హైదరాబాద్ నందు (బంజర హిల్స్, జూబిలీ హిల్స్, మాదాపూర్, కొండాపూర్ ) పరిసర ప్రాంతాల్లో పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ వెంటనే కావాలను. ఆర్మీ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేసి రిటైర్ అయినా వారికీ తగిన ప్రాధాన్యత ఇవ్వ బడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ + 91 8074965869

RRR మెయిన్ విలన్ అతనేనా..?

RRR మెయిన్ విలన్ అతనేనా..?

Category : Uncategorized

 

రాజమౌళి – ఎన్టీఆర్ – చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ చిత్రం #RRR ఈ వారంలోనే మొదలవ్వబోతుంది. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరు హీరోలుగా ఇద్దరి అభిమానులు సర్దుకుపోయే కథతో రాజమౌళి ఈ భారీ మల్టీస్టారర్ ని ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇద్దరు స్టార్ హీరోలతో సినిమా చేయడమనేది ఏ దర్శకుడికైనా కత్తిమీద సామే. అలాంటిది ఇద్దరు బిగ్ స్టార్స్ ని ఒక ఫ్రేమ్‌లో చూపించడం అనేది మరింత రిస్క్. మరి రాజమౌళి ఇద్దరి స్టార్స్ తో ఎలాంటి సినిమా చేసి అభిమానులను శాంతిపరుస్తాడో తెలియదు కానీ.. ప్రస్తుతం #RRR పై భారీ అంచనాలే ఉన్నాయి.

సోషల్ మీడియాలో వినబడుతున్న కథనాల ప్రకారం ఈ సినిమా 1940 లో జరిగిన కథగా ఉంటుందని.. అలాగే రామ్ చరణ్ ని హీరోగా, ఎన్టీఆర్ ని విలన్ తరహా పాత్రలో చూపించి.. రాజమౌళి ఈ సినిమా చేయబోతున్నాడని ప్రచారం జరిగింది. కానీ ఈ సినిమా బ్యాగ్డ్రాప్ సంగతేమో గాని.. ఈ స్టార్ హీరోలకు ధీటుగా నిలబడగలిగిన మెయిన్ విలన్ గురించిన చర్చలు ఇప్పుడు ఫిలింసర్కిల్స్ లో హాట్ టాపిక్ అయ్యాయి. రాజమౌళి గత చిత్రం బాహుబలిలో హీరో ప్రభాస్ బాహబలిగా రానాని ని విలన్ గా చూపెట్టాడు. బాహుబలికి ధీటుగా భళ్లాలదేవ కేరెక్టర్ ని రాజమౌళి ఆ సినిమాలో చూపించాడు. మరి విలన్ కి అంత పవర్ ఫుల్ కేరెక్టర్ ని రాసుకునే రాజమౌళి తాజా చిత్రం RRR కోసం విలన్ తరహా పాత్రని మరెంత పవర్ ఫుల్ గా రాసుకున్నాడో కదా..

మరి ఆ విలన్ ఎవరై ఉంటారనే ఆసక్తి ఇప్పుడు ఫిలింసర్కిల్స్ లో నడుస్తున్న టాపిక్. అయితే అరవింద సమేత లో బసిరెడ్డి గా ఇరగదీసిన జగపతి బాబుపై రాజమౌళి కన్ను పడిందంటున్నారు. అలాగే ఈ చిత్రం ఎనౌన్స్ చేసినప్పుడు ఈ సినిమాలో విలన్ పాత్రకి గాను హీరో రాజశేఖర్ పేరు వినబడినది. అయితే గరుడ వేగ హిట్ తర్వాత రాజమౌళి హీరోగా కల్కి సినిమా చేస్తున్నాడు. మరి రాజమౌళి ముందున్న పవర్ ఫుల్ ఆప్షన్ అండ్ ఏకైక ఆప్షన్ కూడా జగపతి బాబే. మరి రాజమౌళి తన సినిమాలో జగపతి బాబుని తీసుకుంటాడా… అసలు ఎన్టీఆర్ అండ్ చరణ్ లను ఢీ కొట్టబోయే ఆ విలన్ ఎవరో కానీ.. ప్రస్తుతం ఆ విలన్ పేరు తెలిసేవరకు ప్రేక్షకులు నిద్రపోయేలా లేరు.