇది ఎంతవరకు నిజమో..? తెలియాలంటే అధికారిక ప్రకటన వెలువడాల్సిందే మరి.


మాజీ ముఖ్యమంత్రి కొడుకుతో బోయపాటి సినిమా!

Category : Uncategorized

అవును మీరు వింటున్నది నిజమే.. మాజీ సీఎం కుమారుడితో సినిమా తీయడానికి బోయపాటి శ్రీను ప్లాన్ చేస్తున్నాడని ఫిల్మ్‌నగర్‌లో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే అతి త్వరలోనే సినిమా సెట్స్‌ దాకా తీసుకెళ్లాలని బోయపాటి భావిస్తున్నారట. ఇంతకీ ఆ మాజీ సీఎం ఎవరంటారా..? ఆయనేనండి.. కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్ గౌడ.

2019 పార్లమెంట్ ఎన్నికల్లో మాండ్యా నుంచి జేడీఎస్ తరఫున నిఖిల్‌కు అదృష్టం కలిసిరాలేదు. ఇక్కడ్నుంచి ఇండిపెండెంట్‌గా పోటీచేసిన సుమలత ఊహించని మెజార్టీ అఖండ విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో నిఖిల్ ఘోర పరాజయం పాలవ్వడం.. మరోవైపు కన్నడనాట కుమారన్న సర్కార్ కుప్పకూలిపోవడం వరుస పరిణామాల నేపథ్యంలో రాజకీయాలకు రాం రాం చెప్పేసి మళ్లీ సినిమాల్లోకి రావాలని నిఖిల్ నిర్ణయించినట్లు తెలుస్తో్ంది.

కాగా ఇప్పటికే ‘జాగ్వార్’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన నిఖిల్.. ఆ తర్వాత పత్తా లేకుండా పోయారు. అయితే నిఖిల్‌-బోయపాటికి ఎక్కడ కనెక్షన్ సెట్ అయ్యిందో తెలియట్లేదు కానీ.. సినిమా చేయడానికి మాత్రం బోయపాటి సిద్ధంగా ఉన్నారట. కథ కూడా ఆ హీరోకు సరిగ్గా సెట్ అవుతుందని భావిస్తున్నారట. మరోవైపు భారీ సినిమాలంటున్న బోయపాటి ‘వినయ విధేయ రామ’ ఈ మధ్య అట్టర్‌ప్లాప్‌ను ఖాతాలో వేసుకున్నారు. అయితే నిఖిల్‌తో సినిమా పట్టాలెక్కించి సక్సెస్ సాధిస్తారా..? లేదా..? అసలు సినిమా ఉందో..? లేదో..? తెలియాలంటే బోయపాటి రియాక్ట్ అవ్వాల్సిందే మరి.


బాలయ్యకు ముగ్గురు ఫిక్సయ్యారు..!

Category : Uncategorized

బాలకృష్ణ – కెఎస్ రవికుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ఈ మధ్యనే సెట్స్ మీదకు వెళ్ళింది. ప్రస్తుతం బ్యాంకాక్‌లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇందులో హీరోయిన్‌గా సోనాల్ చౌహాన్ ఫైనల్ అయింది. అలానే మరో హీరోయిన్‌గా సుమంత్ హీరోగా నటించిన ‘దగ్గరగా దూరంగా’ ఫేమ్ వేదిక కూడా ఈ సినిమాలో రెండో హీరోయిన్‌గా నటిస్తున్నట్టు సమాచారం.

ఇక తాజా సమాచారం ప్రకారం బాలకృష్ణతో నటించినడానికి ఒక హాట్ బ్యూటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆమె ఎవరో కాదు నమిత. గతంలో ఈమె బాలయ్యతో సింహా సినిమాలో నటించింది. అయితే రవికుమార్ సినిమాలో నమిత నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించనుందట.

మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాల్సిఉంది. ఇక ఈ సినిమాపై బాలయ్య అంచనాలు పెంచుకున్నాడు. ఇది ఎట్టిపరిస్థితుల్లో హిట్ అవ్వాలని చూస్తున్నాడు. రీసెంట్‌గా ఈ మూవీ సంక్రాంతి రేస్ నుండి తప్పుకుందని వార్తలు వస్తున్నాయి. 


‘రాక్షసుడు’ టైటిల్ అందుకే పెట్టాం: నిర్మాత

Category : Uncategorized

యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన  చిత్రం ‘రాక్షసుడు’. తమిళంతో విజయవంతమైన ‘రాక్షసన్’ చిత్రానికి ఇది తెలుగు రీమేక్. ఏ  హావిష్ లక్ష్మణ్ కోనేరు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై  ప్రముఖ విద్యా వేత్త కోనేరు సత్యనారాయణ ఈ సినిమాను నిర్మించారు. అభిషేక్ పిక్చర్స్  బ్యానర్‌పై అభిషేక్ నామ ఈ చిత్రాన్ని  ఆగష్టు 2 న  ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా  కోనేరు సత్యనారాయణ  ఇంటర్వ్యూ..

ప్రఖ్యాత కెఎల్ యూనివర్సిటీకి విజయవాడ  చైర్మన్ అయుండి నిర్మాణం వైపు ఎందుకు వచ్చారు ?  

– దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఎడ్యుకేషన్ రంగంలో ఉన్నాను. మా కోనేరు లక్ష్మయ్య యూనివర్శిటీ నేషనల్ వైజ్‌గా ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లాస్ట్ ఇయర్ నుండి  హైదరాబాద్‌లో కూడా మా బ్రాంచ్ స్టార్ట్ చేయడం జరిగింది.  జీనియస్ అని మా అబ్బాయి హవీష్ హీరోగా చేసిన చిత్రానికి గతంలో పనిచేసినప్పటికీ పెద్దగా ఇన్వాల్వ్ కాలేదు. అయితే సినీ నిర్మాణం వైపు రావడానికి కారణం మాత్రం మా అబ్బాయి హవీషే. ఆ అనుభవంతోనే ఇప్పుడు ‘రాక్షసుడు’ సినిమాకు ఏ హవీష్ లక్ష్మణ్ కోనేరు ప్రొడక్షన్ స్థాపించి పూర్తి స్థాయి నిర్మాణ భాద్యతలు చేపట్టాను. ఒక విధంగా  చెప్పాలంటే  ఈ సినిమాతోనే పూర్తిస్థాయి నిర్మాతగా మారాను.

 ఈ స్క్రిప్ట్‌నే ఎంచుకోవడానికి ప్రత్యేక కారణం ఏమైనా ఉందా ?

– నేను ఈ సినిమాను తమిళ్ లో విడుదలైన వారం రోజుల్లోనే చూసాను. తమిళంలో విజయవంతమైన ‘రాక్షసన్’ సినిమాని ‘రాక్షసుడు’ పేరుతో తెలుగులోకి రీమేక్ చేస్తున్నాం. ముందు మా హవీష్ కోసం ‘రాక్షసన్’ చూసాను. సినిమా నాకు చాలా బాగా నచ్చింది. అయితే అప్పటికే హవీష్ ఇలాంటి జోనర్‌లోనే ఆల్ రెడీ ఓ సినిమా చేస్తున్నాడు. దాంతో బెల్లంకొండ శ్రీనివాస్‌ను హీరోగా తీసుకున్నాము.

తెలుగులో మార్పులు ఏమైనా చేయించారా ?

– లేదండి. డైరెక్టర్ రమేష్ వర్మకు నేను ఫస్ట్ నుండి ఒక్కటే  చెప్పాను. ‘రాక్షసన్’ స్క్రిప్ట్ లో ఒక్క అక్షరం మార్చినా ఆడియన్స్‌కి ఆ ఫీల్ తగ్గుతుంది. అందుకే అలానే తీయమని చెప్పాను. నిజానికి ఉన్నది ఉన్నట్లు తియ్యడం కూడా కష్టమే. అయితే ఆ స్క్రిప్ట్ కి తగ్గట్లుగానే అచ్చం అలాగే ‘రాక్షసుడు’ సినిమా వచ్చింది. రమేష్ వర్మ కూడా కథలో ఇన్వాల్వ్ అయ్యి అత్యద్భుతంగా తెరకెక్కించారు. అతనికి టెక్నీకల్‌గా కూడా మంచి సపోర్ట్ లభించింది. 

