హైదరాబాద్ నందు (బంజర హిల్స్, జూబిలీ హిల్స్, మాదాపూర్, కొండాపూర్ ) పరిసర ప్రాంతాల్లో పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ వెంటనే కావాలను. ఆర్మీ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేసి రిటైర్ అయినా వారికీ తగిన ప్రాధాన్యత ఇవ్వ బడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ + 91 8074965869

Category Archives: Uncategorized

‘మన్మథుడు’ ఫార్ములా మహేష్ ఫాలో అయితే!!

Category : Uncategorized

మహేష్ ఏదన్నా సినిమా చేస్తున్నాడు అంటే ఆ సినిమా నుండి అప్ డేట్స్ చాలా లేట్ గా వస్తుంది. షూటింగ్ కంప్లీట్ చేసినా కానీ ఆ సినిమా టైటిల్ ని రివీల్ చేయరు. అలానే టీజర్, ట్రైలర్స్ విషయంలో ఏదొక ముహూర్తం పెట్టి రిలీజ్ చేస్తుంటారు. అయితే అది గతం. ఇప్పుడు మహేష్ ఆ స్ట్రాటజీని ఫాలో అవ్వడంలేదు. తన లేటెస్ట్ మూవీ విషయంలో మహేష్ ఓ కొత్త స్ట్రాటజీని ఫాలో అవుతున్నాడు.

అతను అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ అనే మూవీ నుండి రెగ్యులర్ గా  అప్ డేట్స్ అందుకోవచ్చు అంట. ఏదొక ముహూర్తం పెట్టి స్టిల్స్ విడుదల చేసే కార్యక్రమాలు మానుకున్నారు. షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుండి దశలవారీగా స్టిల్స్ విడుదల చేయాలని నిర్ణయించారు. రీసెంట్ గా రెండు మూడు వర్కింగ్ స్టిల్స్ బయటకు వచ్చాయి. ఇక త్వరలోనే ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నారు.

ప్రతి నెల ఏదోకటి స్టిల్ రిలీజ్ చేయాలనీ, వీటితో పాటు సాంగ్ మేకింగ్స్, టీజర్, ట్రైలర్స్ కూడా రిలీజ్ చేయాలనీ భావిస్తున్నారట. సేమ్ ఇదే ఫాలో అవుతున్నాడు నాగార్జున. నాగ్ లేటెస్ట్ మూవీ మన్మధుడు-2 సినిమా విషయంలో సినిమా సెట్స్ మీద ఉన్నప్పటి నుండి స్టిల్స్ రిలీజ్ చేస్తూనే ఉన్నాడు. ఈ స్ట్రాటజీ సినిమాకి బాగా ప్లస్ అయింది. సో మహేష్ కూడా అందుకే అదే ఫార్ములాని ఫాలో అవుతున్నాడు.


‘సాహో’ ఆ సీన్ కోసం కాంప్రమైజ్ కావడం లేదంట!

Category : Uncategorized

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ చిత్రం సాహో ఆగస్టు 15 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది. మొదటినుండి ఈసినిమాకి హైలెట్ దుబాయ్ లో తెరకెక్కించిన ఛేజింగ్ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ ని మేకర్స్ ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి  చేసారు. అటువంటి ఈ సీన్స్ ఎలా ఉండాలి? సినిమాలో ఆ ఎపిసోడ్ ని చూస్తే ఎంత కిక్ రావాలి? ప్రేక్షకులు ఎలా థ్రిల్ అవ్వాలి? సో అందుకే ఆ ఎపిసోడ్ కి ప్రస్తుతం విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్ లు జోడించే పనిలో ఉన్నారు టీం.

ట్రైలర్ లో కొన్ని సెకండ్లు మాత్రమే కనిపించిన ఆ సీన్స్ సినిమాలో కొన్ని నిమిషాలు పాటు ఉండనుందట. అందుకే ఈ టోటల్ ఛేజ్ కు సంబంధించి, విఎఫ్ఎక్స్ క్వాలిటీ విషయంలో సాహో యూనిట్ చాలా కేర్ తీసుకుంటోందని తెలుస్తోంది. ఎక్కడా కంప్రమైజ్ కాకుండా చాలా జాగ్రత్తగా ఆ ఎపిసోడ్ ని తీర్చిదిద్దుతున్నారట.

మిగిలిన విఎఫ్ఎక్స్ పనులు చాలావరకు అయ్యాయి కానీ, ఈ ఛేజింగ్ వర్క్ మాత్రం ఇంకా కాస్త వుందని ఇండస్ట్రీ బోగట్టా. త్వరలోనే ఇది కూడా అయిపోనుందని చెబుతున్నారు. సుజీత్ అండ్ టీం వర్క్ విషయంలో ఎక్కడా హడావిడి లేకుండా చాలా జాగ్రత్తగా, హ్యాండిల్ చేస్తున్నారని టాక్. ఇక ఈసినిమా యొక్క టీజర్ లేటెస్ట్ గా రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసింది.


