హైదరాబాద్ నందు (బంజర హిల్స్, జూబిలీ హిల్స్, మాదాపూర్, కొండాపూర్ ) పరిసర ప్రాంతాల్లో పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ వెంటనే కావాలను. ఆర్మీ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేసి రిటైర్ అయినా వారికీ తగిన ప్రాధాన్యత ఇవ్వ బడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ + 91 8074965869

RC12 ముందనుకున్న ఫస్ట్ లుక్ ఇది కాదంట!!

RC12 ముందనుకున్న ఫస్ట్ లుక్ ఇది కాదంట!!

Category : Uncategorized

దీపావళి కానుకగా.. మంగళవారం విడుదల చేసిన రామ్ చరణ్ – బోయపాటి సినిమా టైటిల్ అండ్ లుక్ విషయంలో మెగా అభిమానులు అసంతృప్తిగా ఉన్నారా? అంటే అవుననే సమాధానమే వస్తుంది. ఎప్పటి నుండో అనుకున్నట్లుగా RC12 కి ‘వినయ విధేయరామ’ టైటిల్ ని ఫిక్స్ చేసి వదిలారు. అయితే టైటిల్ విషయంలో ఎలాంటి ప్రాబ్లెమ్ లేని మెగాభిమానులు రామ్ చరణ్ లుక్ విషయంలో మాత్రం కాస్త అసంతృప్తిగానే ఉన్నారు. ఎప్పటి నుండో రామ్ చరణ్ న్యూ మూవీ లుక్ కోసం ఎదురుచూస్తున్న మెగాభిమానులు తాజాగా విడుదల చేసిన ‘వినయ విధేయ రామ’ లుక్ లో రామ్ చరణ్ ని చూసి నీరుగారి పోయారు.

ఏమాత్రం కొత్తదనం లేదని వారి ఫీలింగ్. ‘సరైనోడు’ సినిమా లో అల్లు అర్జున్ లుక్ మాదిరిగా ఇప్పుడు ‘వినయ విధేయ రామ’ లో రామ్ చరణ్ లుక్ ఉందని అంటున్నారు. బోయపాటి అసలేమాత్రం కొత్తదనం లేకుండా చరణ్ లుక్ డిజైన్ చేసాడని అంటున్నారు. అయితే దీవాళి సందర్భంగా RC12 నుండి టైటిల్ తో పాటుగా రామ్ చరణ్ క్లాస్ లుక్ బయటికొస్తుందనే న్యూస్ మీడియాకి లీక్ అవడం.. తర్వాత మీడియా మొత్తం చరణ్ క్లాస్ లుక్ కోసమే వెయిట్ చేస్తే చివరికి చరణ్ మాసివ్ లుక్ చూడాల్సి వచ్చింది. అసలు ముందుగా ‘వినయ విధేయ రామ’ టైటిల్ కి తగ్గట్టుగా చాలా సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా… ప‌ద్ధ‌తిగా ఉన్న రామ్ చరణ్ ఫ‌స్ట్ లుక్‌ని డిజైన్ చేశారు. 

ఇక అలాంటి క్లాస్ లుక్ కి చరణ్ కూడా ఓకే అనేశాడు. కానీ అనుకోకుండా చివ‌రి నిమిషంలో వినయ విధేయ ఫ‌స్ట్ లుక్ మారిపోయింది. చరణ్ క్లాస్ లుక్ ని ప‌క్క‌న పెట్టి… అప్ప‌టిక‌ప్పుడు చరణ్ మాస్ లుక్‌ని వదిలారు. అయితే ఇదంతా బోయపాటి సింగిల్ గా హ్యాండిల్ చేసాడని… ముందు అనుకున్నట్టుగా కాకుండా చివరి నిమిషంలో చరణ్ మాస్ లుక్ రెడీ చేయించాడని… కారణం ఏమిటంటే రామ్ చరణ్ సాంప్రదాయ లుక్ దివాళీ కానుకగా వస్తుందనే న్యూస్ మీడియాకి లీక్ కావడమేనట. మరి క్లాస్ లుక్ కోసం ఎదురు చూసే వారందరికీ సడన్ సర్ప్రైజ్ అంటూ ఇలా మాస్ లుక్ తో దిగారంటే. ఇక ఆ లుక్ చూసిన వారంతా బోయపాటి మార్క్ కనబడుతుంది కానీ.. ఎక్కడా కొత్తదనమే దర్శనమీయలేదంటున్నారు. చరణ్ మాస్ లుక్ లో బాగోలేదని.. ‘రంగస్థలం’లో చిట్టిబాబుగా కనబడిన చరణ్ ఇప్పుడు ఇలాంటి లుక్ లో కనబడేసరికి మెగా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారట.