హైదరాబాద్ నందు (బంజర హిల్స్, జూబిలీ హిల్స్, మాదాపూర్, కొండాపూర్ ) పరిసర ప్రాంతాల్లో పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ వెంటనే కావాలను. ఆర్మీ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేసి రిటైర్ అయినా వారికీ తగిన ప్రాధాన్యత ఇవ్వ బడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ + 91 8074965869

Author Archives: yönetim

`మ‌న్మ‌థుడు 2`కు కూడా డేట్ ఇచ్చేసారు!!

Category : Uncategorized

కింగ్ నాగార్జున‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ జంట‌గా న‌టిస్తున్న చిత్రం `మ‌న్మ‌థుడు 2`. రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌కుడు. మ‌నం ఎంట‌ర్ ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్స్‌, వ‌యకామ్ 18 స్టూడియోస్ ప‌తాకాలపై నాగార్జున అక్కినేని, పి.కిర‌ణ్(జెమిని కిర‌ణ్‌) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆగ‌స్ట్ 9న ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఈ సంద‌ర్భంగా గురువారం ఈ సినిమా టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. నాగార్జున వ‌ర్జీన్ యువ‌కుడిగా బ‌య‌ట‌కు క‌న‌ప‌డతారు, కానీ మ‌రో ప‌క్క‌ అమ్మాయిల వెంట‌ప‌డే ఉమ‌నైజ‌ర్ పాత్ర‌లో క‌న‌ప‌డుతున్నారు. ఇలాంటి బోల్డ్ రోల్‌లో నాగార్జున న‌టించ‌డం ఇదే తొలిసారి. టీజ‌ర్‌ను చూస్తుంటే సినిమాను లావిష్‌గా తెర‌కెక్కించార‌ని అర్థ‌మ‌వుతుంది. సినిమాటోగ్ర‌ఫీ పెద్ద ఎసెట్‌గా క‌న‌ప‌డుతుంది. 

ఎండిపోయిన చెట్టుకి నీళ్లు పోస్తే మళ్ళీ పూలు పూస్తాయా ??

పిల్లలకు కోచింగ్ ఇవ్వాల్సిన వయసులో నువ్వు బాటింగ్ కు దిగుతున్నావ్!

టీజ‌ర్ చివ‌ర్లో ఐ డోంట్ ల‌వ్ ఆ ఓన్లీ మేక్ ల‌వ్ అనే చివ‌రి డైలాగ్ యూత్ ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా ఉంది. సింగిల్ షెడ్యూల్ మిన‌హా సినిమా చిత్రీక‌ర‌ణంతా పూర్త‌య్యింది. సీనియ‌ర్ న‌టి ల‌క్ష్మి, వెన్నెల కిశోర్, రావు ర‌మేష్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. చైత‌న్ భర‌ద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఎం.సుకుమార్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు


సాహో టీజర్ రివ్యూ!!

Category : Uncategorized

ప్రభాస్ తాజా చిత్రం సాహో హడావిడి మొదలైపోయింది. ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో యువీ క్రియేషన్స్ మూడు భాషల్లో భారీగా  తెరకెక్కిస్తున్న సాహో సినిమా ఆగష్టు 15 విడుదలకు సిద్ధమవుతుండగా.. రెండు నెలల ముందు నుండే సాహో ప్రమోషన్స్ ని ఇంటర్నేషనల్ స్థాయిలో మొదలెట్టేసింది సాహో టీం. యాక్షన్ ప్రధానాంశముగా తెరకెక్కుతున్న సాహో చిత్రం అటు హిందీ లోను భారీ అంచనాలను మూటగట్టుకుంది. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో భారీగా తెరకెక్కిన సాహో చిత్ర టీజర్ ని ఈరోజు జూన్ 13 న విడుదల చేస్తున్నామని ప్రకరటించన నాటినుండి నేటి వరకు సాహో టీజర్ కోసం ప్రభాస్ ఫాన్స్ మాత్రమే కాదు.. దేశ వ్యాప్తంగా ప్రేక్షకులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. అనుకున్నట్టుగానే ఈ రోజు 11.30 నిమిషాలకు సాహో టీజర్ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేసింది సాహో టీం.

