హైదరాబాద్ నందు (బంజర హిల్స్, జూబిలీ హిల్స్, మాదాపూర్, కొండాపూర్ ) పరిసర ప్రాంతాల్లో పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ వెంటనే కావాలను. ఆర్మీ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేసి రిటైర్ అయినా వారికీ తగిన ప్రాధాన్యత ఇవ్వ బడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ + 91 8074965869

Author Archives: yönetim

‘కల్కి’ విడుదలకు అడ్డొస్తున్నాడు..!

Category : Uncategorized

తెలుగులో కోలీవుడ్‌ స్టార్స్‌కొందరికి మంచి మార్కెట్‌ ఉంది. కానీ వారు రానురాను ఆ క్రేజ్‌ని తెలుగులో కోల్పోతున్నారు. ఈ విషయంలో రజనీ, కమల్‌, విక్రమ్‌, సూర్య, కార్తి, విజయ్‌ ఆంటోని.. ఇలా అందరు ఒకే దారిలో పయనిస్తున్నారు. ఇక సూర్య విషయం తీసుకుంటే ‘గజిని’తో ఓ రేంజ్‌లో సంచలనం సృష్టించిన ఆయన ఆ తర్వాత తన ప్రతి తమిళ చిత్రాన్ని తెలుగులో కూడా విడుదల చేస్తూ వస్తున్నాడు. కానీ విక్రమ్‌ కెకుమార్‌ దర్శకత్వంలో ఆయన నటించిన ‘24’ చిత్రం తెలుగు హక్కులు అనూహ్యంగా 22కోట్లకు అమ్ముడయ్యాయి. 

ఆ తర్వాత వచ్చిన ‘సింగం3’ 18కోట్లకు, ‘గ్యాంగ్‌’ 15కోట్లకు గ్రాఫ్‌ దిగజారుతూ వచ్చింది. తాజాగా ఆయన సెల్వరాఘవన్‌ దర్శకత్వంలో నటించిన ‘ఎన్జీకే’ చిత్రం తెలుగు హక్కులు ఏకంగా రెండంకెల లోపుకు అంటే 9కోట్లకు పడిపోయాయి. ఈ చిత్రం హక్కులను రాధామోహన్‌ దక్కించుకున్నాడు. శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ బేనర్‌పై రిలీజ్‌ చేయనున్నాడు. మరోవైపు రాజశేఖర్‌ ‘కల్కి’ చిత్రం హక్కులను కూడా రాధామోహన్‌నే దక్కించుకున్నాడు. 

‘కల్కి’ టీజర్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. రాజశేఖర్‌ ‘పీఎస్వీ గరుడ వేగ’తో కంబ్యాక్‌ అయ్యాడు. ‘కల్కి’ని కూడా ‘అ’ చిత్ర దర్శకుడు ప్రశాంత్‌వర్మ బాగా తీర్చిదిద్దాడని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. కానీ మే31న విడుదల కావాల్సిన రాజశేఖర్‌ ‘కల్కి’ని వాయిదా వేసి సూర్య ‘ఎన్జీకే’ని విడుదల చేయడంపై భాషాభిమానులు ఆగ్రహంగా ఉన్నారు. 


లారెన్స్ శభాష్.. చెంపమీద కొట్టినట్టు చేశావ్!

Category : Uncategorized

సాధారణంగా కొత్తగా డైరెక్షన్‌ ఛాన్స్‌ వచ్చిన వారు తమ కెరీర్‌ మొదట్లో ఎన్ని అవమానాలు ఎదురైనా బయటకు చెప్పుకోకుండా తమకు వచ్చిన చాన్స్‌ని ఎలాగోలా సద్వినియోగం చేసుకోవాలని, అది తమకు లభించిన గొప్ప అవకాశంగా భావిస్తూ ఉంటారు. ఇక మన దక్షిణాది నుంచి పలువురు బాలీవుడ్‌ చిత్రాలకు దర్శకత్వం వహించినా అక్కడ తమను ఎవ్వరూ పట్టించుకోకపోయినా ఏమీ మాట్లాడకుండా మౌనం పాటిస్తారు. నిజానికి ఇది ఎప్పటి నుంచో వస్తున్న తంతు. దక్షిణాది దర్శకులంటే బిటౌన్‌ వారికి పెద్దగా గౌరవం ఉండదు. మీడియా కూడా వారిని సరిగా పట్టించుకోదు. ఇటీవల ‘కబీర్‌సింగ్‌’ ప్రమోషన్స్‌లో కూడా దర్శకుడు సందీప్‌రెడ్డి వంగాని అక్కడి మీడియా అసలు పట్టించుకోలేదని వార్తలు వచ్చాయి. 