రాక్షసుడు టైటిల్ పెట్టడానికి కారణం ఏమిటి ?

– సినిమాకి తగ్గట్లే పెట్టాం. అయితే మన సినిమాల టైటిల్స్ అన్నీ హీరోని లేదా హీరోయిన్ ని దృష్టిలో పెట్టుకుని పెడతారు. కానీ ఈ సినిమాకి ఇలాంటి టైటిల్ పెట్టడానికి కారణం ఈ సినిమా కాన్సెప్టే.

తమిళ్ లో లాగానే ఈ తెలుగులోనూ సందేశం ఉంటుందా?

– నేను జీనియస్ చిత్రాన్ని నిర్మించడానికి కూడా అందులో ఉన్న మంచి సందేశమే కారణం. నా ప్రతి సినిమాలోనూ ఒక మంచి సందేశం ఉండేలా చూస్తాను. ఇక ఈ సినిమా విషయానికి వస్తే ఆడపిల్లలు ఉన్నప్పుడు, వారు స్కూల్ కి వెళ్తున్నప్పుడు వారి పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చూపించడం జరిగింది. మేము అనుకున్న విధంగా ఆ సందేశం ప్రేక్షకులకు కన్వే అవుతుంది.

హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పెర్ఫామెన్స్?

– బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలు నేను తక్కువగా చూశాను. అయితే  ఈ కథకు తను బాగుంటాడని అనుకొని తనని హీరోగా తీసుకోవడం జరిగింది. మేము అనుకున్నట్లే  నిజంగా శ్రీనివాస్ చాలా మెచ్యూర్డ్ పెర్ఫామెన్స్ ఇచ్చారు. ఎమోషన్ని అండ్ యాక్షన్ని చాలా బాగా హ్యాండిల్ చేశాడు. ఈ సినిమాకు సాయి నటన కూడా ప్లస్ అవుతుంది.

హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఎవరి ఛాయిస్?

– ఈ సినిమాలో హీరోయిన్ టీచర్ రోల్ లో కనిపిస్తుంది దాని కోసం మొదట చాలా మందిని అనుకున్నాం. అందులో రాశిఖన్నాకూడా ఒకరు. అయితే  ఈ క్యారెక్టర్ కి అనుపమ అయితే జస్టిస్ చేయగలదని అనుపమ పరమేశ్వరన్ ని తీసుకున్నాం. తను చాలా  బాగా నటించింది. కథలో వచ్చే కీలక మార్పుకి ఆమె క్యారెక్టర్ కారణం అవుతుంది. 

సినీ నిర్మాణంపై మీ అభిప్రాయం ఏమిటి ?

– ప్రీ ప్రొడక్షన్ అనేది  చాలా పక్కాగా చెయ్యాలి. అసలు సినిమా సెట్స్ మీదకు వెళ్లకముందే దానిపై ఎక్కువ వర్క్ చేయాలి. అలాగే కథ కథనం మాటలే సినిమాకి మెయిన్. కానీ మనవాళ్ళు మాత్రం ఏదో హడావుడిగా కథ మాటలు రాయించుకొని ప్రొడక్షన్ కి వెళ్ళిపోతారు. అది పూర్తిగా రాంగ్. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ కి సంబధించిన వర్క్ కూడా చాలా క్లారిటీగా ఉండాలి. అదేవిధంగా  అనుకున్న సమయంలో  సినిమా రిలీజ్  చేయడం కూడా చాలా ముఖ్యం. అయితే నేను సినీ నిర్మాణం రావడానికి కారణం ఒక్కటి అయితే.. మరో కారణం ఎంటర్టైన్మెంట్ యూనివర్సిటీ పెట్టాలనేది నా గోల్. 

సినిమా బిజినెస్ ఎలా ఉంది ?

– బిజినెస్ అయిపోయిందండి. మేము అనుకున్న దానికన్నా ఎక్కువ రేటుకే మా సినిమా రైట్స్ అమ్ముడయ్యాయి. అలాగే డిజిటల్ రైట్స్ జెమినివారు తీసుకోవడం జరిగింది. హిందీ రైట్స్ కూడా అమ్ముడయ్యాయి. ఇక అభిషేక్ పిక్చర్స్ వారు మా రాక్షసుడు సినిమా వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ తీసుకున్నారు. అందుకు వారికి కూడా ధన్యవాదాలు. 

మీ తదుపరి సినిమాల గురించి చెప్పండి ?

– రెండు మూడు కథలు రెడీగా ఉన్నాయి. అందులో మా అబ్బాయి హవీష్ తో కూడా ఓ సినిమా చేస్తున్నాము. అలాగే యంగ్  టాలెంట్ తో వచ్చే నూతన దర్శకులు, నటీనటులతో పనిచేస్తాం. అంటూ ఇంటర్వ్యూ ముగించారు.


‘సూపర్ డీలక్స్’ని సామ్ తెలుగులో వద్దనుకుంటుందా?

Category : Uncategorized

అక్కినేని సమంత, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం సూపర్ డీలక్స్. ఇందులో ఓ ముఖ్య పాత్రలో విజయ్ సేతుపతి లాంటి స్టార్ హీరో కూడా నటించారు. ఇందులో రమ్యకృష్ణ , సమంత స్పైసీ పాత్రల్లో నటించడం విశేషం. తమిళంలో రిలీజ్ అయ్యి 6 నెలలు కావస్తున్నా.. ఇంకా తెలుగులో ఈ సినిమాని ఎవరు కొన్నారు అనేదే తెలియదు.

తమిళ సినిమాలు ఏమాత్రం బాగున్నా అవి ఈజీగా తెలుగులోకి డబ్ అవుతాయి కానీ ఈ సినిమా ఎందుకో డబ్ కావడంలేదు. కానీ ఈ సినిమా తెలుగులోకి రావడానికి సమంత అంత సుముఖంగా లేదని మాత్రం గాసిప్‌లు వినిపిస్తున్నాయిు. కారణం ఇందులో సామ్ సినిమా స్టార్టింగ్‌లోనే తన మాజీ ప్రియుడితో సెక్స్ లో పాల్గొనడంతో ప్రారంభమవుతుంది. అటువంటివి ఇక్కడ తెలుగు ప్రేక్షకులకి అంతగా నచ్చదు అని భావించి పెద్దగా ఈ సినిమాపై ఇంట్రెస్ట్ చూపట్లేదట.

అలానే సినిమాలో రమ్యకృష్ణ వేశ్యగా కనిపిస్తుంది. పెళ్లయినా తరువాత మంచి పాత్రలు ఎంచుకుని మరీ నటిస్తున్న సమంత సూపర్ డీలక్స్‌లో తన పాత్ర వీటికి భిన్నంగా వుంటుంది కనుక తెలుగులోకి రావడానికి ఆమె అంతగా ఇష్టపడడంలేదని వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలి.


పూరీని వదిలి పోనంటుంది..!

Category : Uncategorized

హీరోయిన్‌గా కెరీర్ ముగియగానే దర్శకుడి పూరి జగన్నాధ్ చెంతకు చేరి ఆయన పూరి కనెక్ట్స్‌లో భాగమై సహా నిర్మాతగా వ్యవహరిస్తోంది హీరోయిన్ ఛార్మి. ఎన్ని ప్లాప్స్ వచ్చినా పూరిని వదలకుండా ఉన్న ఛార్మికి ఎట్టకేలకు ఇస్మార్ట్ శంకర్ సినిమా హిట్ అవడంతో పూరి, ఛార్మి పోగొట్టుకున్నదంతా ఇచ్చేసాడు. ఇక ఇస్మార్ట్ హిట్ లో ఛార్మి కష్టం చాలా దాగుందని పూరి అనేకసార్లు చెప్పాడు. బడ్జెట్ కంట్రోల్ చేసే విషయాన్నీ పూర్తిగా పూరి, ఛార్మికి అప్పగించాడు. అలాగే నటీనటుల ఎంపిక దగ్గరనుండి వారి రెమ్యునరేషన్ విషయం వరకు…. అలాగే సెట్స్ లో బడ్జెట్ కంట్రోల్ విషయంలో ఛార్మి చాలా తెలివిగా వ్యవహరించి ఖర్చు తగ్గించబట్టే ఇస్మార్ట్ శంకర్ కి బడ్జెట్ కంట్రోల్ జరిగి భారీ లాభాలొచ్చాయి.