బాధయినా హ్యాపీనెస్ అయినా నాతొ షేర్ చేసుకోవడానికి ఎవరు లేరని శ్రద్ద కపూర్ క్యూట్ గా చెప్పే డైలాగ్ తో టీజర్ మొదలవగా… ప్రభాస్ నేనున్నాను అంటూ శ్రద్ద కపూర్ ని కౌగిలించుకోవడం… ఇక టీజర్ మొత్తం ప్రభాస్ చేసే యాక్షన్, అలాగే శ్రద్ద కపూర్ తోనూ దర్శకుడు ఫుల్ యాక్షన్ చేపించేసాడు. కార్ ఛేజింగ్, బైక్ ఛేజింగ్, భారీ యాక్షన్ సన్నివేశాలు, ప్రభాస్ లుక్ అన్ని సాహో సినిమా భారీ తనానికి అద్దం పట్టేలా ఉన్నాయి. తనని ఛేజ్ చేస్తున్న గ్యాంగ్ ని చూసి హీరోయిన్ శ్రద్ద వారంతా ఎవరు అని ప్రభాస్ ని అడిగితె.. ప్రభాస్ మాత్రం కూల్ గా నా ఫాన్స్ అంటే.. దానికి శ్రద్ద ఫాన్స్ అయితే అంత వైలెంట్ గా ఉన్నారేమిటి అని ప్రశ్నిస్తుంది. ఇక డైలాగ్స్ తక్కువ యాక్షన్ ఎక్కువ అన్నట్టుగా సాహో టీజర్ ఉంది. అలాగే వెన్నెల కిషోర్ కూడా కామెడీగా కాకుండా కాస్త సీరియస్ గా అమాయకంగా కనిపిస్తున్నాడు.

ప్రభాస్ లుక్, ప్రభాస్ వాడిన దుస్తులు, శ్రద్ద చేసిన యాక్షన్, ఆమె గ్లామర్ అన్ని అద్భుతంగా ఉన్నాయి. అలాగే బ్యాగ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ అన్ని భారీ తనానికి నిదర్శనంగా అన్నట్టుగా అనిపిస్తున్నాయి. సాహోలోని యాక్షన్ సన్నివేశాలు మాత్రం హాలీవుడ్ సినిమాలకు ఏ మాత్రం తీసిపోవు అన్నట్టుగా ఉన్నాయి. ప్రభాస్ లేట్ చేస్తే చేసాడు కానీ… అభిమానులకు కావాల్సిన ట్రీట్ మాత్రం సాహో తో ఇచ్చేస్తాడని ఫిక్స్ అవ్వొచ్చు. 


‘సాహో’ టీజర్ కు మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్!

Category : Uncategorized

‘బాహుబలి’ 1, 2 తరువాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెబెల్ స్టార్ ప్రభాస్ అభిమానుల ఉత్కంఠని మరింత పెంచుతూ మూడు భాషల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం సాహో. ఇండియన్ బాహుబలి ప్రభాస్ కి ఎంతటి డై హార్డ్ ఫాన్స్ వుంటారో తెలిసిందే. వాళ్ళు చూపించే అభిమానాన్ని మాటల్లో చెప్పలేం. ఇప్పుడు రెబెల్ స్టార్ ప్రభాస్ తన డై హార్డ్ ఫాన్స్ గర్వపడే సాహో టీజర్ ను కానుకగా అందించాడు. ఈరోజు విడుదలైన సాహో టీజర్ సంచలనాలు సృష్టిస్తోంది. రిలీజ్ అయిన క్షణం నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకొని దుమ్ము దులిలేస్తోంది సాహో టీజర్. మరీ ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. మేకింగ్ వీడియోలలోనే వీటి గురించి ప్రత్యేకంగా చెప్పిన దర్శకుడు ఇప్పుడు టీజర్ లో మరింత అద్భుతమైన అవుట్ పుట్ ఇచ్చాడు.  అంతగా యాక్షన్ సీన్స్ తో వరల్డ్ క్లాస్ మేకింగ్ చూపించాడు డైరెక్టర్ సుజీత్. బాహుబలి తర్వాత ప్రభాస్ ఎలాంటి సినిమా అయితే చేయాలని అభిమానులు కోరుకున్నారో సాహో అచ్చం అలాగే ఉంది. ఇప్పుడు టీజర్ చూసిన తర్వాత కచ్చితంగా సినిమా కూడా సంచలనం సృష్టిస్తుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టీజర్ లో కనిపించిన సీన్స్ హాలీవుడ్ సినిమాలను గుర్తుకు తెచ్చింది. తెలుగు సినిమా స్థాయి పెరిగిందంటూ… ప్రభాస్ ఫాన్స్ కాలర్ ఎగరేసుకుంటున్నారు. ప్రేక్షకుల, అభిమానుల అంచనాలను అందుకునేలా ప్రభాస్ స్టైలిష్ గా, కొత్త ఎనర్జీ తో కనిపించారు. ఇండిపెండెన్స్ డే కానుకగా అగ‌స్ట్ 15 న ప్ర‌పంచ‌వ్యాప్తంగా బిగ్గెస్ట్ ఫిల్మ్ ఆఫ్ ద ఇయ‌ర్ గా విడుద‌ల కి సిద్ధ‌మౌతోంది. 

యువీ క్రియేషన్స్ అధినేతలు వంశీ-ప్రమోద్ ఏ విషయంలోనూ రాజీ పడకుండా అత్యంత భారీ బడ్జెట్ తో ఏక కాలంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మూడు భాషల్లో ఒకేసారి షూట్ చేస్తున్న ఈ చిత్రాన్ని ఒకే రోజున విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా విడుద‌ల చేసిన షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 1 కి ఇప్ప‌టికే ఇండియా మెత్తం క్రేజ్ వ‌చ్చింది. ప్ర‌పంచంలో వున్న రెబెల్‌స్టార్ ఫ్యాన్స్ పండ‌గ చేసుకున్నారు. 

షేడ్స్ ఆఫ్ సాహో 2 తో ఈ చిత్రం హీరోయిన్ బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ బర్త్ డే కానుకగా విడుదల చేసిన వీడియో కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ స్పెషల్ వీడియో లో  శ్రద్దా కపూర్ క్యారెక్టర్ లుక్ ని రివీల్ చేశారు. ఈ వీడియో లో ప్రభాస్, శ్రద్దా కపూర్ స్టైలిష్ లుక్స్… ఇంటర్నేషనల్ స్టాండర్ఫ్స్ మేకింగ్ హైలైట్ గా నిలుస్తున్నాయి. ఈ మేకింగ్ వీడియోతో ఈ సినిమా ఏ రేంజ్ లో తీస్తున్నారు అనేది మరింత స్పష్టమైంది. డినో యురి 18 కెడబ్ల్యూ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సినిమా విజువల్స్ ని క్యాప్చర్ చేయడం మరో విశేషం. ఇంత‌టి భారీ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రానికి ర‌న్‌ రాజా రన్ మూవీతో సూపర్ హిట్ అందుకున్న సుజీత్  దర్శకత్వం వహిస్తున్నాడు. సాహోని ఓ విజువల్ వండర్ గా తీర్చిదిద్దేందుకు దర్శకుడు సుజిత్ తో పాటు హాలీవుడ్, బాలీవుడ్ కి చెందిన ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. హైటెక్ యాక్ష‌న్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో మైమరపించే యాక్షన్ సన్నివేశాలను అంతర్జాతీయ సాంకేతిక నిపుణుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో చిత్రీక‌రించారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మధి, ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరీల్, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ వంటి టాప్ టెక్నీషియన్స్ సాహో చిత్రానికి వర్క్ చేస్తుండడం విశేషం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. 