ఇక విషయానికి వస్తే దక్షిణాదికి చెందిన ప్రభుదేవా ఇప్పటికే బాలీవుడ్‌కి దర్శకునిగా ఎగుమతి అయ్యాడు. ఆయన్ను అక్కడి మీడియా రీమేక్‌ దేవాగా చులకనగా చూస్తుంది. ఇది అందరి విషయంలో ఓకేగానీ రాఘవలారెన్స్‌ విషయంలో మాత్రం ఆ పప్పులు తన వద్ద ఉడకవని లారెన్స్‌ నిరూపించాడు. ఆయన బాలీవుడ్‌కి దర్శకునిగా తెరంగేట్రం చేస్తూ తన ‘కాంచన’ చిత్రాన్ని అక్షయ్‌కుమార్‌ హీరోగా ‘లక్ష్మీబాంబ్‌’ పేరుతో తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్నాడు. తాజాగా రాఘవలారెన్స్‌ ఈ చిత్రం నుంచి తప్పుకుంటున్నట్లు ‘లక్ష్మీబాంబ్‌’ని మించినబాంబ్‌ను పేల్చాడు. ఈ చిత్రం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించాడు. దీనికి సంబంధించిన కారణాలను లారెన్స్‌ సోషల్‌ మీడియా ద్వారా తెలిపాడు. 

ఇందులో దానికి గల కారణాలను కూడా ఆయన దాదాపుగా పొందుపరిచాడు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ని తాజాగా విడుదల చేశారు. ఇందులో అక్షయ్‌కుమార్‌ హిజ్రాగా, ఓ మాంత్రికుడి గెటప్‌లో కనిపిస్తూ ఉన్నాడు. ఈ పోస్టర్‌కి మంచి స్పందన లభించింది. అయితే తాను దర్శకత్వం వహించే చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని కనీసం తనకి నామమాత్రంగా కూడా తెలుపకుండా విడుదల చేయడంపై లారెన్స్‌ తీవ్ర మనోవేధనకు గురయ్యాడు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డియర్‌ఫ్రెండ్స్‌ అండ్‌ ఫ్యాన్స్‌. తమిళంలో ఓ పాపులర్‌ కహాని ఉంది. ఎక్కడ నీకు గౌరవం దక్కదో ఆ ఇంటికి నువ్వు వెళ్లకూడదనేది దాని సారాంశం. ఈ విశాల ప్రపంచంలో డబ్బు, ఫేమ్‌ కన్నా ఆత్మగౌరవం అనేది ఎంతో ముఖ్యం. అది మన వ్యక్తిగత క్యారెక్టర్‌ని తెలియజేస్తుంది. అందుకే నేను ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నాను. కాంచన రీమేక్‌ లక్ష్మీబాంబ్‌కి ఇక నేను దర్శకత్వం వహించేది లేదు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఫస్ట్‌లుక్‌ లాంఛ్‌ విషయాన్ని నేను వేరే వారి గురించి తెలుసుకోవాల్సివచ్చింది. దీనిని నేను ఎంతో పెయిన్‌ఫుల్‌గా భావిస్తున్నాను. అసలు నాకు గౌరవం లేనే లేదా? అని ఎంతో బాధపడ్డాను.. అని తెలిపాడు. మొత్తానికి లారెన్స్‌ ఈ చిత్రం నుంచి తప్పుకోవడంతో ఈ మూవీ ఉంటుందా? ఉంటే ఎవరు దర్శకత్వం వహిస్తారు? అనేవి తేలాల్సివుంది. మొత్తానికి ఈ విషయంలో లారెన్స్‌ని దిగ్రేట్‌ అని ఒప్పుకోవాలి.