అయితే ఇప్పుడు ఛార్మి ఇస్మార్ట్ శంకర్ కి బడ్జెట్ కంట్రోల్ విషయంలో బాగా హైలెట్ అవడంతో… ఇప్పుడు చాలామంది నిర్మాణ సంస్థలు ఛార్మిని ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా చూస్తున్నారట. దానికోసం ఎన్నికోట్లయినా ఛార్మికి ఇచ్చేందుకు వారు సిద్దమవుతున్నారట. ఇక మరోపక్క ఇస్మార్ట్ హిట్ తో పూరి తో సినిమాలు చేసేందుకు పలు నిర్మాణ సంస్థలు ముందుకొస్తున్నాయని కూడా ఫిల్మ్‌నగర్ టాక్.

అయితే ఏ నిర్మాణ సంస్థ అయినా తనతో సినిమా చేయాలి అంటే… ఛార్మిని సహ నిర్మాతగా చేర్చుకోమని పూరి సదరు నిర్మాతలకు కండిషన్స్ పెడుతున్నాడట. గతంలో ఇలాంటి వార్తలొచ్చినా.. తాజాగా మాత్రం పూరి కండిషన్స్ కి సదరు నిర్మాతలు కూడా ఒప్పుకునేటట్లే ఉన్నారని వినికిడి. ఇక ఛార్మి మాత్రం పూరిని వదిలి బయట నిర్మాణ సంస్థలకు పనిచేసే ఛాన్స్ అయితే కనబడడం లేదు.


దిల్ రాజు చూపు.. సీనియర్ హీరోల వైపు..!

Category : Uncategorized

టాలీవుడ్‌లో దిల్ రాజు అంటే యంగ్ అండ్ న్యూ హీరోస్‌కి ఓ దేవుడు లాంటి నిర్మాత. ఆయన యంగ్ హీరోలతో మీడియం రేంజ్ సినిమాలు చేస్తూ వాళ్ళకి లైఫ్ ఇస్తుంటాడు. అయన సినిమాలు చేసేది కేవలం హీరోలకి మేలు చెయ్యడానికే కాదు… ఆయన సంపాదించుకోవడానికి కూడా.. టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ నిర్మాతగా దిల్ రాజు మంచి సినిమాలతో పాటుగా కొన్ని డిజాస్టర్ సినిమాలు కూడా చేసాడు. అయితే ఎక్కువగా కొత్త హీరోలతోనూ, యంగ్ హీరోలతోనూ సినిమాలు చేసే దిల్ రాజు స్టార్ హీరోలతో చేసిన సినిమాలు మాత్రం చాలా తక్కువే అని చెప్పుకోవాలి. ఇక సీనియర్ హీరోలలో వెంకటేష్‌, నాగ్‌తో మాత్రమే ఆయన సినిమాలు చేశాడు. చిరు, బాలయ్యలతో ఆయన ఇప్పటి వరకు సినిమాలు చేయలేదు.

తాజాగా బాలకృష్ణతో త్వరలోనే దిల్ రాజు సినిమా ఉంటుందనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. తాజాగా దిల్ రాజు.. చిరుతో కూడా ఓ సినిమా చేయబోతున్నాడనే టాక్ ఫిలింసర్కిల్స్ లో వినబడుతుంది. అయితే చిరు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాక కేవలం రామ్ చరణ్ ప్రొడ్యూసర్ గా కొణిదెల ప్రొడక్షన్స్ లోనే సినిమాలు చేస్తున్నాడు. ఇక ఖైదీ నెంబర్ 150 తో పాటుగా సై రా సినిమాలు చేసిన చిరు.. కొరటాల మూవీ కూడా కొణిదెల ప్రొడక్షన్ లోనే చెయ్యబోతున్నాడు. ఇక తదుపరి చిత్రానికైనా రామ్ చరణ్, అల్లు అరవింద్ కి ఛాన్స్ ఏమన్నా ఇస్తాడేమో అని చూస్తున్నాడు. 