ఆది పినిశెట్టి ‘క్లాప్’ కొట్టాడు!!

Category : Uncategorized

విభిన్నమైన పాత్రలను చేస్తూ వెర్సటైల్ యాక్టర్ గా పేరుతెచ్చుకున్న  ఆది పినిశెట్టి మరో కొత్త తరహా పాత్రలో కనిపించబోతున్నారు. అథ్లెటిక్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో సాగే “క్లాప్” చిత్రంలో రెండు విభిన్నమైన క్యారెక్టర్స్ లో ఆది హీరోగా  నటిస్తున్నారు. ఆది పినిశెట్టి సరసన ఆకాంక్ష సింగ్ కథానాయికగా నటిస్తోంది. రామాంజనేయులు జవ్వాజి సమర్పణలో పృథ్వి ఆదిత్య  దర్శకుడిగా  బిగ్ ప్రింట్ పిక్చర్స్ అండ్ సర్వన్త్ రామ్ క్రియేషన్స్ బ్యానర్లు పై ఐబి కార్తికేయన్, యం .రాజశేఖర్ రెడ్డి సంయుక్తంగా “క్లాప్” చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ్ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కనుంది. కాగా   ఈ చిత్రం జూన్ 12న హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో అతిరథ మహారధులు మధ్య ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవానికి మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా, ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, సి. కళ్యాణ్, చంటి అడ్డాల, శ్రీమతి శోభారాణి, కొమర వెంకటేష్,  హీరోలు నాని, సందీప్ కిషన్, ప్రముఖ దర్శకులు బోయపాటి శ్రీను, గోపీచంద్ మలినేని, బొమ్మరిల్లు భాస్కర్, రచయిత చిన్నికృష్ణ తదితరులు పాల్గొని చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు. పూజాకార్యక్రమాల అనంతరం హీరో ఆది పినిశెట్టి, హీరోయిన్ ఆకాంక్ష సింగ్ లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా క్లాప్ నివ్వగా ఏస్ -ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. తమిళ్ చిత్రానికిగాను హీరో నాని క్లాప్ నిచ్చారు. “క్లాప్” బౌండెడ్ స్క్రిప్టు ను ప్రముఖ దర్శకులు బోయపాటి శ్రీను గోపీచంద్ మలినేని, బొమ్మరిల్లు భాస్కర్ చిత్ర యూనిట్ కు అందించారు. అనంతరం ఏర్పాటైన సమావేశంలో హీరో ఆది పినిశెట్టి, హీరోయిన్ ఆకాంక్ష సింగ్, దర్శకుడు పృథ్వీ  ఆదిత్య, నిర్మాతలు ఐబి కార్తికేయన్, యం .రాజశేఖర్ రెడ్డి సమర్పకుడు జవ్వాజి రామాంజనేయులు, నటి క్రిష  కురుప్, డిఒపి ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 

హీరో ఆది పినిశెట్టి మాట్లాడుతూ.. పృథ్వి ఆదిత్య కథ చెప్పగానే వెంటనే ఈ సినిమా చేస్తాను అని చెప్పాను. అంతలా ఇంప్రెస్ అయ్యాను. వెరీ ఆర్ట్ టచ్చింగ్ మూవీ . డైరెక్టర్ చాలా టాలెంట్ వున్న వ్యక్తి. ఎంతో రీసెర్చ్ చేసి ఈ కథ రాశారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఇప్పటివరకు చాలా సినిమాలు వచ్చాయి. వాటన్నిటికంటే ఈ క్లాప్ చిత్రం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ముఖ్యంగా డైరెక్టర్ కన్విక్షన్ బాగా నచ్చింది. చాలా కాన్ఫిడెంట్ గా వున్నాడు. రెండు షేడ్స్ వున్నా పాత్రల్లో నటిస్తున్నాను. బాగా చెయ్యాలనే  తపనతో వున్నాను. నిర్మాత  కార్తికేయన్ నేను ఎప్పటినుండో సినిమా చెయ్యాలనుకుంటున్నాం. ఇన్నాళ్లకు కుదిరింది. ప్రతిభ వున్న నటీనటులు , టెక్నీషియన్స్  అందరూ ఈ సినిమాకి వర్క్ చేస్తున్నారు.. అన్నారు. 