వంశీ పైడిపల్లి తగ్గడానికి కారణం ఇదే!

Category : Uncategorized

‘మహర్షి’ చిత్రం ప్రమోషన్స్‌ మొదలైనప్పటి నుంచి లావుగా, బొద్దుగా ఉండే దర్శకుడు వంశీపైడిపల్లి స్లిమ్‌ లుక్‌లో కనిపించడంపై కూడా ఆసక్తికర చర్చ సాగుతోంది. వంశీపైడిపల్లి అంటే మనకు ‘బృందావనం, ఎవడు, ఊపిరి’ వంటి చిత్రాలు గుర్తుకు వస్తాయి. తాజాగా ఆయన తాను సన్నబడటానికి కారణం తెలిపాడు. నేను మొదటి నుంచి భోజనప్రియుడిని ఏదైనా సరే ఎక్కువగా తింటూ, లాగించేస్తూ ఉంటాను. అందువల్ల బరువు బాగా పెరిగిపోయాను. 

ఒకానొక దశలో 120కేజీలు మించి బరువు పెరిగాను. ఆ సమయంలో మా పాప నా వద్దకు వచ్చి బాగా లావయ్యారు.. బరువు పెరిగారు డాడీ అని అంది. దాంతో ఇక బరువు తగ్గాలని నిర్ణయించుకున్నాను. అప్పటి నుంచి నెమ్మదిగా బరువు తగ్గే ప్రయత్నాలు మొదలుపెట్టాను. చాలా కసరత్తులు చేసి ప్రస్తుతం 83కేజీలకు వచ్చాను అని చెప్పుకొచ్చాడు.


‘మహర్షి’ ప్రమోషన్స్‌లో జగ్గుభాయ్ ఎక్కడ?!

Category : Uncategorized

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు నటించిన ప్రతిష్టాత్మక 25వ చిత్రం ‘మహర్షి’ని ఎపిక్‌ మూవీగా పేర్కొంటున్నారు. కానీ నిజానికి ఈ చిత్రానికి మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చింది. అయినా మహేషే సొంతంగా రంగంలోకి దిగి ఎగ్రెసివ్‌గా ప్రమోషన్స్‌ చేస్తూ భారీ కలెక్షన్లు వచ్చేందుకు నడుం బిగించాడు. ఇక ఈ చిత్రం విజయోత్సవ సభ విజయవాడలో జరిగిన సందర్భంగా యూనిట్‌ అందరు హాజరయ్యారు. కానీ మెయిన్‌ విలన్‌గా నటించిన జగ్గూభాయ్‌ అలియాస్‌ జగపతిబాబు మాత్రం ఈ వేడుకకు రాలేదు. 

అదే ఆయన ‘శ్రీమంతుడు’ చిత్రం ప్రమోషన్స్‌లో ఎంతో యాక్టివ్‌గా పాల్గొన్నాడు. విజయవాడ విజయోత్సవ సభలోనే కాదు.. ‘మహర్షి’ ప్రమోషన్స్‌లో మొదట నుంచి జెబి అంటీ ముట్టనట్లే ఉన్నాడు. దానికి కారణాలు ఏమిటి? అనే చర్చ సాగుతోంది. జగపతిబాబు ఊపిరి సలపని వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడని, అందుకే సమయాభావం వల్ల ఆయన ప్రమోషన్స్‌కి దూరంగా ఉంటున్నాడనే మాట వినిపిస్తున్నా… మరీ ఒకరోజు కూడా తాను నటించిన, అందునా తమ హీరోకి ప్రతిష్టాత్మక చిత్రమైన ‘మహర్షి’ని జగ్గూభాయ్‌ పట్టించుకోకపోవడం వెనుక మరేదైనా కారణాలు ఉన్నాయా? అనే చర్చసాగుతోంది. 


‘జెర్సీ’కి 8, ‘కాంచన3’కి 10..!!