ఎందుకంటే ఖైదీ తర్వాత సై రా కైనా అరవిందకి ఛాన్స్ వస్తుందేమో, లేదంటే కొరటాల మూవీ అయినా నిర్మిద్దామనుకుంటే.. చరణ్ ఆయనకు ఛాన్స్ ఇవ్వడం లేదు. కానీ దిల్ రాజు కి ఆ ఛాన్స్ దక్కుతుందా…  అంటే డౌటే. అయితే కొరటాల మూవీ తర్వాత చిరు… దిల్ రాజుతో సినిమా చేసే ఛాన్స్ ఉందని.. చిరు, కొరటాల మూవీ ని ఫినిష్ చేసే లోపల దిల్ రాజు గనక కథ, దర్శకుడితో సిద్ధంగా ఉంటే.. చిరుతో సినిమా చేసే ఛాన్స్ దిల్ రాజుకి దక్కుతుందనేది ఫిలింనగర్ న్యూస్.


‘ఆత్రేయపురం ఆణిముత్యం’ షూటింగ్ ప్రారంభం!

Category : Uncategorized

షకలక శంకర్ కథానాయకుడిగా, రీతూ భర్మెచా కథానాయకురాలుగా ‘ది వన్ ఎంటర్ టైన్మెంట్స్’ బ్యానర్ పై ఎం.యస్. రెడ్డి నిర్మిస్తూ, దర్శకత్వం వ‌హిస్తోన్న చిత్రం “ఆత్రేయపురం ఆణిముత్యం” పూజా కార్ర్యక్రమాలు లాంఛనంగా ఫిల్మ్ నగర్ రామానాయుడు స్టూడియోలో ఈ రోజు ప్రారంభమయ్యాయి. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్ర‌ముఖ నిర్మాత  కె.ఎల్ దామోదర్ ప్రసాద్ క్లాప్ కొట్టగా, సీనియర్ డైరెక్టర్ సాగర్  గౌరవ దర్శకత్వం వ‌హించారు.  పి. సత్యా రెడ్డి  కెమెరా స్విచ్ ఆన్ చేశారు. 

అనంత‌రం ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో హీరో షకలక శంకర్ మాట్లాడుతూ…“ఆత్రేయపురం ఆణిముత్యం నా  మార్క్ కామెడీ చిత్రం. ఎమ్మెస్ రెడ్డిగారు మంచి క‌థ‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. క‌చ్చితంగా అంద‌ర్నీ ఎంట‌ర్ టైన్ చేస్తుంది’’ అన్నారు.

చిత్ర ద‌ర్శ‌క నిర్మాత ఎం.యస్. రెడ్డి మాట్లాడుతూ… ‘‘ఆత్రేయపురంలో రాజు అనే యువకుడి చుట్టూ తిరిగే  కుటుంబ హాస్య చిత్రం ఇది. సమాజంలో జరిగే ఉమెన్ హ‌రాష్‌మెంట్ గురించి చ‌ర్చిస్తున్నాం. ఆత్రేయపురం పరిసర ప్రాంతంలో మరియు హైదరాబాద్ లో చిత్రీకరించబోతున్నాం. ఈ కాన్సెప్ట్ కు ష‌క‌ల‌క శంక‌ర్ గారైతే ప‌ర్ఫెక్ట్ యాప్ట్ అని ఆయ‌న్ను తీసుకున్నాం. చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. ‘మా ఆత్రేయ‌పురం ఆణిముత్యం’ అంద‌ర్నీ అల‌రిస్తాడు’’ అన్నారు.

ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో సంగీత ద‌ర్శ‌కుడు వెంగి, డియ‌స్ రావు, రీతూ భ‌ర్మెచా త‌దిత‌రులు పాల్గొన్నారు. 

తారాగణం : షకలక శంకర్, రీతూ భర్మెచా, ఇంద్రజ, తులసి, కాశీ విశ్వనాథ్,  DS రావు, BHEL ప్రసాద్, పటాస్ నూకరాజు, మహిపాల్ 

టెక్నిషీయన్స్ : ఎడిటర్ – మార్తాండ్ కె వెంకటేష్ ; DOP – రవి ; మ్యూజిక్ – వెంగి; స్టిల్స్ – శ్రీను విల్లా ; ఆర్ట్ – వర్మ; పబ్లిసిటీ డిజైనర్: వివా రెడ్డి;  నిర్మాత-ద‌ర్శ‌కుడు: ఎం.య‌స్‌.రెడ్డి.