దర్శకుడు పృథ్వి ఆదిత్య మాట్లాడుతూ.. ఇది వెరీ స్పెషల్ డే నాకు. వన్ ఇయర్ నుండి ఈ కథపై వర్క్ చేశాను. కార్తికేయన్ కి పాయింట్ చెప్పగానే నచ్చి ఈ సినిమా చేయడానికి ముందుకి వచ్చారు. వెంటనే ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేయమన్నారు. ఆది కథ విని ఇమ్మీడియట్ గా సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. అథ్లెటిక్ స్పోర్ట్స్ నేపథ్యంలో చిత్ర కథ సాగుతుంది.. అన్నారు. 

హీరోయిన్ ఆకాంక్ష సింగ్ మాట్లాడుతూ.. తెలుగులో ఇది  నా మూడవ సినిమా. తమిళ్ లో ఫస్ట్ సినిమా. చాలా ఎక్సయిటింగ్ గా వుంది. ఈ చిత్రంలో స్ట్రాంగ్ క్యారెక్టర్ చేస్తున్నాను. వెరీ ఇంపార్టెంట్ రోల్. ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్, ప్రొడ్యూర్స్ కి థాంక్స్ అన్నారు. 

సమర్పకుడు జవ్వాజి రామాంజనేయులు మాట్లాడుతూ.. మిత్రుడు రాజశేఖర్ ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పాడు కథ విని ఇంప్రెస్ అయి ఈ చిత్రంలో భాగమయ్యాను. బౌండెడ్ స్క్రిప్ట్ తో డైరెక్టర్ పృథ్వి పక్కా ప్లానింగ్ తో ఈ చిత్రాన్ని చేయబోతున్నాడు. ఇళయరాజా గారి మ్యూజిక్ ఈ చిత్రానికి బిగ్ ఎస్సెట్ కానుంది. ఈ చిత్రంలోని క్యారెక్టర్ కి ఆది తప్ప ఇంకెవఋ అడాప్ట్ కారు. ఈ నెల 17నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంబిస్తాం. హైదరాబాద్, చెన్నయ్, బెంగుళూరు, మధురైలలో  షూటింగ్ జరుపుతాం. మొత్తం నాలుగు షెడ్యూల్స్ లో ఈ చిత్రాన్ని పూర్తి చేయనున్నాం.. అన్నారు. 


నితిన్ ‘భీష్మ’ మొదలైంది!!

Category : Uncategorized

‘భీష్మ’

నితిన్,రష్మిక మండన,వెంకీ కుడుముల కాంబినేషన్ లో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ ఎంటర్ టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగ వంశి నిర్మిస్తున్న  నూతన చిత్రం ‘భీష్మ’  నేటి ఉదయం (12 – 6 – 19 ) 10 : 19 నిమిషాలకు సంస్థ కార్యాలయంలో  ప్రారంభమయ్యింది.

ఈ నెల 20 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. డిసెంబర్ నెలలో చిత్రం విడుదల అయ్యే దిశగా చిత్ర నిర్మాణ కార్యక్రమాలు జరుగుతాయని నిర్మాత సూర్యదేవర నాగ వంశి తెలిపారు.