‘ఎవరు’ విడుదల ముందుకొచ్చేసింది..!

Category : Uncategorized

పి.వి.పి సినిమా బ్యాన‌ర్‌లో అడివిశేష్ హీరోగా న‌టిస్తోన్న ‘ఎవ‌రు’ ఆగ‌స్ట్ 15న విడుద‌ల‌

‘క్ష‌ణం’, ‘అమీ తుమీ’, ‘గూఢ‌చారి’ వంటి వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న అడివిశేష్ క‌థానాయ‌కుడుగా రూపొందుతోన్న థ్రిల్ల‌ర్ ‘ఎవ‌రు’. ‘బ‌లుపు’, ‘ఊపిరి’, ‘క్ష‌ణం’ వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల‌ను నిర్మించిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ పివిపి సినిమా బ్యాన‌ర్‌పై ఈ చిత్రం నిర్మిత‌మ‌వుతోంది. వెంక‌ట్ రామ్‌జీ ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. పెర‌ల్ వి.పొట్లూరి, ప‌ర‌మ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె నిర్మాత‌లు. ఈ చిత్రంలో రెజీనా క‌సండ్ర హీరోయిన్‌గా న‌టిస్తుంది. న‌వీన్ చంద్ర కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను ఆగ‌స్ట్ 15న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. 

రీసెంట్‌గా విడుద‌లైన ఫ‌స్ట్ లుక్‌కు ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. ‘క్ష‌ణం’ వంటి సూప‌ర్‌హిట్ త‌ర్వాత అడివిశేష్‌, పివిపి సినిమా కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. శ్రీచ‌ర‌ణ్ పాకాల సంగీత సార‌థ్యం వ‌హిస్తున్న ఈ చిత్రానికి వంశీ ప‌చ్చిపులుసు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.  

న‌టీన‌టులు:

అడివిశేష్‌, రెజీనా కసండ్ర‌, న‌వీన్ చంద్ర త‌దిత‌రులు 

 సాంకేతిక వ‌ర్గం:

ద‌ర్శ‌క‌త్వం:  వెంక‌ట్ రామ్‌జీ, నిర్మాత‌లు:  పెర‌ల్ వి.పొట్లూరి, ప‌ర‌మ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె, సినిమాటోగ్ర‌ఫీ: వ‌ంశీ ప‌చ్చిపులుసు, సంగీతం: శ‌్రీచ‌ర‌ణ్ పాకాల‌, ఆర్ట్‌: అవినాష్ కొల్ల‌, ఎడిటింగ్‌:  గ్యారీ బి.హెచ్‌, డైలాగ్స్‌:  అబ్బూరి ర‌వి, కాస్ట్యూమ్స్‌:  జాహ్న‌వి ఎల్లోర్‌, సురా రెడ్డి, సౌండ్ ఎఫెక్ట్స్‌:  య‌తిరాజ్‌, పి.ఆర్‌.ఒ:  కాకా.


‘మన్మథుడు 2’ స్టేటస్ ఇదే..!

Category : Uncategorized

డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాల్లో కింగ్ నాగార్జున‌ ‘మ‌న్మ‌థుడు 2’.. ఆగ‌స్ట్ 9న గ్రాండ్ రిలీజ్‌

కింగ్ నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్‌గా న‌టిస్తోన్న చిత్రం ‘మ‌న్మ‌థుడు 2’. మ‌నం ఎంట‌ర్ ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్స్‌, వ‌యకామ్ 18 స్టూడియోస్ ప‌తాకాలపై నాగార్జున అక్కినేని, పి.కిర‌ణ్(జెమిని కిర‌ణ్‌) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కుతోన్న ఈ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ షూటింగ్ పూర్త‌య్యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఇప్పుడు డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. అందులో భాగంగా హీరో నాగార్జున డ‌బ్బింగ్ చెబుతున్నారు.  అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను ఆగ‌స్ట్ 9న ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతుంది.

ఇటీవ‌ల విడుద‌లైన ఈ సినిమా టీజ‌ర్‌కు ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. అలాగే అవంతికగా న‌టించిన ర‌కుల్ ప్రీత్ సింగ్ పాత్ర‌కు సంబంధించిన టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ టీజ‌ర్‌కు కూడా హ్యూజ్ రెస్పాన్స్ వ‌చ్చింది.  చైత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆడియో విడుద‌ల‌, ట్రైల‌ర్ రిలీజ్ డేట్స్‌ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తామ‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు తెలియ‌జేశారు. 