Category : Uncategorized

కొరియోగ్రాఫర్‌గా, ప్రత్యేక నృత్యాల ద్వారా వెండితెరపై కనిపించే రాఘవలారెన్స్‌ని బహుముఖ ప్రజ్ఞాశాలి అనడంలో అతిశయోక్తి లేదు. టాలీవుడ్‌ సీనియర్‌ స్టార్‌ నాగార్జున ప్రోత్సాహంతో ఈయన నటునిగా, దర్శకునిగా ‘మాస్‌, డాన్‌’ చిత్రాలు తీశాడు. ఇక లగడపాటి శ్రీధర్‌ నిర్మాణంలో నృత్యప్రధాన చిత్రంగా ప్రభుదేవాతో కలిసి ‘స్టైల్‌’ చిత్రంలో హీరోగా, దర్శకునిగా రాణించాడు. కానీ తర్వాత ప్రభాస్‌తో తీసిన ‘రెబెల్‌’ మాత్రం డిజాస్టర్‌ అయింది. కానీ ఆ తర్వాత ఆయనే దర్శకత్వం వహిస్తూ ‘ముని’ సిరీస్‌ని ప్రారంభించాడు. అందులో తానే నటిస్తూ వచ్చాడు. ‘ముని, కాంచన, కాంచన 2’లు హర్రర్‌ కామెడీ చిత్రాల ట్రెండ్‌కి దక్షిణాదిలో మరలా శ్రీకారం చుట్టాయి. ఈ మూడు చిత్రాలు తమిళంలోనే గాక తెలుగులో కూడా వీటిని విడుదల చేసిన బెల్లంకొండ సురేష్‌ వంటి వారికి కాసుల వర్షం కురిపించాయి. ముఖ్యంగా బి,సి సెంటర్ల ఆడియన్స్‌ చేత సెహభాష్‌ అనిపించుకుంటూ కలెక్షన్లు కొల్లగొట్టాయి. 

ఇక తాజాగా ఆయన నుంచి ‘కాంచన 3’ వచ్చింది. ఈ చిత్రానికి మొదటి రోజు పూర్తిగా నెగటివ్‌టాక్‌ వచ్చింది. తనగత చిత్రాల తరహాలనే కథ, కథనాలు ఉన్నాయని, ఏమాత్రం కొత్తదనం లేదని, చిత్రం డిజాస్టర్‌ కావడం ఖాయమని అందరు భావించారు. మరోవైపు అదే రోజున వచ్చిన నాని ‘జెర్సీ’ చిత్రానికి యునానిమస్‌ పాజిటివ్‌, హిట్‌ టాక్‌ వచ్చింది. దాంతో ‘జెర్సీ’ ముందు ‘కాంచన 3’ నిలబడటం అసాధ్యమనుకున్నారు. కానీ అనూహ్యంగా ఈ చిత్రం కూడా మాస్‌ ఆడియన్స్‌కి ఎంతగానో మెప్పించడమే కాదు.. ‘జెర్సీ’ కలెక్షన్లకు బి,సి సెంటర్లలో 70శాతం వరకు గండికొట్టింది. ఈ చిత్రం విడుదలై 100కోట్ల క్లబ్‌ని చేరిన ఈ చిత్రం నాలుగు వారాల స్టడీ కలెక్షన్లతో లాభాల పంట పండించింది. 

ఈ చిత్రాన్ని తెలుగులో ఠాగూర్‌ మధు విడుదల చేశాడు. ఫుల్‌రన్‌ పూర్తయ్యే సమయానికి ఈ చిత్రం నిర్మాతకు 10కోట్ల లాభాలను తెచ్చిపెట్టింది. అదే యునానిమస్‌ హిట్‌ టాక్‌, క్లాసిక్‌ మూవీగా ప్రశంసలు పొందిన ‘జెర్సీ’ మాత్రం 8కోట్ల లాభాలనే సాధించడం గమనార్హం. నెగటివ్‌ టాక్‌ తెచ్చుకున్న ఈ చిత్రం ఖర్చులన్నీపోను 10కోట్ల లాభాలు సంపాదించి పెట్టడం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌ అయింది. 


గురుశిష్యులలో ఎవరు మెప్పిస్తారో చూడాలి!