ఈ ప్రో జెక్ట్ గురించి నేను చాలా ఆనందంగా ఉన్నాను అన్నారు చిత్ర దర్శకుడు వెంకీ కుడుముల. స్క్రిప్ట్ చాలా బాగా వచ్చినందుకు టీమ్ అంతా చాలా హ్యాపీ గా ఉన్నారు. ప్రతి అబ్బాయి నితిన్ గారి క్యారెక్టర్ కి కనెక్ట్ అయ్యేవిధంగా డిజైన్ చెయ్యబడింది. అలాగే ప్రతి యువతి కూడా రష్మిక క్యారెక్టర్ కి కనెక్ట్ అవుతుంది. ఇది ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్. అలాగే చాలా ఫన్ ఎలిమెంట్స్ తో సాగుతుంది అని తెలిపారు దర్శకుడు వెంకీ కుడుముల.


క‌ల్యాణ్‌రామ్ హీరోగా ఆదిత్య మ్యూజిక్ చిత్రం!

Category : Uncategorized

`ఆదిత్య మ్యూజిక్` అనేది సంస్థ మాత్ర‌మే కాదు. అది ఒక బ్రాండ్‌. సంగీత ప్రియులంద‌రికీ ఆదిత్య మ్యూజిక్‌తో ఉన్న అనుబంధం అత్యంత ప్ర‌త్యేక‌మైన‌ది. గ‌త మూడు ద‌శాబ్దాలుగా సంగీత రంగంలో త‌న‌దైన ముద్ర‌వేసిన ఆదిత్య మ్యూజిక్ తాజాగా నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టింది. తెలుగులో నిర్మించ‌బోతున్న త‌మ తొలి సినిమాకు హీరోగా నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్‌ను ఎంపిక చేసుకుంది. ఈ ఏడాది `118` సూప‌ర్ స‌క్సెస్‌తో జోరుమీదున్నారు క‌ల్యాణ్‌రామ్‌. ఆయ‌న హీరోగా నటించ‌నున్న ఈ సినిమాకు జాతీయ పుర‌స్కారాన్ని అందుకున్న `శ‌త‌మానం భ‌వ‌తి` చిత్ర ద‌ర్శ‌కుడు వేగేశ్న స‌తీష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. ఈ మ‌ధ్య‌నే ఎఫ్‌2తో `హ‌నీ ఈజ్ ద బెస్ట్` అనే మ్యాన‌రిజ‌మ్‌తో మార్కులు కొట్టేసిన నార్త్ ఇండియ‌న్ భామ మెహ‌రీన్ నాయిక‌గా న‌టించనున్నారు.`జెంటిల్‌మ‌న్`, `స‌మ్మోహ‌నం` వంటి అభిరుచి గ‌ల హిట్ చిత్రాలు తీసిన‌ శ్రీదేవి మూవీస్ శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్ స‌మ‌ర్పిస్తున్న ఈ సినిమాకు, `గీత గోవిందం`, `మ‌జిలీ` వంటి మ్యూజిక‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్స్ చిత్రాల సంగీత ద‌ర్శ‌కుడు గోపీసుంద‌ర్ సంగీతాన్ని అందిస్తున్నారు. అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల‌నూ అల‌రించేలా ద‌ర్శ‌కుడు క‌థ‌ను సిద్ధం చేసుకున్నార‌ని చిత్ర నిర్మాత ఉమేష్ గుప్త తెలిపారు.


నాగార్జున మ‌న్మ‌థుడు 2 టీజ‌ర్‌ ఎప్పుడంటే…!!