న‌టీన‌టులు:

కింగ్ నాగార్జున‌

ర‌కుల్ ప్రీత్ సింగ్‌

ల‌క్ష్మి

వెన్నెల‌కిషోర్‌

రావు ర‌మేష్‌

ఝాన్సీ

దేవ‌ద‌ర్శిని త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం: 

ద‌ర్శ‌క‌త్వం:  రాహుల్ ర‌వీంద్ర‌న్‌

నిర్మాత‌లు:  నాగార్జున అక్కినేని, పి.కిర‌ణ్‌

నిర్మాణ సంస్థ‌లు: మ‌నం ఎంట‌ర్‌ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్‌, వ‌యాకామ్ 18 స్టూడియోస్‌

మ్యూజిక్:  చైత‌న్య  భ‌రద్వాజ్‌

సినిమాటోగ్ర‌ఫీ:  ఎం.సుకుమార్‌

ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్స్‌:  ఎస్‌.రామ‌కృష్ణ‌, మౌనిక‌

స్క్రీన్‌ప్లే:  రాహుల్ ర‌వీంద్ర‌న్, స‌త్యానంద్‌

ఎడిట‌ర్స్‌:  ఛోటా కె.ప్ర‌సాద్‌, బి.నాగేశ్వ‌ర రెడ్డి

డైలాగ్స్‌:  కిట్టు విస్సా ప్ర‌గ‌డ‌, రాహుల్ ర‌వీంద్ర‌న్‌

కాస్ట్యూమ్స్‌:  అనిరుధ్ సింగ్‌, దీపికా ల‌ల్వాని.

పోస్ట్ ప్రొడ‌క్ష‌న్‌:  సి.వి.రావ్‌

డిజిట‌ల్ మార్కెటింగ్‌:  నిహారిక గాజుల‌

పి.ఆర్‌.ఒ:  వంశీ-శేఖ‌ర్‌, బి.ఎ.రాజు


ఇంగ్లాండ్ కప్ గెలిచి ఉండొచ్చు.. కానీ..: మహేశ్

Category : Uncategorized

ప్రపంచ కప్ చరిత్రలో కనీవిని ఎరగని రీతిలో.. ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. విజయం కోసం ఇరు జట్లు ఎంతలా పోరాడాయో.. నరాలు తెగే ఉత్కంఠతో చూసిన క్రీడాభిమానులకే అది అర్థమవుతుంది. ఫైనల్‌గా న్యూజిలాండ్‌పై ఇంగ్లండ్ గెలిచేసింది. ఇండియా ఫైనల్‌కు చేరుకోలేదు కాబట్టి పెద్దగా ఈ వరల్డ్‌కప్‌కు పసలేకుండా పోయిందన్నది కొందరి వాదన!.

ఈ అద్భుతమైన మ్యాచ్ ఎంతో మంది క్రీడాభిమానులు, సెలబ్రిటీలు చూసే ఉంటారు. అందరిలోనూ ఒకే టెన్షన్.. టెన్షన్.. వాట్ నెక్ట్స్.. ఎవరు గెలుస్తారు..? ఎవరు గెలుస్తారు..? ఎవర్ని పలకరించినా ఇవే ప్రశ్నలు. అయితే ఈ ఫైనల్‌ మ్యాచ్‌ను తాను కూడా ఎంతో ఆసక్తికరంగా చూశానని టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు చెబుతున్నారు. ఈ మ్యాచ్ చూశాక తన అభిప్రాయాన్ని ట్విట్టర్ వేదికగా స్పందించారు.

‘నిన్న రాత్రి జరిగిన మ్యాచ్ మైకంలోనే ఇప్పటికీ ఉన్నాను. అత్యంత ఉత్కంఠకు గురి చేసిన ఫైనల్ ఇది. ఇంగ్లాండ్ కప్ గెలిచి ఉండొచ్చేమో కానీ న్యూజిలాండ్ మాత్రం తప్పకుండా జనాల హృదయాలను గెలుచుకుంది. ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లకు అభినందనలు తెలియజేస్తున్నాను’ అని మహేశ్ బాబు తన ట్విట్టర్‌లో రాసుకొచ్చారు. మహేశ్ ట్వీట్ చూసిన వీరాభిమానులు, ట్విట్టర్ ఫాలోవర్స్ పెద్ద ఎత్తున కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.


అటువంటి ట్రోల్స్ పట్టించుకోను: రకుల్ ప్రీత్

Category : Uncategorized

నాగార్జున – రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రల్లో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మన్మథుడు 2’. కొన్ని రోజులు కిందట నాగార్జున‌ని హైలైట్ చేస్తూ ఒక టీజర్‌ని రిలీజ్ చేసారు. ఇప్పుడు తాజాగా మరో టీజర్ ని రిలీజ్ చేసారు మేకర్స్. అయితే ఈసారి రకుల్ ప్రీత్ ని హైలైట్ చేస్తూ టీజర్ ని వదిలారు. అందులో ఆమె ఒక సీన్ లో సిగరెట్‌ తాగుతూ కనిపిస్తారు. 