Category : Uncategorized

టాలీవుడ్‌లో వచ్చిన కల్ట్‌ మూవీగా, మోడ్రన్‌ క్లాసిక్‌గా సంచలనం సృష్టించిన చిత్రం ‘అర్జున్‌రెడ్డి’. ఇలాంటి చిత్రాలను తీయడంలో ఆద్యుడు బాలా. కానీ తెలుగులో వచ్చిన ఈ రీమేక్‌ని తీయడంలో మాత్రం ఆయన విఫలం చెందాడని, అందుకే ఈ రీమేక్‌ని తమిళంలో చియాన్‌ విక్రమ్‌ తనయుడు దృవ్‌ని తెరంగేట్రం చేస్తూ తీసిన ‘వర్మ’ ఏమాత్రం బాగా లేక నాసిరకంగా ఉందని చెప్పి, ఈ మొత్తం సినిమాని పక్కనపెట్టడం పెద్ద సంచలనాలకే కారణమైంది. అయినా విక్రమ్‌ మీద ఉన్న గౌరవంతో బాలా ఈ విషయంలో పల్లెత్తు మాట కూడా బయటకు చెప్పలేదు. ఆ తర్వాత ఇదే చిత్రాన్ని ‘ఆదిత్యవర్మ’ పేరుతో తెలుగులో ‘అర్జున్‌రెడ్డి’కి దర్శకునిగా పనిచేసి సందీప్‌రెడ్డి వంగా అసిస్టెంట్‌ గిరీశయ్యతో తీశారు. ఇందులో దృవ్‌ని తప్ప అందరినీ మరలా రీప్లేస్‌ చేశారు. 

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం డెహ్రాడూన్‌ షెడ్యూల్‌ తప్ప మిగిలిన షూటింగ్‌ పార్ట్‌ మొత్తం పూర్తయింది. త్వరలో టీజర్‌తో పాటు రిలీజ్‌డేట్‌ని కూడా ప్రకటించనున్నారు. ఇదే సమయంలో ఏకంగా సందీప్‌రెడ్డి వంగానే ఈ రీమేక్‌ని బాలీవుడ్‌లో షాహిద్‌ కపూర్‌, కియారా అద్వానీలతో ‘కబీర్‌సింగ్‌’గా తీశాడు. ఈ చిత్రం కూడా పూర్తయి జూన్‌ 21న విడుదల కానుంది. ఎలా చూసుకున్నా హిందీ ‘కబీర్‌సింగ్‌’ విడుదలకు తమిళ ‘ఆదిత్యవర్మ’ రిలీజ్‌కి పెద్దగా గ్యాప్‌ ఉండకపోవచ్చు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ రెండు భాషల్లోని చిత్రాలను తెలుగులో ‘అర్జున్‌రెడ్డి’తో పోలిక రావడం ఖాయం. 

బాలీవుడ్‌ రీమేక్‌ కబీర్‌సింగ్‌లో మాత్రం నేపధ్యం ఢిల్లీ కావడంతో దానికి తగ్గట్లుగా సందీప్‌ పలు మార్పులు చేర్పులు చేశాడనేది సుస్పష్టం. తమిళంలో మాత్రం గిరీశయ్య ఒరిజినల్‌ ఫీల్‌ చెడకుండా, దాదాపు తెలుగు అర్జున్‌రెడ్డికి పెద్దగా మార్పులు చేర్పులు చేయకుండా యాజిటీజ్‌గా తీశాడని తెలుస్తోంది. ఈ రెండు చిత్రాల విడుదల కోసం ఆయా భాషల వారే కాదు.. తెలుగు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ రీమేక్‌ని గురువు సందీప్‌రెడ్డి వంగా బాగా తీశాడా? లేక శిష్యుడు గిరీశయ్య బాగా తీశాడా? అనే విషయంలో పోలికలు రావడం ఖాయం. మరి ఈ రెండింటిలో ఏది పెద్ద హిట్‌గా నిలిచి ప్రశంసలు అందుకుంటుందో వేచిచూడాల్సివుంది….! 


‘సైరా’లో ఈ పాత్రకు చాలా ప్రాముఖ్యత

Category : Uncategorized

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘సైరా నరసింహారెడ్డి’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. చివరి దశలో ఉన్న ఈ సినిమాను మేకర్స్ అక్టోబర్ 2 న గాంధీ జయంతి సందర్భంగా రిలీజ్ చేయాలనీ ఫిక్స్ అయ్యారట. ఇక ఈ సినిమాలో చిరంజీవి పాత్ర తరువాత మరో పాత్రకి కూడా ప్రత్యేకమైన గుర్తింపు వస్తోందట.