Category : Uncategorized

కింగ్ నాగార్జున హీరోగా మ‌నం ఎంట‌ర్‌ప్రైజ‌స్‌, ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్‌, వ‌య్‌కామ్ 18 స్టూడియోస్‌ ప‌తాకాల‌పై రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం `మ‌న్మ‌థుడు 2`. నాగార్జున అక్కినేని, పి.కిర‌ణ్ (జెమిని కిర‌ణ్‌) నిర్మాత‌లు. ప్ర‌స్తుతం సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. ఒక షెడ్యూల్ మిన‌హా సినిమా చిత్రీక‌ర‌ణంతా పూర్త‌య్యింది. త్వ‌ర‌లోనే ఈ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌కు కూడా ప్లాన్ చేస్తున్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమాకు సంబంధించిన నాగార్జున స్టైలిష్ లుక్‌తో పాటు నాగార్జున‌- ర‌కుల్‌, నాగార్జున‌- కీర్తిసురేష్ ఫోటోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేశాయి. సినిమాపై ఇప్ప‌టికే మంచి అంచ‌నాలున్నాయి. ఈ అంచ‌నాల‌ను మ‌రింత పెంచేలా జూన్ 13న ఈ సినిమా టీజ‌ర్‌ను విడుద‌ల చేస్తున్నారు. 

మ‌న్మ‌థుడు ఇన్‌స్పిరేష‌న్‌తో, రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ ఫ‌న్ రైడ‌ర్ తెర‌కెక్కుతోంది. చైత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి ఎం.సుకుమార్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. 


‘ఓటర్‌’ కి విముక్తి దొరికింది!!

Category : Uncategorized

రామా రీల్స్‌ బ్యానర్‌పై జాన్‌ సుధీర్‌ పూదోట నిర్మాతగా విష్ణు, సురభి జంటగా జి.ఎస్‌.కార్తీక్‌ దర్శకత్వం వహించిన ‘ఓటర్‌’ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. అనేక అడ్డంకులు ఎదుర్కొన్న ఈ చిత్రం మీద ఆడియన్స్‌లోనూ, ట్రేడ్‌ వర్గాల్లోనూ మంచి క్రేజ్‌ ఏర్పడింది. అందుకే సార్థక్‌  మూవీస్‌ సంస్థ పోటీపడి మరీ ఫ్యాన్సీ రేటుకి విడుదల హక్కులను సొంతం చేసుకుంది. ఈ నెల 21న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుందీ సినిమా.  నిర్మాత మాట్లాడుతూ ‘పదవిలో ఉన్న నాయకుడు సరిగా పనిచేయకపోతే.. అతనితో ఎలా పనులు చేయించుకోవాలో తెలిపే నేపథ్యంలో సాగే సినిమా ఇది. ఓటు  హక్కు, ఓటర్‌ విలువను తెలిపే ఈ చిత్రాన్ని పొలిటికల్‌ డ్రామాగా దర్శకుడు కార్తీక్‌ చక్కగా తెరకెక్కించారు. చక్కని సందేశంతోపాటు, పోరాట సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఎన్నో విజయవంతమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించిన సార్థక్‌ మూవీస్‌ సంస్థ మా సినిమాను విడుదల చేయడం ఆనందంగా ఉంది’ అని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్‌, కెమెరా: రాజేష్‌ యాదవ్‌, ఎడిటింగ్‌: కె.ఎల్‌ ప్రవీణ్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ : కిరణ్‌ తనమాల.   


ఏంటి సమంత తల్లి కాబోతుందా?

Category : Uncategorized

అక్కినేని నాగ చైతన్య తో పెళ్లి తరువాత సమంత తన ట్విట్టర్ హ్యాండిల్ పేరుని అక్కినేని సమంత గా మార్చుకుంది. ఇక లేటెస్ట్ గా ఆమె బేబీ అక్కినేని గా మార్చుకోవడంతో రకరకాల అర్థాలు తీస్తున్నాయి సోషల్ మీడియా వర్గాలు. త్వరలోనే సామ్ తల్లి కాబోతుందని అందుకే బేబీ అక్కినేని అని పెట్టుకుందని.. అంతా ఎవరికి ఇష్టమొచ్చినట్లు వారు రాసుకుంటున్నారు.