దాంతో నెటిజన్లు ఆమెను తిట్టిపోస్తున్నారు. ప్రస్తుతం హాట్ టాపిక్ అయిన రకుల్ ని కొంతమంది.. ఆమె ఒక అమ్మాయి. చాలామందికి రోల్ మోడల్, అటువంటి ఆమె ఇలా సిగరెట్లు తాగితే వారూ పాడైపోతారని కామెంట్లు చేస్తున్నారు. అయితే దీనిపై రకుల్ కొంచం గట్టిగానే స్పందించింది.

‘‘నేను సిగరెట్‌ కాల్చితే తప్పేంటి? అయిన ప్రజలు పని అదే కదా..వాళ్ళు ఏదోకటి అంటూనే ఉంటారు. కబీర్ సింగ్ లో హీరో షాహిద్‌ కపూర్‌ కూడా సిగరెట్‌ తాగారు. అతనికి సిగరెట్‌ అలవాటు లేదు. ఎందుకంటే ఆయన నిజ జీవితంలో శాకాహారి. ఆ పాత్ర కోసం ఆయన తాగవల్సివచ్చింది కానీ నిజ జీవితాన్ని సినీ జీవితంతో కలిపి చూడకూడదు. నేను కూడా అంతే. సినిమా చూస్తే మీకే అర్ధం అవుతుంది. నేను ఎందుకు సిగరెట్‌ కాల్చానో అని. అయినా నేను ఇటువంటి ట్రోల్స్ పట్టించుకోను. నాకు వీటికన్నా ఇంకా ముఖ్యమైన పనులు చాలా ఉన్నాయి’’ అని సమాధానం ఇచ్చింది రకుల్.


‘ఓ బేబీ’ విజయం వారికి అంకితమిచ్చాడు

Category : Uncategorized

‘ఓ బేబీ’ రచయితగా నా విజయాన్ని అమ్మ, అమ్మమ్మకు అంకితమిస్తున్నా! – మాటల రచయిత లక్ష్మీ భూపాల్‌

‘చందమామ’, ‘అలా మొదలైంది’, ‘మహాత్మ’, ‘టెర్రర్‌’, ‘నేనే రాజు నేనే మంత్రి’, ‘కల్యాణ వైభోగమే’ చిత్రాలతో మాటల రచయితగా మంచి పేరు తెచ్చుకున్నారు లక్ష్మీ భూపాల్‌. ఇటీవల విడుదలైన ‘ఓ బేబీ’తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. అలాగే, లక్ష్మీ భూపాల్‌ తెలుగు చిత్ర పరిశ్రమలో రచయితగా ప్రవేశించి పదిహేనేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించారు.

సాధారణంగా మీడియా ముందుకు రాని మీరు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇవ్వడానికి కారణం?

‘ఓ బేబీ’ విడుదల తర్వాత ప్రేక్షకులు, విమర్శకులు సమంత నటన, నందినీరెడ్డి దర్శకత్వంతో పాటు నేను రాసిన మాటల గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారు ఫోన్ చేసి అరగంటకు పైగా మాట్లాడారు. కెఎస్ రామారావుగారు ఫోన్ చేశారు. ఇండస్ట్రీ నుంచి, ప్రేక్షకుల నుంచి ఎన్నో ఫోనులు వచ్చాయి. అందరికీ కృతజ్ఞత తెలపడానికి వచ్చాను.

‘ఓ బేబీ’ విజయం మీకు అంత ప్రత్యేకమా?

నేను తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి పదిహేనేళ్లు పూర్తయ్యాయి. ఒక 50, 60 సినిమాలు చేశా. అందులో కొన్ని విజయాలు ఉన్నాయి. ఇన్నేళ్లలో ఇన్ని సినిమాలు చేసినా రాని శాటిశ్‌ఫ్యాక్ష‌న్‌ ‘ఓ బేబీ’కి వచ్చింది. మాటల గురించి ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తుంటే సంతోషంగా ఉంది. వ్యక్తిగతంగానూ సినిమాకు నేను బాగా కనెక్ట్ అయ్యాను. మా నాన్నగారు నా చిన్నతనంలో మరణించారు. అప్పటి నుంచి అమ్మ, అమ్మమ్మ సంరక్షణలో పెరిగాను. అందుకని, సినిమా కథ నాకు మరింత కనెక్ట్ అయింది. ఇందులో బేబీ పాత్రకు రాసిన ప్రతి మాట మా అమ్మ లేదా అమ్మమ్మ అన్న మాటలే. నేను చిన్నతనంలో ఎన్నోసార్లు విన్న మాటలే. ఉదాహరణకు… ‘మగాళ్లు అందరికీ మొగుడులా బతికా’ అని లక్ష్మిగారు ఒక సన్నివేశంలో డైలాగ్ చెబుతారు. నేనది అమ్మమ్మ నోటి నుంచి 150 సార్లు విని ఉంటాను. అందుకని, ‘ఓ బేబీ’ మాటల రచయితగా నా విజయాన్ని మా అమ్మ, అమ్మమ్మకు అంకితం ఇస్తున్నాను. 