ఆ పాత్ర ఎవరో కాదు తమిళ నటుడు విజయ్ సేతుపతి. ఇందులో విజయ్ కొంచెం నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర లో గూఢచారి ఛాయలు ఉన్న లుక్ లో కనిపించనున్నాడు. రీసెంట్ గా విజయ్ లుక్ ని కూడా రివీల్ చేసారు మేకర్స్. ఇక సురేంద్ర రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, కన్నడ హీరో సుదీప్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

హీరోయిన్ గా నయనతార నటిస్తున్న ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ భాషల్లో కూడా రిలీజ్ చేయాలనీ నిర్మాత రామ్ చరణ్ డిసైడ్ అయ్యారు. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది సంగీతం అందించారు.


మాట నిలబెట్టుకున్న రాఘవలారెన్స్‌!

Category : Uncategorized

కంటెంట్‌ ఏమీ లేదని, తన గత ముని చిత్రాల సీక్వెల్స్‌ తరహాలోనే అటు ఇటుగా ‘కాంచన 3’ తీశాడని విమర్శకులు విమర్శించినా కూడా ‘కాంచన 3’ చిత్రం అతి తక్కువ వ్యవధిలోనే 100కోట్లు వసూలు చేసి తన సత్తా చాటింది. ఈ చిత్రం ఏ ప్రత్యేకతలు లేకపోయినా అలా విజయం సాధించడం ఎందరికో మింగుడుపడని విషయం. లారెన్స్‌ విషయంలో మనం ఒక విషయం చెప్పుకోవాలి. కొందరు హీరోలను ప్రేక్షకులు రీల్‌ హీరోలుగా కంటే రియల్‌ హీరోలుగా అభివర్ణిస్తూ వారి చిత్రాలను ఆదరిస్తూ, వారికి అభిమానులుగా మారుతుంటారు. ఈ కోవలోకి వచ్చే హీరోనే రాఘవలారెన్స్‌. ఆయన చేసే సామాజిక కార్యక్రమాలు ఎందరినో ఆయనకు అభిమానులుగా మార్చాయి. జల్లికట్టు ఉద్యమం నేపధ్యంలో నిరసన చేస్తోన్న మహిళలకు మరుగుదొడ్డి సౌకర్యాలు కలిగించడం కోసం స్వయంగా తానే క్యారవాన్‌లను మెరీనా బీచ్‌కి పంపాడు. 

తన చిత్రం విడుదలై విజయం సాధించిన తర్వాత కాదు.. ప్రారంభం రోజునే తనకు వచ్చే రెమ్యూనరేషన్‌ నుంచి హిజ్రాలకు కొంత మొత్తం దానధర్మాలు చేస్తూ ఉంటాడు. చిన్నారులను, వృద్దులను చేరదీసి వారి ఆరోగ్యం, తిండి తిప్పల గురించి ఆలోచించి సాయం చేస్తూ ఉంటాడు. ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ముందుగా లారెన్స్‌ స్పందిస్తూ ఉంటాడు. ఇక ఇటీవల వచ్చిన గజా తుఫాన్‌ తమిళనాడు, కేరళ రాష్ట్రాలను తుత్తునియలు చేసింది. 

