హైదరాబాద్ నందు (బంజర హిల్స్, జూబిలీ హిల్స్, మాదాపూర్, కొండాపూర్ ) పరిసర ప్రాంతాల్లో పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ వెంటనే కావాలను. ఆర్మీ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేసి రిటైర్ అయినా వారికీ తగిన ప్రాధాన్యత ఇవ్వ బడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ + 91 8074965869

RRR: రాజమౌళి ఈసారి కూడా దాచేశాడు

RRR: రాజమౌళి ఈసారి కూడా దాచేశాడు

Category : Uncategorized

రాజమౌళి సినిమా అంటే నిర్మాతకు హీరోకి కూడా తిరుగులేని హామీ. మరి రాజమౌళి డైరెక్షన్ అంటేనే పడిచచ్చిపోయే ప్రేక్షకులు ఈగని పెట్టి సినిమా చేసినా బ్రహ్మరథం పట్టారు. ఇక అలాంటి దర్శకధీరుడి దర్శకత్వంలో స్టార్ హీరోస్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించడం అంటేనే సినిమాకి భారీ క్రేజ్ వచ్చేస్తుంది. ఇక రాజమౌళి ఎలాంటి కథ తో సినిమా చేస్తాడో… తమ హీరోలను ఎలా చూపిస్తాడో అనే క్యూరియాసిటీ అభిమానుల్లో ఉన్నప్పటికీ.. మిగతా ప్రేక్షకులకు మాత్రం కథ మీద కన్నా రాజమౌళి డైరెక్షన్ లో ఎన్టీఆర్, చరణ్ హీరోలుగా సినిమా వస్తుంది అంటే చాలన్నట్టుగా ఉంటుంది. ఇక సినిమా ఓపెనింగ్ రోజునే రాజమౌళికి తన సినిమా కథను రివీల్ చేయడం అలవాటు.

తన సినిమా గురించిన కథను బయటికి చెప్పేసి టెక్నికల్‌గా సినిమాని అదిరిపోయే హిట్ చేసేస్తుంటాడు. విజువల్ ఎఫెక్ట్స్ తోనే అందరిని మెప్పించేస్తాడు. ఇక ఈగ, మగధీర కథలను ముందుగానే చెప్పేసిన రాజమౌళి.. బాహుబలి కథను మాత్రం చెప్పలేదు. ఇక తాజాగా ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీస్టారర్ మూవీ కథను ఆదివారం ఓపెనింగ్ సమయంలో బయటికి చెబుతాడేమో.. అని అందరు ఎదురు చూశారు. కానీ ఈసారి కథను మాత్రం ఎక్కడా బయటికి రానివ్వలేదు రాజమౌళి. మరి సోషల్ మీడియాలో RRR కథపై ఎన్ని స్టోరీస్ ప్రచారంలోకి వచ్చాయో అందరికి తెలుసు.

అయితే RRR కథ చాలా చిన్న స్టోరీ లైన్ అని… అయితే కథ ఎలాగున్నా విజువ‌ల్‌గా ఈ సినిమాని తెలుగు ప్రేక్షకుడు ఎన్నడూ చూడని స్థాయిలో చూపించ‌బోతున్నాడ‌ని విశ్వ‌స‌నీయ సమాచారం. ఇక అంత చిన్న పాయింట్ ఉన్న కథను ముందే లీక్ చేయ‌డం ఎందుకని రాజమౌళి RRR కథను బయటికి చెప్పలేదట. ఇక ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ కి కూడా రాజమౌళి తమ సినిమా విషయాలేమి బయటికి రానివ్వవద్దని గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చాడట.