సినిమా చూశాక, మీ అమ్మగారు ఏమన్నారు?

అమ్మ సినిమా చూసేటప్పుడు నేను పక్కనే కూర్చున్నాను. కొన్ని సన్నివేశాలు వచ్చేటప్పుడు నావైపు చూసేది. ఉదాహరణకు… చేపల పులుసు వాసన చూసి ఉప్పు సరిపోలేదని నేను చెప్పేస్తా. లక్ష్మిగారి పాత్రకు దాన్ని అన్వయిస్తూ సన్నివేశం రాశా. ఇటువంటివి కొన్ని ఉన్నాయి. అమ్మకు సినిమా బాగా నచ్చింది. 

కొన్ని ఘాటైన డైలాగులు కూడా రాశారు. మగాళ్లపై విమర్శ చేసినట్టున్నారు?

‘మొలతాడుకి, మోకాలి మధ్య కొవ్వు పెరిగిపోయి కొట్టుకుంటున్నారు’ డైలాగ్ గురించేనా? సినిమాలో నాగశౌర్య పాత్రను ఉద్దేశించి సమంతగారు ఆ డైలాగ్ చెప్పారని అనుకుంటున్నారు. సరిగా వింటే అందరినీ ఉద్దేశించి రాసిన డైలాగ్ అని తెలుస్తుంది. ప్రతివారం ఎక్కడో చోట చూస్తున్నాం లేదా వింటున్నాం. తొమ్మిదేళ్ల పాపపై అని, మరొకటి అని. అందుకే, ఆ మాట రాశా. సెన్సార్ వాళ్లకు భయపడి నేను చెప్పాలనుకున్న భావాన్ని పూర్తిగా కాకుండా, కొంచెం సుతిమెత్తగా రాశా. లేదంటే ఇంకా ఘాటుగా రాసేవాణ్ణి. 

కృష్ణవంశీ, నందినిరెడ్డి, సతీష్ కాసెట్టి… వీళ్లతో ఎక్కువ సినిమాలు చేసినట్టున్నారు?

అవును. ఒక్కొక్కరితో మూడేసి సినిమాలు చేశా. ఇంకా చాలామందితో చేశా. తేజగారితో చేసిన ‘నేనే రాజు నేనే మంత్రి’ మంచి పేరు తెచ్చింది.

స్టార్ హీరోల సినిమాలకు చేయకపోవడానికి కారణం?

కొన్ని అవకాశాలు వచ్చాయి. కానీ, కుదరలేదు. రవితేజ ‘బలాదూర్’ కి చేశాను కదా! బహుశా… నేను పంచ్ డైలాగులు, ప్రాసలకు దూరంగా ఉంటాను కనుక అవకాశాలు రాలేదేమో. స్టార్ హీరోలు, దర్శకులు అవకాశాలు ఇవ్వలేదేమో. నాకు ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ సినిమాలు చేయాలని ఉంటుంది. అవకాశం వస్తే… వాళ్ల బలాలు చూపించేలా డైలాగులు రాయాలని ఉంటుంది. చిరంజీవిగారు ‘దొంగ మొగుడు’ వంటి సినిమా చేస్తే ఎంత హుషారుగా ఉంటుందో ఆలోచించండి. అవకాశాల కోసం చూస్తున్నాను. స్టార్ హీరోలతో పనిచేయలేదేమో గానీ… స్టార్ ప్రొడక్షన్ హౌసులు సురేష్ ప్రొడక్షన్స్, వైజయంతి మూవీస్, ఉషాకిరణ్ మూవీస్ కి పని చేశా. నా ఫస్ట్ మూవీ ‘సోగ్గాడు’ సురేష్ ప్రొడక్షన్స్ సినిమా. 

సినిమాలు ప్లాప్ అయితే రైటర్ పై ఎలాంటి ప్రభావం ఉంటుంది?

నేను రైటర్ గా వర్క్ చేసిన సినిమాలు ఫెయిల్ అయ్యాయి. కానీ, రైటర్ గా నేను ఎప్పుడు ఫెయిల్ కాలేదు. ఫెయిల్ అయితే తర్వాత మరో అవకాశం వచ్చేది కాదు కదా. ఫెయిల్యూర్ వచ్చిన ప్రతిసారి నేను లక్ష రూపాయల రెమ్యూనరేషన్ పెంచేవాణ్ణి. కసితో రాసేవాణ్ణి. 

ప్రజెంట్ రైటర్స్ రెమ్యూనరేషన్ ఎలా ఉంది?