ఈ సందర్భంగా లక్షల మంది ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. కూడు, గూడు కోల్పోయారు. నాటి తుఫాన్‌లో కేరళకి చెందిన ఓ ముసలావిడ ఇల్లు కుప్పకూలిపోయింది. ఈ విషయం లారెన్స్‌కి చేరింది. దాంతో ఆయన ఆ ముసలావిడకు సొంత ఇల్లు కట్టి ఇస్తానని హామీ ఇచ్చాడు. తాజాగా ఆయన దానిని మర్చిపోకుండా నిజం చేసి చూపాడు. ఆ ముసలావిడ కన్నీటి పర్యంతం అయిన వీడియోను లారెన్స్‌ చూసి చలించిపోయాడు. తాజాగా ఆయన ఆ ముసలావిడకు సొంత ఇంటిని తన స్వంత నిధుల నుంచి నిర్మించి ఇచ్చాడు. పూజలు నిర్వహించిన అనంతరం ఆ అవ్వతో కలిసి గృహప్రవేశం చేశాడు. ఈ విషయాన్ని లారెన్స్‌ ట్విట్టర్‌లో పంచుకున్నాడు. ఈ సందర్భంగా ఆ ముసలావిడ దుస్థితిని తనకు తెలియజేసిన యువకులకు ఆయన ధన్యవాదాలు తెలిపి రియల్‌హీరో అనిపించుకున్నాడు. 


రీ-షూట్‌లో సమంత సినిమా..?

Category : Uncategorized

పెళ్లికి ముందు పక్కన పెడితే పెళ్లి తరువాత మాత్రం మంచి మంచి చిత్రాలు చేస్తూ తనలో ఉన్న నటనా చాతుర్యానికి అద్దం పట్టేలా మంచి మంచి ప్రాజెక్టులను ఎంచుకుంటుంది అక్కినేని సమంత. వరస విజయాలతో దూసుకుపోతున్న సామ్ లేటెస్ట్ గా ఓ కొరియన్ చిత్రం రీమేక్ లో నటిస్తుంది. తెలుగులో “ఓ బేబీ” అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమాను నందిని రెడ్డి దర్శకత్వం చేస్తున్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలో సామ్ ఒక వయసు మళ్ళిన లేడీ పాత్రలో కనిపించనున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ గురించి సినీ వర్గాలలో కొన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా కొంత భాగం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. అయితే ఆ తాలూకు ఫుటేజ్ ఊహించిన స్థాయిలో రాకపోవడంతో మళ్ళీ రీషూట్ చేసే యోచనలో ఉన్నట్టు సమాచారం.

మరి ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియదు కానీ ప్రస్తుతం తెలుగు మీడియాలో వైరల్ అవుతుంది. అయితే దీనిపై సామ్ కానీ, నందిని రెడ్డి కానీ స్పదించలేదు. ఇక ఈ మూవీని సురేష్ బాబు నిర్మిస్తున్నారు. రిలీజ్ డేట్ త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు.


బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ అతిథిగా ‘కార్టూన్’!

Category : Uncategorized

యంగ్ అప్‌క‌మింగ్ హీరో విశ్వక్‌సేన్ కొత్త చిత్రం ‘కార్టూన్‌’ లాంఛ‌నంగా ఆదివారం హైద‌రాబాద్‌లో ప్రారంభమైంది. ఈ చిత్రం ద్వారా ప్ర‌దీప్ పులివ‌ర్తి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. డిఫ‌రెంట్ జోన‌ర్‌లో తెర‌కెక్కుతోన్న చిత్ర‌మిది. ఈ సినిమా ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మానికి డైరెక్ట‌ర్ బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ముఖ్య అతిథిగా హాజ‌రయ్యారు. జూన్ 3 నుండి ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది. 

ర‌ధ‌న్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఉద‌య్ గుర్రాల సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ఆర్య‌ క్రియేటివ్స్ బ్యాన‌ర్‌పై విశ్వ‌నాథ్ మ‌ల్లిడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

న‌టీన‌టులు:

విశ్వ‌క్ సేన్‌

సాంకేతిక వ‌ర్గం:

ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: ప‌్ర‌దీప్ పులివ‌ర్తి

నిర్మాత‌:  విశ్వ‌నాథ్ మ‌ల్లిడి

బ్యాన‌ర్‌: ఆర్య క్రియేటివ్స్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: న‌ందూరి శ్రీనివాస్ కౌశిక్‌

మ్యూజిక్‌: ర‌ధ‌న్‌

సినిమాటోగ్ర‌ఫీ: ఉద‌య్ గుర్రాల‌

ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: ల‌తా త‌రుణ్‌

పాట‌లు:  రాకేందు మౌళి

లైన్ ప్రొడ్యూస‌ర్‌:  సాయికృష్ణ గ‌ద్వాల్‌