వాస్తవానికి సామ్ అలా పెట్టింది కేవలం తన కొత్త సినిమా అయిన ఓ బేబీ ని ప్రమోట్ చేసుకోవాలనే. కొరియన్ హిట్ మిస్ గ్రానీకి అఫీషియల్ రీమేక్ గా రూపొందుతున్న ఓ బేబీ సినిమా చేస్తుంది సామ్. ఈసినిమా యొక్క ప్రమోషన్స్ లో భాగంగా అలా తన పేరుకు తగిలించుకుందే తప్ప అందులో అంతకు మించి అర్థం లేదు. 

ఈ రూమర్ ఊరికే రాలేదు. గతంలో సామ్ నటించిన మజిలీ అప్పుడు శ్రావణి అనో లేదా రంగస్థలం టైంలో రామలక్ష్మి అనో లేదా యూటర్న్ గురించి ఇంకేదో ఇలా దేనికీ ట్విట్టర్ హ్యాండిల్ ని మార్చుకోలేదు సమంత. సో గతంలో ఆమె ఇలా అలా ప్రమోట్ చేసుకోలేదు కాబట్టి సామ్ తల్లికాబోతుందనే అనుకున్నారు. పిల్లలు గురించి సామ్ అప్పుడే ఏమి ఆలోచించట్లేదట. రెండు మూడేళ్లు ఫుల్ బిజీగా ఉండడంతో ఆమె తల్లికాబోతుందని వచ్చినవి రూమర్సే అని క్లారిటీ వచ్చేసింది.


వాల్మీకి వచ్చేస్తున్నాడు!!

Category : Uncategorized

14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై శ‌ర‌వేగంగా రూపొందుతోన్న వ‌రుణ్ తేజ్‌, హ‌రీష్ శంక‌ర్ వాల్మీకి.. సెప్టెంబ‌ర్ 6న గ్రాండ్ రిలీజ్‌

కెరీర్ ప్రారంభం నుండి వైవిధ్య‌మైన క‌థా చిత్రాల్లో న‌టించ‌డానికి ఆస‌క్తి చూపించిన క‌థానాయ‌కుడు మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌. ముకుంద‌, కంచె, అంత‌రిక్ష్యం, ఫిదా, తొలి ప్రేమ‌, ఎఫ్‌2 వంటి చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల్లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడీ యువ క‌థానాయ‌కుడు. 

అలాగే హీరో బాడీ లాంగ్వేజ్‌ను స‌రికొత్త‌గా ప్రెజెంట్ చేస్తూ సినిమాను క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కించ‌డంలో దిట్ట డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్‌.ఎస్…. సూప‌ర్ హిట్ చిత్రాలు మిర‌ప‌కాయ్‌, సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌, ఇండ‌స్ట్రీ హిట్ గ‌బ్బ‌ర్ సింగ్‌, సెన్సేష‌న‌ల్ హిట్ డీజే దువ్వాడ జ‌గ‌న్నాథమ్‌ వంటి క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్సే హ‌రీష్ మేకింగ్‌కు ఉదాహ‌ర‌ణ‌లు. 

ఇలా వైవిధ్య‌మైన చిత్రాల్లో న‌టించడానికి ఆస‌క్తి చూపే యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో వ‌రుణ్ తేజ్‌, ఇండ‌స్ట్రీ హిట్ డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ క‌ల‌యిక‌లో రూపొందుతోన్న చిత్రం వాల్మీకి.

14 రీల్స్ ప్ల‌స్ బ్యాన‌ర్‌పై రామ్ ఆచంట‌, గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వ‌రుణ్ తేజ్ గ్యాంగ్ స్ట‌ర్ పాత్ర‌లో న‌టిస్తుండ‌గా.. త‌మిళ హీరో అధ‌ర్వ ముర‌ళి కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. పూజా హెగ్డే, మృణాళిని ర‌వి హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను సెప్టెంబ‌ర్ 6న విడుద‌ల చేయ‌డానికి సన్నాహాలు చేస్తున్నారు. మిక్కి జె.మేయ‌ర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఐనాంక బోస్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.