బావుంది. హ్యాట్సాఫ్ టు త్రివిక్రమ్ గారు. ఆయన ఒక ప్యారామీటర్ సెట్ చేశారు. రైటర్ ఇంత తీసుకోవచ్చు, రైటర్ కి ఇంత ఇవ్వొచ్చు అని చూపించారు.

ఇటీవల రచయితలు దర్శకులుగా మారుతున్నారు. మీరు?

కొందరు రచయితలు ఫ్ర‌స్ట్రేష‌న్‌లో దర్శకులు అవుతున్నారు. తాము రాసినది దర్శకులు సరిగా ఆవిష్కరించడం లేదనే కోపంలో దర్శకులుగా మారుతున్నారు. నేను ఫ్ర‌స్ట్రేష‌న్‌లో, కోపంలో దర్శకుడు కావాలని అనుకోవడం లేదు. నేను మాత్రమే కథకు న్యాయం చేయగలనని భావించిన రోజున మెగాఫోన్ పడతా. 

మీ దగ్గర ఎన్ని కథలున్నాయి? అందులో మీరు మాత్రమే న్యాయం చేయగలిగినవి ఎన్ని?

నా దగ్గర మొత్తం 24 కథలున్నాయి. అందులో ఆరు కథలను నా కోసం పక్కన పెట్టుకున్నా. సతీష్ కాసెట్టికి ఒక కథ ఇచ్చాను. అలాగే, రచయితగా రెండు మూడు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.


కామెడీ కింగ్స్ చేతుల మీదుగా ‘గుణ 369’ పాట!

Category : Uncategorized

ప్ర‌ముఖ హాస్య‌న‌టులు బ్ర‌హ్మానందం- అలీ చేతుల మీదుగా ‘గుణ 369’లోని ‘బుజ్జి బంగారం…’ పాట విడుద‌ల‌!

‘ఆర్‌.ఎక్స్.100’ ఫేమ్ కార్తికేయ, అన‌ఘ జంట‌గా అర్జున్ జంధ్యాల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం ‘గుణ 369’. శ్రీమ‌తి ప్ర‌వీణ క‌డియాల స‌మ‌ర్ప‌ణ‌లో స్ప్రింట్‌ ఫిలిమ్స్‌, జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌జీ మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అనిల్‌ కడియాల, తిరుమల్‌ రెడ్డి నిర్మాతలు. ఈ చిత్రంలోని తొలి పాట‌ను ఇటీవ‌ల స్టార్ ప్రొడ్యూస‌ర్ ‘దిల్‌’ రాజు విడుద‌ల చేశారు. రెండో పాట ‘బుజ్జి బంగారం..’ను సోమ‌వారం హైద‌రాబాద్‌లో ప్ర‌ముఖ హాస్య న‌టులు బ్ర‌హ్మానందం, అలీ విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా చిత్ర యూనిట్‌ను బ్ర‌హ్మానందం ఆశీర్వ‌దించారు. 

అనంత‌రం అలీ మాట్లాడుతూ.. ‘‘చైత‌న్ భ‌ర‌ద్వాజ్ స్వ‌ర‌ప‌ర‌చిన ఈ పాట చాలా బావుంది. ద‌ర్శ‌కుడు అర్జున్ జంధ్యాల‌… నేనూ కొలీగ్స్. ఇద్ద‌రం క‌లిసి చాలా సినిమాలు చేశాం. నిర్మాత‌లు బుల్లితెర‌ మీద స‌క్సెస్ అయ్యారు. ఇప్పుడు సిల్వ‌ర్ స్క్రీన్ మీద కూడా వాళ్లు చేస్తున్న ప్ర‌య‌త్నం విజ‌య‌వంతం కావాలి. ప్ర‌తి ఇంట్లోనూ హోమ్ మినిస్ట‌ర్ స్ట్రాంగ్‌గా ఉంటారు. వాళ్లు మంచి ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉంటారు కాబ‌ట్టి ‘బుజ్జిబంగారం’ అనే ప‌దాల‌తో వాళ్ల‌ను పిలుస్తూనే ఉంటాం. నేనూ నా రియ‌ల్ లైఫ్‌లో ‘బుజ్జి బంగారం’ అని పిలుస్తూనే ఉంటాను. అదే పదాల‌తో వ‌చ్చే ఈ పాట బావుంది. అంద‌రూ పాడుకునేలా ఉంది. ఈ చిత్రం కార్తికేయ‌కు ‘ఆర్‌.ఎక్స్.100’ క‌న్నా పెద్ద హిట్ కావాలి’’ అని చెప్పారు.

హీరో కార్తికేయ మాట్లాడుతూ.. ‘‘ప్రేమ‌లో ఉన్న ప్ర‌తి అమ్మాయి, అబ్బాయి పాడుకునేలా ఉంది మా ‘బుజ్జి బంగారం…’ పాట‌. ఎవ‌రైనా విన‌గానే మంచి స్టెప్పులు వేసేలా ఉంది. కామెడీ లెజండ్స్ బ్ర‌హ్మానందంగారు బ్లెస్ చేయ‌డం, అలీగారు పాట‌ను లాంచ్ చేయ‌డం గొప్ప అనుభూతిని క‌లిగిస్తోంది. ఇద్ద‌రు యాక్టింగ్ లెజెండ్స్ బ్లెస్సింగ్స్ అందుకోవ‌డం అదృష్టంగా భావిస్తున్నా. ఎంతో అదృష్టం చేసుకుంటే త‌ప్ప ఇలాంటి అరుదైన అవ‌కాశం దొర‌క‌ద‌ని నాకు తెలుసు. పెద్ద‌ల ఆశీస్సులందుకున్న ఈ సినిమా త‌ప్ప‌కుండా విజ‌యం సాధిస్తుంద‌ని న‌మ్ముతున్నా’’ అని అన్నారు.

ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ.. ‘‘నాలుగ్గోడ‌ల మ‌ధ్య ఊహించి రాసుకున్న క‌థ‌తో ఈ చిత్రాన్ని తీయ‌లేదు. విశాల ప్ర‌పంచంలో జ‌రిగిన య‌థార్థ‌గాథ మా చిత్రానికి ముడి స‌రుక‌య్యింది. స్క్రీన్ మీద కూడా అంతే స‌హ‌జంగా ఉంటుంది. ఆ నేచురాలిటీ ప్రేక్ష‌కుడి గుండెను తాకుతుంది. కామెడీ లెజెండ్స్ ఇద్ద‌రి చేతుల మీదుగా మా చిత్రంలోని రెండో పాట ‘బుజ్జి బంగారం’ విడుద‌ల కావ‌డం ఆనందంగా ఉంది. వారి పాజిటివ్ మాట‌లు మాలో కొత్త ఉత్తేజాన్ని నింపాయి’’ అని అన్నారు.

నిర్మాత‌లు అనిల్‌ కడియాల, తిరుమ‌ల్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘బ్ర‌హ్మానందంగారు, అలీగారు పేర్లు విన్నంత‌నే మ‌న పెదాల‌పై తెలియ‌కుండా చిరున‌వ్వులు వ‌చ్చేస్తాయి. అంద‌రిలోనూ అంత పాజిటివ్ ఎన‌ర్జీని నింపే ఆ ఇద్ద‌రు లెజెండ్స్ చేతుల మీదుగా మా చిత్రంలోని రెండో పాట విడుద‌ల కావ‌డం మా అదృష్టం. ‘బుజ్జి బంగారం…’ పాట త‌ప్ప‌కుండా అంద‌రికీ న‌చ్చుతుంది. ప్రేమ‌లో ఉన్న వాళ్లు ఎవ‌రైనా స‌రదాగా స్టెప్పులు వేసుకుంటూ పాడుకునేలా ఉంది. ఈ నెల 17న ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్‌గారు, మాస్ క‌మ‌ర్షియ‌ల్ డైర‌క్ట‌ర్ బోయ‌పాటి శ్రీనుగారి చేతుల మీదుగా ట్రైల‌ర్ విడుద‌ల చేస్తాం. ఆగ‌స్ట్ 2న చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తాం’’ అని అన్నారు.

సాంకేతిక నిపుణులు:

ఈ చిత్రానికి సంగీత దర్శకుడు: చైతన్య భరద్వాజ్‌, కెమెరామెన్‌: ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ రామ్, ఆర్ట్‌ డైరెక్టర్‌: జీయమ్‌ శేఖర్, ఎడిటర్: తమ్మిరాజు, డాన్స్: రఘు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌లు: స‌త్య కిశోర్‌, శివ మల్లాల.


‘సాహో’కి భయపడుతున్నది ‘ఎవరు’?

Category : Uncategorized

ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్‌తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సాహో సినిమా మీద ట్రేడ్‌లోనే కాదు.. ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఆగష్టు 15న వరల్డ్ వైడ్‌గా విడుదల కాబోతున్న సాహో సినిమా అనేక రికార్డులను కొల్లగొట్టడానికి రెడీ అవుతుంది. ప్రభాస్, శ్రద్దా కపూర్ హీరో హీరోయిన్లుగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన సాహో సినిమా టీజర్‌తోనే అంచనాలు మరిన్ని పెరిగిపోయాయి. అయితే ఆగష్టు‌లో విడుదల కాబోతున్న సాహో సినిమాని చూసి ఇపుడు చాలా సినిమాలు భయపడుతున్నాయి. భయపడడం అనే కన్నా సాహోకి ఎదురెళ్ళడం ఎందుకులే అని వెనక్కి తగ్గుతున్నారు. అందులో మొదటగా అడవి శేష్ ‘ఎవరు’ సినిమాని ముందుగా ఆగష్టు‌లో విడుదల చేద్దామనుకున్నారు. కానీ సాహోతో పెట్టుకోవడం కరెక్ట్ కాదని వెనక్కి తగ్గుతున్నారు.

క్షణం, గూఢచారి సినిమాల్తో హీరోగా ప్రూవ్ చేసుకున్న అడవి శేష్ ఎవరు సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. క్షణం సినిమాలో ప్రేమించిన అమ్మాయి కోసం అమెరికా నుండి ఇండియాకొచ్చి… పాపని వెతుకుతూ… అదరగొట్టే యాక్షన్‌తో, నటనతో ఆకట్టుకున్న అడవి శేష్.. గూఢచారి సినిమాలో రా ఎజెంట్ గా ఇరగదీసాడు. భారీ ప్రమోషన్స్‌తో గూఢచారి సినిమాని బ్లాక్ బస్టర్ చేసాడు. ఇక ఇప్పుడు కూడా ‘ఎవరు’ సినిమాతో రెజీనాతో కలిసి సందడి చెయ్యడానికి రెడీ అవుతున్నాడు. ఫస్ట్ లుక్ తోనే ఆసక్తిని క్రియేట్ చేసిన అడవి శేష్ తన సినిమాని ఆగష్టు లో విడుదల చేద్దామనుకున్నాడు. 

ఇక మంచి బిజినెస్ జరిగిన ఎవరు సినిమా బయ్యర్లు మాత్రం ఆగస్టు నుండి డేట్ మార్చుకుంటే బెటర్.. సాహో సినిమాతో మనకెందుకు అంటున్నారట. అలాగే ఆగష్టు లో మన్మథుడు 2, నాని గ్యాంగ్ లీడర్ సినిమాలు కూడా వస్తున్నాయి కాబట్టి.. ఎవరు సినిమాని సెప్టెంబర్ లో విడుదల చెయ్యమని అడగడంతో… ఎవరు నిర్మాతలు కూడా అదే బెటర్ అనుకుంటున్నారట. ఇక సినిమా విడుదలకు టైం దొరికితే… మంచి ప్రమోషన్స్ తో సినిమా మీద మరిన్ని అంచనాలు పెరిగేలా చెయ్యొచ్చనే ప్లాన్ లో ‘ఎవరు’ టీం కూడా ఉందట. 


హమ్మయ్యా.. ‘కుమారి’కి మంచిరోజులొచ్చాయ్!!

Category : Uncategorized

‘కుమారి 21 ఎఫ్’ హీరోయిన్ హెబ్బా పటేల్ గురించి ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. ఈ ‘21 ఎఫ్‌’ లోని కొన్ని కొన్ని సన్నివేశాలు కుర్రకారును కట్టిపడేశాయి. సినిమా రిలీజ్ అయ్యింది మొదలుకుని ఇప్పటి వరకూ ఈ చిత్రాన్ని ఎన్నిసార్లు చూసినా తక్కువే అన్నట్లుగా ఉంటుంది. సినిమా సంగతి ఓకే కానీ.. సినిమాలో నటించిన కుమారికే ఆ తర్వాత ఆశించినంతగా సినిమా చాన్స్‌లు దక్కలేదు. దీంతో కుమారికి కష్టాలొచ్చి పడినట్లైంది.

టాలీవుడ్‌లో హెబ్బా నటించింది.. అరకొర చిత్రాల్లో మాత్రమే అయినప్పటికీ తన అంద చెందాలతో కుర్రకారును తనవైపు తిప్పుకున్నది. ఆ తర్వాత అడ్రస్ లేకుండా పోయింది. అయితే ఈ భామకు తాజాగా.. మంచి ఛాన్స్ దొరికిందని ఫిల్మ్‌నగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. నితిన్- వెంకీ కుడుముల కాంబోలో వస్తున్న చిత్రం ‘భీష్మ’.. ఇందులో హెబ్బాను ఓ కీలక పాత్ర కోసం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు సినిమాకు కుమారి పాత్రే ప్రధాన బలం అని సమాచారం.

అయితే అప్పుడెప్పుడో  2016, 2017 ఈ రెండేళ్లలో వరుస చిత్రాలతో గ్యాప్ లేకుండా నటించిన ఆమెకు పాపం.. 2018 మాత్రం ఆశించినంతగా కలిసిరాలేదు. దీంతో ఎంత గ్యాప్ లేకుండా ఒకప్పుడు సినిమాలు వచ్చాయో అంతకు డబుల్ బ్రేకులు పడ్డాయ్. అయితే తాజా సినిమాతో కుమారికి కష్టాలు తొలగి.. మంచి రోజులొచ్చినట్లేనని ఆమె సహచరులు, కుటుంబ సభ్యులు చెప్పుకుంటున్నారట.